1 ULB ఇది ద్వారపాలకుల విభజన గూర్చిన సంగతి. ఆసాపు సంతానంలో కోరే కొడుకు మెషెలెమ్యా కోరహు సంతానం వాడు. BSB BSB: These were the divisions of the gatekeepers: From the Korahites: Meshelemiah son of Kore, one of the sons of Asaph.
2 ULB మెషెలెమ్యా కొడుకులు ఎవరంటే జెకర్యా పెద్దవాడు, యెదీయవేలు రెండోవాడు, జెబద్యా మూడోవాడు, యత్నీయేలు నాల్గోవాడు. BSB BSB: Meshelemiah had sons: Zechariah the firstborn, Jediael the second, Zebadiah the third, Jathniel the fourth,
3 ULB ఏలాము అయిదోవాడు, యెహోహనాను ఆరోవాడు, ఎల్యోయేనై ఏడోవాడు. BSB BSB: Elam the fifth, Jehohanan the sixth, and Eliehoenai the seventh.
4 ULB దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కొడుకులను దయ చేశాడు. వాళ్ళెవరంటే, షెమయా పెద్దవాడు, యెహోజాబాదు రెండోవాడు, యోవాహు మూడోవాడు, శాకారు నాల్గోవాడు, నెతనేలు అయిదోవాడు, BSB BSB: And Obed-edom also had sons: Shemaiah the firstborn, Jehozabad the second, Joah the third, Sachar the fourth, Nethanel the fifth,
5 ULB అమ్మీయేలు ఆరోవాడు, ఇశ్శాఖారు ఏడోవాడు, పెయుల్లెతై ఎనిమిదోవాడు. BSB BSB: Ammiel the sixth, Issachar the seventh, and Peullethai the eighth. For God had blessed Obed-edom.
6 ULB అతని కొడుకు షెమయాకు కొడుకులు పుట్టారు. వాళ్ళు పరాక్రమశాలులుగా ఉండి తమ తండ్రి కుటుంబంలో పెద్దలయ్యారు. BSB BSB: Also to his son Shemaiah were born sons who ruled over their families because they were strong, capable men.
7 ULB షెమయా కొడుకులు ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, యెల్జాబాదు, బలవంతులైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా. BSB BSB: Shemaiah’s sons were Othni, Rephael, Obed, and Elzabad; his brothers were Elihu and Semachiah, also capable men.
8 ULB ఓబేదెదోము కొడుకులూ, వాళ్ళ కొడుకులూ వాళ్ళ సహోదరులూ అరవై ఇద్దరు, వాళ్ళు తమ పని చెయ్యడంలో గట్టివాళ్ళు. BSB BSB: All these were descendants of Obed-edom; they and their sons and brothers were capable men with strength to do the work—62 in all from Obed-edom.
9 ULB మెషెలెమ్యాకు పుట్టిన కొడుకులూ, సహోదరులూ, పరాక్రమశాలురు. వీళ్ళు పద్దెనిమిది మంది. BSB BSB: Meshelemiah also had sons and brothers who were capable men—18 in all.
10 ULB మెరారీయుల్లో హోసా అనే అతనికి పుట్టిన కొడుకులు పెద్దవాడు షిమ్రీ, అతడు పెద్దకొడుకు కాకపోయినా అతని తండ్రి అతన్ని నాయకునిగా చేశాడు. BSB BSB: Hosah the Merarite also had sons: Shimri the first (although he was not the firstborn, his father had appointed him as the first),
11 ULB రెండోవాడు హిల్కీయా, మూడోవాడు టెబల్యాహు, నాలుగోవాడు జెకర్యా, హోసా కొడుకులూ, సహోదరులూ అందరూ కలిసి పదముగ్గురు. BSB BSB: Hilkiah the second, Tebaliah the third, and Zechariah the fourth. The sons and brothers of Hosah numbered 13 in all.
12 ULB ఈ విధంగా ఏర్పాటైన తరగతులనుబట్టి యెహోవా మందిరంలో వంతుల ప్రకారం తమ సోదరులు సేవ చెయ్యడానికి ఈ ద్వారపాలకులు, అంటే వాళ్ళలో ఉన్న పెద్దలు వాళ్ళను జవాబుదారులుగా నియమించడం జరిగింది. BSB BSB: These divisions of the gatekeepers, through their chief men, had duties for ministering in the house of the LORD, just as their relatives did.
13 ULB చిన్నలకైనా పెద్దలకైనా పూర్వీకుల ఇంటి వరసనుబట్టి ఒక్కొక్క ద్వారం దగ్గర కావలి ఉండడానికి వాళ్ళు చీట్లు వేశారు. BSB BSB: They cast lots for each gate, according to their families, young and old alike.
14 ULB తూర్పు వైపు కావలి షెలెమ్యాకు పడింది, వివేకం గలిగి ఆలోచన చెప్పగలిగిన అతని కొడుకు జెకర్యాకు చీటివేసినప్పుడు ఉత్తరం వైపు కావలి అతనికి పడింది. BSB BSB: The lot for the East Gate fell to Shelemiah. Then lots were cast for his son Zechariah, a wise counselor, and the lot for the North Gate fell to him.
15 ULB ఓబేదెదోముకు దక్షిణం వైపు కావలీ, అతని కొడుకులకు గిడ్డంగుల కావలి పడింది. BSB BSB: The lot for the South Gate fell to Obed-edom, and the lot for the storehouses to his sons.
16 ULB షుప్పీముకూ, హోసాకూ, పడమటి వైపున ఉన్న షల్లెకెతు గుమ్మానికి ఎక్కే రాజమార్గాన్ని కాయడానికి చీటి పడింది. BSB BSB: The lots for the West Gate and the Shallecheth Gate on the ascending highway fell to Shuppim and Hosah. There were guards stationed at every watch.
17 ULB తూర్పున లేవీయులైన ఆరుగురు, ఉత్తరాన రోజుకు నలుగురూ, దక్షిణాన రోజుకు నలుగురూ, గిడ్డంగుల దగ్గర ఇద్దరిద్దరూ, BSB BSB: Each day there were six Levites on the east, four on the north, four on the south, and two pairs at the storehouse.
18 ULB బయట ద్వారం దగ్గర పడమరగా ఎక్కి వెళ్ళే రాజమార్గం దగ్గర నలుగురూ, బయట దారిలో ఇద్దరూ, ఏర్పాటు అయ్యారు. BSB BSB: As for the court on the west, there were four at the highway and two at the court.
19 ULB కోరే సంతానంలోనూ, మెరారీయుల్లోనూ ద్వారం కావలి కాసే వాళ్లకు ఈ విధంగా వంతులు వచ్చాయి. BSB BSB: These were the divisions of the gatekeepers who were descendants of Korah and Merari.
20 ULB చివరికి లేవీయుల్లో అహీయా అనేవాడు దేవుని మందిరపు గిడ్డంగులనూ, ప్రతిష్ఠిత వస్తువుల గిడ్డంగులనూ కాసేవాడుగా నియామకం జరిగింది. BSB BSB: Now their fellow Levites were in charge of the treasuries of the house of God and the treasuries of the dedicated things.
21 ULB ఇది లద్దాను సంతానం గూర్చినది. గెర్షోనీయుడైన లద్దాను కొడుకులు, అంటే, గెర్షోనీయులుగా ఉంటూ తమ పూర్వీకుల కుటుంబాలకు పెద్దలై ఉన్నవాళ్ళను గూర్చినది. BSB BSB: From the descendants of Ladan, who were Gershonites through Ladan and heads of the families of Ladan the Gershonite, were Jehieli,
22 ULB యెహీయేలీ కొడుకులైన జేతాము, అతని సహోదరుడు యోవేలు, యెహోవా మందిరపు గిడ్డంగులకు కావలి కాసేవాళ్ళు. BSB BSB: the sons of Jehieli, Zetham, and his brother Joel. They were in charge of the treasuries of the house of the LORD.
23 ULB ఇది అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు, అనేవాళ్ళను గూర్చినది. BSB BSB: From the Amramites, the Izharites, the Hebronites, and the Uzzielites:
24 ULB మోషే కొడుకు గెర్షోముకు పుట్టిన షెబూయేలుకు గిడ్డంగుల మీద ప్రధానిగా నియామకం జరిగింది. BSB BSB: Shebuel, a descendant of Gershom son of Moses, was the officer in charge of the treasuries.
25 ULB ఎలీయెజెరు సంతానం వాళ్ళు షెబూయేలు సహోదరులు ఎవరంటే, అతని కొడుకు రెహబ్యా, రెహబ్యా కొడుకు యెషయా, యెషయా కొడుకు యెహోరాము, యెహోరాము కొడుకు జిఖ్రీ, జిఖ్రీ కొడుకు షెలోమీతు. BSB BSB: His relatives through Eliezer included Rehabiah his son, Jeshaiah his son, Joram his son, Zichri his son, and Shelomith his son.
26 ULB రాజైన దావీదూ, పూర్వీకుల కుటుంబాల పెద్దలూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, సైన్యాధిపతులూ ప్రతిష్ఠించిన ప్రత్యేకమైన సామగ్రి ఉన్న గిడ్డంగులకు షెలోమీతూ, అతని సహోదరులూ కావలి కాసేవాళ్ళయ్యారు. BSB BSB: This Shelomith and his brothers were in charge of all the treasuries for the things dedicated by King David, by the heads of families who were the commanders of thousands and of hundreds, and by the army commanders.
27 ULB యెహోవా మందిరం మరమ్మతు పనుల కోసం యుద్ధాల్లో పట్టుకున్న కొల్లసొమ్ము కొంత భాగాన్ని వీరు సమర్పించారు. BSB BSB: They had dedicated some of the plunder from their battles to the repair of the house of the LORD.
28 ULB ప్రవక్త అయిన సమూయేలు, కీషు కొడుకు సౌలు, నేరు కొడుకు అబ్నేరు, సెరూయా కొడుకు యోవాబు ప్రతిష్ఠించిన సొమ్మంతటినీ షెలోమీతు, అతని సహోదరుల ఆధీనంలో ఉంచారు. BSB BSB: Everything that had been dedicated by Samuel the seer, Saul son of Kish, Abner son of Ner, and Joab son of Zeruiah, along with everything else that was dedicated, was under the care of Shelomith and his brothers.
29 ULB ఇది ఇస్హారీయులను గూర్చినది. వాళ్ళల్లో కెనన్యా, అతని కొడుకులను, పురపాలన జరిగించడానికి ఇశ్రాయేలీయులకు లేఖికులుగా, న్యాయాధిపతులుగా నియమించారు. BSB BSB: From the Izharites, Chenaniah and his sons had the outside duties as officers and judges over Israel.
30 ULB ఇది హెబ్రోనీయులను గూర్చినది. హషబ్యా, అతని సహోదరులు పరాక్రమశాలురు. వీళ్ళు పదిహేడువేల మంది. వీళ్ళు యొర్దాను ఇవతల పడమటి వైపున ఉండే ఇశ్రాయేలీయుల మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయంలోనూ, రాజు నియమించిన పని విషయంలోనూ, పర్యవేక్షకులుగా నియమితులయ్యారు. BSB BSB: From the Hebronites, Hashabiah and his relatives, 1,700 capable men, had charge of the affairs of Israel west of the Jordan for all the work of the LORD and for the service of the king.
31 ULB ఇది హెబ్రోనీయులను గూర్చినది. హెబ్రోనీయుల పూర్వీకుల ఇంటి పెద్దలందరికీ యెరీయా పెద్ద. దావీదు ఏలుబడిలో నలభయ్యవ సంవత్సరంలో వాళ్ళ సంగతి పరిశీలించినప్పుడు, వాళ్ళల్లో గిలాదు దేశంలోని యాజేరులో ఉన్న వాళ్ళు పరాక్రమశాలురుగా కనిపించారు. BSB BSB: As for the Hebronites, Jerijah was the chief of the Hebronites, according to the genealogies of his ancestors. In the fortieth year of David’s reign the records were searched, and strong, capable men were found among the Hebronites at Jazer in Gilead.
32 ULB పరాక్రమశాలురైన అతని సంబంధులు రెండువేల ఏడువందల మంది కుటుంబ పెద్దలుగా కనిపించారు. దావీదు దైవసంబంధమైన కార్యాల విషయంలోనూ, రాజకార్యాల విషయంలోనూ, రూబేనీయుల మీదా, గాదీయుల మీదా, మనష్షే అర్థగోత్రపు వాళ్ళ మీదా వాళ్ళను నియమించాడు. BSB BSB: Among Jerijah’s relatives there were 2,700 capable men who were heads of families. King David appointed them over the Reubenites, the Gadites, and the half-tribe of Manasseh for every matter pertaining to God and for the affairs of the king.
Select verses for actions: Enter goes to them and Escape comes back.