1 ULB ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికీ ప్రతి ఉద్దేశానికీ ఒక సమయం ఉంది. BSB BSB: To everything there is a season, and a time for every purpose under heaven:
2 ULB పుట్టడానికీ, చనిపోడానికీ నాటడానికీ, నాటిన దాన్ని పెరకడానికీ BSB BSB: a time to be born and a time to die, a time to plant and a time to uproot,
3 ULB చంపడానికీ, స్వస్థపరచడానికీ కూలదోయడానికీ, కట్టడానికీ BSB BSB: a time to kill and a time to heal, a time to break down and a time to build,
4 ULB ఏడవడానికీ, నవ్వడానికీ, దుఃఖించడానికీ, నాట్యం చేయడానికీ BSB BSB: a time to weep and a time to laugh, a time to mourn and a time to dance,
5 ULB రాళ్లను పారవేయడానికీ, వాటిని పోగు చేయడానికీ ఎదుటి వారిని కౌగలించుకోడానికీ, మానడానికీ BSB BSB: a time to cast away stones and a time to gather stones together, a time to embrace and a time to refrain from embracing,
6 ULB వస్తువులను వెదకడానికీ, పోగొట్టుకోడానికీ దాచుకోడానికీ, పారవేయడానికీ BSB BSB: a time to search and a time to count as lost, a time to keep and a time to discard,
7 ULB వస్త్రాలను చింపడానికీ, కుట్టడానికీ మౌనం వహించడానికీ, మాటలాడడానికీ BSB BSB: a time to tear and a time to mend, a time to be silent and a time to speak,
8 ULB ప్రేమించడానికీ, ద్వేషించడానికీ యుద్ధం చేయడానికీ, సంధి చేసుకోడానికీ ఇలా ప్రతిదానికీ ఒక సమయం ఉంది. BSB BSB: a time to love and a time to hate, a time for war and a time for peace.
9 ULB కష్టపడి పని చేసిన వారికి దాని వలన వచ్చిన లాభమేముంది? BSB BSB: What does the worker gain from his toil?
10 ULB మానవులు చేయడానికి దేవుడు వారికి ఇచ్చిన పని ఏమిటో నేను చూశాను. BSB BSB: I have seen the burden that God has laid upon the sons of men to occupy them.
11 ULB దేవుడు ప్రతి దానినీ దాని కాలానికి సరిపడినట్టుగా చేశాడు. ఆయన నిత్యమైన జ్ఞానాన్ని మానవుల హృదయాల్లో ఉంచాడు. దేవుని కార్యాలను మొదటి నుండి చివరి వరకూ పూర్తిగా గ్రహించడానికి అది చాలదు. BSB BSB: He has made everything beautiful in its time. He has also set eternity in the hearts of men, yet they cannot fathom the work that God has done from beginning to end.
12 ULB కాబట్టి మానవులకు బతికినంత కాలం సంతోషంగా, మంచి జరిగిస్తూ ఉండడం కంటే శ్రేష్ఠమైనదేదీ లేదని నేను గ్రహించాను. BSB BSB: I know that there is nothing better for them than to rejoice and do good while they live,
13 ULB ప్రతి ఒక్కరూ అన్నపానాలు పుచ్చుకుంటూ తన కష్టార్జితాన్ని అనుభవించడం దేవుడిచ్చే బహుమానమే అని కూడా గ్రహించాను. BSB BSB: and also that every man should eat and drink and find satisfaction in all his labor—this is the gift of God.
14 ULB దేవుడు చేసే పనులన్నీ నిత్యమైనవి అని నాకు తెలుసు. దానికి మరి దేనినీ కలపలేము, దానినుండి దేనినీ తీయలేము. మానవులు తనలో భయభక్తులు కలిగి ఉండాలని దేవుడే ఈ విధంగా నియమించాడు. BSB BSB: I know that everything God does endures forever; nothing can be added to it or taken from it. God does it so that they should fear Him.
15 ULB గతంలో జరిగిందే ఇప్పుడూ జరుగుతుంది. తరవాత జరగబోయేది కూడా ఇంతకు ముందు జరిగిందే. మానవులు మర్మమైన సంగతులు వెదికేలా దేవుడు చేస్తాడు. BSB BSB: What exists has already been, and what will be has already been, for God will call to account what has passed.
16 ULB అంతేగాక ఈ లోకంలో న్యాయతీర్పు జరిగించే స్థలాల్లో, నీతి ఉండాల్సిన స్థలాల్లో నాకు దుష్టత్వం కనిపించింది. BSB BSB: Furthermore, I saw under the sun that in the place of judgment there is wickedness, and in the place of righteousness there is wickedness.
17 ULB <<మంచివారికీ చెడ్డవారికీ వారి ప్రతి ప్రయత్నానికీ, పనికీ తగిన సమయంలో దేవుడే తీర్పు తీరుస్తాడు>> అని నా హృదయంలో అనుకున్నాను. BSB BSB: I said in my heart, “God will judge the righteous and the wicked, since there is a time for every activity and every deed.”
18 ULB తాము జంతువుల్లాటి వారని మానవులు తెలుసుకోవాలని దేవుడు అలా చేస్తున్నాడని నేను అనుకున్నాను. BSB BSB: I said to myself, “As for the sons of men, God tests them so that they may see for themselves that they are but beasts.”
19 ULB ఎందుకంటే జంతువులకు జరుగుతున్నట్టే మనుషులకీ జరుగుతూ ఉంది. ఇద్దరి గతీ ఒక్కటే. జంతువులు చనిపోతాయి, మనుషులూ చనిపోతారు. జీవులన్నిటికీ ఒక్కటే ప్రాణం. జంతువుల కంటే మనుషులకు ఎక్కువేమీ లేదు. అంతా ఆవిరిలాగా నిష్ప్రయోజనం కదా! BSB BSB: For the fates of both men and beasts are the same: As one dies, so dies the other—they all have the same breath. Man has no advantage over the animals, since everything is futile.
20 ULB అంతా ఒక్క చోటికే వెళతారు. అంతా మట్టిలోనుండి పుట్టింది, ఆ మట్టిలోకే తిరిగి పోతుంది. BSB BSB: All go to one place; all come from dust, and all return to dust.
21 ULB మనుషుల ఆత్మ పరలోకానికి ఎక్కిపోతుందనీ జంతువుల ప్రాణం భూమిలోకి దిగిపోతుందనీ ఎవరికి తెలుసు? BSB BSB: Who knows if the spirit of man rises upward and the spirit of the animal descends into the earth?
22 ULB మనిషికి తన తరువాత ఏం జరగబోతున్నదో చూపించడానికి వారిని తిరిగి వెనక్కి తెచ్చేవాడు ఎవరున్నారు? కాబట్టి వారు తమ పనిలో సంతోషించడం కంటే శ్రేష్టమైంది వారికేమీ లేదని నేను తెలుసుకున్నాను. అదే వారు చేయవలసింది. BSB BSB: I have seen that there is nothing better for a man than to enjoy his work, because that is his lot. For who can bring him to see what will come after him?
Select verses for actions: Enter goes to them and Escape comes back.