2 ULB శారయి అబ్రాముతో <<ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో>> అంది. అబ్రాము శారయి మాట విన్నాడు. BSB BSB: So Sarai said to Abram, “Look now, the LORD has prevented me from bearing children. Please go to my maidservant; perhaps I can build a family by her.” And Abram listened to the voice of Sarai.
3 ULB అబ్రాము అప్పటికి కనాను దేశంలో పదేళ్ల నుండి నివాసముంటున్నాడు. అబ్రాము భార్య శారయి ఈజిప్టుకు చెందిన తన దాసి హాగరును తన భర్తకు భార్యగా ఉండటానికి ఇచ్చింది. BSB BSB: So after he had lived in Canaan for ten years, his wife Sarai took her Egyptian maidservant Hagar and gave her to Abram to be his wife.
4 ULB అతడు హాగరుతో సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం ధరించింది. తాను గర్భం ధరించానని తెలుసుకున్న హాగరు తన యజమానురాలిని చులకనగా చూడటం ప్రారంభించింది. BSB BSB: And he slept with Hagar, and she conceived. But when Hagar realized that she was pregnant, she began to despise her mistress.
5 ULB అప్పుడు శారయి అబ్రాముతో <<నా ఉసురు నీకు తగులుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నా దాసిని నేనే నీ చేతుల్లో పెట్టాను. ఆమె గర్భవతి అయింది. అది తెలిసిన దగ్గరనుండీ అది కన్నూమిన్నూ గానక నన్ను చులకనగా చూడటం మొదలు పెట్టింది. నీకూ నాకూ మధ్యన యెహోవా న్యాయం తీరుస్తాడు>> అంది. BSB BSB: Then Sarai said to Abram, “May the wrong done to me be upon you! I delivered my servant into your arms, and ever since she saw that she was pregnant, she has treated me with contempt. May the LORD judge between you and me.”
6 ULB అందుకు అబ్రాము <<ఇలా చూడు, నీ దాసి నీ చెప్పుచేతల్లోనే ఉంది గదా. ఆమె విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో>> అన్నాడు. శారయి తన దాసిని రాచి రంపాన పెట్టింది. దాంతో ఆమె శారయి దగ్గర నుండి పారిపోయింది. BSB BSB: “Here,” said Abram, “your servant is in your hands. Do whatever you want with her.” Then Sarai treated Hagar so harshly that she fled from her.
8 ULB ఆమెతో <<శారయి దాసివైన హాగరూ, ఎక్కడ నుండి వస్తున్నావ్? ఎక్కడికి వెళ్తున్నావ్?>> అని అడిగాడు. అందుకామె <<నా యజమానురాలైన శారయి దగ్గరనుండి పారిపోతున్నాను>> అంది. BSB BSB: “Hagar, servant of Sarai,” he said, “where have you come from, and where are you going?” “I am running away from my mistress Sarai,” she replied.
9 ULB అప్పుడు యెహోవా దూత <<నువ్వు మళ్ళీ నీ యజమానురాలి దగ్గరికి తిరిగి వెళ్ళు. ఆమెకు పూర్తిగా అణిగి మణిగి ఉండు>> అన్నాడు. BSB BSB: So the angel of the LORD told her, “Return to your mistress and submit to her authority.”
10 ULB యెహోవా దూత ఇంకా ఇలా చెప్పాడు. <<నీ సంతానానికి తప్పకుండా ఆధిక్యత కలిగిస్తాను. అది లెక్క పెట్టడానికి వీలు లేనంతగా అయ్యేలా చేస్తాను>> అని ఆమెకు చెప్పాడు. BSB BSB: Then the angel added, “I will greatly multiply your offspring so that they will be too numerous to count.”
11 ULB తరువాత యెహోవా దూత <<ఇలా చూడు, యెహోవా నీ మొర విన్నాడు. ఇప్పుడు నువ్వు గర్భవతిగా ఉన్నావు. నీకు కొడుకు పుడతాడు. అతనికి ఇష్మాయేలు అనే పేరు పెడతావు. BSB BSB: The angel of the LORD proceeded: “Behold, you have conceived and will bear a son. And you shall name him Ishmael, for the LORD has heard your cry of affliction.
12 ULB అతడు అడవి గాడిదలా స్వేచ్ఛాజీవిగా ఉంటాడు. అందరూ అతనికి విరోధంగా ఉంటారు. అతడు ప్రతి ఒక్కరికీ తూర్పు దిక్కున నివసిస్తాడు. అతడు తన సోదరులకు వేరుగా నివసిస్తాడు>> అని ఆమెకు చెప్పాడు. BSB BSB: He will be a wild donkey of a man, and his hand will be against everyone, and everyone’s hand against him; he will live in hostility toward all his brothers.”
13 ULB అప్పుడు ఆమె <<నన్ను చూసినవాడు నాకు నిజంగా కనిపించాడు కదా!>> అంది. అందుకనే తనతో మాట్లాడిన యెహోవాకు<< నన్ను చూస్తున్న దేవుడివి నువ్వే>> అనే పేరు పెట్టింది. BSB BSB: So Hagar gave this name to the LORD who had spoken to her: “You are the God who sees me,” for she said, “Here I have seen the One who sees me!”
14 ULB దీన్ని బట్టి ఆ నీటి ఊటకి<< బెయేర్ లహాయి రోయి>> అనే పేరు వచ్చింది. అది కాదేషుకీ బెరెదుకీ మధ్యలో ఉంది. BSB BSB: Therefore the well was called Beer-lahai-roi. It is located between Kadesh and Bered.
15 ULB తరువాత హాగరు అబ్రాము కొడుక్కి జన్మనిచ్చింది. హాగరు ద్వారా పుట్టిన తన కుమారుడికి అబ్రాము ఇష్మాయేలు అనే పేరు పెట్టాడు. BSB BSB: And Hagar bore Abram a son, and Abram gave the name Ishmael to the son she had borne.
16 ULB అబ్రాము కొడుకు ఇష్మాయేలుకు హాగరు జన్మనిచ్చినప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరేళ్ళు. BSB BSB: Abram was eighty-six years old when Hagar bore Ishmael to him.