1 ULB అందుకు యోబు ఇలా జవాబు ఇచ్చాడు, BSB BSB: Then Job answered:
2 ULB <<ఇలాంటి మాటలు నేను అనేకం విన్నాను. మీరంతా ఆదరించడానికి కాదు, బాధ పెట్టడానికి వచ్చినట్టున్నారు. BSB BSB: “I have heard many things like these; miserable comforters are you all.
3 ULB నువ్వు చెబుతున్న గాలిమాటలు చాలిస్తావా? నాకిలా జవాబివ్వడానికి నీకేం బాధ కలిగింది? BSB BSB: Is there no end to your long-winded speeches? What provokes you to continue testifying?
4 ULB నా దుస్థితి మీకు పట్టి ఉంటే నేను కూడా మీలాగా మాట్లాడేవాణ్ణి. మీ మీద లేనిపోని మాటలు కల్పిస్తూ నా తల ఆడిస్తూ మీవైపు చూసేవాణ్ణి. BSB BSB: I could also speak like you if you were in my place; I could heap up words against you and shake my head at you.
5 ULB అయినప్పటికీ నేను మిమ్మల్ని ఓదార్చి ధైర్యపరిచేవాణ్ణి. నా ఆదరణ వాక్కులతో మిమ్మల్ని బలపరిచేవాణ్ణి. BSB BSB: But I would encourage you with my mouth, and the consolation of my lips would bring relief.
6 ULB ఇప్పుడు నేను ఎన్ని మాటలు మాట్లాడినా దుఃఖం తీరదు, అలాగని మౌనంగా ఉన్నా నాకెలాంటి ఉపశమనం కలగదు. BSB BSB: Even if I speak, my pain is not relieved, and if I hold back, how will it go away?
7 ULB దేవుడు నాకు ఆయాసం కలగజేశాడు. దేవా, నా బంధువర్గమంతటినీ నువ్వు నాశనం చేశావు. BSB BSB: Surely He has now exhausted me; You have devastated all my family.
8 ULB నా శరీరమంతా బక్కచిక్కిపోయింది. క్షీణించిపోయి, మడతలు పడిన నా చర్మం నాకు వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నది. BSB BSB: You have bound me, and it has become a witness; my frailty rises up and testifies against me.
9 ULB ఆయన కళ్ళు నా మీద కోపంతో ఎర్రబడ్డాయి. నన్ను చూసి పళ్ళు కొరుకుతూ నా మీద పడి నాతో యుద్ధం చేశాడు. BSB BSB: His anger has torn me and opposed me; He gnashes His teeth at me. My adversary pierces me with His eyes.
10 ULB మనుషులు నన్ను ఎత్తి పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ తిట్లు నాకు చెంపపెట్టులాంటివి. వాళ్ళంతా ఏకమై నాకు వ్యతిరేకంగా సమకూడుతున్నారు. BSB BSB: They open their mouths against me and strike my cheeks with contempt; they join together against me.
11 ULB దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించాడు. భక్తిహీనుల ఆధీనంలో నన్ను బంధించి ఉంచాడు. BSB BSB: God has delivered me to unjust men; He has thrown me to the clutches of the wicked.
12 ULB నేను మౌనంగా ఉండిపోయాను. ఆయన నన్ను ముక్కలు ముక్కలు చేశాడు. నా మెడ పట్టుకుని విదిలించి నన్ను చిందరవందర చేశాడు. నన్ను గురిగా చేసుకుని వేధిస్తున్నాడు. BSB BSB: I was at ease, but He shattered me; He seized me by the neck and crushed me. He has set me up as His target;
13 ULB ఆయన వేసే బాణాలు నా దేహమంతా గుచ్చుకుంటున్నాయి. ఆయన నా మూత్రపిండాలను పొడిచివేశాడు. జాలి, దయ లేకుండా నన్ను వేధిస్తున్నాడు. నాలోని పైత్యరసాన్ని నేలపై కక్కించాడు. BSB BSB: His archers surround me. He pierces my kidneys without mercy and spills my gall on the ground.
14 ULB దెబ్బ మీద దెబ్బ వేసి నన్ను విరగగొడుతున్నాడు. యుద్ధ వీరుని వలే పరుగెత్తుకుంటూ వచ్చి నా మీద పడ్డాడు. BSB BSB: He breaks me with wound upon wound; He rushes me like a mighty warrior.
15 ULB నా చర్మానికి గోనెపట్ట కప్పుకుని కూర్చున్నాను. నా దేహమంతా బూడిద పోసుకుని మురికి చేసుకున్నాను. BSB BSB: I have sewn sackcloth over my skin; I have buried my horn in the dust.
16 ULB నేను ఎవ్వరికీ కీడు తలపెట్టలేదు. నేను చేసే ప్రార్థన పరిశుద్ధం. BSB BSB: My face is red with weeping, and deep shadows ring my eyes;
17 ULB ఏడ్చి ఏడ్చి నా ముఖం ఎర్రబడిపోయింది. నా కంటిరెప్పల మీద మరణాంధకారం తేలియాడుతున్నది. BSB BSB: yet my hands are free of violence and my prayer is pure.
18 ULB భూమీ, ఒలుకుతున్న నా రక్తాన్ని కనబడనియ్యి. నేను పెడుతున్న మొరలు ఎప్పుడూ వినిపిస్తూ ఉండాలి. BSB BSB: O earth, do not cover my blood; may my cry for help never be laid to rest.
19 ULB ఇప్పటికీ నా తరుపు సాక్షి పరలోకంలో ఉన్నాడు. నా పక్షంగా వాదించేవాడు ఆయన సమక్షంలో ఉన్నాడు. BSB BSB: Even now my witness is in heaven, and my advocate is on high.
20 ULB నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా కళ్ళు దేవుని కోసం కన్నీళ్లు కారుస్తున్నాయి. BSB BSB: My friends are my scoffers as my eyes pour out tears to God.
21 ULB ఒక వ్యక్తి తన స్నేహితుని కోసం బ్రతిమిలాడినట్టు నా కోసం దేవుణ్ణి వేడుకునే ఒక మనిషి నాకు కావాలి. BSB BSB: Oh, that a man might plead with God as he pleads with his neighbor!
22 ULB ఇంకా కొన్ని సంవత్సరాలు గడచిన తరువాత నేను తిరిగిరాని దారిలో వెళ్ళిపోతాను. BSB BSB: For when only a few years are past I will go the way of no return.
Select verses for actions: Enter goes to them and Escape comes back.