1 ULB మనం యెహోవా దగ్గరికి తిరిగి వెళ్దాం రండి. ఆయన మనలను చీల్చివేశాడు. ఆయనే మనలను స్వస్థపరుస్తాడు. ఆయన మనలను గాయపరిచాడు. ఆయనే మనకు కట్లు కడతాడు. BSB BSB: Come, let us return to the LORD. For He has torn us to pieces, but He will heal us; He has wounded us, but He will bind up our wounds.
2 ULB రెండు రోజుల తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు. మనం ఆయన సముఖంలో బ్రతికేలా, మూడవ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు. BSB BSB: After two days He will revive us; on the third day He will raise us up, that we may live in His presence.
3 ULB యెహోవాను తెలుసుకుందాం రండి. యెహోవాను తెలుసుకోడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ఆయన్ని అనుసరించుదాము రండి. పొద్దు పొడవడం ఎంత కచ్చితమో ఆయన రావడం అంత కచ్చితం. వర్షం చినుకుల్లాగా భూమిని తడిపే తొలకరి వర్షంలాగా ఆయన మన దగ్గరికి వస్తాడు. BSB BSB: So let us know—let us press on to know the LORD. As surely as the sun rises, He will appear; He will come to us like the rain, like the spring showers that water the earth.
4 ULB ఎఫ్రాయిమూ, నేను నిన్నేం చేయాలి? యూదా, నిన్నేమి చెయ్యాలి? ఉదయం పొగమంచు లాగా త్వరగా ఆరిపోయే మంచు బిందువుల్లాగా మీ భక్తి ఉంది. BSB BSB: What shall I do with you, O Ephraim? What shall I do with you, O Judah? For your loyalty is like a morning mist, like the early dew that vanishes.
5 ULB కాబట్టి నేను ప్రవక్తల మూలంగా వారిని ముక్కలు చేశాను. నా నోటిమాటలతో నేను వారిని హతమార్చాను. నీ శాసనాలు వెలుగులాగా ప్రకాశిస్తున్నాయి. BSB BSB: Therefore I have hewn them by the prophets; I have slain them by the words of My mouth, and My judgments go forth like lightning.
6 ULB నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను. దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను. BSB BSB: For I desire mercy, not sacrifice, and the knowledge of God rather than burnt offerings.
7 ULB ఆదాములాగా వారు విశ్వాస ఘాతకులై నా నిబంధనను ఉల్లంఘించారు. BSB BSB: But they, like Adam, have transgressed the covenant; there they were unfaithful to Me.
8 ULB గిలాదు పాపాత్ముల పట్టణమై పోయింది. అందులో నెత్తురు అడుగుజాడలు కనబడుతున్నాయి. BSB BSB: Gilead is a city of evildoers, tracked with footprints of blood.
9 ULB బందిపోటు దొంగలు పొంచి ఉండేలా యాజకులు పొంచి ఉండి షెకెము దారిలో హత్య చేస్తారు. వారు ఘోరనేరాలు చేశారు. BSB BSB: Like raiders who lie in ambush, so does a band of priests; they murder on the way to Shechem; surely they have committed atrocities.
10 ULB ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి నేను చూశాను. ఎఫ్రాయిమీయుల వ్యభిచార క్రియలు అక్కడున్నాయి. ఇశ్రాయేలు వారి చెడుతనం అక్కడ ఉంది. BSB BSB: In the house of Israel I have seen a horrible thing: Ephraim practices prostitution there, and Israel is defiled.
11 ULB నా ప్రజల సంపదలు మళ్ళీ వారికి ఇచ్చినప్పుడు, యూదా, నీ కోసం కూడా కోత సిద్ధంగా ఉంది. BSB BSB: Also for you, O Judah, a harvest is appointed, when I restore My people from captivity.