1 ULB యాకోబు తన తండ్రి పరదేశీయుడుగా ఉండిన కనాను దేశంలో నివసించాడు. BSB BSB: Now Jacob lived in the land where his father had resided, the land of Canaan.
2 ULB యాకోబు జీవిత వృత్తాంతం ఇది. యోసేపు పదిహేనేళ్ళ వాడుగా ఉన్నప్పుడు తన సోదరులతో కూడ మందను మేపుతూ ఉన్నాడు. అతడు చిన్నవాడుగా తన తండ్రి భార్యలైన బిల్హా కొడుకుల దగ్గరా జిల్పా కొడుకుల దగ్గరా ఉండేవాడు. అప్పుడు యోసేపు వారి చెడ్డ పనులను గూర్చిన సమాచారం వారి తండ్రికి చేరవేసేవాడు. BSB BSB: This is the account of Jacob. When Joseph was seventeen years old, he was tending the flock with his brothers, the sons of his father’s wives Bilhah and Zilpah, and he brought their father a bad report about them.
3 ULB యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటే అతణ్ణి ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిలువుటంగీ కుట్టించాడు. BSB BSB: Now Israel loved Joseph more than his other sons, because Joseph had been born to him in his old age; so he made him a robe of many colors.
4 ULB అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగపట్టి, అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు. BSB BSB: When Joseph’s brothers saw that their father loved him more than any of them, they hated him and could not speak a kind word to him.
5 ULB యోసేపు ఒక కల కని తన సోదరులతో దాన్ని గూర్చి చెప్పినప్పుడు వారు అతని మీద మరింత పగపట్టారు. BSB BSB: Then Joseph had a dream, and when he told it to his brothers, they hated him even more.
6 ULB అతడు వారితో ఇలా చెప్పాడు. <<నేను కన్న ఈ కల మీరూ వినండి. BSB BSB: He said to them, “Listen to this dream I had:
7 ULB అదేమిటంటే మనం పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నాం. నా కట్ట లేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టాంగపడ్డాయి.>> BSB BSB: We were binding sheaves of grain in the field, and suddenly my sheaf rose and stood upright, while your sheaves gathered around and bowed down to mine.”
8 ULB అందుకు అతని సోదరులు <<నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా? మామీద నువ్వు అధికారివి అవుతావా>> అని అతనితో చెప్పి, అతని కలలను బట్టీ అతని మాటలను బట్టీ అతని మీద మరింత పగ పెంచుకున్నారు. BSB BSB: “Do you intend to reign over us?” his brothers asked. “Will you actually rule us?” So they hated him even more because of his dream and his statements.
9 ULB అతడింకొక కల కని తన సోదరులతో<<ఇదిగో నేను మరొక కల గన్నాను. అందులో సూర్య చంద్రులూ, పదకొండు నక్షత్రాలూ నాకు సాష్టాంగ పడ్డాయి>> అని చెప్పాడు. BSB BSB: Then Joseph had another dream and told it to his brothers. “Look,” he said, “I had another dream, and this time the sun and moon and eleven stars were bowing down to me.”
10 ULB అతడు తన తండ్రితో, తన అన్నలతో అది చెప్పాడు. అతని తండ్రి అతనితో <<నువ్వు కన్న ఈ కల ఏమిటి? నేనూ నీ తల్లీ నీ అన్నలూ నిజంగా నీకు సాష్టాంగపడాలా?>> అని అతణ్ణి గద్దించాడు. BSB BSB: He told his father and brothers, but his father rebuked him and said, “What is this dream that you have had? Will your mother and brothers and I actually come and bow down to the ground before you?”
11 ULB అతని సోదరులు అతనిపై కక్ష పెంచుకున్నారు. అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు. BSB BSB: And his brothers were jealous of him, but his father kept in mind what he had said.
12 ULB యోసేపు సోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపడానికి వెళ్ళారు. BSB BSB: Some time later, Joseph’s brothers had gone to pasture their father’s flocks near Shechem.
13 ULB అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో <<నీ సోదరులు షెకెములో మందను మేపుతున్నారు. నిన్ను వారి దగ్గరికి పంపుతాను, రా>> అన్నప్పుడు అతడు <<అలాగే>> అని చెప్పాడు. BSB BSB: Israel said to him, “Are not your brothers pasturing the flocks at Shechem? Get ready; I am sending you to them.” “I am ready,” Joseph replied.
14 ULB అప్పుడు యాకోబు <<నువ్వు వెళ్ళి నీ సోదరుల క్షేమాన్ని, మంద క్షేమాన్ని తెలుసుకుని నాకు కబురు తీసుకురా>> అని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతణ్ణి పంపించాడు. అతడు షెకెముకు వచ్చాడు. BSB BSB: Then Israel told him, “Go now and see how your brothers and the flocks are faring, and bring word back to me.” So he sent him off from the Valley of Hebron. And when Joseph arrived in Shechem,
15 ULB యోసేపు పొలంలో ఇటు అటు తిరుగుతూ ఉండగా ఒక మనిషి అతణ్ణి చూసి <<దేని గురించి వెదుకుతున్నావు?>> అని అడిగాడు. BSB BSB: a man found him wandering in the field and asked, “What are you looking for?”
16 ULB అందుకతడు <<నేను నా సోదరులను వెదుకుతున్నాను. వారు మందను ఎక్కడ మేపుతున్నారో దయచేసి నాకు చెప్పు>> అని అడిగాడు. BSB BSB: “I am looking for my brothers,” Joseph replied. “Can you please tell me where they are pasturing their flocks?”
17 ULB అందుకు ఆ మనిషి <<వారు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు <దోతానుకు వెళ్దాం పదండి> అని చెప్పుకోవడం నేను విన్నాను>> అని చెప్పాడు. అప్పుడు యోసేపు తన సోదరుల కోసం వెదుకుతూ వెళ్ళి దోతానులో వారిని కనుగొన్నాడు. BSB BSB: “They have moved on from here,” the man answered. “I heard them say, ‘Let us go to Dothan.’” So Joseph set out after his brothers and found them at Dothan.
18 ULB అతడు దగ్గరికి రాక ముందే వారు అతణ్ణి దూరం నుండి చూసి అతణ్ణి చంపడానికి దురాలోచన చేశారు. BSB BSB: Now Joseph’s brothers saw him in the distance, and before he arrived, they plotted to kill him.
19 ULB వారు <<అడుగో, కలలు కనేవాడు వస్తున్నాడు. BSB BSB: “Here comes that dreamer!” they said to one another.
20 ULB వీణ్ణి చంపి ఒక గుంటలో పారేసి, <ఏదో క్రూర జంతువు వీణ్ణి చంపి తినేసింది> అని చెబుదాం. అప్పుడు వీడి కలలేమౌతాయో చూద్దాం>> అని ఒకరి కొకరు చెప్పుకున్నారు. BSB BSB: “Come now, let us kill him and throw him into one of the pits. We can say that a vicious animal has devoured him. Then we shall see what becomes of his dreams!”
21 ULB రూబేను ఆ మాట విని <<మనం వాణ్ణి చంపకూడదు>> అని చెప్పి వారి చేతుల్లో చావకుండా యోసేపును తప్పించాడు. BSB BSB: When Reuben heard this, he tried to rescue Joseph from their hands. “Let us not take his life,” he said.
22 ULB ఎలాగంటే రూబేను అతణ్ణి తమ తండ్రికి అప్పగించాలని, వారు అతణ్ణి చంపకుండా విడిపించాలని ఉద్దేశించి <<రక్తం చిందించ వద్దు. అతణ్ణి చంపకుండా అడవిలో ఉన్న ఈ గుంటలో తోసేయండి>> అని వారితో చెప్పాడు. BSB BSB: “Do not shed his blood. Throw him into this pit in the wilderness, but do not lay a hand on him.” Reuben said this so that he could rescue Joseph from their hands and return him to his father.
23 ULB యోసేపు తన సోదరుల దగ్గరికి వచ్చినప్పుడు వారు యోసేపు తొడుక్కొన్న ఆ అందమైన నిలువుటంగీని తీసేసి, BSB BSB: So when Joseph came to his brothers, they stripped him of his robe—the robe of many colors he was wearing—
24 ULB అతణ్ణి పట్టుకుని ఆ గుంటలో పడదోశారు. అది నీళ్ళు లేని వట్టి గుంట. BSB BSB: and they took him and threw him into the pit. Now the pit was empty, with no water in it.
25 ULB వారు భోజనానికి కూర్చున్నపుడు, ఐగుప్తుకు సుగంధ ద్రవ్యాలు, మస్తకి, బోళం మోసుకుపోతున్న ఒంటెలతో ఇష్మాయేలీ యాత్రికులు గిలాదు నుండి రావడం చూశారు. BSB BSB: And as they sat down to eat a meal, they looked up and saw a caravan of Ishmaelites coming from Gilead. Their camels were carrying spices, balm, and myrrh on their way down to Egypt.
26 ULB అప్పుడు యూదా <<మనం మన తమ్ముణ్ణి చంపి వాడి చావుని దాచిపెట్టడం వలన ఏం ప్రయోజనం? BSB BSB: Then Judah said to his brothers, “What profit will we gain if we kill our brother and cover up his blood?
27 ULB ఈ ఇష్మాయేలీయులకు వాణ్ణి అమ్మేద్దాం రండి. ఎలాగైనా వాడు మన తమ్ముడు, మన రక్త సంబంధి గదా? వాడిని చంపకూడదు>> అని తన సోదరులతో చెప్పాడు. అందుకు అతని సోదరులు అంగీకరించారు. BSB BSB: Come, let us sell him to the Ishmaelites and not lay a hand on him; for he is our brother, our own flesh.” And they agreed.
28 ULB ఆ మిద్యాను వర్తకులు దగ్గరికి వచ్చినపుడు వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరవై షెకెల్ ల వెండికి అతణ్ణి అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు. BSB BSB: So when the Midianite traders passed by, his brothers pulled Joseph out of the pit and sold him for twenty shekels of silver to the Ishmaelites, who took him to Egypt.
29 ULB రూబేను ఆ గుంట దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు యోసేపు అందులో లేకపోవడంతో అతడు తన బట్టలు చింపుకున్నాడు. BSB BSB: When Reuben returned to the pit and saw that Joseph was not there, he tore his clothes,
30 ULB అతడు తన సోదరుల దగ్గరికి వెళ్ళి <<చిన్నవాడు లేడే, అయ్యో, నేనెక్కడికి వెళతాను?>> అన్నాడు. BSB BSB: returned to his brothers, and said, “The boy is gone! What am I going to do?”
31 ULB వారు ఒక మేకపిల్లను చంపి, యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు. BSB BSB: Then they took Joseph’s robe, slaughtered a young goat, and dipped the robe in its blood.
32 ULB వారు దాన్ని తమ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి <<ఇది మాకు దొరికింది. ఇది నీ కొడుకు అంగీనో కాదో చూడు>> అన్నారు. BSB BSB: They sent the robe of many colors to their father and said, “We found this. Examine it to see whether it is your son’s robe or not.”
33 ULB అతడు దాన్ని గుర్తుపట్టి <<ఈ అంగీ నా కొడుకుదే, ఏదో ఒక క్రూర జంతువు వాణ్ణి చంపి తినేసింది. తప్పనిసరిగా అది యోసేపును చీల్చేసి ఉంటుంది>> అన్నాడు. BSB BSB: His father recognized it and said, “It is my son’s robe! A vicious animal has devoured him. Joseph has surely been torn to pieces!”
34 ULB యాకోబు తన బట్టలు చింపుకుని తన నడుముకు గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కొడుకు కోసం దుఃఖించాడు. BSB BSB: Then Jacob tore his clothes, put sackcloth around his waist, and mourned for his son many days.
35 ULB అతని కొడుకులు, కూతుర్లు అందరూ అతణ్ణి ఓదార్చడానికి ప్రయత్నం చేశారు గానీ అతడు ఓదార్పు పొందలేదు. <<నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను>> అని అతడు యోసేపు కోసం ఏడ్చాడు. BSB BSB: All his sons and daughters tried to comfort him, but he refused to be comforted. “No,” he said. “I will go down to Sheol mourning for my son.” So his father wept for him.
36 ULB మిద్యానీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్లి, ఫరో రాజు అంగ రక్షకుల సేనానిగా పని చేస్తున్న పోతీఫరుకు అతణ్ణి అమ్మేశారు. BSB BSB: Meanwhile, the Midianites sold Joseph in Egypt to Potiphar, an officer of Pharaoh and captain of the guard.