1 ULB సముద్రతీరాన ఉన్న ఎడారిని గురించిన దైవ ప్రకటన. <<దక్షిణ దేశం నుండి తుఫాను గాలులు వీస్తున్నట్టు, ఒక భయంకరమైన దేశం నుండి అరణ్యాన్ని దాటుకుంటూ ఆ విపత్తు వస్తూ ఉంది. BSB BSB: This is the burden against the Desert by the Sea: Like whirlwinds sweeping through the Negev, an invader comes from the desert, from a land of terror.
2 ULB దుస్థితిని తెలియ జేసే ఒక దర్శనం నాకు కలిగింది. మోసగాడు మోసాలు చేస్తాడు. నాశనం చేసేవాడు నాశనం చేస్తాడు. ఏలాము దేశమా, వెళ్ళి దాడి చెయ్యి, మాదియా దేశమా ముట్టడి వెయ్యి. నేను ఆమె మూలుగులను ఆపివేస్తాను. BSB BSB: A dire vision is declared to me: “The traitor still betrays, and the destroyer still destroys. Go up, O Elam! Lay siege, O Media! I will put an end to all her groaning.”
3 ULB కాబట్టి నా నడుముకు విపరీతమైన నొప్పి కలిగింది. ప్రసవ వేదన పడే స్త్రీకి కలిగిన నొప్పుల్లాంటివే నాకూ కలిగాయి. నేను విన్న దాన్ని బట్టి కుంగిపోయాను. చూసిన దాన్ని బట్టి నాకు బాధ కలుగుతున్నది. BSB BSB: Therefore my body is filled with anguish. Pain grips me, like the pains of a woman in labor. I am bewildered to hear, I am dismayed to see.
4 ULB నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. భయంతో నాకు జలదరింపు కలిగింది. నేను ఆశతో ఎదురు చూసిన రాత్రి నాకు భయంతో వణుకు పుట్టింది. BSB BSB: My heart falters; fear makes me tremble. The twilight I desired has turned to horror.
5 ULB వాళ్ళు భోజనం బల్ల సిద్ధం చేస్తారు. తివాచీలు పరుస్తారు. అన్నం తిని, తాగుతారు. అధిపతులారా, లేవండి. డాళ్ళకి నూనె రాయండి. BSB BSB: They prepare a table, they lay out a carpet, they eat, they drink! Rise up, O princes, oil the shields!
6 ULB ఎందుకంటే ప్రభువు నాకు చెప్పిన మాట ఇది. వెళ్ళు. ఒక కాపలా వాణ్ణి నియమించు. తాను చూస్తున్న దాని గూర్చి అతడు సమాచారం ఇవ్వాలి. BSB BSB: For this is what the Lord says to me: “Go, post a lookout and have him report what he sees.
7 ULB అతడు ఒక రథాన్ని చూసినప్పుడు, జంట రౌతులు గుర్రాలపై రావడం చూసినప్పుడు, గాడిదలనూ, ఒంటెలనూ ఎక్కి వాళ్ళు రావడం చూసినప్పుడు అతడు మనస్సు పెట్టి అప్రమత్తంగా ఉండాలి.>> BSB BSB: When he sees chariots with teams of horsemen, riders on donkeys, riders on camels, he must be alert, fully alert.”
8 ULB ఆ కాపలా వాడు ఇలా అరుస్తాడు. <<నా ప్రభూ, ఈ పహారా స్తంభంపై ప్రతి రోజూ, రోజంతా నిలబడి ఉన్నాను. రాత్రంతా నేను కాపలా కాస్తూనే ఉన్నాను.>> BSB BSB: Then the lookout shouted: “Day after day, my lord, I stand on the watchtower; night after night I stay at my post.
9 ULB చూడండి, రథాన్ని తోలుకుంటూ ఒక వ్యక్తి గుర్రాలెక్కి వస్తున్న రౌతులతో వస్తున్నాడు. వాళ్ళు జంటలుగా ఒక దళంగా వస్తున్నారు. అతడు పిలిచి ఇలా చెప్పాడు. <<బబులోను కూలి పోయింది. నిజంగానే కూలిపోయింది. దాని చెక్కిన దేవుళ్ళ బొమ్మలన్నీ విరిగి నేలకూలాయి.>> BSB BSB: Look, here come the riders, horsemen in pairs.” And one answered, saying: “Fallen, fallen is Babylon! All the images of her gods lie shattered on the ground!”
10 ULB నేను నూర్చిన నా ధాన్యమా, నేను చెరిగిన వాళ్ళు, నా కళ్ళంలో నూర్చిన పిల్లలు, ఇశ్రాయేలు దేవుడు, సేనలకు అధిపతి అయిన యెహోవా దగ్గర నేను విన్నది నీకు తెలియజేశాను. BSB BSB: O my people, crushed on the threshing floor, I tell you what I have heard from the LORD of Hosts, the God of Israel.
11 ULB దూమా గూర్చిన ఒక దైవ ప్రకటన. శేయీరు లో నుండి ఒకడు నన్ను అడుగుతున్నాడు. <<కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత మిగిలి ఉంది?>> BSB BSB: This is the burden against Dumah: One calls to me from Seir, “Watchman, what is left of the night? Watchman, what is left of the night?”
12 ULB అప్పుడు కావలివాడు <<ఉదయం వస్తుంది, రాత్రి కూడా వస్తుంది. మీరు అడగాలనుకుంటే అడగండి. మళ్ళీ తిరిగి రండి>> అంటున్నాడు. BSB BSB: The watchman replies, “Morning has come, but also the night. If you would inquire, then inquire. Come back yet again.”
13 ULB అరేబియాను గూర్చిన ఒక దైవ ప్రకటన. దెదాను సంచార వర్తకులు, మీరు అరేబియా ఎడారిలో రాత్రి గడపాలి. BSB BSB: This is the burden against Arabia: In the thickets of Arabia you must lodge, O caravans of Dedanites.
14 ULB తేమా దేశ వాసులారా, దాహంతో ఉన్న వారి కోసం నీళ్ళు తీసుకుని రండి. దేశ దిమ్మరుల ఎదురుగా ఆహారం తీసుకు రండి. BSB BSB: Bring water for the thirsty, O dwellers of Tema; meet the refugees with food.
15 ULB ఎందుకంటే వాళ్ళు కత్తినుండి తప్పించుకుని పారిపోతున్నారు. దూసిన కత్తి నుండీ, ఎక్కు పెట్టిన విల్లు నుండీ, యుద్ధ భయం వల్లా పారిపోతున్నారు. BSB BSB: For they flee from the sword—the sword that is drawn—from the bow that is bent, and from the stress of battle.
16 ULB ఎందుకంటే ప్రభువు నాకిలా చెప్పాడు. <<మరో సంవత్సరంలోగా కూలి వాళ్ళని ఒక సంవత్సరానికి పెట్టుకున్నట్టుగా కేదారు ప్రభావం అంతా నశించిపోతుంది. BSB BSB: For this is what the Lord says to me: “Within one year, as a hired worker would count it, all the glory of Kedar will be gone.
17 ULB కేదారు ప్రజల్లో కొద్దిమంది విలుకాళ్ళూ, శూరులూ మిగిలిపోతారు.>> ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా చెప్తున్న మాట ఇది. BSB BSB: The remaining archers, the warriors of Kedar, will be few.” For the LORD, the God of Israel, has spoken.
Select verses for actions: Enter goes to them and Escape comes back.