1 ULB <<మీరు మీ యెహోవా దేవుని ప్రజలు కాబట్టి ఎవరైనా చనిపోతే మిమ్మల్ని మీరు కోసుకోవడం, మీ ముఖంలో ఏ భాగాన్నైనా గొరుక్కోవడం చేయకూడదు. BSB BSB: You are sons of the LORD your God; do not cut yourselves or shave your foreheads on behalf of the dead,
2 ULB ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్టితమైన ప్రజలు. భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజల నుండి ప్రత్యేకంగా తన స్వంత ప్రజలుగా యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. BSB BSB: for you are a people holy to the LORD your God. The LORD has chosen you to be a people for His prized possession out of all the peoples on the face of the earth.
3 ULB మీరు హేయమైనది ఏదీ తినకూడదు. మీరు ఈ జంతువులను తినవచ్చు. BSB BSB: You must not eat any detestable thing.
4 ULB ఎద్దు, గొర్రె, మేక. BSB BSB: These are the animals that you may eat: The ox, the sheep, the goat,
5 ULB దుప్పి, ఎర్ర చిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండ గొర్రె. BSB BSB: the deer, the gazelle, the roe deer, the wild goat, the ibex, the antelope, and the mountain sheep.
6 ULB జంతువుల్లో రెండు డెక్కలు ఉండి నెమరు వేసే వాటిని తినవచ్చు. BSB BSB: You may eat any animal that has a split hoof divided in two and that chews the cud.
7 ULB నెమరు వేసేవైనా రెండు డెక్కలు గలదైనా నెమరు వేసి ఒక్కటే డెక్క కలిగిన ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనే జంతువులను తినకూడదు. అవి మీకు నిషిద్ధం. BSB BSB: But of those that chew the cud or have a completely divided hoof, you are not to eat the following: the camel, the rabbit, or the rock badger. Although they chew the cud, they do not have a divided hoof. They are unclean for you,
8 ULB అలాగే పంది రెండు డెక్కలు కలిగినదైనా నెమరు వేయదు కాబట్టి అది మీకు నిషిద్ధం. వాటి మాంసం తినకూడదు, వాటి శవాలను తాకకూడదు. BSB BSB: as well as the pig; though it has a divided hoof, it does not chew the cud. It is unclean for you. You must not eat its meat or touch its carcass.
9 ULB నీటిలో నివసించే వాటిలో రెక్కలు, పొలుసులు గలవాటినన్నిటినీ తినవచ్చు. BSB BSB: Of all the creatures that live in the water, you may eat anything with fins and scales,
10 ULB రెక్కలు, పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు. అది మీకు నిషిద్ధం. BSB BSB: but you may not eat anything that does not have fins and scales; it is unclean for you.
11 ULB పవిత్రమైన ప్రతి పక్షినీ మీరు తినవచ్చు. BSB BSB: You may eat any clean bird,
12 ULB మీరు తినరాని పక్షులు ఏవంటే, పక్షిరాజు, రాబందు, గద్ద. BSB BSB: but these you may not eat: the eagle, the bearded vulture, the black vulture,
13 ULB ఎర్ర గద్ద, నల్ల గద్ద, డేగ. BSB BSB: the red kite, the falcon, any kind of kite,
14 ULB అన్ని రకాల కాకులు. BSB BSB: any kind of raven,
15 ULB నిప్పు కోడి, నిశి డేగ, అన్ని రకాల డేగలు. BSB BSB: the ostrich, the screech owl, the gull, any kind of hawk,
16 ULB చిన్న గుడ్లగూబ, పెద్ద గుడ్లగూబ, తీతువు పిట్ట, BSB BSB: the little owl, the great owl, the white owl,
17 ULB గూడబాతు, బోడి రాబందు, గండ భేరుండం. BSB BSB: the desert owl, the osprey, the cormorant,
18 ULB కొంగ, అన్ని రకాల బకాలు, కూకుడు గువ్వ, గబ్బిలం. BSB BSB: the stork, any kind of heron, the hoopoe, or the bat.
19 ULB ఎగిరే ప్రతి పురుగూ మీకు నిషిద్ధం. వాటిని తినకూడదు. BSB BSB: All flying insects are unclean for you; they may not be eaten.
20 ULB ఎగిరే పవిత్రమైన ప్రతి దాన్నీ తినవచ్చు. BSB BSB: But you may eat any clean bird.
21 ULB దానికదే చచ్చిన దాన్ని మీరు తినకూడదు. అయితే దాన్ని మీ ఇంటి ఆవరణంలో ఉన్న పరదేశికి తినడానికి ఇయ్యవచ్చు. లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు ప్రతిష్ఠితమైన ప్రజలు. మేకపిల్లను దాని తల్లి పాలతో కలిపి వండకూడదు. BSB BSB: You are not to eat any carcass; you may give it to the foreigner residing within your gates, and he may eat it, or you may sell it to a foreigner. For you are a holy people belonging to the LORD your God. You must not cook a young goat in its mother’s milk.
22 ULB ప్రతి సంవత్సరం, మీ విత్తనాల పంటలో దశమ భాగాన్ని తప్పనిసరిగా వేరు చెయ్యాలి. BSB BSB: You must be sure to set aside a tenth of all the produce brought forth each year from your fields.
23 ULB మీ జీవితమంతటిలో మీ దేవుడైన యెహోవాను మీరు గౌరవించాలంటే ఆయన తన నామానికి నివాస స్థానంగా ఏర్పాటు చేసుకొన్న స్థలంలో, ఆయన సన్నిధిలో మీ పంటలో, ద్రాక్షారసంలో, నూనెలో పదో పంతును, మీ పశువుల్లో గొర్రెల్లో మేకల్లో తొలిచూలు వాటిని తినాలి. BSB BSB: And you are to eat a tenth of your grain, new wine, and oil, and the firstborn of your herds and flocks, in the presence of the LORD your God at the place He will choose as a dwelling for His Name, so that you may learn to fear the LORD your God always.
24 ULB యెహోవా తన సన్నిధి కోసం ఏర్పాటు చేసుకున్న స్థలం దూరంగా ఉంటే, మీరు వాటిని మోయలేరు కాబట్టి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, BSB BSB: But if the distance is too great for you to carry that with which the LORD your God has blessed you, because the place where the LORD your God will choose to put His Name is too far away,
25 ULB వాటిని వెండిగా మార్చి దాన్ని తీసుకుని మీ యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి వెళ్లి, BSB BSB: then exchange it for money, take the money in your hand, and go to the place the LORD your God will choose.
26 ULB ఎద్దులు, గొర్రెలు, ద్రాక్షారసం, మద్యం, వీటిలో మీరు కోరిన దానికి ఆ వెండిని ఇచ్చి, అక్కడ మీ దేవుడు యెహోవా సన్నిధిలో భోజనం చేసి, మీరు, మీ ఇంటివారు, మీ ఇంట్లో ఉండే లేవీయులు సంతోషించాలి. BSB BSB: Then you may spend the money on anything you desire: cattle, sheep, wine, strong drink, or anything you wish. You are to feast there in the presence of the LORD your God and rejoice with your household.
27 ULB లేవీయులను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మీ మధ్యలో వారికి వంతు గాని, స్వాస్థ్యం గాని లేదు. BSB BSB: And do not neglect the Levite within your gates, since he has no portion or inheritance among you.
28 ULB మీ దేవుడు యెహోవా మీరు చేసే పని అంతటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా మూడు సంవత్సరాల కొకసారి, ఆ సంవత్సరం మీకు కలిగిన పంటలో పదో వంతుని బయటికి తెచ్చి మీ ఇంట్లో ఉంచాలి. BSB BSB: At the end of every three years, bring a tenth of all your produce for that year and lay it up within your gates.
29 ULB అప్పుడు మీ మధ్యలో వంతు గాని, స్వాస్థ్యం గాని లేని లేవీయులు, మీ ఇంట్లో ఉన్న పరదేశులు, అనాథలు, విధవరాళ్ళు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు.>> BSB BSB: Then the Levite (because he has no portion or inheritance among you), the foreigner, the fatherless, and the widow within your gates may come and eat and be satisfied. And the LORD your God will bless you in all the work of your hands.
Select verses for actions: Enter goes to them and Escape comes back.