1 ULB మోషే మిద్యానులో యాజకుడైన తన మామ యిత్రో మందను మేపుతున్నాడు. ఆ మందను అరణ్యం అవతలి వైపుకు తోలుకుంటూ దేవుని పర్వతం హోరేబుకు వచ్చాడు. BSB BSB: Meanwhile, Moses was shepherding the flock of his father-in-law Jethro, the priest of Midian. He led the flock to the far side of the wilderness and came to Horeb, the mountain of God.
2 ULB అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో ఆ పొద మండుతూ ఉంది గానీ పొద కాలిపోవడం లేదు. BSB BSB: There the angel of the LORD appeared to him in a blazing fire from within a bush. Moses saw the bush ablaze with fire, but it was not consumed.
3 ULB అప్పుడు మోషే ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదో, ఆ వింత ఏమిటో ఆ వైపుకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు. BSB BSB: So Moses thought, “I must go over and see this marvelous sight. Why is the bush not burning up?”
4 ULB దాన్ని చూద్దామని అతడు ఆ వైపుకు రావడం యెహోవా చూశాడు. ఆ పొద మధ్య నుండి దేవుడు <<మోషే, మోషే>> అని అతణ్ణి పిలిచాడు. అప్పుడు అతడు <<చిత్తం ప్రభూ>> అన్నాడు. BSB BSB: When the LORD saw that he had gone over to look, God called out to him from within the bush, “Moses, Moses!” “Here I am,” he answered.
5 ULB అందుకు ఆయన <<దగ్గరికి రావద్దు. నీ కాళ్ళకున్న చెప్పులు తీసెయ్యి. నువ్వు నిలబడి ఉన్న ప్రదేశం పవిత్రమైనది>> అన్నాడు. BSB BSB: “Do not come any closer,” God said. “Take off your sandals, for the place where you are standing is holy ground.”
6 ULB ఆయన ఇంకా <<నేను నీ పూర్వికులు అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి>> అని చెప్పగా మోషే తన ముఖం కప్పుకుని దేవుని వైపు చూసేందుకు భయపడ్డాడు. BSB BSB: Then He said, “I am the God of your father, the God of Abraham, the God of Isaac, and the God of Jacob.” At this, Moses hid his face, for he was afraid to look at God.
7 ULB యెహోవా ఇలా చెప్పాడు. <<ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు. BSB BSB: The LORD said, “I have indeed seen the affliction of My people in Egypt. I have heard them crying out because of their oppressors, and I am aware of their sufferings.
8 ULB కనుక ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను విడిపించి, ఆ దేశం నుండి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు యెబూసీయులు నివసిస్తున్న చాలా సారవంతమైన, విశాలమైన మంచి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను. BSB BSB: I have come down to rescue them from the hand of the Egyptians and to bring them up out of that land to a good and spacious land, a land flowing with milk and honey—the home of the Canaanites, Hittites, Amorites, Perizzites, Hivites, and Jebusites. 9 ULB నిజంగా ఇశ్రాయేలు ప్రజల మొర నేను విన్నాను. ఐగుప్తీయులు వారి పట్ల జరిగిస్తున్న హింసాకాండను చూశాను. BSB BSB: And now the cry of the Israelites has reached Me, and I have seen how severely the Egyptians are oppressing them.
10 ULB నువ్వు సిద్ధపడు. నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించాలి.>> BSB BSB: Therefore, go! I am sending you to Pharaoh to bring My people the Israelites out of Egypt.”
11 ULB అప్పుడు మోషే దేవునితో <<ఫరో దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు నడిపించడానికి నేను ఏపాటి వాణ్ణి?>> అని అన్నాడు. BSB BSB: But Moses asked God, “Who am I, that I should go to Pharaoh and bring the Israelites out of Egypt?”
12 ULB దేవుడు <<నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకు వచ్చిన తరువాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు. కచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన>> అన్నాడు. BSB BSB: “I will surely be with you,” God said, “and this will be the sign to you that I have sent you: When you have brought the people out of Egypt, all of you will worship God on this mountain.”
13 ULB మోషే <<నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మీ పూర్వీకుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని చెప్పినప్పుడు వారు <ఆయన పేరేమిటి?> అని అడిగితే వారితో నేనేం చెప్పాలి?>> అని దేవుణ్ణి అడిగాడు. BSB BSB: Then Moses asked God, “Suppose I go to the Israelites and say to them, ‘The God of your fathers has sent me to you,’ and they ask me, ‘What is His name?’ What should I tell them?”
15 ULB దేవుడు మోషేతో ఇంకా <<మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు యెహోవా మీ దగ్గరికి నన్ను పంపించాడు అని నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాలి. చిరకాలం నిలిచి ఉండే, తరతరాలకు జ్ఞాపకముండే నా పేరు ఇదే. BSB BSB: God also told Moses, “Say to the Israelites, ‘The LORD, the God of your fathers—the God of Abraham, the God of Isaac, and the God of Jacob—has sent me to you.’ This is My name forever, and this is how I am to be remembered in every generation.
16 ULB నువ్వు వెళ్లి ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి <మీ పూర్వీకుల దేవుడు యెహోవా, అంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు కనబడి ఇలా చెప్పాడు, నేను ఐగుప్తులో మీకు జరుగుతున్నదంతా చూశాను. BSB BSB: Go, assemble the elders of Israel and say to them, ‘The LORD, the God of your fathers—the God of Abraham, Isaac, and Jacob—has appeared to me and said: I have surely attended to you and have seen what has been done to you in Egypt.
17 ULB ఐగుప్తులో మీరు పడుతున్న బాధల నుండి విడిపించి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకువస్తాను> అని చెప్పాడని వారితో చెప్పు. BSB BSB: And I have promised to bring you up out of your affliction in Egypt, into the land of the Canaanites, Hittites, Amorites, Perizzites, Hivites, and Jebusites—a land flowing with milk and honey.’
18 ULB వాళ్ళు నీ మాట వింటారు గనక నువ్వూ, ఇశ్రాయేలు ప్రజల పెద్దలూ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్లి, అతనితో, హెబ్రీయుల దేవుడు యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు, మేము అడవిలోకి మూడు రోజుల ప్రయాణమంత దూరం ప్రయాణించి మా దేవుడు యెహోవాకు బలులు అర్పిస్తాం, మాకు అనుమతి ఇవ్వు, అని అతనితో చెప్పాలి. BSB BSB: The elders of Israel will listen to what you say, and you must go with them to the king of Egypt and tell him, ‘The LORD, the God of the Hebrews, has met with us. Now please let us take a three-day journey into the wilderness, so that we may sacrifice to the LORD our God.’
19 ULB ఐగుప్తు రాజు తన గొప్ప సైన్యంతో మిమ్మల్ని అడ్డగించి వెళ్ళనీయకుండా చేస్తాడని నాకు తెలుసు. BSB BSB: But I know that the king of Egypt will not allow you to go unless a mighty hand compels him.
20 ULB అయితే నేను నా చెయ్యి చాపి ఐగుప్తు దేశంలో నేను చేయాలనుకున్న నా అద్భుత కార్యాలను చూపించి అతడి ప్రయత్నాలను భంగపరుస్తాను. ఆ తరువాత అతడు మిమ్మల్ని వెళ్ళనిస్తాడు. BSB BSB: So I will stretch out My hand and strike the Egyptians with all the wonders I will perform among them. And after that, he will release you.
21 ULB మీరు ఐగుప్తును విడిచి వెళ్ళే సమయంలో ఖాళీ చేతులతో వెళ్ళరు. ఎందుకంటే ప్రజల పట్ల ఐగుప్తు వారికి మంచి మనస్సు కలిగేలా చేస్తాను. BSB BSB: And I will grant this people such favor in the sight of the Egyptians that when you leave, you will not go away empty-handed.
22 ULB ప్రతి స్త్రీ తన దగ్గర ఉన్న స్త్రీని, తన యజమానురాలిని వెండి, బంగారు నగలు, దుస్తులు ఇమ్మని అడగాలి. వాటిని తీసుకుని మీ కొడుకులకు, కూతుళ్ళకు ధరింపజేయాలి. ఈ విధంగా మీరు ఐగుప్తు దేశ ప్రజలను కొల్లగొడతారు>> అన్నాడు. BSB BSB: Every woman shall ask her neighbor and any woman staying in her house for silver and gold jewelry and clothing, and you will put them on your sons and daughters. So you will plunder the Egyptians.”