1 ULB ఇది జరిగిన తరువాత అమ్మోనీయుల రాజు నాహాషు చనిపోగా అతని కొడుకు అతని స్థానంలో రాజయ్యాడు. BSB BSB: Some time later, Nahash king of the Ammonites died and was succeeded by his son.
2 ULB అప్పుడు దావీదు <<హానూను తండ్రి నాహాషు నా పట్ల దయ చూపించాడు కాబట్టి నేను అతని కొడుకు పట్ల దయ చూపిస్తాను>> అనుకుని, అతని తండ్రి నిమిత్తం అతన్ని పరామర్శించడానికి దూతలను పంపాడు. దావీదు సేవకులు హానూనును పరామర్శించడానికి అమ్మోను దేశానికి వచ్చినప్పుడు, BSB BSB: And David said, “I will show kindness to Hanun son of Nahash, because his father showed kindness to me.” So David sent messengers to console Hanun concerning his father. But when David’s servants arrived in the land of the Ammonites to console him,
3 ULB అమ్మోనీయుల అధిపతులు హానూనుతో<<నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరికి దావీదు దూతలను పంపడం నీ తండ్రిని ఘనపరచడానికే అనుకుంటున్నావా? దేశాన్ని జాగ్రత్తగా గమనించి, దాన్ని నాశనం చెయ్యడానికే అతని సేవకులు నీ దగ్గరికి వచ్చారు>> అని చెప్పారు. BSB BSB: the princes of the Ammonites said to Hanun, “Just because David has sent you comforters, do you really believe he is showing respect for your father? Have not his servants come to you to explore the land, spy it out, and overthrow it?”
4 ULB హానూను దావీదు సేవకులను పట్టుకుని, వాళ్ళ జుట్టు గొరిగించి, వాళ్ళ బట్టలు మొల కంటే కిందకు దిగకుండా సగానికి కత్తిరించి వాళ్ళను పంపేశాడు. BSB BSB: So Hanun took David’s servants, shaved their beards, cut off their garments at the hips, and sent them away.
5 ULB ఆ మనుషులు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు కొందరు వచ్చి వాళ్ళను గూర్చిన వార్త దావీదుకు తెలియజేశారు. వాళ్ళు ఎంతో సిగ్గు పాలై ఉన్నారు గనుక రాజు వాళ్లకు ఎదురుగా మనుషులను పంపి <<మీ గడ్డాలు పెరిగే వరకూ మీరు యెరికోలో ఉండి, తరువాత రండి>> అని సందేశం పంపాడు. BSB BSB: When someone came and told David about his men, he sent messengers to meet them, since the men had been thoroughly humiliated. The king told them, “Stay in Jericho until your beards have grown back, and then return.”
6 ULB అమ్మోనీయులు తమ పట్ల దావీదుకు అసహ్యం కలిగేలా చేసుకున్నాం అని గ్రహించారు. హానూనూ, అమ్మోనీయులూ రెండు వేల మణుగుల వెండి ఇచ్చి అరామ్నహరయీము నుంచి, ఆరాము మయకా నుంచి, సోబా నుంచి, రథాలను, గుర్రపు రౌతులను కిరాయికి తెచ్చుకున్నారు. BSB BSB: When the Ammonites realized that they had become a stench to David, Hanun and the Ammonites sent a thousand talents of silver to hire for themselves chariots and horsemen from Aram-naharaim, Aram-maacah, and Zobah.
7 ULB కిరాయి చెల్లించి మయకా రాజును, అతని సైన్యాన్నీ ముప్ఫై రెండువేల రథాలను కుదుర్చుకున్నారు. వీళ్ళు వచ్చి మేదెబా ఎదుట దిగారు. అమ్మోనీయులు తమ పట్టణాల్లో నుంచి యుద్ధం చెయ్యడానికి వచ్చారు. BSB BSB: So they hired for themselves thirty-two thousand chariots, as well as the king of Maacah with his troops, who came and camped near Medeba while the Ammonites were mustered from their cities and marched out for battle.
8 ULB దావీదు ఈ సంగతి విని యోవాబునూ, సైన్యంలో ఉన్న పరాక్రమశాలులు అందరినీ పంపాడు. BSB BSB: On hearing this, David sent Joab and the entire army of mighty men.
9 ULB అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు ద్వారం దగ్గర యుద్ధపంక్తులు తీర్చారు. వచ్చిన రాజులు ప్రత్యేకంగా బయట ఉన్న భూమిలో యుద్ధానికి సిద్ధంగా నిలిచారు. BSB BSB: The Ammonites marched out and arrayed themselves for battle at the entrance to the city, while the kings who had come stayed by themselves in the open country.
10 ULB తాను రెండు సైన్యాల మధ్యలో చిక్కి ఉండడం చూసి, యోవాబు ఇశ్రాయేలీయుల్లో ఉన్న శ్రేష్ఠుల్లో పరాక్రమశాలులను సిద్ధం చేసుకుని, అరామీయులకు ఎదురుగా వాళ్ళను బారులు తీర్చి, BSB BSB: When Joab saw the battle lines before him and behind him, he selected some of the best men of Israel and arrayed them against the Arameans.
11 ULB మిగిలిన సైన్యాన్ని తన సోదరుడు అబీషైకి అప్పగించి, అమ్మోనీయులకు ఎదురుగా మొహరింప జేశాడు. BSB BSB: And he placed the rest of the troops under the command of his brother Abishai, who arrayed them against the Ammonites.
12 ULB <<అరామీయుల బలగాలను ఎదిరించి నేను నిలబడలేకపోతే, నువ్వు నాకు సాయం చెయ్యాలి. అమ్మోనీయుల బలానికి నువ్వు నిలబడలేకపోతే, నేను నీకు సాయం చేస్తాను. BSB BSB: “If the Arameans are too strong for me,” said Joab, “then you will come to my rescue. And if the Ammonites are too strong for you, then I will come to your rescue.
13 ULB ధైర్యంగా ఉండు. మనం మన ప్రజల నిమిత్తమూ మన దేవుని పట్టణాల నిమిత్తమూ శౌర్యం చూపుదాం. యెహోవా తన దృష్టిలో ఏది మంచిదో అది చేస్తాడు గాక>> అన్నాడు. BSB BSB: Be strong and let us fight bravely for our people and for the cities of our God. May the LORD do what is good in His sight.”
14 ULB ఆ విధంగా యోవాబు అతనితో కూడ ఉన్న సైన్యమూ, అరామీయులతో యుద్ధం చేయడానికి కదిలినప్పుడు, వాళ్ళు అతని ముందు నిలవలేక వెనక్కి తిరిగి పారిపోయారు. BSB BSB: So Joab and his troops advanced to fight the Arameans, who fled before him.
15 ULB అరామీయులు పారిపోవడం అమ్మోనీయులు చూసినప్పుడు వాళ్ళు కూడా యోవాబు సోదరుడు అబీషై ఎదుట నిలవలేక వెనక్కి తిరిగి పట్టణంలోకి పారిపోయారు. యోవాబు యెరూషలేముకు తిరిగి వచ్చాడు. BSB BSB: When the Ammonites saw that the Arameans had fled, they too fled before Joab’s brother Abishai, and they entered the city. So Joab went back to Jerusalem.
16 ULB తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని అరామీయులు గ్రహించి దూతలను పంపి, నది అవతల ఉన్న అరామీయులను పిలిపించుకున్నారు. హదరెజెరు సైన్యాధిపతి షోపకు వాళ్లకు నాయకుడయ్యాడు. BSB BSB: When the Arameans saw that they had been defeated by Israel, they sent messengers to bring more Arameans from beyond the Euphrates, with Shophach the commander of Hadadezer’s army leading them.
17 ULB దావీదు ఆ సంగతి తెలుసుకుని ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి యొర్దాను దాటి, వాళ్లకు ఎదురుగా సైన్యాలను సిద్ధం చేశాడు. దావీదు అరామీయులకు ఎదురుగా సైన్యాలను బారులు తీర్చి యుద్ధం చేశాడు. BSB BSB: When this was reported to David, he gathered all Israel, crossed the Jordan, advanced toward the Arameans, and arrayed for battle against them. When David lined up to engage them in battle, they fought against him.
18 ULB అరామీయులు ఇశ్రాయేలీయుల ముందు నిలవలేక, వెనుదిరిగి పారిపోయారు. దావీదు అరామీయుల్లో ఏడువేల రథికులనూ, నలభై వేల మంది సైనికులనూ హతం చేసి వారి సేనాని షోపకును చంపాడు. BSB BSB: But the Arameans fled before Israel, and David killed seven thousand of their charioteers and forty thousand foot soldiers. He also killed Shophach the commander of their army.
19 ULB తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని హదరెజెరు సేవకులు గ్రహించి దావీదుతో సంధి చేసుకుని అతనికి దాసోహమయ్యారు. అప్పటినుంచి అరామీయులు అమ్మోనీయులకు సాయం చెయ్యడానికి అంగీకరించ లేదు. BSB BSB: When Hadadezer’s subjects saw that they had been defeated by Israel, they made peace with David and became subject to him. So the Arameans were unwilling to help the Ammonites anymore.
Select verses for actions: Enter goes to them and Escape comes back.