2 ULB రాత్రి పూట దొంగ ఎలా వస్తాడో ప్రభువు దినం కూడా అలానే వస్తుందని మీకు బాగా తెలుసు. BSB BSB: For you are fully aware that the Day of the Lord will come like a thief in the night.
3 ULB ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు. BSB BSB: While people are saying, “Peace and security,” destruction will come upon them suddenly, like labor pains on a pregnant woman, and they will not escape.
4 ULB సోదరులారా, ఆ రోజు దొంగలాగా మీ మీదికి రావడానికి మీరేమీ చీకటిలో ఉన్నవారు కాదు. BSB BSB: But you, brothers, are not in the darkness so that this day should overtake you like a thief.
5 ULB మీరంతా వెలుగు సంతానం, పగటి సంతానం. మనం రాత్రి సంతానం కాదు. చీకటి సంతానమూ కాదు. BSB BSB: For you are all sons of the light and sons of the day; we do not belong to the night or to the darkness.
6 ULB కాబట్టి ఇతరుల్లాగా నిద్ర పోకుండా, అప్రమత్తంగా, మెలకువగా ఉందాం. BSB BSB: So then, let us not sleep as the others do, but let us remain awake and sober.
7 ULB నిద్రపోయే వారు రాత్రుళ్ళు నిద్రపోతారు. తాగి మత్తెక్కేవారు రాత్రుళ్ళే మత్తుగా ఉంటారు. BSB BSB: For those who sleep, sleep at night, and those who get drunk, get drunk at night.
8 ULB విశ్వాసులమైన మనం పగటి వాళ్ళం కాబట్టి మనల్ని మనం అదుపులో ఉంచుకుందాము. విశ్వాసం, ప్రేమ అనే కవచాన్నీ, రక్షణ కొరకైన ఆశాభావం అనే శిరస్త్రాణాన్నీ ధరించుకుందాం. BSB BSB: But since we belong to the day, let us be sober, putting on the breastplate of faith and love, and the helmet of our hope of salvation.
9 ULB ఎందుకంటే మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు రక్షణ పొందడానికే మనల్ని నియమించాడు గానీ ఉగ్రతను ఎదుర్కోడానికి కాదు. BSB BSB: For God has not appointed us to suffer wrath, but to obtain salvation through our Lord Jesus Christ.
10 ULB మనం మేలుకొని ఉన్నా నిద్రపోతూ ఉన్నా తనతో కలసి జీవించడానికే ఆయన మన కోసం చనిపోయాడు. BSB BSB: He died for us so that, whether we are awake or asleep, we may live together with Him.
11 ULB కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించుకోండి, క్షేమాభివృద్ధి కలగజేసుకోండి. BSB BSB: Therefore encourage and build one another up, just as you are already doing.
12 ULB సోదరులారా, మీ మధ్య ప్రయాసపడుతూ ప్రభువులో మీకు నాయకత్వం వహిస్తూ మీకు బుద్ధి చెబుతూ ఉన్నవారిని గౌరవించండి. BSB BSB: But we ask you, brothers, to acknowledge those who work diligently among you, who care for you in the Lord and who admonish you.
13 ULB వారు చేస్తున్న పనిని బట్టి వారిని ప్రేమతో ఎంతో ఘనంగా ఎంచుకోవాలని బతిమాలుతున్నాం. ఒకరితో మరొకరు శాంతి భావనతో ఉండండి. BSB BSB: In love, hold them in highest regard because of their work. Live in peace with one another.
14 ULB సోదరులారా, మీకు మా ఉపదేశం ఏమిటంటే, సోమరులను హెచ్చరించండి. ధైర్యం లేక కుంగిపోయిన వారికి ధైర్యం చెప్పండి. బలహీనులకు సహాయం చేయండి. అందరి పట్లా సహనం కలిగి ఉండండి. BSB BSB: And we urge you, brothers, to admonish the unruly, encourage the fainthearted, help the weak, and be patient with everyone.
15 ULB ఎవరూ కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి పట్ల మరొకరూ, ఇంకా మనుషులందరి పట్లా ఎప్పుడూ మేలైన దానినే చేయడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. BSB BSB: Make sure that no one repays evil for evil. Always pursue what is good for one another and for all people.
16 ULB ఎప్పుడూ సంతోషంగా ఉండండి. BSB BSB: Rejoice at all times.
17 ULB ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి. BSB BSB: Pray without ceasing.
18 ULB ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయడం యేసు క్రీస్తులో మీ విషయంలో దేవుని ఉద్దేశం. BSB BSB: Give thanks in every circumstance, for this is God’s will for you in Christ Jesus.
19 ULB దేవుని ఆత్మను ఆర్పవద్దు. BSB BSB: Do not extinguish the Spirit.
20 ULB ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. BSB BSB: Do not treat prophecies with contempt,
22 ULB ప్రతి విధమైన కీడుకూ దూరంగా ఉండండి. BSB BSB: Abstain from every form of evil.
23 ULB శాంతి ప్రదాత అయిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పవిత్ర పరచు గాక! మీ ఆత్మా ప్రాణమూ శరీరమూ మన ప్రభువైన యేసుక్రీస్తు రాకలో నిందారహితంగా సంపూర్ణంగా ఉంటాయి గాక! BSB BSB: Now may the God of peace Himself sanctify you completely, and may your entire spirit, soul, and body be kept blameless at the coming of our Lord Jesus Christ.
24 ULB మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన అలా చేస్తాడు. BSB BSB: The One who calls you is faithful, and He will do it.
25 ULB సోదరులారా, మా కోసం ప్రార్థన చేయండి. BSB BSB: Brothers, pray for us as well.
26 ULB పవిత్రమైన ముద్దుపెట్టుకొని సోదరులందరికీ వందనాలు తెలియజేయండి. BSB BSB: Greet all the brothers with a holy kiss.
27 ULB సోదరులందరికీ ఈ ఉత్తరాన్ని చదివి వినిపించాలని ప్రభువు పేర మీకు ఆదేశిస్తున్నాను. BSB BSB: I charge you before the Lord to have this letter read to all the brothers.
28 ULB మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక! BSB BSB: The grace of our Lord Jesus Christ be with you.
Select verses for actions: Enter goes to them and Escape comes back.