1 ULB నేను నా కన్నులతో ఒప్పందం చేసుకున్నాను గనక కన్యను కోరికతో ఎలా చూస్తాను? BSB BSB: “I have made a covenant with my eyes. How then could I gaze with desire at a virgin?
2 ULB అలా చేస్తే పైనున్న దేవుని ఆజ్ఞ ఏమౌతుంది? ఉన్నత స్థలంలో ఉన్న సర్వశక్తుని వారసత్వం ఏమౌతుంది? BSB BSB: For what is the allotment of God from above, or the heritage from the Almighty on high?
3 ULB ఆపద అనేది దుర్మార్గులకేననీ, విపత్తు దుష్టత్వం జరిగించే వారికేననీ నేను భావించే వాణ్ణి. BSB BSB: Does not disaster come to the unjust and calamity to the workers of iniquity?
4 ULB ఆయనకు నా ప్రవర్తన తెలుసు గదా. ఆయన నా అడుగు జాడలన్నిటినీ లెక్కబెడతాడు గదా. BSB BSB: Does He not see my ways and count my every step?
5 ULB అబద్ధికుడినై నేను తిరుగులాడి ఉన్నట్టయితే, మోసం చేయడానికి నా కాలు వేగిరపడినట్టయితే, BSB BSB: If I have walked in falsehood or my foot has rushed to deceit,
6 ULB నా యథార్థతను తెలుసుకునేందుకు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచు గాక. BSB BSB: let God weigh me with honest scales, that He may know my integrity.
7 ULB నేను న్యాయ మార్గం విడిచి నడచినట్టయితే, నా మనస్సు నా కళ్ళను అనుసరించి నడిచినట్టయితే మాలిన్యం ఏదైనా నా చేతులకు తగిలినట్టయితే, BSB BSB: If my steps have turned from the path, if my heart has followed my eyes, or if impurity has stuck to my hands,
8 ULB నేను విత్తనం చల్లి పండించిన దాన్ని వేరొకడు భుజించనియ్యండి. నా పంటను పెరికి వేయనియ్యండి. BSB BSB: then may another eat what I have sown, and may my crops be uprooted.
9 ULB నేను హృదయంలో పరస్త్రీని మోహించినట్టయితే, నా పొరుగువాడి వాకిట్లో అతని భార్య కోసం నేను పొంచి ఉన్నట్టయితే, BSB BSB: If my heart has been enticed by my neighbor’s wife, or I have lurked at his door,
10 ULB నా భార్య వేరొకడి తిరుగలి విసరు గాక. ఇతరులు ఆమెను అనుభవిస్తారు గాక. BSB BSB: then may my own wife grind grain for another, and may other men sleep with her.
11 ULB అది భయంకరమైన నేరం. అది న్యాయాధిపతుల చేత శిక్షనొందదగిన నేరం. BSB BSB: For that would be a heinous crime, an iniquity to be judged.
12 ULB అది నాశనకూపం వరకూ దహించే అగ్నిహోత్రం. అది నా పంట కోత అంతటినీ నిర్మూలం చేస్తుంది. BSB BSB: For it is a fire that burns down to Abaddon; it would root out my entire harvest.
13 ULB నా సేవకుడైనా దాసి అయినా నాతో వ్యాజ్యెమాడి న్యాయం కోసం చేసిన విన్నపం నేను నిర్లక్ష్యం చేస్తే, BSB BSB: If I have rejected the cause of my manservant or maidservant when they made a complaint against me,
14 ULB దేవుడు లేచి నాపై తప్పు మోపినప్పుడు నేనేమి చేస్తాను? ఆయన విచారణకై వచ్చినప్పుడు నేను ఆయనకు ఏమి ప్రత్యుత్తరం ఇస్తాను? BSB BSB: what will I do when God rises to judge? How will I answer when called to account?
15 ULB గర్భంలో నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టించ లేదా? గర్భంలో నన్నూ వారినీ కూడా రూపొందించినవాడు ఒక్కడే గదా. BSB BSB: Did not He who made me in the womb also make them? Did not the same One form us in the womb?
16 ULB పేదలు కోరిన దాన్ని నేను బిగబట్టినట్టయితే, ఏడుపు మూలంగా వితంతువుల కళ్ళు క్షీణింపజేసినట్టయితే, BSB BSB: If I have denied the desires of the poor or allowed the widow’s eyes to fail,
17 ULB తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనా తిననియ్యక నేనొక్కడినే భోజనం చేస్తే, BSB BSB: if I have eaten my morsel alone, not sharing it with the fatherless—
18 ULB (నేను అలా చేయలేదు, నా యవ్వనప్రాయం మొదలు తండ్రి లేనివాడు నన్నొక తండ్రిగా భావించి నా దగ్గర పెరిగాడు. నా తల్లి కడుపున పుట్టింది మొదలు నేను అతని తల్లికి, ఆ వితంతువుకు దారి చూపించాను). BSB BSB: though from my youth I reared him as would a father, and from my mother’s womb I guided the widow—
19 ULB ఎవరైనా బట్టల్లేక చావడం నేను చూస్తే, పేదలకు వస్త్రం లేకపోవడం నేను చూస్తే, BSB BSB: if I have seen one perish for lack of clothing, or a needy man without a cloak,
20 ULB వారి హృదయాలు నన్ను దీవించక పోతే, వారు నా గొర్రెల బొచ్చు చేత వెచ్చదనం పొందక పోయినట్టయితే, BSB BSB: if his heart has not blessed me for warming him with the fleece of my sheep,
21 ULB ఊరి రచ్చబండ దగ్గర అంతా నన్ను సమర్థిస్తారులే అని తండ్రిలేని వారి పై నేను చెయ్యి ఎత్తితే, BSB BSB: if I have lifted up my hand against the fatherless because I saw that I had support in the gate,
22 ULB నా భుజం ఎముక దాని గూటి నుండి జారిపోతుంది గాక. నా చేతి ఎముక దాని కీలు దగ్గర విరిగిపోతుంది గాక. BSB BSB: then may my arm fall from my shoulder and be torn from its socket.
23 ULB దేవుడి నుండి ఆపద వస్తుందని నాకొక భయం ఉంది. ఆయన మహాత్మ్యం కారణంగా ఇలాంటివేమీ నేను చెయ్యలేదు. BSB BSB: For calamity from God terrifies me, and His splendor I cannot overpower.
24 ULB బంగారం నాకు ఆధారమనుకున్నట్టయితే, నా ఆశ్రయం నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పినట్టయితే, BSB BSB: If I have put my trust in gold or called pure gold my security,
25 ULB నాకు చాలా ఆస్తి ఉందని గానీ నా చేతికి విస్తారమైన సంపద దొరికిందని గానీ నేను సంతోషించినట్టయితే, BSB BSB: if I have rejoiced in my great wealth because my hand had gained so much,
26 ULB సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను దాన్ని గానీ, చంద్రుడు మెరిసిపోతూ ఉన్నప్పుడు దాన్ని గానీ చూసి, BSB BSB: if I have beheld the sun in its radiance or the moon moving in splendor,
27 ULB నా హృదయం నాలో మురిసిపోయి వాటివైపు చూసి పూజ్య భావంతో నా నోరు ముద్దు పెట్టినట్టయితే, BSB BSB: so that my heart was secretly enticed and my hand threw a kiss from my mouth,
28 ULB అది కూడా న్యాయాధిపతుల చేత శిక్ష పొందదగిన నేరమౌతుంది. ఎందుకంటే నేను పైనున్న దేవుణ్ణి కాదన్న వాడినౌతాను. BSB BSB: this would also be an iniquity to be judged, for I would have denied God on high.
29 ULB నన్ను ద్వేషించిన వాడికి కలిగిన నాశనాన్ని బట్టి నేను సంతోషించినట్టయితే, అతనికి కీడు కలగడం చూసి నన్ను నేను అభినందించుకున్నట్టయితే, BSB BSB: If I have rejoiced in my enemy’s ruin, or exulted when evil befell him—
30 ULB (పాపం చేయడానికి నేను నా నోటికి చోటియ్యలేదు. అతని ప్రాణం తీసే శాపం ఏదీ పలకలేదు). BSB BSB: I have not allowed my mouth to sin by asking for his life with a curse—
31 ULB <<యోబు పెట్టిన భోజనం తిని, తృప్తి పొందని వాణ్ణి ఎవరు చూపించగలరు?>> అని నా ఇంట్లో నివసించేవారు అనకపోతే, BSB BSB: if the men of my house have not said, ‘Who is there who has not had his fill?’—
32 ULB (పరదేశి ఎప్పుడూ ఆరుబయట ఉండే పరిస్థితి రాలేదు. బాటసారుల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి). BSB BSB: but no stranger had to lodge on the street, for my door has been open to the traveler—
33 ULB మానవ జాతి చేసినట్టు నా పాపాలను దాచి పెట్టుకోలేదు. నా అంగీలో దోషాన్ని కప్పి ఉంచుకోలేదు. BSB BSB: if I have covered my transgressions like Adam by hiding my guilt in my heart,
34 ULB జన సమూహానికి భయపడి, కుటుంబాల తిరస్కారానికి జడిసి నేను మౌనంగా ఉండి ద్వారం దాటి బయటికి వెళ్లకుండా దాక్కోలేదు. BSB BSB: because I greatly feared the crowds and the contempt of the clans terrified me, so that I kept silent and would not go outside—
35 ULB నా మాట వినడానికి నాకొకడు ఉంటే ఎంత బాగుంటుంది! ఇదిగో నా సంతకం. సర్వశక్తుడు నాకు జవాబిస్తాడు గాక. ఇదిగో నా ప్రతివాది రాసిన అభియోగం ఎవరైనా నాకు చూపిస్తే ఎంత బాగుంటుంది! BSB BSB: (Oh, that I had one to hear me! Here is my signature. Let the Almighty answer me; let my accuser compose an indictment.
36 ULB నిశ్చయంగా నేను నా భుజం మీద దాన్ని ధరిస్తాను. దాన్ని కిరీటంగా పెట్టుకుంటాను. BSB BSB: Surely I would carry it on my shoulder and wear it like a crown.
37 ULB నేను వేసిన అడుగుల లెక్క ఆయనకు తెలియజేస్తాను. రాజు లాగా నిబ్బరంగా నేనాయన దగ్గరికి వెళ్తాను. BSB BSB: I would give account of all my steps; I would approach Him like a prince.)—
38 ULB నా భూమి నా గురించి మొర పెడితే, దాని చాళ్లు ఏకమై ఏడిస్తే, BSB BSB: if my land cries out against me and its furrows weep together,
39 ULB వెల చెల్లించకుండా నేను దాని పంటను అనుభవించినట్టయితే, దాని యజమానులకు ప్రాణహాని కలగజేసినట్టయితే, BSB BSB: if I have devoured its produce without payment or broken the spirit of its tenants,
40 ULB గోదుమల బదులు ముళ్లు, బార్లీకి బదులు కలుపు మొలచు గాక. యోబు మాటలు ఇంతటితో సమాప్తం. BSB BSB: then let briers grow instead of wheat and stinkweed instead of barley.” Thus conclude the words of Job.
Select verses for actions: Enter goes to them and Escape comes back.