1 ULB యెహోషాపాతు చనిపోయినప్పుడు తన పూర్వీకులతో పాటు అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు యెహోరాము అతని బదులు రాజయ్యాడు. BSB BSB: And Jehoshaphat rested with his fathers and was buried with them in the City of David. And his son Jehoram reigned in his place.
2 ULB యెహోషాపాతు కుమారులైన అజర్యా, యెహీయేలు, జెకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్య అనేవారు ఇతనికి సోదరులు. వీరంతా ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు కొడుకులు. BSB BSB: Jehoram’s brothers, the sons of Jehoshaphat, were Azariah, Jehiel, Zechariah, Azariah, Michael, and Shephatiah; these were all sons of Jehoshaphat king of Israel.
3 ULB వారి తండ్రి బహుమానాలుగా, వెండి, బంగారం ఇంకా ఎన్నో విలువైన వస్తువులను, యూదాదేశంలో గోడలున్న పట్టణాలను వారికిచ్చాడు. అయితే యెహోరాము తనకు పెద్ద కొడుకు కాబట్టి అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు. BSB BSB: Their father had given them many gifts of silver and gold and precious things, as well as the fortified cities in Judah; but he gave the kingdom to Jehoram because he was the firstborn.
4 ULB యెహోరాము తన తండ్రి రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టి తన అధికారం సుస్థిరం చేసుకున్న తరువాత తాను స్థిరపడి, తన సోదరులందరినీ ఇశ్రాయేలీయుల అధిపతుల్లో కొంత మందినీ చంపేసాడు. BSB BSB: When Jehoram had established himself over his father’s kingdom, he strengthened himself by putting to the sword all his brothers along with some of the princes of Israel.
5 ULB యెహోరాము పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతనికి 32 ఏళ్ళు. అతడు యెరూషలేములో 8 ఏళ్ళు పాలించాడు. BSB BSB: Jehoram was thirty-two years old when he became king, and he reigned in Jerusalem eight years.
6 ULB అతడు అహాబు కూతుర్ని పెళ్లి చేసుకుని, అహాబు సంతతివారు నడచిన ప్రకారం ఇశ్రాయేలు రాజుల పద్ధతుల్లో నడిచాడు. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించాడు. BSB BSB: And Jehoram walked in the ways of the kings of Israel, just as the house of Ahab had done. For he married a daughter of Ahab and did evil in the sight of the LORD.
7 ULB అయినా యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన బట్టి, అతనికీ అతని కుమారులకూ ఎప్పుడూ జీవమిస్తానని చేసిన వాగ్దానం కోసం దావీదు సంతతిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. BSB BSB: Yet the LORD was unwilling to destroy the house of David, because of the covenant He had made with David, and since He had promised to maintain a lamp for David and his descendants forever.
8 ULB యెహోరాము రోజుల్లో యూదా రాజుల అధికారానికి వ్యతిరేకంగా ఎదోమీయులు తిరుగుబాటు చేసి తమకు ఒక రాజును ఉంచుకున్నారు. BSB BSB: In the days of Jehoram, Edom rebelled against the hand of Judah and appointed their own king.
9 ULB యెహోరాము తన అధికారులను వెంటబెట్టుకుని, తన రథాలన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తనను చుట్టుముట్టిన ఎదోమీయులనూ రథాధిపతులను చంపేసాడు. BSB BSB: So Jehoram crossed into Edom with his officers and all his chariots. When the Edomites surrounded him and his chariot commanders, he rose up and attacked by night.
10 ULB కాబట్టి ఇప్పటి వరకూ ఎదోమీయులు యూదావారి అధికారం కింద ఉండక తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. యెహోరాము తన పూర్వీకుల దేవుడైన యెహోవాను విస్మరించినందుకు అదే సమయంలో లిబ్నా పట్టణం కూడా అతని అధికారం కింద ఉండకుండాా తిరుగుబాటు చేసింది. BSB BSB: So to this day Edom has been in rebellion against the hand of Judah. Likewise, Libnah rebelled against his hand at the same time, because Jehoram had forsaken the LORD, the God of his fathers.
11 ULB యెహోరాము యూదా కొండల్లో బలిపీఠాలు కట్టించి యెరూషలేము నివాసులు వేశ్యలా ప్రవర్తించేలా చేశాడు. ఈ విధంగా అతడు యూదావారిని తప్పుదారి పట్టించాడు. BSB BSB: Jehoram had also built high places on the hills of Judah; he had caused the people of Jerusalem to prostitute themselves and had led Judah astray.
12 ULB ఏలీయా ప్రవక్త నుంచి ఒక ఉత్తరం యెహోరాముకు వచ్చింది. దానిలో ఇలా ఉంది. <<నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు. <నీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గాల్లో గానీ యూదారాజు ఆసా మార్గాల్లో గానీ నడుచుకోకుండా BSB BSB: Then a letter came to Jehoram from Elijah the prophet, which stated: “This is what the LORD, the God of your father David, says: ‘You have not walked in the ways of your father Jehoshaphat or of Asa king of Judah,
13 ULB ఇశ్రాయేలు రాజుల మార్గాల్లో నడచి అహాబు సంతతివారు చేసిన ప్రకారం యూదానూ యెరూషలేము నివాసులనూ వ్యభిచరింపజేసి, నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతానమైన నీ సోదరులను చంపావు. BSB BSB: but you have walked in the ways of the kings of Israel and have caused Judah and the people of Jerusalem to prostitute themselves, just as the house of Ahab prostituted itself. You have also killed your brothers, your father’s family, who were better than you.
14 ULB కాబట్టి గొప్ప తెగులుతో యెహోవా నీ ప్రజలనూ నీ పిల్లలనూ నీ భార్యలనూ నీ సంపదనంతటినీ దెబ్బ తీస్తాడు. BSB BSB: So behold, the LORD is about to strike your people, your sons, your wives, and all your possessions with a serious blow.
15 ULB నీవు పేగుల్లో ఘోరమైన జబ్బుతో రోగిష్టిగా ఉంటావు. రోజురోజుకూ ఆ జబ్బుతో నీ పేగులు చెడిపోతాయి.>>> BSB BSB: And day after day you yourself will suffer from a severe illness, a disease of your bowels, until it causes your bowels to come out.’”
16 ULB యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను, ఇతియోపియాకు దగ్గరగా ఉన్న అరబీయులను రేపాడు. BSB BSB: Then the LORD stirred against Jehoram the spirit of the Philistines and Arabs who lived near the Cushites.
17 ULB వారు యూదాదేశంపై దాడి చేసి దానిలో చొరబడి రాజనగరులో దొరికిన సంపదనంతా, అతని కొడుకులనూ భార్యలనూ పట్టుకెళ్ళారు. అతని కొడుకుల్లో చివరి వాడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కొడుకును కూడా విడిచిపెట్టలేదు. BSB BSB: So they went to war against Judah, invaded it, and carried off all the possessions found in the king’s palace, along with his sons and wives; not a son was left to him except Jehoahaz, his youngest.
18 ULB ఇదంతా జరిగిన తరువాత యెహోవా అతని కడుపులో నయం కాని జబ్బు కలిగించాడు. BSB BSB: After all this, the LORD afflicted Jehoram with an incurable disease of the bowels.
19 ULB రెండేళ్ళ తరువాత ఆ జబ్బు ముదిరి అతని పేగులు చెడిపోయి దుర్భరంగా చనిపోయాడు. అతని ప్రజలు అతని పూర్వీకులకు చేసిన అంత్యక్రియలు అతనికి చేయలేదు. BSB BSB: This continued day after day until two full years had passed. Finally, his intestines came out because of his disease, and he died in severe pain. And his people did not make a fire in his honor as they had done for his fathers.
Select verses for actions: Enter goes to them and Escape comes back.