1 ULB యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకు ఇలా చెప్పాడు. BSB BSB: Then the word of the LORD came to me, saying,
2 ULB <<నరపుత్రుడా, నువ్వు తిరగబడే ప్రజల మధ్య నివసిస్తున్నావు. వాళ్లకు కళ్ళు ఉన్నాయి. కానీ వాళ్ళు చూడరు. వాళ్లకి చెవులు ఉన్నాయి. కానీ వినరు. BSB BSB: “Son of man, you are living in a rebellious house. They have eyes to see but do not see, and ears to hear but do not hear, for they are a rebellious house.
3 ULB నరపుత్రుడా, నువ్వైతే దేశాంతరం వెళ్ళడానికి సామాను సిద్ధం చేసుకో. పగలు వాళ్ళు చూస్తుండగానే నువ్వు నీ స్థలాన్ని విడిచి ప్రయాణమై వేరే స్థలానికి దేశాంతరం పోవాలి. వాళ్ళు తిరగబడే వాళ్ళే అయినా ఇదంతా గమనించడం మొదలు పెడతారేమో. BSB BSB: Therefore, son of man, pack your bags for exile. In broad daylight, set out from your place and go to another as they watch. Perhaps they will understand, though they are a rebellious house.
4 ULB వాళ్ళు చూస్తుండగానే పగటి వేళ దేశాంతరం వెళ్ళడానికి నీ సామాను బయటకి తీయాలి. అలాగే మరో దేశం ప్రయాణమయ్యే వాడు వెళ్ళినట్టుగా వాళ్ళు చూస్తుండగా సాయంత్రం వేళలో వెళ్ళాలి. BSB BSB: Bring out your baggage for exile by day, as they watch. Then in the evening, as they watch, go out like those who go into exile.
5 ULB వాళ్ళు చూస్తుండగా గోడకి కన్నం వేసి దానిలో నుండి బయల్దేరు. BSB BSB: As they watch, dig through the wall and carry your belongings out through it.
6 ULB వాళ్ళు చూస్తుండగా నీ వస్తువులను భుజం మీదికెత్తుకో. వాటిని రాత్రివేళ బయటకు తీసుకు రా. నీకు నేల కనపడకుండా ముఖం కప్పుకో. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు నేను నిన్ను ఒక సూచనగా నిర్ణయించాను.>> BSB BSB: And as they watch, lift your bags to your shoulder and take them out at dusk; cover your face so that you cannot see the land. For I have made you a sign to the house of Israel.”
7 ULB ఆయన నాకాజ్ఞాపించినట్టే నేను చేశాను. దేశాంతరం వెళ్ళడానికి పగలు సామాను బయటకు తెచ్చాను. సాయంత్రం నా చేత్తో గోడకి కన్నం వేసి నా వస్తువులను చీకట్లో బయటకు తెచ్చాను. వాళ్ళు చూస్తుండగా వాటిని నా భుజం పైకెత్తుకున్నాను. నేను దేశాంతరం పోతున్నట్టుగా పగటివేళ నా సామాను బయటికి తెచ్చి పొద్దుగుంకే వేళ నా చేత్తో గోడకు కన్నం వేసి, వారు చూస్తుండగా సామగ్రిని తీసుకుని మూట భుజం మీద పెట్టుకున్నాను. BSB BSB: So I did as I was commanded. I brought out my bags for exile by day, and in the evening I dug through the wall by hand. I took my belongings out at dusk, carrying them on my shoulder as they watched.
8 ULB తరువాత ఉదయం యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు. BSB BSB: And in the morning the word of the LORD came to me, saying,
9 ULB <<నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలు, ఆ తిరగబడే జనం <నువ్విలా చేస్తున్నావేమిటి?> అని అడగడం లేదా? BSB BSB: “Son of man, hasn’t the rebellious house of Israel asked you, ‘What are you doing?’
10 ULB వాళ్ళకిలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఈ ప్రవచనాత్మక సందేశం యెరూషలేములోని పరిపాలకుడికీ దానిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ చెందుతుంది. BSB BSB: Tell them that this is what the Lord GOD says: ‘This burden concerns the prince in Jerusalem and all the house of Israel who are there.’
11 ULB నేను మీకు ఒక సూచనగా ఉన్నాను. నేను చేసి చూపినదే వాళ్ళకీ జరుగుతుంది. వాళ్ళు చెరలోకి వెళ్తారు. బందీలుగా దేశాంతరం పోతారు. BSB BSB: You are to say, ‘I am a sign to you.’ Just as it happened here, so will it be done to them; they will go into exile as captives.
12 ULB వాళ్ళలో ఉన్న పరిపాలకుడు తన సామాను భుజం మీద ఎత్తుకుని రాత్రివేళ గోడలో నుండి వెళ్తాడు. వాళ్ళు గోడ తవ్వి దాంట్లో నుండి తమ వస్తువులు బయటకు తీసుకువస్తారు. అతడు నేలను చూడకుండా తన ముఖాన్ని కప్పుకుంటాడు. BSB BSB: And at dusk the prince among them will lift his bags to his shoulder and go out. They will dig through the wall to bring him out. He will cover his face so he cannot see the land.
13 ULB నేను అతణ్ణి పట్టుకోడానికి వల విసురుతాను. అతడు నా వలలో చిక్కుకుంటాడు. అతణ్ణి కల్దీయ ప్రజల దేశమైన బబులోనుకి తీసుకు వస్తాను. కానీ అతడు ఆ స్థలాన్ని చూడకుండానే మరణిస్తాడు. BSB BSB: But I will spread My net over him, and he will be caught in My snare. I will bring him to Babylon, the land of the Chaldeans; yet he will not see it, and there he will die.
14 ULB అతనికి సహాయం చేయడానికి వచ్చిన వారినీ, అతని మొత్తం సైన్యాన్నీ నేను అన్ని దిక్కులకీ చెదరగొడతాను. వాళ్ళ వెనుకే ఒక కత్తిని పంపి తరుముతాను. BSB BSB: And I will scatter to every wind all the attendants around him and all his troops, and I will draw a sword to chase after them.
15 ULB నేను వాళ్ళని అనేక జనాల్లోకి చెదరగొట్టి, అనేక దేశాల్లోకి పంపిన తరువాత వాళ్ళు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు. BSB BSB: And they will know that I am the LORD, when I disperse them among the nations and scatter them throughout the countries.
16 ULB ఇతర ప్రజలకు తమ అసహ్యమైన పనులను గూర్చి వివరించడానికి నేను కొంతమందిని కత్తీ, కరువూ, తెగులు బారిన పడకుండా కాపాడతాను.>> BSB BSB: But I will spare a few of them from sword and famine and plague, so that in the nations to which they go, they can recount all their abominations. Then they will know that I am the LORD.”
17 ULB యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు. BSB BSB: Moreover, the word of the LORD came to me, saying,
18 ULB <<నరపుత్రుడా, భయపడుతూ నీ ఆహారం తిను. చింతా ఆందోళనలతో నీళ్ళు తాగు. BSB BSB: “Son of man, eat your bread with trembling, and drink your water with quivering and anxiety.
19 ULB తరువాత, దేశ ప్రజలకు ఇలా ప్రకటించు. యెరూషలేములో నివసించే వాళ్ళను గూర్చీ ఇశ్రాయేలు దేశాన్ని గూర్చీ ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. వాళ్ళు వణికిపోతూ తమ ఆహారం తింటారు. భయపడి పోతూ నీళ్ళు తాగుతారు. ఎందుకంటే అక్కడ నివసించే వాళ్ళు చేసే హింస, దౌర్జన్యాల వల్ల దేశంలోని సౌభాగ్యం నాశనం అయింది. BSB BSB: Then tell the people of the land that this is what the Lord GOD says about those living in Jerusalem and in the land of Israel: ‘They will eat their bread with anxiety and drink their water in dread, for their land will be stripped of everything in it because of the violence of all who dwell in it.
20 ULB పట్టణాలు నిర్జనంగానూ, శిథిలంగానూ మారతాయి. దేశం నిస్సారం అవుతుంది. అప్పుడు మీరు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు.>> BSB BSB: The inhabited cities will be laid waste, and the land will become desolate. Then you will know that I am the LORD.’”
21 ULB తిరిగి యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు. BSB BSB: Again the word of the LORD came to me, saying,
22 ULB <<నరపుత్రుడా, <రోజులు గడిచి పోతున్నాయి, ప్రతి దర్శనమూ విఫలమవుతుంది> అని సామెత చెప్తారే. దాని అర్థం ఏమిటి? BSB BSB: “Son of man, what is this proverb that you have in the land of Israel: ‘The days go by, and every vision fails’?
23 ULB కాబట్టి నువ్వు వాళ్లకి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలు ఈ సామెత చెప్పకుండా నేను ఈ సామెతకి ముగింపు పలుకుతున్నాను. దాన్ని వ్యర్ధం చేస్తున్నాను. ఇలా చెప్పి వాళ్ళకి <ప్రతి దర్శనమూ నెరవేరే రోజులు దగ్గర పడుతున్నాయి.> అని ప్రకటించు.>> BSB BSB: Therefore tell them that this is what the Lord GOD says: ‘I will put an end to this proverb, and in Israel they will no longer recite it.’ But say to them: ‘The days are at hand when every vision will be fulfilled.
24 ULB <<ఇశ్రాయేలు ప్రజల్లో ఇక మీదట తప్పుడు దర్శనాలూ, అనుకూల జోస్యాలూ ఉండవు. BSB BSB: For there will be no more false visions or flattering divinations within the house of Israel,
25 ULB నేను యెహోవాను. నేనే మాట్లాడుతున్నాను. నా మాటలు నేను నెరవేరుస్తాను. ఏమాత్రం ఆలస్యం కాకుండా ఇదంతా జరుగుతుంది. తిరగబడే జనమా, మీ రోజుల్లోనే నేను ఈ మాట చెప్పి దాన్ని నెరవేరుస్తాను. ఇదే ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.>> BSB BSB: because I, the LORD, will speak whatever word I speak, and it will be fulfilled without delay. For in your days, O rebellious house, I will speak a message and bring it to pass, declares the Lord GOD.’”
26 ULB తిరిగి యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు. BSB BSB: Furthermore, the word of the LORD came to me, saying,
27 ULB <<నరపుత్రుడా, చూడు. <ఇతడు చూస్తున్న దర్శనం జరగడానికి ఇంకా ఎన్నో రోజులు పడుతుంది. చాలా కలం తరవాత జరిగే వాటిని గూర్చి ఇతడు ఇప్పుడే ప్రవచనం చెప్తున్నాడు> అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు. BSB BSB: “Son of man, take note that the house of Israel is saying, ‘The vision that he sees is for many years from now; he prophesies about the distant future.’
28 ULB అయితే నువ్వు వాళ్ళకి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. నా మాటలు ఇక ఆలస్యం కావు. నేను పలికినది తప్పక నెరవేరుతుంది. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.>> BSB BSB: Therefore tell them that this is what the Lord GOD says: ‘None of My words will be delayed any longer. The message I speak will be fulfilled, declares the Lord GOD.’”
Select verses for actions: Enter goes to them and Escape comes back.