1 ULB అబ్రాహాము బాగా వయస్సు మళ్ళి వృద్దుడయ్యాడు. యెహోవా అన్ని విషయాల్లో అబ్రాహామును ఆశీర్వదించాడు. BSB BSB: By now Abraham was old and well along in years, and the LORD had blessed him in every way.
2 ULB అప్పుడు అబ్రాహాము తన ఆస్తి వ్యవహారాలనూ ఇంటి విషయాలనూ నిర్వహించే పెద్ద దాసుడిని పిలిచాడు.<< నీ చెయ్యి నా తొడ కింద ఉంచు. BSB BSB: So Abraham instructed the chief servant of his household, who managed all he owned, “Place your hand under my thigh,
3 ULB నేను నివాసముంటున్న ఈ కనాను వాసుల కూతుళ్ళలో ఒక అమ్మాయిని ఇచ్చి నా కొడుక్కి పెళ్ళి చేయకుండా BSB BSB: and I will have you swear by the LORD, the God of heaven and the God of earth, that you will not take a wife for my son from the daughters of the Canaanites among whom I am dwelling,
4 ULB నా స్వదేశంలో ఉన్న నా బంధువుల దగ్గరికి వెళ్ళు. అక్కడనుండి నా కొడుకు ఇస్సాకుకు భార్యను తీసుకురావాలి. ఇలా చేస్తానని నీతో <భూమీ ఆకాశాలకు దేవుడైన యెహోవా తోడు> అని ప్రమాణం చేయిస్తాను>> అని అతనితో అన్నాడు. BSB BSB: but will go to my country and my kindred to take a wife for my son Isaac.”
5 ULB దానికి ఆ దాసుడు <<ఒకవేళ ఆమె నాతో కలసి ఈ దేశం రావడానికి ఇష్టపడక పొతే నీ కొడుకునే నీ స్వదేశానికి తీసుకుని వెళ్ళాలా?>> అని ప్రశ్నించాడు. BSB BSB: The servant asked him, “What if the woman is unwilling to follow me to this land? Shall I then take your son back to the land from which you came?”
6 ULB అప్పుడు అబ్రాహాము <<ఎట్టి పరిస్థితిలోనూ నా కొడుకుని నువ్వు అక్కడికి తీసుకు వెళ్ళకూడదు. BSB BSB: Abraham replied, “Make sure that you do not take my son back there.
7 ULB నా తండ్రి ఇంటి నుండీ, నా బంధువుల దేశం నుండీ నన్ను తీసుకు వచ్చి <నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను> అని పరలోకపు దేవుడైన యెహోవా నాకు ప్రమాణం చేశాడు. ఆ దేవుడే తన దూతను నీకు ముందుగా పంపుతాడు. అక్కడనుండి నువ్వు నా కొడుక్కి భార్యను తీసుకుని వస్తావు. BSB BSB: The LORD, the God of heaven, who brought me from my father’s house and my native land, who spoke to me and promised me on oath, saying, ‘To your offspring I will give this land’—He will send His angel before you so that you can take a wife for my son from there.
8 ULB అయితే ఒకవేళ నీ వెంట రావడానికి ఆమె ఇష్టపడక పొతే నాకు చేసిన ప్రమాణం నుండి విడుదల పొందుతావు. అంతేకానీ నా కొడుకుని మాత్రం నువ్వు అక్కడికి తీసుకు వెళ్ళకూడదు>> అని చెప్పాడు. BSB BSB: And if the woman is unwilling to follow you, then you are released from this oath of mine. Only do not take my son back there.”
9 ULB కాబట్టి ఆ దాసుడు తన యజమాని అయిన అబ్రాహాము తొడ కింద తన చెయ్యి పెట్టి ఈ విషయం ప్రమాణం చేశాడు. BSB BSB: So the servant placed his hand under the thigh of his master Abraham and swore an oath to him concerning this matter.
11 ULB అతడు ఆ పట్టణం బయటే ఉన్న ఒక నీటి బావి దగ్గర తన ఒంటెలను మోకరింప చేశాడు. అప్పటికి సాయంత్రం అయింది. ఊరి స్త్రీలు నీళ్ళు తోడుకోడానికి వచ్చే సమయమది. BSB BSB: As evening approached, he made the camels kneel down near the well outside the town at the time when the women went out to draw water.
12 ULB అప్పుడు అతడు ఇలా ప్రార్థించాడు. <<నా యజమాని అయిన అబ్రాహాము దేవుడివైన యెహోవా, నా యజమాని అయిన అబ్రాహాముపట్ల నీ నిబంధన విశ్వాస్యత చూపి ఈ రోజు నాకు కార్యం సఫలం చెయ్యి. BSB BSB: “O LORD, God of my master Abraham,” he prayed, “please grant me success today, and show kindness to my master Abraham.
13 ULB ఇదిగో చూడు, నేను ఈ నీళ్ళ బావి దగ్గర నిలబడ్డాను. ఈ ఊళ్ళో వాళ్ళ పిల్లలు నీళ్ళు తోడుకోవడం కోసం వస్తున్నారు. BSB BSB: Here I am, standing beside the spring, and the daughters of the townspeople are coming out to draw water.
14 ULB ఇది ఈ విధంగా జరగనియ్యి. <నీ కుండ కొంచెం వంచి నేను తాగడానికి కాసిన్ని నీళ్ళు పొయ్యి> అని నేను అంటే <తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు పెడతాను> అని ఏ అమ్మాయి అంటుందో ఆ అమ్మాయే నీ సేవకుడు ఇస్సాకు కోసం నువ్వు ఏర్పాటు చేసిన అమ్మాయి అయి ఉండాలి. ఈ విధంగా నువ్వు నా యజమాని పట్ల నిబంధన విశ్వాస్యత చూపించావని తెలుసుకుంటాను>> అన్నాడు. BSB BSB: Now may it happen that the girl to whom I say, ‘Please let down your jar that I may drink,’ and who responds, ‘Drink, and I will water your camels as well’—let her be the one You have appointed for Your servant Isaac. By this I will know that You have shown kindness to my master.”
15 ULB అతడు ఈ మాటలు ముగించక ముందే రిబ్కా కుండ భుజంపై పెట్టుకుని అక్కడికి వచ్చింది. ఆమె బెతూయేలు కూతురు. ఈ బెతూయేలు అబ్రాహాము సోదరుడైన నాహోరుకూ అతని భార్య అయిన మిల్కాకూ పుట్టిన కుమారుడు. BSB BSB: Before the servant had finished praying, Rebekah came out with her jar on her shoulder. She was the daughter of Bethuel son of Milcah, the wife of Abraham’s brother Nahor.
16 ULB ఆ అమ్మాయి చాలా అందకత్తె, కన్య. పురుష స్పర్శ ఎరగనిది. ఆమె ఆ బావిలోకి దిగి కుండతో నీళ్ళు నింపుకుని పైకి వచ్చింది. BSB BSB: Now the girl was very beautiful, a virgin who had not had relations with any man. She went down to the spring, filled her jar, and came up again.
17 ULB అప్పుడు ఆ సేవకుడు ఆమెను కలుసుకోడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. <<దయచేసి నీ కుండలో నీళ్ళు తాగడానికి నాకు పోస్తావా?>> అని ఆమెను అడిగాడు. BSB BSB: So the servant ran to meet her and said, “Please let me have a little water from your jar.”
18 ULB దానికామె <<అయ్యా, తాగండి>> అంటూ చప్పున కుండ చేతిమీదికి దించుకుని అతడు తాగడానికి నీళ్ళు ఇచ్చింది. BSB BSB: “Drink, my lord,” she replied, and she quickly lowered her jar to her hands and gave him a drink.
19 ULB ఆమె అతనికి తాగడానికి నీళ్ళు ఇచ్చిన తరవాత <<మీ ఒంటెలు తాగేందుకు కూడా నీళ్ళు తోడి పోస్తాను>> అని చెప్పి BSB BSB: After she had given him a drink, she said, “I will also draw water for your camels, until they have had enough to drink.”
20 ULB త్వరగా అక్కడి తొట్టిలో కుండెడు నీళ్ళు కుమ్మరించి తిరిగి నీళ్ళు తోడటానికి బావి దగ్గరికి పరుగు తీసింది. అతని ఒంటెలన్నిటికీ నీళ్ళు తోడి పోసింది. BSB BSB: And she quickly emptied her jar into the trough and ran back to the well to draw water, until she had drawn water for all his camels.
21 ULB ఆ వ్యక్తి తన ప్రయాణాన్ని యెహోవా సఫలం చేశాడో లేదో తెలుసుకోడానికి ఆమెను మౌనంగా గమనిస్తూనే ఉన్నాడు BSB BSB: Meanwhile, the man watched her silently to see whether or not the LORD had made his journey a success.
22 ULB ఒంటెలు నీళ్ళు తాగడం అయ్యాక అతడు అరతులం బరువున్న ఒక బంగారపు ముక్కుపుడకను, ఆమె చేతులకు పది తులాల బరువున్న రెండు బంగారు కడియాలను బయటకు తీశాడు. BSB BSB: And after the camels had finished drinking, he took out a gold ring weighing a beka, and two gold bracelets for her wrists weighing ten shekels.
23 ULB ఆమెను <<నువ్వు ఎవరి అమ్మాయివి? మీ నాన్న గారింట్లో మేము ఈ రాత్రి ఉండటానికి స్థలం దొరుకుతుందా? దయచేసి నాకు చెప్పు>> అని అడిగాడు. BSB BSB: “Whose daughter are you?” he asked. “Please tell me, is there room in your father’s house for us to spend the night?”
24 ULB దానికి ఆమె <<నేను నాహోరుకూ మిల్కాకూ కొడుకైన బెతూయేలు కూతుర్ని>> అంది. BSB BSB: She replied, “I am the daughter of Bethuel, the son that Milcah bore to Nahor.”
25 ULB ఇంకా ఆమె <<మా దగ్గర చాలా గడ్డీ, మేతా ఉన్నాయి. రాత్రి ఉండటానికి స్థలం కూడా ఉంది>> అంది. BSB BSB: Then she added, “We have plenty of straw and feed, as well as a place for you to spend the night.”
26 ULB ఆ వ్యక్తి తల వంచి యెహోవాను ఇలా ఆరాధించాడు. BSB BSB: Then the man bowed down and worshiped the LORD,
27 ULB <<అబ్రాహాము అనే నా యజమాని దేవుడైన యెహోవాకు స్తుతి కలుగు గాక! ఆయన నా యజమానికి తన నిబంధన విశ్వాస్యతనూ, తన విశ్వసనీయతనూ చూపడం మానలేదు. నన్నయితే ఆయన సరిగ్గా నా యజమాని బంధువుల ఇంటికే నడిపించాడు>> అన్నాడు. BSB BSB: saying, “Blessed be the LORD, the God of my master Abraham, who has not withheld His kindness and faithfulness from my master. As for me, the LORD has led me on the journey to the house of my master’s relatives.”
28 ULB అప్పుడు ఆ అమ్మాయి ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ అందరికీ జరిగిన విషయమంతా చెప్పింది. BSB BSB: The girl ran and told her mother’s household about these things.
29 ULB ఈ రిబ్కాకు ఒక సోదరుడున్నాడు. అతని పేరు లాబాను. అతడు తన సోదరి చేతులకున్న కడియాలూ ముక్కుకు ఉన్న పుడకనూ చూశాడు. అలాగే <<ఆ వ్యక్తి నాతొ ఇలా చెప్పాడు>> అంటూ తన సోదరి చెప్పిన మాటలూ విన్నాడు. BSB BSB: Now Rebekah had a brother named Laban, and he rushed out to the man at the spring.
30 ULB అప్పుడు లాబాను బయట ఆ బావి దగ్గరే ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడతను తన ఒంటెల పక్కనే నిలబడి ఉన్నాడు. BSB BSB: As soon as he saw the ring, and the bracelets on his sister’s wrists, and heard Rebekah’s words, “The man said this to me,” he went and found the man standing by the camels near the spring.
31 ULB అతణ్ణి చూసి లాబాను ఇలా అన్నాడు. <<యెహోవా ఆశీర్వదించిన వాడా. లోపలికి రండి. మీరు బయటే ఎందుకున్నారు? నేను ఇంటినీ, మీ ఒంటెలకు స్థలాన్నీ సిద్ధం చేశాను>> అన్నాడు. BSB BSB: “Come, you who are blessed by the LORD,” said Laban. “Why are you standing out here? I have prepared the house and a place for the camels.”
32 ULB ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఆ ఒంటెల జీను ఊడదీసి వాటికి గడ్డీ మేతా పెట్టాడు. అబ్రాహాము సేవకునికీ అతనితో కూడా వచ్చిన వారికీ కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చాడు. BSB BSB: So the man came to the house, and the camels were unloaded. Straw and feed were brought to the camels, and water to wash his feet and the feet of his companions.
33 ULB భోజనం చేయమని అతని ముందు ఆహారం పెట్టారు. కానీ అతడు <<నేను చెప్పాల్సిన విషయం ఒకటుంది. అది చెప్పే వరకూ నేను భోజనం చేయను>> అన్నాడు. అందుకు <<చెప్పండి>> అన్నాడు. BSB BSB: Then a meal was set before the man, but he said, “I will not eat until I have told you what I came to say.” So Laban said, “Please speak.”
34 ULB అప్పుడు అతడు ఇలా చెప్పాడు. <<నేను అబ్రాహాము దాసుణ్ణి. BSB BSB: “I am Abraham’s servant,” he replied.
35 ULB యెహోవా నా యజమానిని ఎంతో ఆశీర్వదించాడు. అతడు చాలా గొప్పవాడయ్యాడు. ఆయన అతనికి ఎన్నో గొర్రెలనూ, పశువులనూ, వెండీ బంగారాలనూ, దాసులనీ, దాసీలనూ అనుగ్రహించాడు. BSB BSB: “The LORD has greatly blessed my master, and he has become rich. He has given him sheep and cattle, silver and gold, menservants and maidservants, camels and donkeys.
36 ULB నా యజమాని భార్య శారా. ఆమె వృద్ధురాలు అయ్యాక నా యజమానికి ఒక కొడుకుని కని ఇచ్చింది. నా యజమాని తనకున్న ఆస్తినంతా తన కొడుక్కే ఇచ్చాడు. BSB BSB: My master’s wife Sarah has borne him a son in her old age, and my master has given him everything he owns.
37 ULB నా యజమాని నాతో ఇలా చెప్పాడు, <నేను ప్రస్తుతం నివసిస్తున్న ఈ కనాను దేశపు అమ్మాయిల్లో ఎవర్నీ నా కొడుక్కి ఇచ్చి పెళ్ళి చేయవద్దు. BSB BSB: My master made me swear an oath and said, ‘You shall not take a wife for my son from the daughters of the Canaanites in whose land I dwell,
38 ULB నువ్వు నా తండ్రి ఇంటికీ, నా రక్త సంబధికుల దగ్గరకూ వెళ్ళి అక్కడ నుండి నా కొడుకు కోసం ఒక అమ్మాయిని భార్యగా తీసుకు రావాలి> అంటూ నాతో ప్రమాణం చేయించుకున్నాడు. BSB BSB: but you shall go to my father’s house and to my kindred to take a wife for my son.’
39 ULB దానికి నేను <ఒకవేళ ఆ అమ్మాయి నాతో రాకపోతే?> అని నా యజమానిని అడిగాను. BSB BSB: Then I asked my master, ‘What if the woman will not come back with me?’
40 ULB అతడు <నేను యెహోవా సన్నిధిలో నివసిస్తున్నాను. ఆయనే నీతో తన దూతను పంపి నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు. కాబట్టి నువ్వు నా కొడుక్కి నా బంధువుల నుండి నా తండ్రి వారసులనుండి భార్యగా ఉండేందుకు ఒక అమ్మాయిని తీసుకు వస్తావు. BSB BSB: And he told me, ‘The LORD, before whom I have walked, will send His angel with you and make your journey a success, so that you may take a wife for my son from my kindred and from my father’s house.
41 ULB అయితే నువ్వు నా రక్త సంబధికుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళ అమ్మాయిని నీతో పంపడానికి వాళ్ళు ఇష్టపడక పోతే ఈ ప్రమాణం నుండి నువ్వు విముక్తుడివి అవుతావు> అన్నాడు. BSB BSB: And when you go to my kindred, if they refuse to give her to you, then you will be released from my oath.’
42 ULB నేను ఈ రోజు ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ప్రార్థించాను. <నా యజమాని అబ్రాహాము దేవుడవైన యెహోవా, నా ఈ ప్రయాణాన్ని విజయవంతం చేస్తే BSB BSB: So when I came to the spring today, I prayed: O LORD, God of my master Abraham, if only You would make my journey a success!
43 ULB నేను ఈ నీళ్ళ బావి దగ్గర ఉన్నప్పుడు నీళ్ళు తోడుకోడానికి వచ్చిన అమ్మాయితో నేను, <<దయచేసి నీ కుండలో నీళ్ళు కాసిన్ని నాకు తాగడానికి ఇవ్వు>> అని అడిగితే BSB BSB: Here I am, standing beside this spring. Now if a maiden comes out to draw water and I say to her, ‘Please let me drink a little water from your jar,’
44 ULB <<మీరు తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు తోడి పోస్తాను>> అని ఏ అమ్మాయి చెప్తుందో ఆ అమ్మాయే నా యజమాని కొడుక్కి నువ్వు నియమించిన భార్య అయి ఉంటుంది అని నేను యెహోవా దగ్గర మనవి చేసుకున్నాను.> BSB BSB: and she replies, ‘Drink, and I will draw water for your camels as well,’ may she be the woman the LORD has appointed for my master’s son.
45 ULB నేను నా హృదయంలో అలా అనుకున్నానో లేదో రిబ్కా తన భుజం మీద కుండ పెట్టుకుని బావి దగ్గరికి వచ్చి ఆ బావి లోకి దిగి నీళ్ళు తోడుకుని వచ్చింది. అప్పుడు నేను నాకు తాగడానికి నీళ్ళు ఇమ్మని ఆమెను అడిగాను. BSB BSB: And before I had finished praying in my heart, there was Rebekah coming out with her jar on her shoulder, and she went down to the spring and drew water. So I said to her, ‘Please give me a drink.’
46 ULB ఆమె వెంటనే కుండ దించి <తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు పెడతాను> అంది. నేను ఆ నీళ్ళు తాగాను. ఆమె ఒంటెలకు కూడా నీళ్ళు పెట్టింది. BSB BSB: She quickly lowered her jar from her shoulder and said, ‘Drink, and I will water your camels as well.’ So I drank, and she also watered the camels.
47 ULB అప్పుడు నేను <నువ్వు ఎవరి అమ్మాయివి?> అని అడిగాను. ఆమె <నేను మిల్కా నాహోరుల కొడుకు బెతూయేలు కూతురుని> అని చెప్పినప్పుడు నేను ఆమెకు ముక్కుకు పుడకా చేతులకు కడియాలూ పెట్టాను. BSB BSB: Then I asked her, ‘Whose daughter are you?’ She replied, ‘The daughter of Bethuel son of Nahor, whom Milcah bore to him.’ So I put the ring on her nose and the bracelets on her wrists.
48 ULB నా యజమాని బంధువు కూతుర్నే అతని కొడుక్కి భార్యగా తీసుకు వెళ్ళడానికి నన్ను సరైన మార్గంలో నడిపించిన యెహోవాను నా తలవంచి ఆరాధించాను. నా యజమాని దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లించాను. BSB BSB: Then I bowed down and worshiped the LORD; and I blessed the LORD, the God of my master Abraham, who led me on the right road to take the granddaughter of my master’s brother for his son.
49 ULB కాబట్టి ఇప్పుడు నా యజమాని పట్ల మీరు దయనూ నమ్మకాన్నీ చూపించ దల్చుకుంటే ఆ విషయం నాకు చెప్పండి. మీకిష్టం లేకపోతే అదైనా చెప్పండి. అప్పుడు నేనెటు వెళ్ళాలో అటు వెళ్తాను>> అన్నాడు. BSB BSB: Now if you will show kindness and faithfulness to my master, tell me; but if not, let me know, so that I may go elsewhere.”
50 ULB అప్పుడు లాబానూ, బెతూయేలూ ఇలా జవాబిచ్చారు. <<ఈ విషయం యెహోవా నుండి కలిగింది. ఇది మంచో, చెడో మేమేమి చెప్పగలం? BSB BSB: Laban and Bethuel answered, “This is from the LORD; we have no choice in the matter.
51 ULB చూడు, రిబ్కా ఇక్కడే నీ ఎదుటే ఉంది. ఆమెను తీసుకు వెళ్ళు. యెహోవా మాట ప్రకారం ఆమె నీ యజమాని కొడుక్కి భార్య అవుతుంది గాక!>> BSB BSB: Rebekah is here before you. Take her and go, and let her become the wife of your master’s son, just as the LORD has decreed.”
52 ULB అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. BSB BSB: When Abraham’s servant heard their words, he bowed down to the ground before the LORD.
53 ULB తరువాత ఆ సేవకుడు వెండీ బంగారు నగలనూ, వస్త్రాలనూ బయటికి తీసి రిబ్కాకు ఇచ్చాడు. అలాగే అతడు ఆమె తల్లికీ, సోదరుడికీ విలువైన కానుకలిచ్చాడు. BSB BSB: Then he brought out jewels of silver and gold, and articles of clothing, and he gave them to Rebekah. He also gave precious gifts to her brother and her mother.
54 ULB అప్పుడు అతడూ అతనితో వచ్చిన వాళ్ళూ భోజన పానాదులు చేశారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఉదయాన్నే లేచి అతడు <<నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి>> అని అడిగాడు. BSB BSB: Then he and the men with him ate and drank and spent the night there. When they got up the next morning, he said, “Send me on my way to my master.”
55 ULB ఆమె సోదరుడూ, ఆమె తల్లీ <<మా అమ్మాయిని కనీసం పది రోజులన్నా మా దగ్గర ఉండనీయి. తరువాత ఆమెను తీసుకు వెళ్ళవచ్చు>> అన్నారు. BSB BSB: But her brother and mother said, “Let the girl remain with us ten days or so. After that, she may go.”
56 ULB కానీ అతడు <<యెహోవా నా ప్రయాణాన్ని సఫలం చేసాడు. కాబట్టి దయచేసి నన్ను ఆపవద్దు. నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి>> అన్నాడు. BSB BSB: But he replied, “Do not delay me, since the LORD has made my journey a success. Send me on my way so that I may go to my master.”
57 ULB అప్పుడు వాళ్ళు అమ్మాయిని పిలిచి తను ఏమంటుందో తెలుసుకుందాం BSB BSB: So they said, “We will call the girl and ask her opinion.”
58 ULB అని రిబ్కాను పిలిచారు. <<ఈ వ్యక్తి తో నువ్వు వెళ్తావా?>> అని అడిగారు. దానికామె <<వెళ్తాను>> అంది. BSB BSB: They called Rebekah and asked her, “Will you go with this man?” “I will go,” she replied.
59 ULB కాబట్టి వాళ్ళు తమ సోదరి అయిన రిబ్కాను మరో దాసీని తోడుగా ఇచ్చి అబ్రాహాము సేవకుడూ, అతనితో వచ్చిన మనుషులతో పంపించారు. BSB BSB: So they sent their sister Rebekah on her way, along with her nurse and Abraham’s servant and his men.
60 ULB అప్పుడు వాళ్ళు రిబ్కాతో <<మా సోదరీ, నువ్వు లక్షలాది మందికి తల్లివి కావాలి. నీ సంతానం తమను ద్వేషించే వారి గుమ్మాలను ఆక్రమించుకుంటారు గాక!>> అంటూ ఆమెను దీవించారు. BSB BSB: And they blessed Rebekah and said to her, “Our sister, may you become the mother of thousands upon thousands. May your offspring possess the gates of their enemies.”
61 ULB రిబ్కా, ఆమె సేవకురాళ్ళూ ఒంటెలెక్కి ఆ వ్యక్తి వెంట వెళ్లారు. ఆ విధంగా అబ్రాహాము సేవకుడు రిబ్కాను తీసుకుని తన దారిన వెళ్ళాడు. BSB BSB: Then Rebekah and her servant girls got ready, mounted the camels, and followed the man. So the servant took Rebekah and left.
62 ULB ఇస్సాకు కనాను దక్షిణ దేశంలో నివాసమున్నాడు. ఆ సమయంలో అతడు బెయేర్ లహాయి రోయి నుండి వస్తూ ఉన్నాడు. BSB BSB: Now Isaac had just returned from Beer-lahai-roi, for he was living in the Negev.
63 ULB ఆ సాయంత్రం ఇస్సాకు ధ్యానం చేయడానికి మైదానంలోకి వెళ్ళాడు. అక్కడ అతడు తలెత్తి చూసినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి. BSB BSB: Early in the evening, Isaac went out to the field to meditate, and looking up, he saw the camels approaching.
64 ULB రిబ్కా కూడా ఇస్సాకును చూసింది. వెంటనే ఒంటె పైనుండి దిగింది. BSB BSB: And when Rebekah looked up and saw Isaac, she got down from her camel
65 ULB <<మనలను కలుసుకోడానికి మైదానం నుండి వస్తున్నఆ వ్యక్తి ఎవరు?>> అని అబ్రాహాము సేవకుణ్ణి అడిగింది. దానికతడు <<ఆయన నా యజమాని>> అన్నాడు. వెంటనే ఆమె ముసుగు వేసుకుంది. BSB BSB: and asked the servant, “Who is that man in the field coming to meet us?” “It is my master,” the servant answered. So she took her veil and covered herself.
66 ULB అప్పుడు ఆ దాసుడు జరిగినదంతా ఇస్సాకుకు వివరించి చెప్పాడు. BSB BSB: Then the servant told Isaac all that he had done.
67 ULB అప్పుడు ఇస్సాకు తన తల్లి అయిన శారా గుడారం లోకి ఆమెను తీసుకు వెళ్ళాడు. అలా అతడు రిబ్కాను తన భార్యగా స్వీకరించాడు. అతడు ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఇస్సాకు తన తల్లి మరణం విషయమై ఆదరణ పొందాడు. BSB BSB: And Isaac brought her into the tent of his mother Sarah and took Rebekah as his wife. And Isaac loved her and was comforted after his mother’s death.