1 ULB దావీదు తన దగ్గర ఉన్న మనుషులను లెక్కించాడు. వారిలో వెయ్యిమందిని, వందమందిని విభజించి వారిని మూడు భాగాలుగా చేశాడు. BSB BSB: Then David reviewed his troops and appointed over them commanders of thousands and of hundreds.
2 ULB ఒక భాగానికి యోవాబుకు, ఒక భాగాన్ని సెరూయా కుమారుడు, యోవాబు సోదరుడు అబీషైకు, మరో భాగాన్ని గిత్తీయుడు ఇత్తయికు నాయకత్వ బాధ్యతలు అప్పగించాడు. తరువాత దావీదు <<నేను మీతోకూడా కలసి బయలుదేరుతున్నాను>> అని వారితో చెప్పాడు. BSB BSB: He sent out the troops, a third under Joab, a third under Joab’s brother Abishai son of Zeruiah, and a third under Ittai the Gittite. And the king said to the troops, “I will surely march out with you as well.”
3 ULB అందుకు వారు <<నువ్వు మాతో రాకూడదు. మేము పారిపోయినా ప్రజలు దాన్ని పట్టించుకోరు, మాలో సగం మంది చనిపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. మాలాంటి పది వేలమందితో నువ్వు ఒక్కడివి సమానం. కాబట్టి నీవు పట్టణంలోనే ఉండి మాకు సూచనలిస్తూ సహాయం చెయ్యి>> అని చెప్పారు. BSB BSB: But the people pleaded, “You must not go out! For if we have to flee, they will not care about us. Even if half of us die, they will not care. But you are worth ten thousand of us. It is better now if you support us from the city.”
4 ULB అందుకు రాజు <<మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేస్తాను>> అని చెప్పి, గుమ్మం పక్కన నిలబడినప్పుడు ప్రజలంతా గుంపులు గుంపులుగా వందల కొలదిగా, వేల కొలదిగా బయలుదేరారు. BSB BSB: “I will do whatever seems best to you,” the king replied. So he stood beside the gate, while all the troops marched out by hundreds and by thousands.
5 ULB అప్పుడు రాజు యోవాబు, అబీషై, ఇత్తయిలను పిలిచి <<నా కోసం యువకుడైన అబ్షాలోము పట్ల దయ చూపించండి>> అని ఆజ్ఞాపించాడు. అక్కడున్నవారంతా వింటూ ఉండగానే రాజు అబ్షాలోమును గూర్చి సైన్యాధిపతులకందరికీ ఈ ఆజ్ఞ ఇచ్చాడు. BSB BSB: Now the king had commanded Joab, Abishai, and Ittai, “Treat the young man Absalom gently for my sake.” And all the people heard the king’s orders to each of the commanders regarding Absalom.
6 ULB దావీదు మనుషులు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయడానికి మైదానంలోకి బయలుదేరారు. ఎఫ్రాయిము అడవిలో పోరాటం జరిగింది. BSB BSB: So David’s army marched into the field to engage Israel, and the battle took place in the forest of Ephraim.
7 ULB ఇశ్రాయేలు వారు దావీదు సైనికుల ముందు నిలబడలేక ఓడిపోయారు. ఆ రోజున ఇరవై వేలమందిని అక్కడ చంపేశారు. BSB BSB: There the people of Israel were defeated by David’s servants, and the slaughter was great that day—twenty thousand men.
8 ULB ఆ ప్రాంతమంతా యుద్ధం వ్యాపించింది. ఆ రోజున కత్తి వాత చనిపోయిన వారికంటే ఎక్కువమంది అడవిలో చిక్కుకుని నాశనమయ్యారు. BSB BSB: The battle spread over the whole countryside, and that day the forest devoured more people than the sword.
9 ULB అబ్షాలోము కంచరగాడిద ఎక్కి వస్తూ దావీదు సేవకులకు ఎదురు పడ్డాడు. ఆ కంచరగాడిద ఒక బాగా గుబురుగా ఉన్న పెద్ద సింధూర వృక్షం కొమ్మల కిందనుండి వెళ్తున్నప్పుడు అబ్షాలోము తల చెట్టుకు తగులుకుంది. అతడు పైకి ఎత్తబడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. అతని కింద ఉన్న కంచర గాడిద ముందుకు వెళ్ళిపోయింది. BSB BSB: Now Absalom was riding on his mule when he met the servants of David, and as the mule went under the thick branches of a large oak, Absalom’s head was caught fast in the tree. The mule under him kept going, so that he was suspended in midair.
10 ULB ఒక సైనికుడు అది చూసి, యోవాబు దగ్గర కు వచ్చి <<అబ్షాలోము సింధూర వృక్షానికి చిక్కుకుని వేలాడుతూ ఉండడం నేను చూశాను>> అని చెప్పాడు. BSB BSB: When one of the men saw this, he told Joab, “I just saw Absalom hanging in an oak tree!”
11 ULB అప్పుడు యోవాబు ఆ వార్త తెచ్చినవాడితో <<నువ్వు చూశావు గదా, నేలమీద పడేలా అతణ్ణి ఎందుకు కొట్టలేదు? నువ్వు గనక అతణ్ణి చంపి ఉంటే పది తులాల వెండి, ఒక నడికట్టు నీకు ఇచ్చి ఉండేవాణ్ణి>> అన్నాడు. BSB BSB: “You just saw him!” Joab exclaimed. “Why did you not strike him to the ground right there? I would have given you ten shekels of silver and a warrior’s belt!”
12 ULB అప్పుడు వాడు <<యువకుడైన అబ్షాలోమును ఎవ్వరూ తాకకుండా జాగ్రత్తపడమని రాజు నీకూ, అబీషైకీ, ఇత్తయికీ ఆజ్ఞ ఇస్తున్నప్పుడు నేను విన్నాను. వెయ్యి తులాల వెండి నా చేతిలో పెట్టినా రాజు కొడుకుని నేను చంపను. BSB BSB: The man replied, “Even if a thousand shekels of silver were weighed out into my hands, I would not raise my hand against the son of the king. For we heard the king command you and Abishai and Ittai, ‘Protect the young man Absalom for my sake.’
13 ULB మోసం చేసి అతని ప్రాణానికి హాని తలపెడితే ఆ సంగతి రాజుకు తెలియకుండా ఉండదు. రాజు సమక్షంలో నువ్వే నాకు విరోధివౌతావు>> అని యోవాబుతో అన్నాడు. BSB BSB: If I had jeopardized my own life—and nothing is hidden from the king—you would have abandoned me.”
14 ULB యోవాబు <<నువ్వు చంపకపోతే నేను చూస్తూ ఊరుకుంటానా?>> అని చెప్పి, మూడు బాణాలు చేతిలోకి తీసుకుని వెళ్లి సింధూర వృక్షానికి వ్రేలాడుతూ ఇంకా ప్రాణంతో ఉన్న అబ్షాలోము గుండెకు గురి చూసి కొట్టాడు. BSB BSB: But Joab declared, “I am not going to wait like this with you!” And he took three spears in his hand and thrust them through the heart of Absalom while he was still alive in the oak tree.
15 ULB యోవాబు ఆయుధాలు మోసేవారు పదిమంది చుట్టుముట్టి అబ్షాలోమును కొట్టి చంపారు. BSB BSB: And ten young men who carried Joab’s armor surrounded Absalom, struck him, and killed him.
16 ULB అప్పుడు ఇశ్రాయేలీయులను తరమడం ఇక ఆపమని యోవాబు బాకా ఊదించాడు. దావీదు సైనికులు తిరిగి వచ్చారు. BSB BSB: Then Joab blew the ram’s horn, and the troops broke off their pursuit of Israel because Joab had restrained them.
17 ULB ప్రజలు అబ్షాలోము మృతదేహాన్ని ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేశారు. పెద్ద రాళ్లకుప్పను దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులంతా తమ తమ ఇళ్ళకు పారిపోయారు. BSB BSB: They took Absalom, cast him into a large pit in the forest, and piled a huge mound of stones over him. Meanwhile, all the Israelites fled, each to his home.
18 ULB అబ్షాలోము జీవించి ఉన్నప్పుడు తన పేరు నిలబెట్టడానికి తనకు కొడుకులు లేరు గనక అతడు బ్రదికి ఉన్నప్పుడే ఒక స్తంభం తెచ్చి దాన్ని తన పేరట నిలబెట్టి ఆ స్తంభానికి అతని పేరు పెట్టాడు. ఇప్పటికీ అది అబ్షాలోము స్తంభం అని పిలువబడుతూ ఉంది. BSB BSB: During his lifetime, Absalom had set up for himself a pillar in the King’s Valley, for he had said, “I have no son to preserve the memory of my name.” So he gave the pillar his name, and to this day it is called Absalom’s Monument.
19 ULB సాదోకు కొడుకు అహిమయస్సు <<నేను పరుగెత్తుకుంటూ వెళ్ళి యెహోవా తన శత్రువులను ఓడించి రాజుకు న్యాయం చేకూర్చాడన్న సమాచారం రాజుతో చెబుతాను>> అన్నాడు. BSB BSB: Then Ahimaaz son of Zadok said, “Please let me run and tell the king the good news that the LORD has avenged him of his enemies.”
20 ULB యోవాబు <<ఈ రోజున ఈ కబురు చెప్పకూడదు. మరో రోజు చెప్పవచ్చు. ఎందుకంటే రాజు కుమారుడు చనిపోయాడు కనుక నేడు ఈ కబురు రాజుకు చెప్పడం భావ్యం కాదు>> అని అతనితో చెప్పాడు. BSB BSB: But Joab replied, “You are not the man to take good news today. You may do it another day, but you must not do so today, because the king’s son is dead.”
21 ULB తరువాత కూషువాడిని పిలిచి <<నువ్వు వెళ్లి నువ్వు చూసినదంతా రాజుకు తెలియజెయ్యి>> అని చెప్పాడు. అప్పుడు కూషువాడు యోవాబుకు నమస్కారం చేసి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. BSB BSB: So Joab said to a Cushite, “Go, tell the king what you have seen.” The Cushite bowed to Joab and took off running.
22 ULB సాదోకు కొడుకు అహిమయస్సు <<కూషువాడితో నేను కూడా పరుగెత్తుకుంటూ వెళ్ళడానికి నాకు అనుమతి ఇవ్వు>> అని అడిగాడు. యోవాబు <<కుమారా, నువ్వెందుకు వెళ్ళాలి? నీకు బహుమానం వచ్చే ప్రత్యేకమైన సమాచారం ఏదీ లేదుకదా>> అని అతనితో అన్నాడు. BSB BSB: Ahimaaz son of Zadok, however, persisted and said to Joab, “No matter what, please let me also run behind the Cushite!” “My son,” Joab replied, “why do you want to run, since you will not receive a reward?”
23 ULB అప్పుడు అతడు <<ఏమైనా సరే, నేను పరుగెత్తి వెళ్తాను>> అన్నాడు. అందుకు యోవాబు <<సరే వెళ్ళు>> అని చెప్పాడు. అహిమయస్సు మైదానపు దారిలో పరుగెత్తుకుంటూ కూషీవాడి కంటే ముందుగా చేరుకున్నాడు. BSB BSB: “No matter what, I want to run!” he replied. “Then run!” Joab told him. So Ahimaaz ran by way of the plain and outran the Cushite.
24 ULB దావీదు రెండు గుమ్మాల మధ్య వరండాలో కూర్చుని ఉన్నాడు. కాపలా కాసేవాడు గుమ్మంపైనున్న గోడమీదికి ఎక్కి చూసినప్పుడు ఒంటరిగా పరుగెత్తుకుంటూ వస్తున్న ఒకడు కనబడ్డాడు. కాపలా కాసేవాడు గట్టిగా అరుస్తూ రాజుకు ఈ సంగతి చెప్పాడు. BSB BSB: Now David was sitting between the two gates when the watchman went up to the roof of the gateway by the wall, looked out, and saw a man running alone.
25 ULB రాజు <<వాడు ఒంటరిగా వస్తున్నట్టైతే ఏదో కబురు తెస్తున్నాడు>> అన్నాడు. వాడు పరుగెత్తుకొంటూ దగ్గరికి వచ్చాడు. BSB BSB: So he called out and told the king. “If he is alone,” the king replied, “he bears good news.” As the first runner drew near,
26 ULB కాపలా కాసేవాడికి పరుగెత్తుకుంటూ వస్తున్న మరొకడు కనబడ్డాడు. వాడు <<అదిగో మరొకడు ఒంటరిగా పరుగెత్తుకొంటూ వస్తున్నాడు>> అని గుమ్మం వైపు తిరిగి రాజుతో చెప్పాడు. రాజు <<వాడు కూడా ఏదో కబురు తెస్తున్నాడు>> అన్నాడు. BSB BSB: the watchman saw another man running, and he called out to the gatekeeper, “Look! Another man is running alone!” “This one also brings good news,” said the king.
27 ULB కాపలా కాసేవాడు దగ్గరికి వస్తున్న మొదటివాణ్ణి చూసి <<వాడు సాదోకు కొడుకు అహిమయస్సు అని నాకు అనిపిస్తుంది>> అన్నాడు. అప్పుడు రాజు <<వాడు మంచివాడు, మంచివార్తే తెచ్చి ఉంటాడు>> అన్నాడు. BSB BSB: The watchman said, “The first man appears to me to be running like Ahimaaz son of Zadok.” “This is a good man,” said the king. “He comes with good news.”
28 ULB అంతలో అహిమయస్సు <<రాజా, జయహో>> అని గట్టిగా రాజుతో చెప్పి, రాజు ముందు సాష్టాంగపడి నమస్కారం చేసి <<నా యేలిన వాడవైన రాజా, నిన్ను చంపాలని చూసిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం>> అన్నాడు. BSB BSB: Then Ahimaaz called out to the king, “All is well!” And he bowed facedown before the king. He continued, “Blessed be the LORD your God! He has delivered up the men who raised their hands against my lord the king.”
29 ULB అప్పుడు రాజు <<బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?>> అని అడిగాడు. అహిమయస్సు <<నీ దాసుడనైన నన్ను యోవాబు పంపుతున్నప్పుడు ఏదో గందరగోళం జరుగుతూ ఉండడం చూసాను గానీ అది ఏమిటో నాకు తెలియదు>> అని చెప్పాడు. BSB BSB: The king asked, “Is the young man Absalom all right?” And Ahimaaz replied, “When Joab sent the king’s servant and your servant, I saw a great tumult, but I do not know what it was.”
30 ULB అప్పుడు రాజు <<నువ్వు అవతలికి వెళ్లి నిలబడు>> అని ఆజ్ఞ ఇచ్చాడు. వాడు పక్కకు జరిగి నిలబడ్డాడు. BSB BSB: “Move aside,” said the king, “and stand here.” So he stepped aside.
31 ULB అంతలో కూషీవాడు వచ్చి <<మా ఏలికవైన రాజా, నేను నీకు మంచి సమాచారం తెచ్చాను. ఈ రోజు యెహోవా నీ మీదికి దండెత్తిన వారందరినీ ఓడించి నీకు న్యాయం చేకూర్చాడు>> అని చెప్పినప్పుడు BSB BSB: Just then the Cushite came and said, “May my lord the king hear the good news: Today the LORD has avenged you of all who rose up against you!”
32 ULB రాజు <<బాలుడు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా?>> అని అడిగాడు. అప్పుడు కూషీవాడు <<మా ఏలినవాడవు, రాజువు అయిన నీకు కీడు చేయాలని నీ మీదకు దండెత్తినవాళ్ళందరికీ ఏమి జరిగిందో ఆ బాలుడికి కూడా అదే జరిగింది>> అన్నాడు. BSB BSB: The king asked the Cushite, “Is the young man Absalom all right?” And the Cushite replied, “May the enemies of my lord the king and all who rise up against you to harm you be like that young man.”
33 ULB అప్పుడు రాజు తీవ్రంగా పరితాపం చెందాడు. పట్టణం గుమ్మానికి పైన ఉన్న గదికి వెళ్లి, ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతూ <<అబ్షాలోమా, నా బిడ్డా, అబ్షాలోమా>> అని కేకలు వేస్తూ <<అయ్యో నా బిడ్డా, నీ బదులు నేను చనిపోయినా బాగుండేది. నా బిడ్డా, అబ్షాలోమా, నా బిడ్డా>> అని విలపిస్తూ ఉన్నాడు. BSB BSB: The king was shaken and went up to the chamber over the gate and wept. And as he walked, he cried out, “O my son Absalom! My son, my son Absalom! If only I had died instead of you, O Absalom, my son, my son!”
Select verses for actions: Enter goes to them and Escape comes back.