1 ULB ప్రవక్త అయిన హబక్కూకు దగ్గరికి దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి. BSB BSB: This is the burden that Habakkuk the prophet received in a vision:
3 ULB నన్నెందుకు దోషాన్ని చూడనిస్తున్నావు? బాధను నీవెందుకు చూస్తూ ఉండిపోతున్నావు? ఎక్కడ చూసినా నాశనం, బలాత్కారం కనబడుతున్నాయి. జగడం, కలహం రేగుతున్నాయి. BSB BSB: Why do You make me see iniquity? Why do You tolerate wrongdoing? Destruction and violence are before me. Strife is ongoing, and conflict abounds.
4 ULB అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమై పోయింది. న్యాయం జరగకుండా ఆగిపోయింది. భక్తి హీనులు నీతిపరులను చుట్టుముడుతున్నారు. న్యాయం చెడిపోతున్నది. BSB BSB: Therefore the law is paralyzed, and justice never goes forth. For the wicked hem in the righteous, so that justice is perverted.
5 ULB అన్యజనుల్లో జరుగుతున్నది చూడండి, ఆలోచించండి. నిర్ఘాంతపొండి. మీ కాలంలో నేనొక కార్యం చేస్తాను. అలా జరుగుతుందని ఎవరైనా మీకు చెప్పినా మీరు నమ్మరు. BSB BSB: “Look at the nations and observe—be utterly astounded! For I am doing a work in your days that you would never believe even if someone told you.
6 ULB కల్దీయులను నేను రేపుతున్నాను. వినండి. వారు తమవి కాని ఉనికిపట్టులను ఆక్రమించాలని భూదిగంతాలదాకా సంచరించే ఉద్రేకం గల క్రూరులు. BSB BSB: For behold, I am raising up the Chaldeans—that ruthless and impetuous nation which marches through the breadth of the earth to seize dwellings not their own.
7 ULB వారు ఘోరమైన భీకర జాతి. వారు ప్రభుత్వ విధులను తమ ఇష్టం వచ్చినట్టు ఏర్పరచుకుంటారు. BSB BSB: They are dreaded and feared; from themselves they derive justice and sovereignty.
8 ULB వారి గుర్రాలు చిరుతపులుల కంటే వేగంగా పరుగులెత్తుతాయి. రాత్రిలో తిరుగులాడే తోడేళ్లకంటే అవి చురుకైనవి. వారి రౌతులు దూరం నుండి వచ్చి తటాలున చొరబడతారు. ఎరను పట్టుకోడానికి గరుడ పక్షి వడిగా వచ్చేలా వారు వస్తారు. BSB BSB: Their horses are swifter than leopards, fiercer than wolves of the night. Their horsemen charge ahead, and their cavalry comes from afar. They fly like a vulture, swooping down to devour.
9 ULB వెనుదిరిగి చూడకుండా దౌర్జన్యం చేయడానికి వారు వస్తారు. ఇసుక రేణువులంత విస్తారంగా వారు జనులను చెర పట్టుకుంటారు. BSB BSB: All of them come bent on violence; their hordes advance like the east wind; they gather prisoners like sand.
10 ULB రాజులను అపహాస్యం చేస్తారు. అధిపతులను హేళన చేస్తారు. ప్రాకారాలున్న దుర్గాలన్నిటిని తృణీకరిస్తారు. మట్టి దిబ్బలు వేసి వాటిని పట్టుకుంటారు. BSB BSB: They scoff at kings and make rulers an object of scorn. They laugh at every fortress and build up siege ramps to seize it.
11 ULB తమ బలమే తమ దేవుడనుకుంటారు. గాలి కొట్టుకుని పోయేలా వారు కొట్టుకు పోతూ అపరాధులౌతారు. BSB BSB: Then they sweep by like the wind and pass through. They are guilty; their own strength is their god.”
12 ULB యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నువ్వున్న వాడవు కావా? మేము మరణించము. యెహోవా, తీర్పుకే నువ్వు వారిని నియమించావు. ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించడానికే వారిని పుట్టించావు. BSB BSB: Are You not from everlasting, O LORD, my God, my Holy One? We will not die. O LORD, You have appointed them to execute judgment; O Rock, You have established them for correction.
13 ULB నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది గదా. బాధించేవారు చేసే దుర్మార్గతను బాధను నువ్వు చూడలేవు గదా. కపటులను నువ్వు చూసి కూడా, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా చూసి కూడా ఎందుకు ఊరుకున్నావు? BSB BSB: Your eyes are too pure to look upon evil, and You cannot tolerate wrongdoing. So why do You tolerate the faithless? Why are You silent while the wicked swallow up those more righteous than themselves?
14 ULB పాలించే వారెవరూ లేని చేపలతో, పాకే పురుగులతో నువ్వు మనుషులను సమానులనుగా చేశావు. BSB BSB: You have made men like the fish of the sea, like creeping things that have no ruler.
15 ULB వాడు గాలం వేసి మనుషులందరిని గుచ్చి లాగుతున్నాడు. ఉరులు పన్ని చిక్కించుకుంటున్నాడు. వలతో వారిని వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నాడు. BSB BSB: The foe pulls all of them up with a hook; he catches them in his dragnet, and gathers them in his fishing net; so he rejoices gladly.
16 ULB కాబట్టి వలల వలన మంచి రాబడి, పుష్టినిచ్చే భోజనం తనకు దొరుకుతున్నాయని వాడు తన వలకు బలులు అర్పిస్తున్నాడు. తన వలలకు సాంబ్రాణి వేస్తున్నాడు. BSB BSB: Therefore he sacrifices to his dragnet and burns incense to his fishing net, for by these things his portion is sumptuous and his food is rich.
17 ULB వాడు అస్తమానం తన వలలో నుండి దిమ్మరిస్తూ ఉండాలా? ఎప్పటికీ మానకుండా వాడు జాతులను దయలేకుండా హతం చేస్తూ ఉండాలా?>> BSB BSB: Will he, therefore, empty his net and continue to slay nations without mercy?