1 ULB సర్వశక్తుడు దుష్టులను శిక్షించే నియామక కాలాలను ఎందుకు ఏర్పాటు చేయడు? ఆయనను ఎరిగినవారు ఆయన తీర్పు దినాలను ఎందుకు చూడడం లేదు? BSB BSB: “Why does the Almighty not reserve times for judgment? Why may those who know Him never see His days?
2 ULB సరిహద్దు రాళ్లను తీసేసే వారు ఉన్నారు. వారు అక్రమం చేసి మందలను ఆక్రమించుకుని తమ గడ్డి భూముల్లో వాటిని ఉంచుకుంటారు. BSB BSB: Men move boundary stones; they pasture stolen flocks.
3 ULB వారు తండ్రి లేని వారి గాడిదను తోలేస్తారు. విధవరాలి ఎద్దును తాకట్టు పెట్టుకుంటారు. BSB BSB: They drive away the donkey of the fatherless and take the widow’s ox in pledge.
4 ULB వారు అవసరంలో ఉన్న వారిని తమ దారుల్లో నుండి తప్పిస్తారు. దేశంలోని పేదలు వారి కంటబడకుండా దాక్కోవలసి వచ్చింది. BSB BSB: They push the needy off the road and force all the poor of the land into hiding.
5 ULB అరణ్యంలోని అడవి గాడిదలు తిరిగినట్టు పేదలు బయలుదేరి ఆహారం కోసం వెతుకులాడతారు. ఎడారిలో వారి పిల్లలకు ఆహారం దొరుకుతుంది. BSB BSB: Indeed, like wild donkeys in the desert, the poor go to work foraging for food; the wasteland is food for their children.
6 ULB పొలంలో వారు తమ కోసం గడ్డి కోసుకుంటారు. దుష్టుల ద్రాక్షతోటల్లో పరిగ ఏరుకుంటారు. BSB BSB: They gather fodder in the fields and glean the vineyards of the wicked.
7 ULB బట్టలు లేక రాత్రి అంతా పడుకుని ఉంటారు. చలిలో కప్పుకోడానికి ఏమీ లేక అలా పడి ఉంటారు. BSB BSB: Without clothing, they spend the night naked; they have no covering against the cold.
8 ULB పర్వతాల మీది జల్లులకు తడుస్తారు. ఆశ్రయం లేనందువల్ల బండను కౌగలించుకుంటారు. BSB BSB: Drenched by mountain rains, they huddle against the rocks for want of shelter.
9 ULB తండ్రి లేని పిల్లను తల్లి రొమ్ము నుండి లాగేసే వారు ఉన్నారు. వారు దరిద్రుల దగ్గర తాకట్టు పుచ్చుకుంటారు. BSB BSB: The fatherless infant is snatched from the breast; the nursing child of the poor is seized for a debt.
10 ULB దరిద్రులు కట్టు బట్టలు లేక తిరుగులాడుతారు. ఆకలితో ఇతరుల పనలను మోసుకుంటూ పోతారు. BSB BSB: Without clothing, they wander about naked. They carry the sheaves, but still go hungry.
11 ULB వారు తమ యజమానుల ప్రహరీ లోపల నూనె గానుగలు ఆడిస్తారు. ద్రాక్ష గానుగలను తొక్కుతూ, తాము మాత్రం దాహంతో ఉంటారు. BSB BSB: They crush olives within their walls; they tread the winepresses, but go thirsty.
12 ULB పట్టణంలో మనుషులు మూలుగుతూ ఉంటారు. క్షతగాత్రులు మొర పెడుతూ ఉంటారు. కానీ దేవుడు వారి ప్రార్థనలు పట్టించుకోడు. BSB BSB: From the city, men groan, and the souls of the wounded cry out, yet God charges no one with wrongdoing.
13 ULB ఈ దుష్టులు కొందరు వెలుగు మీద తిరుగుబాటు చేస్తారు. వారు దాని మార్గాలను గుర్తించరు. దాని త్రోవల్లో నిలవరు. BSB BSB: Then there are those who rebel against the light, not knowing its ways or staying on its paths.
14 ULB తెల్లవారే సమయంలో హంతకుడు బయలు దేరుతాడు. వాడు పేదలను, అవసరంలో ఉన్న వారిని చంపుతాడు. రాత్రివేళ వాడు దొంగతనం చేస్తాడు. BSB BSB: When daylight is gone, the murderer rises to kill the poor and needy; in the night he is like a thief.
15 ULB వ్యభిచారి ఏ కన్నైనా తనను చూడదనుకుని తన ముఖానికి ముసుకు వేసుకుని సందె చీకటి కోసం కనిపెడతాడు. BSB BSB: The eye of the adulterer watches for twilight. Thinking, ‘No eye will see me,’ he covers his face.
16 ULB దుర్మార్గులు చీకట్లో కన్నం వేస్తారు. పగలు దాక్కుంటారు. వారు వెలుగును చూడరు. BSB BSB: In the dark they dig through houses; by day they shut themselves in, never to experience the light.
17 ULB ఉదయం వారి దృష్టిలో దట్టమైన అంధకారం. గాఢాంధకార భయాలు వారికి ఏమీ ఇబ్బందిగా అనిపించవు. BSB BSB: For to them, deep darkness is their morning; surely they are friends with the terrors of darkness!
18 ULB వారు జలాల మీద తేలికగా కొట్టుకు పోతారు. వారి స్వాస్థ్యం భూమి మీద శాపగ్రస్థం. ద్రాక్షతోటల దారిలో వారు ఇకపై నడవరు. BSB BSB: They are but foam on the surface of the water; their portion of the land is cursed, so that no one turns toward their vineyards.
19 ULB అనావృష్టి మూలంగా వేడిమి మూలంగా మంచు, నీళ్లు ఆవిరై పోయేలా పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. BSB BSB: As drought and heat consume the melting snow, so Sheol steals those who have sinned.
20 ULB వారిని కన్న గర్భమే వారిని మరిచి పోతుంది. పురుగు వారిని కమ్మగా తినివేస్తుంది. వారు మరి ఎన్నడూ జ్ఞాపకంలోకి రారు. చెట్టు విరిగి పడిపోయినట్టు దుర్మార్గులు పడిపోతారు. BSB BSB: The womb forgets them; the worm feeds on them; they are remembered no more. So injustice is broken like a tree.
21 ULB వారు గొడ్రాళ్ళను దిగమింగుతారు. వితంతువులకు మేలు చేయరు. BSB BSB: They prey on the barren and childless, and show no kindness to the widow.
22 ULB ఆయన తన బలం చేత బలవంతులను కాపాడుతున్నాడు. కొందరు ప్రాణంపై ఆశ వదులుకున్నా మళ్ళీ బాగవుతారు. BSB BSB: Yet by His power, God drags away the mighty; though rising up, they have no assurance of life.
23 ULB తమకు భద్రత ఉందిలే అని వారు అనుకునేలా ఆయన చేస్తాడు. దాన్ని బట్టి వారు సంతోషంగా ఉంటారు. కానీ ఆయన కళ్ళు వారి మార్గాల మీద ఉన్నాయి. BSB BSB: He gives them a sense of security, but His eyes are on their ways.
24 ULB వారు ఘనత పొందినా కొంతసేపటికి లేకుండా పోతారు. వారు హీనస్థితిలోకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళ లాగానే కొట్టుకుపోతారు. పక్వం అయిన వెన్నుల్లాగా వారిని కోసివేయడం జరుగుతుంది. BSB BSB: They are exalted for a moment, then they are gone; they are brought low and gathered up like all others; they are cut off like heads of grain.
25 ULB ఇప్పుడు ఇలా జరగక పోతే నేను అబద్ధికుడినని ఎవరు రుజువు చేస్తారు? నా మాటలు విలువ లేనివని చూపించేది ఎవరు? BSB BSB: If this is not so, then who can prove me a liar and reduce my words to nothing?”
Select verses for actions: Enter goes to them and Escape comes back.