1 ULB దావీదు అమాలేకీయులను చంపి తిరిగి వచ్చాడు. సౌలు చనిపోయిన తరువాత అతడు సిక్లగు ప్రాంతంలో రెండు రోజులు ఉన్నాడు. BSB BSB: After the death of Saul, David returned from the slaughter of the Amalekites and stayed in Ziklag two days.
2 ULB మూడవ రోజు ఒకడు తన బట్టలు చింపుకుని, తల మీద బూడిద పోసుకుని సౌలు సైన్యం నుండి వచ్చాడు. BSB BSB: On the third day a man with torn clothes and dust on his head arrived from Saul’s camp. When he came to David, he fell to the ground to pay him homage.
3 ULB అతడు దావీదును చూసి నేలపై సాష్టాంగపడి నమస్కారం చేశాడు. అప్పుడు దావీదు <<నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?>> అని అడిగాడు. అందుకు వాడు <<ఇశ్రాయేలీయుల సైన్యంలో నుండి నేను తప్పించుకు వచ్చాను>> అన్నాడు. BSB BSB: “Where have you come from?” David asked. “I have escaped from the Israelite camp,” he replied.
4 ULB <<జరిగిన సంగతులు నాతో చెప్పు>> అని దావీదు అడిగాడు. అందుకు అతడు <<సైనికులు యుద్ధంలో నిలవలేక పారిపోయారు. చాలా మంది గాయాలపాలై పడిపోయారు, చాలా మంది చనిపోయారు. సౌలూ అతని కొడుకు యోనాతానూ చనిపోయారు>> అన్నాడు. BSB BSB: “What was the outcome?” David asked. “Please tell me.” “The troops fled from the battle,” he replied. “Many of them fell and died. And Saul and his son Jonathan are also dead.”
5 ULB <<సౌలు, అతని కొడుకు యోనాతాను చనిపోయారని నీకెలా తెలిసిందో నాకు వివరంగా చెప్పు>> అని దావీదు అతణ్ణి అడిగాడు. ఆ యువకుడు ఇలా అన్నాడు, BSB BSB: Then David asked the young man who had brought him the report, “How do you know that Saul and his son Jonathan are dead?”
6 ULB <<నేను అనుకోకుండా గిల్బోవ కొండకు వచ్చినప్పుడు సౌలు తన ఈటె మీద ఆనుకుని ఉన్నాడు. BSB BSB: “I happened to be on Mount Gilboa,” he replied, “and there was Saul, leaning on his spear, with the chariots and the cavalry closing in on him.
7 ULB రథాలు, రౌతులు అతనిని తరుముతూ పట్టుకోవడానికి సమీపించినప్పుడు అతడు వెనక్కి తిరిగి చూసి నన్ను పిలిచాడు. అందుకు నేను, <చిత్తం నా రాజా> అన్నాను. BSB BSB: When he turned around and saw me, he called out to me, and I answered, ‘Here I am!’
8 ULB అతడు <నువ్వు ఎవరివి?> అని నన్ను అడిగాడు. <నేను అమాలేకీయుణ్ణి> అని చెప్పాను. BSB BSB: ‘Who are you?’ he asked. So I told him, ‘I am an Amalekite.’
9 ULB అతడు <నాలో కొన ప్రాణం ఉన్నందువల్ల నేను తీవ్రమైన యాతనలో ఉన్నాను. నా దగ్గరికి వచ్చి నన్ను చంపెయ్యి> అని ఆజ్ఞాపించాడు. BSB BSB: Then he begged me, ‘Stand over me and kill me, for agony has seized me, but my life still lingers.’
10 ULB అంత తీవ్రంగా గాయపడిన తరువాత అతడు ఇక బతకడని అనిపించి నేను అతని దగ్గర నిలబడి అతణ్ణి చంపివేశాను. అతని తల మీద ఉన్న కిరీటాన్ని, చేతి కంకణాలను తీసుకుని నా రాజువైన నీ దగ్గరికి వాటిని తెచ్చాను>> అన్నాడు. BSB BSB: So I stood over him and killed him, because I knew that after he had fallen he could not survive. And I took the crown that was on his head and the band that was on his arm, and I have brought them here to my lord.”
11 ULB దావీదు ఆ వార్త విని తన బట్టలు చింపుకున్నాడు. అతని దగ్గర ఉన్నవారంతా అలాగే చేసి, BSB BSB: Then David took hold of his own clothes and tore them, and all the men who were with him did the same.
12 ULB సౌలూ, యోనాతానూ యెహోవా ప్రజలూ ఇశ్రాయేలు వంశీకులూ యుద్ధంలో చనిపోయారని వారిని గూర్చి దుఃఖపడుతూ, ప్రలాపిస్తూ సాయంత్రం వరకూ ఉపవాసం ఉన్నారు. BSB BSB: They mourned and wept and fasted until evening for Saul and his son Jonathan, and for the people of the LORD and the house of Israel, because they had fallen by the sword.
13 ULB తరువాత దావీదు <<నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?>> అని ఆ వార్త తెచ్చినవాణ్ణి అడిగాడు. వాడు <<నేను ఇశ్రాయేలు దేశంలో నివసించే అమాలేకువాడైన ఒకడి కొడుకును>> అన్నాడు. BSB BSB: And David inquired of the young man who had brought him the report, “Where are you from?” “I am the son of a foreigner,” he answered. “I am an Amalekite.”
14 ULB అందుకు దావీదు <<భయం లేకుండా యెహోవా అభిషేకించిన వాణ్ణి చంపడానికి అతని మీద నువ్వెందుకు చెయ్యి ఎత్తావు?>> అని BSB BSB: So David asked him, “Why were you not afraid to lift your hand to destroy the LORD’s anointed?”
15 ULB తన మనిషి ఒకణ్ణి పిలిచి <<వెళ్లి వాణ్ణి చంపు>> అని చెప్పగా అతడు వాణ్ణి కొట్టి చంపాడు. BSB BSB: Then David summoned one of the young men and said, “Go, execute him!” So the young man struck him down, and he died.
16 ULB <<యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను చంపానని నువ్వు చెప్పావే, నీ నోటి మాటే నీకు సాక్ష్యం. కాబట్టి నీ ప్రాణానికి నువ్వే జవాబుదారివి>> అని దావీదు ఆ మృత అమాలేకీయుడితో అన్నాడు. BSB BSB: For David had said to the Amalekite, “Your blood be on your own head because your own mouth has testified against you, saying, ‘I killed the LORD’s anointed.’”
17 ULB దావీదు సౌలును గూర్చి, అతని కొడుకు యోనాతానును గూర్చి భూస్థాపన విలాప గీతం ఒకటి పాడాడు. BSB BSB: Then David took up this lament for Saul and his son Jonathan,
18 ULB యూదా వారంతా ఆ ధనుర్గీతం నేర్చుకోవాలని తన ప్రజలను ఆదేశించాడు. అది యాషారు గ్రంథంలో రాసి ఉంది. BSB BSB: and he ordered that the sons of Judah be taught the Song of the Bow. It is written in the Book of Jashar:
19 ULB ఇశ్రాయేలూ, నీకు మహిమ అంతా నీ పర్వతాలపై మృతి చెందింది. బలవంతులు ఎలా పడిపోయారో గదా! BSB BSB: “Your glory, O Israel, lies slain on your heights. How the mighty have fallen!
20 ULB ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషించకూడదు. సున్నతి లేనివారి కుమార్తెలు పండగ చేసుకోకూడదు. అందుకని ఈ సంగతి గాతులో తెలియనియ్యకండి. అష్కెలోను వీధుల్లో ప్రకటన చేయకండి. BSB BSB: Tell it not in Gath; proclaim it not in the streets of Ashkelon, lest the daughters of the Philistines rejoice, and the daughters of the uncircumcised exult.
21 ULB గిల్బోవ పర్వతాల్లారా, మీ మీద మంచైనా వర్షమైనా పడకపోవు గాక. అర్పణకు పనికి వచ్చే ధాన్యం పండే చేలు లేకపోవు గాక. పరాక్రమవంతుల డాలు అవమానం పాలయింది. సౌలు డాలు తైలం చేత అభిషేకం పొందనిదైనట్టు అయిపోయింది. BSB BSB: O mountains of Gilboa, may you have no dew or rain, no fields yielding offerings of grain. For there the shield of the mighty was defiled, the shield of Saul, no longer anointed with oil.
22 ULB హతుల రక్తం ఒలికించకుండా, బలిష్టుల దేహాలనుండి యోనాతాను విల్లు మడమ తిప్పలేదు. ఎవరినీ హతమార్చకుండా సౌలు ఖడ్గం వట్టినే వెనుదిరగ లేదు. BSB BSB: From the blood of the slain, from the fat of the mighty, the bow of Jonathan did not retreat, and the sword of Saul did not return empty.
23 ULB సౌలూ యోనాతానూ తమ బతుకులో ప్రేమ గలవారుగా, దయ గలవారుగా ఉన్నారు. తమ చావులో సైతం వారు ఒకరికొకరికి వేరై ఉండలేదు. వారు పక్షిరాజుల కంటే వేగం గలవారు. సింహాలకంటే బలమైన వారు. BSB BSB: Saul and Jonathan, beloved and delightful in life, were not divided in death. They were swifter than eagles; they were stronger than lions.
24 ULB ఇశ్రాయేలీయుల కుమార్తెలూ, సౌలును గూర్చి ఏడవండి. అతడు మీకు ఇష్టమైన ఎర్రని బట్టలు ధరింప జేశాడు. మీకు బంగారు నగలు ఇచ్చాడు. BSB BSB: O daughters of Israel, weep for Saul, who clothed you in scarlet and luxury, who decked your garments with ornaments of gold.
25 ULB యుద్ధరంగంలో బలమైన మనుషులు పడిపోయారు. నీ ఉన్నత స్థలాల్లో యోనాతానును చంపేశారు. BSB BSB: How the mighty have fallen in the thick of battle! Jonathan lies slain on your heights.
26 ULB నా సోదరుడా, యోనాతానూ, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి. నీ నిమిత్తం నేను తీవ్రంగా శోకిస్తున్నాను. నాపై నీ ప్రేమ ఎంతో వింతైనది. స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది ఎక్కువైనది. BSB BSB: I grieve for you, Jonathan, my brother. You were delightful to me; your love to me was extraordinary, surpassing the love of women.
27 ULB అయ్యయ్యో బలవంతులైన సైనికులు కూలిపోయారు. యుద్ధ శూరులు నశించిపోయారు. BSB BSB: How the mighty have fallen, and the weapons of war have perished!”
Select verses for actions: Enter goes to them and Escape comes back.