1 ULB యెహోవా మోషే అహరోనులతో మాట్లాడి ఇలా చెప్పాడు. BSB BSB: And the LORD said to Moses and Aaron,
2 ULB <<మీరు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి శరీరంలో ఎక్కడన్నా ఏదన్నా స్రావం జరుగుతుంటే ఆ స్రావం కారణంగా అతడు అశుద్ధుడు అవుతాడు. BSB BSB: “Say to the Israelites, ‘When any man has a bodily discharge, the discharge is unclean.
3 ULB అతని అశుద్ధతకు కారణం రోగ కారకమైన స్రావమే. అతని శరీరంలో ఆ స్రావాలు కారినా, నిలిచి పోయినా అది అశుద్ధమే. BSB BSB: This uncleanness is from his discharge, whether his body allows the discharge to flow or blocks it. So his discharge will bring about uncleanness.
4 ULB అతడు పడుకునే పడకా, కూర్చునే ప్రతిదీ అశుద్ధమే అవుతుంది. BSB BSB: Any bed on which the man with the discharge lies will be unclean, and any furniture on which he sits will be unclean.
5 ULB అతని పడకని తాకే ఎవడైనా తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడు గానే ఉంటాడు. BSB BSB: Anyone who touches his bed must wash his clothes and bathe with water, and he will be unclean until evening.
6 ULB శరీరంలో స్రావం అవుతున్న వాడు కూర్చున్న దానిపై ఎవరైనా కూర్చుంటే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. వాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. BSB BSB: Whoever sits on furniture on which the man with the discharge was sitting must wash his clothes and bathe with water, and he will be unclean until evening.
7 ULB రోగ కారకమైన స్రావం అవుతున్న వాణ్ణి తాకిన వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. BSB BSB: Whoever touches the body of the man with a discharge must wash his clothes and bathe with water, and he will be unclean until evening.
8 ULB అలాంటి స్రావం జరిగే వాడు ఎవరైనా శుద్ధుడి పైన ఉమ్మి వేస్తే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. BSB BSB: If the man with the discharge spits on one who is clean, that person must wash his clothes and bathe with water, and he will be unclean until evening.
9 ULB స్రావం జరిగేవాడు జీను పై కూర్చుంటే అదీ అశుద్ధం అవుతుంది. BSB BSB: Any saddle on which the man with the discharge rides will be unclean.
10 ULB అతడు కూర్చున్న ఏ వస్తువునైనా తాకితే, ఆ తాకినవాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఆ వస్తువులను మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. BSB BSB: Whoever touches anything that was under him will be unclean until evening, and whoever carries such things must wash his clothes and bathe with water, and he will be unclean until evening.
11 ULB స్రావం జరిగే వాడు నీళ్ళతో చేతులు కడుక్కోకుండా ఎవరినైనా తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. BSB BSB: If the man with the discharge touches anyone without first rinsing his hands with water, the one who was touched must wash his clothes and bathe with water, and he will be unclean until evening.
12 ULB స్రావం జరిగే వాడు తాకిన మట్టిపాత్రను పగలగొట్టాలి. అది చెక్క పాత్ర అయితే దాన్ని నీళ్ళతో కడగాలి. BSB BSB: Any clay pot that the man with the discharge touches must be broken, and any wooden utensil must be rinsed with water.
13 ULB స్రావం జరిగే వాడు స్రావం మానిన తరువాత శుద్ధుడు కావడానికి ఏడు రోజులు లెక్క పెట్టుకోవాలి. ఆ తరువాత తన బట్టలు ఉతుక్కోవాలి. పారే నీటిలో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడు అవుతాడు. BSB BSB: When the man has been cleansed from his discharge, he must count off seven days for his cleansing, wash his clothes, and bathe himself in fresh water, and he shall be clean.
14 ULB ఎనిమిదో రోజు అతడు రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి. BSB BSB: On the eighth day he is to take two turtledoves or two young pigeons, come before the LORD at the entrance to the Tent of Meeting, and give them to the priest.
15 ULB యాజకుడు వాటిలో ఒక దాన్ని పాపం కోసం బలిగా రెండోదాన్ని దహనబలిగా అర్పించాలి. స్రావం జరిగే వాడి విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి. BSB BSB: The priest is to sacrifice them, one as a sin offering and the other as a burnt offering. In this way the priest will make atonement for the man before the LORD because of his discharge.
16 ULB ఒక వ్యక్తికి అప్రయత్నంగా వీర్యస్కలనం జరిగితే అతడు నీళ్ళలో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. BSB BSB: When a man has an emission of semen, he must bathe his whole body with water, and he will be unclean until evening.
17 ULB అతని వీర్యం ఏదన్నా బట్టలపైనో, తోలు వస్తువు పైనో పడితే ఆ బట్టనీ, తోలునూ నీళ్ళతో ఉతకాలి. అవి సాయంత్రం వరకూ అశుద్ధమై ఉంటాయి. BSB BSB: Any clothing or leather on which there is an emission of semen must be washed with water, and it will remain unclean until evening.
18 ULB స్త్రీ పురుష సంపర్కంలో వీర్యస్కలనమైతే వాళ్ళిద్దరూ స్నానం చేయాలి. వాళ్ళు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు. BSB BSB: If a man lies with a woman and there is an emission of semen, both must bathe with water, and they will remain unclean until evening.
19 ULB ఒక స్త్రీ శరీరంలో బహిష్టు సమయంలో రక్తస్రావం జరిగితే ఆమె అశుద్ధత ఏడు రోజులుంటుంది. ఆ సమయంలో ఆమెని తాకిన వాళ్ళు ఆ రోజు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు. BSB BSB: When a woman has a discharge consisting of blood from her body, she will be unclean due to her menstruation for seven days, and anyone who touches her will be unclean until evening.
20 ULB ఆ సమయంలో ఆమె పండుకున్న ప్రతిదీ అశుద్ధంగా ఉంటుంది. ఆమె దేనిపైన కూర్చుంటుందో అది అశుద్ధంగా ఉంటుంది. BSB BSB: Anything on which she lies or sits during her menstruation will be unclean,
21 ULB ఆమె మంచాన్ని తాకిన ప్రతి వాడూ తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. BSB BSB: and anyone who touches her bed must wash his clothes and bathe with water, and he will be unclean until evening.
22 ULB ఆమె దేనిపైన కూర్చుంటుందో దాన్ని తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. BSB BSB: Whoever touches any furniture on which she was sitting must wash his clothes and bathe with water, and he will be unclean until evening.
23 ULB ఆమె మంచాన్నీ లేదా ఆమె కూర్చున్నదాన్నీ తాకితే ఆ వ్యక్తి సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. BSB BSB: And whether it is a bed or furniture on which she was sitting, whoever touches it will be unclean until evening.
24 ULB ఒక వ్యక్తి స్త్రీతో సంభోగించినప్పుడు ఆమె అశుచి అతనికి తగిలితే అతడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు. అతడు పండుకునే ప్రతి పడకా అశుద్ధమవుతుంది. BSB BSB: If a man lies with her and her menstrual flow touches him, he will be unclean for seven days, and any bed on which he lies will become unclean.
25 ULB ఒక స్త్రీకి తన బహిష్టు సమయంలో కాకుండా అనేకరోజులు రక్త స్రావం జరుగుతూ ఉన్నా, లేదా బహిష్టు సమయం దాటిన తరువాత కూడా స్రావం జరుగుతూనే ఉన్నా స్రావం జరిగినన్ని రోజులూ ఆమెకు బహిష్టు సమయం లానే ఉంటుంది. ఆమె అశుద్ధురాలుగానే ఉంటుంది. BSB BSB: When a woman has a discharge of her blood for many days at a time other than her menstrual period, or if it continues beyond her period, she will be unclean all the days of her unclean discharge, just as she is during the days of her menstruation.
26 ULB ఆమెకు స్రావం జరుగుతున్న రోజులన్నీ ఆమె పండుకునే మంచం ఆమె బహిష్టు సమయంలో పండుకునే మంచం లాగే ఉంటుంది. ఆమె దేని పైన కూర్చుంటుందో ఆమె బహిష్టు సమయంలో జరిగినట్టే అది అశుద్ధం అవుతుంది. BSB BSB: Any bed on which she lies or any furniture on which she sits during the days of her discharge will be unclean, like her bed during her menstrual period.
27 ULB వీటిని ముట్టుకునే వాడు అశుద్ధుడు. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. BSB BSB: Anyone who touches these things will be unclean; he must wash his clothes and bathe with water, and he will be unclean until evening.
28 ULB ఆమె స్రావం నిలిచిపోయి ఆమె శుద్ధురాలైతే దానికి ఏడు రోజులు పడుతుంది. ఆమె ఆ ఏడు రోజులను లెక్క పెట్టుకోవాలి. అవి గడచిన తరువాత ఆమె శుద్ధురాలు అవుతుంది. BSB BSB: When a woman is cleansed of her discharge, she must count off seven days, and after that she will be ceremonially clean.
29 ULB ఎనిమిదో రోజు ఆమె రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారంలో యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి. BSB BSB: On the eighth day she is to take two turtledoves or two young pigeons and bring them to the priest at the entrance to the Tent of Meeting.
30 ULB యాజకుడు వాటిలో ఒక దాన్ని పాపం కోసం బలిగా రెండోదాన్ని దహనబలిగా అర్పించాలి. ఆమెకు జరిగిన మలినకరమైన రక్త స్రావం విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి. BSB BSB: The priest is to sacrifice one as a sin offering and the other as a burnt offering. In this way the priest will make atonement for her before the LORD for her unclean discharge.
31 ULB నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నాను. తమ అశుద్ధతతో వాళ్ళు నా నివాస స్థలాన్ని పాడు చేయకూడదు. వాళ్ళు తమ అశుద్ధతతో నా నివాస స్థలాన్ని పాడు చేసి చనిపోకుండా మీరు వారి అశుద్ధతని వాళ్ళకి దూరం చేయాలి. BSB BSB: You must keep the children of Israel separate from their uncleanness, so that they do not die by defiling My tabernacle, which is among them.
32 ULB శరీరంలో స్రావం జరిగే వాణ్ణి గూర్చీ, వీర్యస్కలనమై అశుద్ధుడయ్యే వాణ్ణి గూర్చీ, BSB BSB: This is the law of him who has a discharge, of the man who has an emission of semen whereby he is unclean,
33 ULB బహిష్టుగా ఉన్న స్త్రీ గూర్చీ, స్రావం జరిగే స్త్రీ పురుషులను గూర్చీ, అశుద్ధంగా ఉన్న స్త్రీతో సంభోగించే వాణ్ని గూర్చీ విధించిన నిబంధనలు ఇవి.>> BSB BSB: of a woman in her menstrual period, of any male or female who has a discharge, and of a man who lies with an unclean woman.’”
Select verses for actions: Enter goes to them and Escape comes back.