1 ULB ఇది దమస్కు నగరం గూర్చిన దైవ ప్రకటన. <<దమస్కు ఇక మీదట నగరంగా ఉండదు. అది శిథిల గృహంలా ఉంటుంది. BSB BSB: This is the burden against Damascus: “Behold, Damascus is no longer a city; it has become a heap of ruins.
2 ULB అరోయేరు పట్టణాలు జనాలు లేకుండా ఉంటాయి. అవి గొర్రెల మందలు మేసే ప్రదేశాలవుతాయి. అవి అక్కడ ఎవరి భయమూ లేకుండా పడుకుంటాయి. BSB BSB: The cities of Aroer are forsaken; they will be left to the flocks, which will lie down with no one to fear.
3 ULB ఎఫ్రాయిములో భద్రత కోసం కట్టిన ప్రాకారాలూ, దమస్కులో రాజ్యాధికారమూ మాయమవుతాయి. ఇశ్రాయేలు ప్రజల ప్రాభవానికి జరిగినట్టే సిరియాలో మిగిలి ఉన్న వారికీ జరుగుతుంది.>> ఇది సేనల ప్రభువైన యెహోవా మాట. BSB BSB: The fortress will disappear from Ephraim, and the sovereignty from Damascus. The remnant of Aram will be like the splendor of the Israelites,” declares the LORD of Hosts.
4 ULB <<ఆ రోజుల్లో యాకోబు ప్రాభవం హీన దశకు చేరుకుంటుంది. బలిసిన అతని శరీరం చిక్కి పోతుంది. BSB BSB: “In that day the splendor of Jacob will fade, and the fat of his body will waste away,
5 ULB అది పంట కోసేవాడు ధాన్యాన్ని సమకూర్చినట్టుగా, అతడి చేయి కంకులను కోసినట్టుగా ఉంటుంది. రెఫాయీము లోయలో ఒకడు పరిగె సేకరించినట్టుగా ఉంటుంది. BSB BSB: as the reaper gathers the standing grain and harvests the ears with his arm, as one gleans heads of grain in the Valley of Rephaim.
6 ULB అయినా ఒలీవ చెట్టును దులిపినప్పుడు పైన కొన్ని పళ్ళు మిగిలి ఉన్నట్టుగా పరిగె మిగిలి ఉంటుంది. రెండు మూడు ఒలీవ పళ్ళు చిట్టచివరి కొమ్మలో మిగిలి ఉన్నట్టుగా, ఫలభరితమైన చెట్టు చిటారు కొమ్మలో నాలుగైదు పళ్ళు మిగిలి ఉన్నట్టుగా పరిగె మిగిలి ఉంటుంది.>> ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రకటన ఇది. BSB BSB: Yet gleanings will remain, like an olive tree that has been beaten—two or three berries atop the tree, four or five on its fruitful branches,” declares the LORD, the God of Israel.
7 ULB ఆ రోజుల్లో మనుషులు తమ సృష్టికర్త వైపు చూస్తారు. ఇశ్రాయేలు ప్రజల పరిశుద్ధ దేవునిపై తమ దృష్టి నిలుపుతారు. BSB BSB: In that day men will look to their Maker and turn their eyes to the Holy One of Israel.
8 ULB తమ చేతులతో చేసిన బలిపీఠాలను గానీ, తమ చేతివేళ్ళతో చేసిన ఆషేరా దేవతా స్తంభాలను గానీ, సూర్యుడి విగ్రహాలను గానీ చూడరు. BSB BSB: They will not look to the altars they have fashioned with their hands or to the Asherahs and incense altars they have made with their fingers.
9 ULB ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల భయం వల్ల వాళ్ళు వదిలి వెళ్ళిన బలమైన పట్టణాలు కొండ శిఖరాల పైన నిర్జనమైన అడవుల్లా ఉంటాయి. అవి నాశనమై పోతాయి. BSB BSB: In that day their strong cities will be like forsaken thickets and summits, abandoned to the Israelites and to utter desolation.
10 ULB ఎందుకంటే నీ రక్షణకు కారకుడైన దేవుణ్ణి నువ్వు మర్చి పోయావు. నీ బలానికి ఆధారంగా ఉన్న బండను అలక్ష్యం చేశావు. కాబట్టి నువ్వు అందమైన మొక్కలను నాటావు. అన్య దేశాల ద్రాక్ష చెట్లు నాటావు. BSB BSB: For you have forgotten the God of your salvation and failed to remember the Rock of your refuge. Therefore, though you cultivate delightful plots and set out cuttings from exotic vines—
11 ULB నువ్వు వాటిని నాటిన రోజున దానికి కంచె వేసి సేద్యం చేశావు. త్వరలోనే నీ విత్తనాలు ఫలించి మొక్కలు పెరిగాయి. కానీ అమితమైన దుఃఖం, భయంకరమైన విచారం కలిగే రోజున నీ పంట విఫలమవుతుంది. BSB BSB: though on the day you plant you make them grow, and on that morning you help your seed sprout—yet the harvest will vanish on the day of disease and incurable pain.
12 ULB అయ్యో! భీకరమైన సముద్ర ఘోషలా అనేక జనాలు వేసే కేకలు, బలమైన నీటి ప్రవాహపు హోరులాగా అనేక జాతులు తరలి పోతున్న శబ్దాలూ వినిపిస్తున్నాయి. BSB BSB: Alas, the tumult of many peoples; they rage like the roaring seas and clamoring nations; they rumble like the crashing of mighty waters.
13 ULB అనేక నీటి ప్రవాహాల హోరులాగా జాతులు గర్జిస్తున్నాయి. కానీ దేవుడు వాళ్ళని గద్దిస్తాడు. వాళ్ళు దూరంగా పారిపోతారు. గాలికి ఎగిరిపోయే చచ్చిన మొక్కలను గాలి ఎగర గొట్టినట్టుగా, సుడిగాలిలో పిచ్చి మొక్కలు గిర్రున తిరిగి పోయినట్టుగా వాళ్ళు పారిపోతారు. BSB BSB: The nations rage like the rush of many waters. He rebukes them, and they flee far away, driven before the wind like chaff on the hills, like tumbleweeds before a gale.
14 ULB సాయంత్రం, చూడండి, భయోత్పాతం! ఉదయం కాకుండానే వాళ్ళు కనిపించకుండా పోతారు. మమ్మల్ని దోచుకునే వాళ్లకి పట్టే గతి ఇదే. మా సంపదను దొంగతనం చేసేవాళ్ళకి దక్కేది ఇదే. BSB BSB: In the evening, there is sudden terror! Before morning, they are no more! This is the portion of those who loot us and the lot of those who plunder us.
Select verses for actions: Enter goes to them and Escape comes back.