1 ULB బబులోను చెరలో ఉన్న కాలంలో, ఏడో సంవత్సరం, ఐదో నెల, పదో రోజు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొంతమంది యెహోవాను యోచన అడగాలని ఆయన దగ్గరికి వచ్చి నా ఎదుట కూర్చున్నారు. BSB BSB: In the seventh year, on the tenth day of the fifth month, some of the elders of Israel came to inquire of the LORD, and they sat down before me.
2 ULB అప్పుడు యెహోవా వాక్కు నాకు ఇలా వినిపించింది, BSB BSB: Then the word of the LORD came to me, saying,
3 ULB <<నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పెద్దలతో నువ్వు ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నన్ను అడిగి తెలుసుకోడానికి మీరు వచ్చారా? నా జీవం తోడు, నానుంచి ఏ ఆలోచనా మీకు దొరకదు.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. BSB BSB: “Son of man, speak to the elders of Israel and tell them that this is what the Lord GOD says: Have you come to inquire of Me? As surely as I live, I will not be consulted by you, declares the Lord GOD.
4 ULB <<వాళ్లకు న్యాయం తీరుస్తావా? నరపుత్రుడా, వాళ్లకు న్యాయం తీరుస్తావా? వాళ్ళ పితరులు చేసిన అసహ్యమైన పనులు వాళ్ళకు తెలియజేయి. BSB BSB: Will you judge them, will you judge them, son of man? Confront them with the abominations of their fathers
5 ULB వాళ్ళతో చెప్పు, ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలును ఎంపిక చేసుకున్న రోజు, యాకోబు సంతానానికి ప్రమాణం చేసిన రోజు, ఐగుప్తుదేశంలో నన్ను వాళ్లకు ప్రత్యక్షం చేసుకుని ప్రమాణం చేసి, నేను మీ దేవుడైన యెహోవానని నేను ప్రకటించిన కాలంలో, BSB BSB: and tell them that this is what the Lord GOD says: On the day I chose Israel, I swore an oath to the descendants of the house of Jacob and made Myself known to them in the land of Egypt. With an uplifted hand I said to them, ‘I am the LORD your God.’
6 ULB వాళ్ళను ఐగుప్తు దేశంలోనుంచి రప్పించి, వాళ్ళ కోసం నేను ఎంపిక చేసిన దేశం, పాలు తేనెలు ప్రవహించేది, అన్ని దేశాలకూ ఆభరణమైనది అయిన ఆ దేశంలోకి తీసుకు వెళ్తానని నేను ప్రమాణం చేశాను. BSB BSB: On that day I swore to bring them out of the land of Egypt into a land that I had searched out for them, a land flowing with milk and honey, the glory of all lands.
7 ULB అప్పుడు నేను వాళ్ళతో, నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడూ అసహ్యమైన పనులు విడిచిపెట్టాలి, ఐగుప్తీయుల విగ్రహాలు విసిరేసి, వాటిని పూజించడం వల్ల మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకుండా ఉండాలి, అన్నాను. BSB BSB: And I said to them: ‘Each of you must throw away the abominations before his eyes, and you must not defile yourselves with the idols of Egypt. I am the LORD your God.’
8 ULB అయితే వాళ్ళు నా మాట వినకుండా నా మీద తిరుగుబాటు చేసి, అసహ్యమైన పనులు చెయ్యడం మానలేదు. ఐగుప్తీయుల విగ్రహాలు పూజించడం మానలేదు గనుక వాళ్ళు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించి వాళ్ళ మీద నా కోపం తీర్చుకుంటానని అనుకున్నాను. BSB BSB: But they rebelled against Me and refused to listen. None of them cast away the abominations before their eyes, and they did not forsake the idols of Egypt. So I resolved to pour out My wrath upon them and vent My anger against them in the land of Egypt.
9 ULB ఏ అన్యదేశాల ఎదుట నన్ను నేను ప్రత్యక్షం చేసుకున్నానో, ఏ అన్యప్రజల మధ్య వాళ్లున్నారో, ఆ అన్యప్రజల్లో, వాళ్ళున్న అన్యప్రజల ఎదుట వాళ్లకు నన్ను ప్రత్యక్షం చేసుకున్నాను. నా పేరుకు దూషణ కలగకుండా ఉండాలని ఆ విధంగా చెయ్యకుండా, ఆ ప్రజలు చూస్తూ ఉండగా నా ఘన నామం కోసం నేను వాళ్ళను ఐగుప్తు దేశంలోనుంచి రప్పించాను. BSB BSB: But I acted for the sake of My name, that it should not be profaned in the eyes of the nations among whom they were living, in whose sight I had revealed Myself to Israel by bringing them out of the land of Egypt.
10 ULB వాళ్ళను ఐగుప్తు దేశంలోనుంచి రప్పించి నిర్జన ప్రదేశంలోకి తీసుకొచ్చి, BSB BSB: So I brought them out of the land of Egypt and led them into the wilderness.
11 ULB వాళ్లకు నా కట్టడలు నియమించి, నా విధులు వాళ్లకు తెలియజేశాను. ఎవడైనా వాటిని అనుసరిస్తే, వాటిని బట్టి బ్రతుకుతాడు. BSB BSB: And I gave them My statutes and made known to them My ordinances—for the man who does these things will live by them.
12 ULB యెహోవానైన నేనే వాళ్ళను పవిత్రపరచే వాడినని వాళ్ళు తెలుసుకునేలా నాకూ, వాళ్ళకూ మధ్య నా విశ్రాంతి దినాలను నేను వాళ్లకు సూచనగా నియమించాను. BSB BSB: I also gave them My Sabbaths as a sign between us, so that they would know that I am the LORD who sanctifies them.
13 ULB అయితే ఎడారిలో ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడలు అనుసరించకుండా, తాము అనుసరించి జీవించాలని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేసినప్పుడు, ఎడారిలో నా ఉగ్రత నేను వాళ్ళ మీద కుమ్మరించి, వాళ్ళను నాశనం చేద్దామనుకున్నాను. BSB BSB: Yet the house of Israel rebelled against Me in the wilderness. They did not follow My statutes and they rejected My ordinances—though the man who does these things will live by them—and they utterly profaned My Sabbaths. Then I resolved to pour out My wrath upon them and put an end to them in the wilderness.
14 ULB కాని నేను వాళ్ళను రప్పించినప్పుడు ఏ అన్యప్రజలు చూశారో, ఏ అన్యప్రజల్లోనుంచి నేను వాళ్ళను రప్పించానో, వాళ్ళ ఎదుట నా పేరుకు దూషణ కలగకుండా ఉండేలా నేను అనుకున్న ప్రకారం చెయ్యకుండా మానాను. BSB BSB: But I acted for the sake of My name, so that it would not be profaned in the eyes of the nations in whose sight I had brought them out.
15 ULB తమకిష్టమైన విగ్రహాలను అనుసరించాలని కోరి, వాళ్ళు నా విధులను తృణీకరించి, నా కట్టడలను అనుసరించకుండా నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేసినప్పుడు, BSB BSB: Moreover, with an uplifted hand I swore to them in the wilderness that I would not bring them into the land that I had given them—a land flowing with milk and honey, the glory of all lands—
16 ULB ఇస్తానని నేను చెప్పినదీ, పాలు తేనెలు ప్రవహించేదీ, అన్ని దేశాలకూ ఆభరణం అయిన ఆ దేశంలోకి వాళ్ళను తీసుకు రానని వాళ్ళు ఎడారిలో ఉండగానే నేను ప్రమాణం చేశాను. BSB BSB: because they kept rejecting My ordinances, refusing to walk in My statutes, and profaning My Sabbaths; for their hearts continually went after their idols.
17 ULB అయినా వాళ్ళు నశించిపోకుండా ఉండాలని వాళ్ళ మీద కనికరం చూపించి, ఎడారిలో నేను వాళ్ళను నాశనం చెయ్యలేదు. BSB BSB: Yet I looked on them with pity and did not destroy them or bring them to an end in the wilderness.
18 ULB వాళ్ళు ఎడారిలో ఉండగానే వాళ్ళ పిల్లలతో నేను, మీరు మీ పితరులూ ఆచారాలు అనుసరించకుండా, వాళ్ళ పద్ధతుల ప్రకారం ప్రవర్తించకుండా, వాళ్ళు పెట్టుకున్న దేవుళ్ళను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకుండా ఉండండి. BSB BSB: In the wilderness I said to their children: ‘Do not walk in the statutes of your fathers or keep their ordinances or defile yourselves with their idols.
19 ULB మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను పాటించి, నేను నియమించిన విశ్రాంతి దినాలు ఆచరించండి. BSB BSB: I am the LORD your God; walk in My statutes, keep My ordinances, and practice them.
20 ULB నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకునేలా ఆ విశ్రాంతిదినాలు నాకూ, మీకూ మధ్య సూచనగా ఉంటాయి. BSB BSB: Keep My Sabbaths holy, that they may be a sign between us, so that you may know that I am the LORD your God.’
21 ULB అయినా వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు కూడా నా మీద తిరగబడి, తాము అనుసరించి జీవించాలని నేనిచ్చిన నా కట్టడలు అనుసరించకుండా, నా విధులను పాటించకుండా, నేను నియమించిన విశ్రాంతి దినాలను అపవిత్రం చేశారు గనుక, వాళ్ళు ఎడారిలో ఉండగానే నేను నా ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించి, వాళ్ళ మీద నా కోపం తీర్చుకోవాలని అనుకున్నాను. BSB BSB: But the children rebelled against Me. They did not walk in My statutes or carefully observe My ordinances—though the man who does these things will live by them—and they profaned My Sabbaths. So I resolved to pour out My wrath upon them and vent My anger against them in the wilderness.
22 ULB కాని నేను ప్రత్యక్షమైన అన్యప్రజల మధ్య నా పేరుకు అవమానం కలగకుండా ఉండేలా, ఏ ప్రజల్లోనుంచి వాళ్ళను రప్పించానో, ఆ ప్రజలు చూస్తూ ఉండగా నా చెయ్యి వెనక్కు తీసి నా వాగ్దానం నెరవేర్చాను. BSB BSB: But I withheld My hand and acted for the sake of My name, so that it would not be profaned in the eyes of the nations in whose sight I had brought them out.
23 ULB వాళ్ళు నా విధులు అనుసరించకుండా, నా కట్టడలు తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినాలను అపవిత్రం చేసి, BSB BSB: However, with an uplifted hand I swore to them in the wilderness that I would scatter them among the nations and disperse them throughout the lands.
24 ULB తమ పితరులు పెట్టుకున్న విగ్రహాలు పూజించాలని కోరుకున్నప్పుడు, అన్యప్రజల్లోకి వాళ్ళను చెదరగొట్టి, ప్రతి దేశంలోకీ వాళ్ళను వెళ్ళగొడతానని ప్రమాణం చేశాను. BSB BSB: For they did not practice My ordinances, but they rejected My statutes and profaned My Sabbaths, fixing their eyes on the idols of their fathers.
25 ULB తరువాత నేను యెహోవానని వాళ్ళు తెలుసుకునేలా, మంచివి కాని కట్టడలు, బ్రతకడానికి అనుకూలం కాని విధులు వాళ్ళకు ఇచ్చాను. BSB BSB: I also gave them over to statutes that were not good and ordinances by which they could not live.
26 ULB మొదట పుట్టిన పిల్లలను మంటల్లోనుంచి దాటించి బలి అర్పించడం ద్వారా తమ్మును తాము అపవిత్రం చేసుకోనిచ్చాను.>> BSB BSB: And I pronounced them unclean through their gifts—the sacrifice of every firstborn in the fire—so that I might devastate them, in order that they would know that I am the LORD.
27 ULB కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాట్లాడి, ఇలా ప్రకటించు. <<ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ పితరులు నా పట్ల అతిక్రమం చేసి, నన్ను దూషించి, BSB BSB: Therefore, son of man, speak to the house of Israel, and tell them that this is what the Lord GOD says: In this way also your fathers blasphemed Me by their unfaithfulness against Me.
28 ULB వాళ్లకు ఇస్తానని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోకి నేను వాళ్ళను రప్పించిన తరువాత, ఒక ఎత్తయిన కొండను గాని, ఒక దట్టమైన చెట్టును గాని వాళ్ళు చూసినప్పుడెల్లా బలులు అర్పిస్తూ, అర్పణలు అర్పిస్తూ, అక్కడ పరిమళ ధూపం వేస్తూ, పానార్పణలు చేస్తూ, నాకు కోపం పుట్టించారు.>> BSB BSB: When I brought them into the land that I swore to give them and they saw any high hill or leafy tree, there they offered their sacrifices, presented offerings that provoked Me, sent up their fragrant incense, and poured out their drink offerings.
29 ULB అప్పుడు నేను వాళ్ళతో <<మీరు బలులు తీసుకొస్తున్న ఈ ఉన్నత స్థలాలు ఏంటి?>> అని అడిగాను. కాబట్టి దానికి <<బామా>> అనే పేరు ఈ రోజు వరకూ వాడుకలో ఉంది. BSB BSB: So I asked them: ‘What is this high place to which you go?’ (And to this day it is called Bamah.)
30 ULB కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించు. <<ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, మీ పితరుల విధానంలోనే మీరూ అపవిత్రులు అయ్యారు. వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలను అనుసరిస్తూ మీరూ వ్యభిచారులయ్యారు. BSB BSB: Therefore tell the house of Israel that this is what the Lord GOD says: Will you defile yourselves the way your fathers did, prostituting yourselves with their abominations?
31 ULB ఈనాటి వరకూ మీరు అర్పణలు అర్పించి మీ కొడుకులను అగ్నిగుండా దాటించేటప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహాలన్నిటికీ పూజ చేసి అపవిత్రులయ్యారు. ఇశ్రాయేలీయులారా, మీరు నా దగ్గరికి వచ్చి నన్ను యోచన అడుగుతున్నారా? నా జీవం తోడు, నానుంచి మీకు ఏ ఆలోచనా దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. BSB BSB: When you offer your gifts, sacrificing your sons in the fire, you continue to defile yourselves with all your idols to this day. So should I be consulted by you, O house of Israel? As surely as I live, declares the Lord GOD, I will not be consulted by you!
32 ULB <అన్యప్రజలు, భూమి మీద ఇతర జాతులూ చేస్తున్నట్టు మేము కూడా కొయ్యకూ, రాళ్లకూ పూజిస్తాం> అని మీరు అనుకుంటున్నారు. మీ మనస్సులో ఏర్పడుతున్న ఈ ఆలోచన ఎన్నటికీ నెరవేరదు. BSB BSB: When you say, ‘Let us be like the nations, like the peoples of the lands, serving wood and stone,’ what you have in mind will never come to pass.
33 ULB నా జీవం తోడు, నా బలమైన చేతితో, ఉగ్రతతో, ఎత్తిన చేతితో నీ మీద రాజ్యపాలన చేస్తాను. BSB BSB: As surely as I live, declares the Lord GOD, with a strong hand, an outstretched arm, and outpoured wrath I will rule over you.
34 ULB నేను ఉగ్రత కుమ్మరిస్తూ, బలమైన చేతితోనూ, ఎత్తిన చేతితోనూ మిమ్మల్ని చెదరగొట్టిన అనేక దేశాల్లోనుంచ, ప్రజల్లోనుంచి నేను మిమ్మల్ని సమకూర్చి BSB BSB: With a strong hand, an outstretched arm, and outpoured wrath I will bring you out from the peoples and gather you from the lands to which you have been scattered.
35 ULB జనాలున్న ఎడారిలోకి మిమ్మల్ని రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీకు తీర్పు చెబుతాను. ఇదే యెహోవా వాక్కు. BSB BSB: And I will bring you into the wilderness of the nations, where I will enter into judgment with you face to face.
36 ULB ఐగుప్తీయుల దేశపు ఎడారిలో నేను మీ పితరులకు తీర్పు చెప్పినట్టు మీకూ తీర్పు చెబుతాను.>> ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. BSB BSB: Just as I entered into judgment with your fathers in the wilderness of the land of Egypt, so I will enter into judgment with you, declares the Lord GOD.
37 ULB <<నా చేతి కర్ర కింద మిమ్మల్ని దాటించి నిబంధన ఒడంబడికలోకి మిమ్మల్ని తీసుకొస్తాను. BSB BSB: I will make you pass under the rod and will bring you into the bond of the covenant.
38 ULB నా మీద తిరుగుబాటు చేసేవాళ్ళనూ, దోషం చేసేవాళ్ళనూ, మీలో ఉండకుండాా ప్రక్షాళన చేస్తాను. వారు కాపురమున్న దేశంలో నుంచి వాళ్ళను రప్పిస్తాను గాని, నేను యెహోవానని మీరు తెలుసుకునేలా, వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు.>> BSB BSB: And I will purge you of those who rebel and transgress against Me. I will bring them out of the land in which they dwell, but they will not enter the land of Israel. Then you will know that I am the LORD.
39 ULB ఇశ్రాయేలు ఇంటివారలారా, ప్రభువైన యెహోవా మీతో చెప్పేదేమంటే <<మీరు నామాట వినకపోతే, మీరు పెట్టుకున్న విగ్రహాలు మీ కిష్టమైనట్టుగా పూజించుకోండి, కాని మీ అర్పణల వల్ల, మీ విగ్రహాల వల్ల, నా పవిత్రమైన పేరును అపవిత్రం చెయ్యొద్దు.>> BSB BSB: And as for you, O house of Israel, this is what the Lord GOD says: Go and serve your idols, every one of you. But afterward, you will surely listen to Me, and you will no longer defile My holy name with your gifts and idols.
40 ULB ఇది ప్రభువైన యెహోవా వాక్కు. <<ఇశ్రాయేలీయుల ఎత్తయిన నా పవిత్ర పర్వతం మీద దేశంలో ఉన్న ఇశ్రాయేలీయుల ఇంటి వాళ్ళందరూ నన్ను ఆరాధిస్తారు. అక్కడ నేను వాళ్ళ పట్ల సంతోషిస్తాను. అక్కడ మీ ప్రతిష్ఠిత అర్పణలు, మీ ప్రథమ ఫలదానాలూ, ప్రతిష్ఠిత కానుకలన్నీ నేను అంగీకరిస్తాను. BSB BSB: For on My holy mountain, the high mountain of Israel, declares the Lord GOD, there the whole house of Israel, all of them, will serve Me in the land. There I will accept them and will require your offerings and choice gifts, along with all your holy sacrifices.
41 ULB దేశాల్లో నుంచి నేను మిమ్మల్ని రప్పించేటప్పుడు, మిమ్మల్ని చెదరగొట్టిన అనేక దేశాల్లో నుంచి మిమ్మల్ని సమకూర్చేటప్పుడు, ఒక పరిమళ ధూపంగా మిమ్మల్ని అంగీకరిస్తాను. అన్యప్రజల ఎదుటా, మీ మధ్యలోనూ, నన్ను నేను పవిత్రం చేసుకుంటాను. BSB BSB: When I bring you from the peoples and gather you from the lands to which you have been scattered, I will accept you as a pleasing aroma. And I will show My holiness through you in the sight of the nations.
42 ULB మీ పితరులకు ఇస్తానని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశానికి, అంటే ఇశ్రాయేలీయుల దేశానికి నేను మిమ్మల్ని రప్పించేటప్పుడు, నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. BSB BSB: Then you will know that I am the LORD, when I bring you into the land of Israel, the land that I swore to give your fathers.
43 ULB అక్కడ చేరి, మీ ప్రవర్తనను, మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకున్న మీ పనులన్నిటినీ గుర్తు చేసుకుని మీరు చేసిన చెడుపనులన్నిటిని బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకుంటారు. BSB BSB: There you will remember your ways and all the deeds with which you have defiled yourselves, and you will loathe yourselves for all the evils you have done.
44 ULB ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టి, మీ చెడు చేష్టలను బట్టి కాక నా పేరును బట్టి మాత్రమే నేను మీ పట్ల ఈ విధంగా చేసినప్పుడు, నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.>> BSB BSB: Then you will know, O house of Israel, that I am the LORD, when I have dealt with you for the sake of My name and not according to your wicked ways and corrupt acts, declares the Lord GOD.”
45 ULB ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు మళ్ళీ నాకు వినిపించింది. BSB BSB: Now the word of the LORD came to me, saying,
46 ULB <<నరపుత్రుడా, నీ ముఖం దక్షిణం వైపు తిప్పుకుని దక్షిణ దేశానికి ప్రకటించు, దక్షిణ దేశపు ఎడారి అరణ్యాన్ని గూర్చి ప్రవచించి ఇలా చెప్పు, BSB BSB: “Son of man, set your face toward the south, preach against it, and prophesy against the forest of the Negev.
47 ULB దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నీలో అగ్ని రగిలిస్తాను. అది నీలో ఉన్న పచ్చని పళ్ళ చెట్లన్నిటినీ, ఎండిన చెట్లన్నిటినీ కాల్చేస్తుంది. అది ఆరిపోదు. దక్షిణం మొదలుకుని ఉత్తరం వరకూ భూతలమంతా ఆ భీకరమైన అగ్ని దహిస్తుంది. BSB BSB: Say to the forest of the Negev: Hear the word of the LORD! This is what the Lord GOD says: I am about to ignite in you a fire, and it will devour all your trees, both green and dry. The blazing flame will not be quenched, and by it every face from south to north will be scorched.
48 ULB అది ఆరిపోకుండా ఉండగా యెహోవానైన నేను దాన్ని రగిలించానని మనుషులందరూ చూస్తారు.>> BSB BSB: Then all people will see that I, the LORD, have kindled it; it will not be quenched.”
49 ULB అప్పుడు నేను ఇలా అన్నాను<<అయ్యో ప్రభూ, యెహోవా, వాళ్ళు నా గురించి, <వీడు కేవలం ఉపమానాలు చెప్పేవాడేగదా?> అంటున్నారు.>> BSB BSB: Then I said, “Ah, Lord GOD, they are saying of me, ‘Is he not just telling parables?’”
Select verses for actions: Enter goes to them and Escape comes back.