1 ULB అబ్రాము తనకు కలిగిన వాటినన్నిటినీ, తన భార్యనూ, తనతో ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుంచి నెగెబుకు వెళ్ళాడు. BSB BSB: So Abram went up out of Egypt into the Negev—he and his wife and all his possessions—and Lot was with him.
2 ULB అబ్రాము చాలా ధనవంతుడు. అతనికి వెండి, బంగారం, పశువులు ఉన్నాయి. BSB BSB: And Abram had become extremely wealthy in livestock and silver and gold.
3 ULB అతడు ప్రయాణం చేసి దక్షిణం నుంచి బేతేలు వరకూ అంటే బేతేలుకు, హాయికి మధ్య మొదట తన గుడారం ఉన్న స్థలానికి వెళ్ళాడు. BSB BSB: From the Negev he journeyed from place to place toward Bethel, until he came to the place between Bethel and Ai where his tent had formerly been pitched,
4 ULB అతడు మొదట బలిపీఠం కట్టిన చోటుకు వచ్చాడు. అక్కడ అబ్రాము యెహోవా పేరట ప్రార్థన చేశాడు. BSB BSB: to the site where he had built the altar. And there Abram called on the name of the LORD.
5 ULB అబ్రాముతో పాటు కలసి వెళ్ళిన లోతుకు కూడా గొర్రెలు, పశువులు, పరివారం ఉన్నాయి. BSB BSB: Now Lot, who was traveling with Abram, also had flocks and herds and tents.
6 ULB వాళ్ళు కలిసి నివాసం చెయ్యడానికి ఆ ప్రదేశం చాల లేదు. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండలేనంత విస్తారమైన సంపద వారికి ఉంది. BSB BSB: But the land was unable to support both of them while they stayed together, for they had so many possessions that they were unable to coexist.
7 ULB ఆ సమయంలో అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు వివాదం ఏర్పడింది. ఆ కాలంలో కనానీయులు, పెరిజ్జీయులు ఆ ప్రదేశంలో కాపురం ఉన్నారు. BSB BSB: And there was discord between the herdsmen of Abram and the herdsmen of Lot. At that time the Canaanites and the Perizzites were also living in the land.
8 ULB కాబట్టి అబ్రాము <<మనం బంధువులం కాబట్టి నాకూ నీకూ నా పశువుల కాపరులకూ నీ పశువుల కాపరులకూ ఘర్షణ ఉండకూడదు. BSB BSB: So Abram said to Lot, “Please let there be no contention between you and me, or between your herdsmen and my herdsmen. After all, we are kinsmen.
9 ULB ఈ ప్రదేశం అంతా నీ ముందు కనిపిస్తూ ఉంది కదా. దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు. నువ్వు ఎడమవైపు వెళ్తే నేను కుడివైపుకు, నువ్వు కుడివైపుకు వెళ్తే నేను ఎడమవైపుకు వెళ్తాను>> అని లోతుకు చెప్పాడు. BSB BSB: Is not the whole land before you? Now separate yourself from me. If you go to the left, I will go to the right; if you go to the right, I will go to the left.”
11 ULB కాబట్టి లోతు యొర్దాను ప్రాంతాన్ని తన కోసం ఎంపిక చేసుకుని, తూర్పు వైపు ప్రయాణం చేశాడు. ఆ విధంగా వాళ్ళు ఒకరినుంచి ఒకరు వేరైపోయారు. BSB BSB: So Lot chose the whole plain of the Jordan for himself and set out toward the east. And Abram and Lot parted company.
12 ULB అబ్రాము కనానులో నివాసం ఉన్నాడు. లోతు ఆ మైదానంలో ఉన్న పట్టణాల్లో కాపురం ఉండి, సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు. BSB BSB: Abram lived in the land of Canaan, but Lot settled in the cities of the plain and pitched his tent toward Sodom.
13 ULB సొదొమ మనుషులు యెహోవా దృష్టిలో ఘోర పాపులుగా ఉన్నారు. BSB BSB: But the men of Sodom were wicked, sinning greatly against the LORD.
14 ULB లోతు అబ్రామును విడిచి వెళ్ళిన తరువాత యెహోవా <<నువ్వు ఉన్నచోటనుంచి నాలుగు దిక్కులకూ చూడు. BSB BSB: After Lot had departed, the LORD said to Abram, “Now lift up your eyes from the place where you are, and look to the north and south and east and west,
15 ULB నువ్వు చూస్తున్న ఈ ప్రదేశం అంతా నీకు, నీ వారసులకు శాశ్వతంగా ఇస్తాను. BSB BSB: for all the land that you see, I will give to you and your offspring forever.
16 ULB నీ వారసులను భూమి మీద ఉండే ఇసుక రేణువుల్లాగా విస్తరింపజేస్తాను. ఇది ఎలాగంటే, ఎవడైనా భూమి మీద ఉండే ఇసుక రేణువులను లెక్కించగలిగితే, నీ వారసులనుకూడా లెక్కపెట్టవచ్చు. BSB BSB: I will make your offspring like the dust of the earth, so that if one could count the dust of the earth, then your offspring could be counted.
17 ULB నువ్వు లేచి ఈ ప్రదేశంలో ఆ చివరినుండి ఈ చివరి వరకూ సంచరించు. అదంతా నీకు ఇస్తాను>> అని అబ్రాముతో చెప్పాడు. BSB BSB: Get up and walk around the land, through its length and breadth, for I will give it to you.”
18 ULB అప్పుడు అబ్రాము తన గుడారం తీసి, హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షాల దగ్గర వేసుకుని అక్కడ నివసించాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. BSB BSB: So Abram moved his tent and went to live near the Oaks of Mamre at Hebron, where he built an altar to the LORD.