6 TELOTSA వారిద్దరు ప్రభువు ఆజ్ఞలను, శాసనాలను నిందారహితంగా అనుసరిస్తూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. BSB BSB: Both of them were righteous in the sight of God, walking blamelessly in all the commandments and decrees of the Lord.
7 TELOTSA అయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరు చాలా వృద్ధులు. BSB BSB: But they had no children, because Elizabeth was barren, and they were both well along in years.
8 TELOTSA ఒకసారి జెకర్యా వారి శాఖ విధుల్లో ఉన్నప్పుడు అతడు దేవుని ఎదుట యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు, BSB BSB: One day while Zechariah’s division was on duty and he was serving as priest before God,
9 TELOTSA యాజకులు వారి సాంప్రదాయం ప్రకారం చీట్లు వేసినప్పుడు, అతనికి ప్రభువు మందిరంలోనికి వెళ్లి ధూపం వేసే వంతు వచ్చింది. BSB BSB: he was chosen by lot, according to the custom of the priesthood, to enter the temple of the Lord and burn incense.
10 TELOTSA ధూపం వేసే సమయం వచ్చినప్పుడు, సమాజ ప్రజలందరు బయట ప్రార్థిస్తున్నారు. BSB BSB: And at the hour of the incense offering, the whole congregation was praying outside.
11 TELOTSA ప్రభువు దూత ధూపవేదికకు కుడి వైపున నిలబడి, అతనికి ప్రత్యక్షమయ్యాడు. BSB BSB: Just then an angel of the Lord appeared to Zechariah, standing at the right side of the altar of incense.
12 TELOTSA జెకర్యా అతన్ని చూసి, ఉలిక్కిపడి, భయంతో బిగుసుకుపోయాడు. BSB BSB: When Zechariah saw him, he was startled and gripped with fear.
13 TELOTSA ఆ దూత అతనితో, “జెకర్యా భయపడకు; నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కుమారుని కంటుంది, నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి. BSB BSB: But the angel said to him, “Do not be afraid, Zechariah, because your prayer has been heard. Your wife Elizabeth will bear you a son, and you are to give him the name John.
14 TELOTSA అతడు నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగ చేస్తాడు, అలాగే అనేకులు అతని పుట్టుకను బట్టి సంతోషిస్తారు. BSB BSB: He will be a joy and delight to you, and many will rejoice at his birth,
15 TELOTSA ఎందుకంటే ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడవుతాడు. అతడు ద్రాక్షరసం కానీ మద్యం కానీ త్రాగకూడదు, అతడు పుట్టక ముందే పరిశుద్ధాత్మచేత నింపబడతాడు. BSB BSB: for he will be great in the sight of the Lord. He shall never take wine or strong drink, and he will be filled with the Holy Spirit even from his mother’s womb.
16 TELOTSA ఇశ్రాయేలీయుల్లోని చాలామందిని అతడు వారి ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పుతాడు. BSB BSB: Many of the sons of Israel he will turn back to the Lord their God.
18 TELOTSA అందుకు జెకర్యా ఆ దూతతో, “ఇది జరుగుతుందని నేను ఎలా నమ్మాలి? నేను ముసలివాన్ని, నా భార్య వయస్సు కూడా మీరిపోయింది” అన్నాడు. BSB BSB: “How can I be sure of this?” Zechariah asked the angel. “I am an old man, and my wife is well along in years.”
19 TELOTSA అందుకు ఆ దూత అతనితో, “నేను గబ్రియేలును. నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాను, నీతో మాట్లాడి నీకు ఈ శుభవార్త చెప్పడానికి నేను నీ దగ్గరకు పంపబడ్డాను. BSB BSB: “I am Gabriel,” replied the angel. “I stand in the presence of God, and I have been sent to speak to you and to bring you this good news.
20 TELOTSA నేనిప్పుడు నీతో చెప్పిన మాటలను నీవు నమ్మలేదు, కాబట్టి నిర్ణీత సమయంలో ఇది జరిగే వరకు, నీవు మూగవానిగా మౌనంగా ఉంటావు” అన్నాడు. BSB BSB: And now you will be silent and unable to speak until the day this comes to pass, because you did not believe my words, which will be fulfilled at their proper time.”
21 TELOTSA అంతలో, ప్రజలు జెకర్యా కోసం ఎదురుచూస్తూ దేవాలయంలో అతడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. BSB BSB: Meanwhile, the people were waiting for Zechariah and wondering why he took so long in the temple.
22 TELOTSA అతడు బయటకు వచ్చాక, అతడు వారితో మాట్లాడలేకపోయాడు. అతడు తమతో మాట్లాడటానికి బదులు సైగలు చేస్తూ ఉండడంతో, అతడు దేవాలయంలో దర్శనం చూశాడని వారు గ్రహించారు. BSB BSB: When he came out and was unable to speak to them, they realized he had seen a vision in the temple. He kept making signs to them but remained unable to speak.
23 TELOTSA అతని సేవ కాలం పూర్తయినప్పుడు, అతడు ఇంటికి వెళ్లిపోయాడు. BSB BSB: And when the days of his service were complete, he returned home.
24 TELOTSA ఆ తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భం ధరించి అయిదు నెలల వరకు ఇతరులకు కనబడకుండా ఉండింది. BSB BSB: After these days, his wife Elizabeth became pregnant and for five months remained in seclusion. She declared,
25 TELOTSA ఆమె, “ప్రభువే నా కోసం ఈ కార్యం చేశారు, ఈ దినాల్లో ఆయన నన్ను కరుణించి, నా ప్రజలమధ్య నాకున్న అవమానం తొలగించారు” అని అన్నది. BSB BSB: “The Lord has done this for me. In these days He has shown me favor and taken away my disgrace among the people.”
27 TELOTSA దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే కన్య దగ్గరకు పంపారు. BSB BSB: to a virgin pledged in marriage to a man named Joseph, who was of the house of David. And the virgin’s name was Mary.
28 TELOTSA ఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, “బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు” అని చెప్పాడు. BSB BSB: The angel appeared to her and said, “Greetings, you who are highly favored! The Lord is with you.”
29 TELOTSA అతని మాటలకు మరియ చాలా కలవరపడి, ఇది ఎటువంటి శుభవచనమో అని ఆశ్చర్యపడింది. BSB BSB: Mary was greatly troubled at his words and wondered what kind of greeting this might be.
30 TELOTSA అయితే ఆ దూత ఆమెతో, “మరియా, భయపడకు; నీవు దేవుని దయను పొందుకొన్నావు. BSB BSB: So the angel told her, “Do not be afraid, Mary, for you have found favor with God.
31 TELOTSA నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. BSB BSB: Behold, you will conceive and give birth to a son, and you are to give Him the name Jesus.
32 TELOTSA ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు. BSB BSB: He will be great and will be called the Son of the Most High. The Lord God will give Him the throne of His father David,
33 TELOTSA ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు. BSB BSB: and He will reign over the house of Jacob forever. His kingdom will never end!”
35 TELOTSA అందుకు ఆ దూత, “పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. BSB BSB: The angel replied, “The Holy Spirit will come upon you, and the power of the Most High will overshadow you. So the Holy One to be born will be called the Son of God.
36 TELOTSA నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన ముసలితనంలో గర్భం ధరించింది, పిల్లలు పుట్టరు అని ఎవరి గురించైతే అనుకున్నారో, ఆమెకు ఇప్పుడు ఆరో నెల నిండింది. BSB BSB: Look, even Elizabeth your relative has conceived a son in her old age, and she who was called barren is in her sixth month.
37 TELOTSA ఎందుకంటే దేవుని నుండి వచ్చే ఏ మాట నెరవేరక మానదు” అన్నాడు. BSB BSB: For no word from God will ever fail.”
39 TELOTSA కొన్ని రోజుల తర్వాత మరియ సిద్ధపడి యూదయ కొండ ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్లింది, BSB BSB: In those days Mary got ready and hurried to a town in the hill country of Judah,
40 TELOTSA అక్కడ ఆమె జెకర్యా ఇంటికి వెళ్లి ఎలీసబెతుకు వందనాలు చెప్పింది. BSB BSB: where she entered the home of Zechariah and greeted Elizabeth.
41 TELOTSA ఎలీసబెతు మరియ చెప్పిన వందనాలను వింటున్నప్పుడు, ఆమె గర్భంలోని శిశువు గంతులేసాడు, ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నింపబడింది. BSB BSB: When Elizabeth heard Mary’s greeting, the baby leaped in her womb, and Elizabeth was filled with the Holy Spirit.
42 TELOTSA ఆమె పెద్ద స్వరంతో: “స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీవు గర్భంలో మోస్తున్న శిశువు ధన్యుడు! BSB BSB: In a loud voice she exclaimed, “Blessed are you among women, and blessed is the fruit of your womb!
43 TELOTSA నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను? BSB BSB: And why am I so honored, that the mother of my Lord should come to me?
44 TELOTSA నీవు చెప్పిన వందనం నా చెవిని చేరగానే, నా గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేశాడు. BSB BSB: For as soon as the sound of your greeting reached my ears, the baby in my womb leaped for joy.
45 TELOTSA ప్రభువు తనకు చేసిన వాగ్దానం తప్పక నెరవేరుతుందని నమ్మిన స్త్రీ ధన్యురాలు!” అని చెప్పింది. BSB BSB: Blessed is she who has believed that the Lord’s word to her will be fulfilled.”
47 TELOTSA నా రక్షకుడైన దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది. BSB BSB: and my spirit rejoices in God my Savior!
49 TELOTSA ఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు. BSB BSB: For the Mighty One has done great things for me. Holy is His name.
50 TELOTSA తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది. BSB BSB: His mercy extends to those who fear Him, from generation to generation.
51 TELOTSA ఆయన తన బాహువుతో గొప్ప కార్యాలను చేస్తారు; తమ అంతరంగాల్లో గర్వించు వారిని ఆయన చెదరగొట్టారు. BSB BSB: He has performed mighty deeds with His arm; He has scattered those who are proud in the thoughts of their hearts.
52 TELOTSA సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు, కాని, దీనులను పైకి లేవనెత్తారు. BSB BSB: He has brought down rulers from their thrones, but has exalted the humble.
53 TELOTSA ఆకలిగొనిన వారిని మంచి పదార్ధాలతో తృప్తిపరిచారు, కాని, ధనవంతులను వట్టి చేతులతో పంపారు. BSB BSB: He has filled the hungry with good things, but has sent the rich away empty.
54 TELOTSA ఆయన అబ్రాహాముకు అతని సంతతివారికి నిత్యం దయ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకొంటూ, మన పితరులకు వాగ్దానం చేసినట్లు, తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు.” BSB BSB: He has helped His servant Israel, remembering to be merciful,
56 TELOTSA మరియ దాదాపు మూడు నెలలు ఎలీసబెతుతో ఉండి తన ఇంటికి తిరిగి వెళ్లింది. BSB BSB: Mary stayed with Elizabeth for about three months and then returned home.
57 TELOTSA ఎలీసబెతుకు నెలలు నిండినప్పుడు, ఆమె ఒక కుమారుని కన్నది. BSB BSB: When the time came for Elizabeth to have her child, she gave birth to a son.
58 TELOTSA ప్రభువు ఆమెపై ఈ గొప్ప కరుణను చూపించాడన్న సంగతిని విన్న ఇరుగుపొరుగువారు బంధువులు, ఆమెతో కలిసి సంతోషించారు. BSB BSB: Her neighbors and relatives heard that the Lord had shown her great mercy, and they rejoiced with her.
59 TELOTSA ఎనిమిదవ రోజున శిశువుకు సున్నతిచేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా, BSB BSB: On the eighth day, when they came to circumcise the child, they were going to name him after his father Zechariah.
60 TELOTSA తల్లి, “వద్దు! బాబును యోహాను అని పిలువాలి” అని చెప్పింది. BSB BSB: But his mother replied, “No! He shall be called John.”
61 TELOTSA అందుకు వారు ఆమెతో, “మీ బంధువుల్లో ఎవ్వరికి ఆ పేరు లేదు కదా” అన్నారు. BSB BSB: They said to her, “There is no one among your relatives who bears this name.”
62 TELOTSA వారు ఈ బాబుకు ఏ పేరు పెట్టాలని తండ్రికి సైగ చేసి అడిగారు. BSB BSB: So they made signs to his father to find out what he wanted to name the child.
63 TELOTSA అందుకతడు ఒక పలకను అడిగి, “బాబు పేరు యోహాను” అని దానిపై వ్రాసినప్పడు వారందరు ఆశ్చర్యపడ్డారు. BSB BSB: Zechariah asked for a tablet and wrote, “His name is John.” And they were all amazed.
64 TELOTSA వెంటనే అతని నోరు తెరుచుకుంది అతని నాలుక సడలింది, అతడు మాట్లాడుతూ దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. BSB BSB: Immediately Zechariah’s mouth was opened and his tongue was released, and he began to speak, praising God.
65 TELOTSA ఇరుగుపొరుగు వారందరు భయంతో నిండిపోయారు, యూదయ కొండ ప్రాంత ప్రజలందరు ఈ సంగతుల గురించి చెప్పుకొన్నారు. BSB BSB: All their neighbors were filled with awe, and people throughout the hill country of Judea were talking about these events.
66 TELOTSA ఇది విన్న ప్రతి ఒక్కరు దాని గురించి ఆశ్చర్యపడి, “ఈ బిడ్డ ఏమవుతాడో?” అనుకున్నారు. ఎందుకంటే ప్రభువు హస్తం బిడ్డకు తోడుగా ఉన్నది. BSB BSB: And all who heard this wondered in their hearts and asked, “What then will this child become?” For the Lord’s hand was with him.
67 TELOTSA తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ విధంగా ప్రవచించాడు: BSB BSB: Then his father Zechariah was filled with the Holy Spirit and prophesied:
68 TELOTSA “ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు స్తుతింపబడును గాక, ఎందుకంటే ఆయన తన ప్రజలను దర్శించి వారిని విమోచించారు. BSB BSB: “Blessed be the Lord, the God of Israel, because He has visited and redeemed His people.
69 TELOTSA దేవుడు ముందుగానే తన పవిత్ర ప్రవక్తల ద్వారా పలికించినట్లు, తన సేవకుడైన దావీదు వంశంలో మన కోసం రక్షణ కొమ్మును మొలిపించారు. BSB BSB: He has raised up a horn of salvation for us in the house of His servant David,
71 TELOTSA మన శత్రువుల చేతి నుండి మనల్ని ద్వేషించు వారి నుండి రక్షణ కలిగించారు, BSB BSB: salvation from our enemies and from the hand of all who hate us,
72 TELOTSA మన పితరులకు దయ చూపడానికి తన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి: BSB BSB: to show mercy to our fathers and to remember His holy covenant,
73 TELOTSA మన తండ్రియైన అబ్రాహాముకు ప్రమాణం చేసినట్లుగా, BSB BSB: the oath He swore to our father Abraham, to grant us
74 TELOTSA మన శత్రువుల చేతి నుండి మనల్ని తప్పించి, మనం భయపడకుండా ఆయనను సేవించాలని, BSB BSB: deliverance from hostile hands, that we may serve Him without fear,
75 TELOTSA బ్రతికిన కాలమంతా మనం ఆయన ఎదుట పరిశుద్ధత నీతి కలిగి జీవించాలని విమోచించారు. BSB BSB: in holiness and righteousness before Him all the days of our lives.
76 TELOTSA “నా బిడ్డా, నీవు, మహోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు; ప్రభువుకు ముందుగా నీవు ఆయన కోసం మార్గం సిద్ధం చేస్తావు. BSB BSB: And you, child, will be called a prophet of the Most High; for you will go on before the Lord to prepare the way for Him,
77 TELOTSA ఆయన ప్రజలకు వారి పాపక్షమాపణ ద్వారానే, రక్షణ కలుగుతుందని వారికి తెలియ చేస్తావు, BSB BSB: to give to His people the knowledge of salvation through the forgiveness of their sins,
78 TELOTSA ఎందుకంటే మన పాదాలను సమాధాన మార్గంలో నడిపించడానికి, చీకటిలో జీవిస్తున్నవారిపై మరణచ్ఛాయలో ఉన్నవారిపై ప్రకాశించడానికి పరలోకం నుండి ఉదయించే సూర్యునిలా మన దేవుని దయా కనికరం మన కోసం అనుగ్రహించబడింది.” BSB BSB: because of the tender mercy of our God, by which the Dawn will visit us from on high,
80 TELOTSA ఆ బాలుడు ఎదిగి ఆత్మలో బలపడ్డాడు; ఇశ్రాయేలీయులకు బహిరంగంగా కనబడే వరకు అరణ్యంలో నివసించాడు. BSB BSB: And the child grew and became strong in spirit; and he lived in the wilderness until the time of his public appearance to Israel.