1 ULB యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు, అతడిలా ప్రార్థించాడు. BSB BSB: And David sang this song to the LORD on the day the LORD had delivered him from the hand of all his enemies and from the hand of Saul.
2 ULB యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు. BSB BSB: He said: “The LORD is my rock, my fortress, and my deliverer.
3 ULB నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం. హింస నుండి నన్ను కాపాడేవాడు. BSB BSB: My God is my rock, in whom I take refuge, my shield, and the horn of my salvation. My stronghold, my refuge, and my Savior, You save me from violence.
4 ULB స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను. నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను. BSB BSB: I will call upon the LORD, who is worthy to be praised; so shall I be saved from my enemies.
5 ULB మృత్యుకెరటాలు నన్ను చుట్టుకున్నాయి. భక్తిహీనుల వరద పొంగు నన్ను ముంచెత్తింది. BSB BSB: For the waves of death engulfed me; the torrents of chaos overwhelmed me.
6 ULB పాతాళ పాశాలు నన్ను కట్టి వేశాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి. BSB BSB: The cords of Sheol entangled me; the snares of death confronted me.
7 ULB నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను. నా దేవునికి విన్నవించుకున్నాను. ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు. నా మొర్ర ఆయన చెవులకు చేరింది. BSB BSB: In my distress I called upon the LORD; I cried out to my God. And from His temple He heard my voice, and my cry for help reached His ears.
8 ULB అప్పుడు భూమి కంపించింది. అదిరింది. పరమండలపు పునాదులు వణికాయి. ఆయన కోపానికి అవి కంపించాయి. BSB BSB: Then the earth shook and quaked; the foundations of the heavens trembled; they were shaken because He burned with anger.
9 ULB ఆయన ముక్కుపుటాల్లో నుంచి నుండి పొగ లేచింది. ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి. అవి నిప్పు కణాలను రగిల్చాయి. BSB BSB: Smoke rose from His nostrils, and consuming fire came from His mouth; glowing coals blazed forth.
10 ULB ఆకాశాన్ని చీల్చి ఆయన దిగి వచ్చాడు ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది. BSB BSB: He parted the heavens and came down with dark clouds beneath His feet.
11 ULB ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు. BSB BSB: He mounted a cherub and flew; He soared on the wings of the wind.
12 ULB అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు. దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు. BSB BSB: He made darkness a canopy around Him, a gathering of water and thick clouds.
13 ULB ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి. BSB BSB: From the brightness of His presence coals of fire blazed forth.
14 ULB యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు. BSB BSB: The LORD thundered from heaven; the voice of the Most High resounded.
15 ULB తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు. ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు. BSB BSB: He shot His arrows and scattered the foes; He hurled lightning and routed them.
16 ULB యెహోవా యుధ్ధ ధ్వనికి ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి. BSB BSB: The channels of the sea appeared, and the foundations of the world were exposed at the rebuke of the LORD, at the blast of the breath of His nostrils.
17 ULB పైనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నురగలు కక్కుతున్న జలరాసుల్లో నుండి నన్ను బయటికి తీశాడు. BSB BSB: He reached down from on high and took hold of me; He drew me out of deep waters.
18 ULB బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారినిండి, నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు. BSB BSB: He rescued me from my powerful enemy, from foes too mighty for me.
19 ULB విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు. కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు. BSB BSB: They confronted me in my day of calamity, but the LORD was my support.
20 ULB యెహోవా విశాలమైన చోటికి నన్ను తోడుకుని వచ్చాడు. నేనంటే ఆయనకు ఇష్టం గనక ఆయన నన్ను రక్షించాడు. BSB BSB: He brought me out into the open; He rescued me because He delighted in me.
21 ULB నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు. నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు పూర్వ క్షేమ స్థితి కలిగించాడు. BSB BSB: The LORD has rewarded me according to my righteousness; He has repaid me according to the cleanness of my hands.
22 ULB ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను. నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు. BSB BSB: For I have kept the ways of the LORD and have not wickedly departed from my God.
23 ULB ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి. ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగ లేదు. BSB BSB: For all His ordinances are before me; I have not disregarded His statutes.
24 ULB ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. పాపానికి దూరంగా ఉన్నాను. BSB BSB: And I have been blameless before Him and kept myself from iniquity.
25 ULB నా నీతినిబట్టి యెహోవా నాకు పూర్వ క్షేమస్థితి కలిగించాడు తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు. BSB BSB: So the LORD has repaid me according to my righteousness, according to my cleanness in His sight.
26 ULB నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు. యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు. BSB BSB: To the faithful You show Yourself faithful, to the blameless You show Yourself blameless;
27 ULB నిష్కళంకుల యెడల నీవు నిష్కళంకంగా ఉంటావు. వక్ర బుద్ది గలవారి యెడల వికటంగా ఉంటావు. BSB BSB: to the pure You show Yourself pure, but to the crooked You show Yourself shrewd.
28 ULB యాతన పడే వారిని రక్షిస్తావు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేస్తావు. BSB BSB: You save an afflicted people, but Your eyes are on the haughty to bring them down.
29 ULB యెహోవా, నీవు నాకు దీపం. యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చు. BSB BSB: For You, O LORD, are my lamp; the LORD lights up my darkness.
30 ULB నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను. నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను. BSB BSB: For in You I can charge an army; with my God I can scale a wall.
31 ULB దేవుని మార్గం పరిపూర్ణం యెహోవా వాక్కు నిర్మలం ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు. BSB BSB: As for God, His way is perfect; the word of the LORD is flawless. He is a shield to all who take refuge in Him.
32 ULB యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? BSB BSB: For who is God besides the LORD? And who is the Rock except our God?
33 ULB దేవుడు నాకు బలమైన కోట. ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు. BSB BSB: God is my strong fortress, and He makes my way clear.
34 ULB ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. పర్వతాలపై నన్ను నిలుపుతాడు. BSB BSB: He makes my feet like those of a deer and stations me upon the heights.
35 ULB నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెడతాయి. BSB BSB: He trains my hands for battle; my arms can bend a bow of bronze.
36 ULB నీవు నీ రక్షణ డాలును నాకు అందిస్తావు. నీ అనుగ్రహం నన్ను గొప్పచేస్తుంది. BSB BSB: You have given me Your shield of salvation, and Your gentleness exalts me.
37 ULB నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు. BSB BSB: You broaden the path beneath me so that my ankles do not give way.
38 ULB నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను. వారిని నాశనం చేసేదాకా నేను వెనుదిరగను. BSB BSB: I pursued my enemies and destroyed them; I did not turn back until they were consumed.
39 ULB నేను వారిని మింగి వేశాను. ముక్కలుచెక్కలు చేశాను. వారిక లేవలేరు. వారు నా కాళ్ళ కింద ఉన్నారు. BSB BSB: I devoured and crushed them so they could not rise; they have fallen under my feet.
40 ULB నడికట్టు బిగించి కట్టినట్టు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపజేస్తావు. నా మీదికి లేచిన వారిని నీవు అణచివేస్తావు. BSB BSB: You have armed me with strength for battle; You have subdued my foes beneath me.
41 ULB నా శత్రువుల మెడలను నా ముందు వంచావు. నన్ను ద్వేషించే వారిని నేను సమూలనాశనం చేస్తాను. BSB BSB: You have made my enemies retreat before me; I destroyed those who hated me.
42 ULB వారు సహాయం కోసం అరిచారు. కానీ రక్షించే వాడు ఎవడూ లేడు. వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు. BSB BSB: They looked, but there was no one to save them—to the LORD, but He did not answer.
43 ULB నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను. వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను. BSB BSB: I ground them as the dust of the earth; I crushed and trampled them like mud in the streets.
44 ULB నా స్వజనుల కలహాల్లో నుండి కూడా నీవు నన్నువిడిపించావు. ప్రజల అధికారిగా నన్ను నిలిపావు. నేను ఎరుగని ప్రజానీకం నన్ను సేవిస్తారు. BSB BSB: You have delivered me from the strife of my people; You have preserved me as the head of nations; a people I had not known shall serve me.
45 ULB పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు. వారు నన్నుగూర్చి వింటే చాలు, నాకు విధేయులౌతారు. BSB BSB: Foreigners cower before me; when they hear me, they obey me.
46 ULB అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు. BSB BSB: Foreigners lose heart and come trembling from their strongholds.
47 ULB యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి. నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక. BSB BSB: The LORD lives, and blessed be my Rock! And may God, the Rock of my salvation, be exalted—
48 ULB ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే. BSB BSB: the God who avenges me and brings down nations beneath me,
49 ULB ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిస్తాడు. నా మీద దాడి చేసే వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు. హింసాత్మకుల నుండి నన్ను కాపాడుతావు. BSB BSB: who frees me from my enemies. You exalt me above my foes; You rescue me from violent men.
50 ULB కాబట్టి యెహోవా, జాతుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ నామానికి స్తుతి పాడుతాను. BSB BSB: Therefore I will praise You, O LORD, among the nations; I will sing praises to Your name.
51 ULB తాను నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయాన్నిస్తాడు. తాను అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిబంధన విశ్వసనీయత చూపే వాడు ఆయన. BSB BSB: Great salvation He brings to His king. He shows loving devotion to His anointed, to David and his descendants forever.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.