1 ULB యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు. BSB BSB: Then the LORD said to Moses,
2 ULB <<దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా ప్రమిదల కోసం దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. BSB BSB: “Command the Israelites to bring you pure oil of pressed olives for the light, to keep the lamps burning continually.
3 ULB ప్రత్యక్ష గుడారంలో శాసనాల అడ్డతెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం దాకా అది వెలుగుతూ ఉండేలా యెహోవా సన్నిధిలో దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం. BSB BSB: Outside the veil of the Testimony in the Tent of Meeting, Aaron is to tend the lamps continually before the LORD from evening until morning. This is to be a permanent statute for the generations to come.
4 ULB అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రమిదలను యెహోవా సన్నిధిలో నిత్యం చూసుకోవాలి. BSB BSB: He shall tend the lamps on the pure gold lampstand before the LORD continually.
5 ULB నీవు గోదుమ పిండి తీసుకుని దానితో పన్నెండు రొట్టెలు చెయ్యాలి. ఒక్కొక్క రొట్టెకు రెండు కిలోల పిండి వాడాలి. BSB BSB: You are also to take fine flour and bake twelve loaves, using two-tenths of an ephah for each loaf,
6 ULB యెహోవా సన్నిధిలో నిర్మలమైన బల్లమీద ఆరేసి రొట్టెలున్న రెండు దొంతులుగా వాటిని ఉంచాలి. BSB BSB: and set them in two rows—six per row—on the table of pure gold before the LORD.
7 ULB ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. అది యెహోవా కోసం పరిమళ హోమం. BSB BSB: And you are to place pure frankincense near each row, so that it may serve as a memorial portion for the bread, a food offering to the LORD.
8 ULB యాజకుడు ప్రతి విశ్రాంతి దినాన నిత్య నిబంధన ప్రకారం ఇశ్రాయేలీయుల పక్షంగా ఆ రొట్టెలు బల్లపై పెడుతూ ఉండాలి. BSB BSB: Every Sabbath day the bread is to be set out before the LORD on behalf of the Israelites as a permanent covenant.
9 ULB ఈ అర్పణ అహరోనుకు అతని సంతానానికి. వారు పరిశుద్ధస్థలం లో దాన్ని తినాలి. నిత్య శాసనం చొప్పున యెహోవాకు చేసే హోమాల్లో అది అతి పవిత్రం.>> BSB BSB: It belongs to Aaron and his sons, who are to eat it in a holy place; for it is to him a most holy part of the food offerings to the LORD—his portion forever.”
10 ULB ఒక ఇశ్రాయేలు జాతి స్త్రీకి ఐగుప్తు పురుషుడికి పుట్టిన ఒకడు ఇశ్రాయేలీయులతో కలిసి వచ్చాడు. BSB BSB: Now the son of an Israelite mother and an Egyptian father went out among the Israelites, and a fight broke out in the camp between him and an Israelite.
11 ULB ఆ ఇశ్రాయేలీయురాలి కొడుక్కి ఒక ఇశ్రాయేలీయుడికి శిబిరంలో గొడవ జరిగింది. ఆ ఇశ్రాయేలీయురాలి కొడుకు యెహోవా నామాన్ని దూషించి శపించాడు. ప్రజలు మోషే దగ్గరికి వాణ్ణి తీసుకొచ్చారు. వాడి తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడు దిబ్రీ కూతురు. BSB BSB: The son of the Israelite woman blasphemed the Name with a curse. So they brought him to Moses. (His mother’s name was Shelomith daughter of Dibri, of the tribe of Dan.)
12 ULB యెహోవా ఏమి చెబుతాడో తెలిసేదాకా వాణ్ణి కావలిలో ఉంచారు. BSB BSB: They placed him in custody until the will of the LORD should be made clear to them.
13 ULB అప్పుడు యెహోవా మోషేకు ఇలా చెప్పాడు. BSB BSB: Then the LORD said to Moses,
14 ULB <<శపించిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకురా. వాడు పలికిన శాపనార్థాలు విన్న వారంతా వాని తల మీద చేతులుంచిన తరవాత ప్రజలంతా రాళ్లతో వాణ్ణి చావగొట్టాలి. BSB BSB: “Take the blasphemer outside the camp, and have all who heard him lay their hands on his head; then have the whole assembly stone him.
15 ULB నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. తన దేవుణ్ణి శపించేవాడు తన పాపశిక్షను భరించాలి. BSB BSB: And you are to tell the Israelites, ‘If anyone curses his God, he shall bear the consequences of his sin.
16 ULB యెహోవా నామాన్ని దూషించేవాడికి మరణశిక్ష విధించాలి. ప్రజలంతా రాళ్లతో అలాటి వాణ్ణి చావ గొట్టాలి. పరదేశిగాని స్వదేశిగాని యెహోవా నామాన్ని దూషిస్తే వాడికి మరణశిక్ష విధించాలి. BSB BSB: Whoever blasphemes the name of the LORD must surely be put to death; the whole assembly must surely stone him, whether he is a foreign resident or native; if he blasphemes the Name, he must be put to death.
17 ULB ఎవడైనా హత్య చేసినట్టయితే వాడికి మరణశిక్ష విధించాలి. BSB BSB: And if a man takes the life of anyone else, he must surely be put to death.
18 ULB జంతువు ప్రాణం తీసినవాడు ప్రాణానికి ప్రాణమిచ్చి దాని నష్టపరిహారం చెల్లించాలి. BSB BSB: Whoever kills an animal must make restitution—life for life.
19 ULB ఒకడు తన సాటి మనిషిని గాయపరిస్తే వాడు చేసినట్టే వాడికీ చెయ్యాలి. BSB BSB: If anyone injures his neighbor, whatever he has done must be done to him:
20 ULB ఎముక విరగ్గొడితే వాడి ఎముక విరగ్గొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకడు వేరొకడికి గాయం చేస్తే వాడికి అదే చెయ్యాలి. BSB BSB: fracture for fracture, eye for eye, tooth for tooth. Just as he injured the other person, the same must be inflicted on him.
21 ULB జంతువును చావగొట్టినవాడు దాని నష్టపరిహారం ఇచ్చుకోవాలి.హత్య చేసినవాడికి మరణశిక్ష విధించాలి. BSB BSB: Whoever kills an animal must make restitution, but whoever kills a man must be put to death.
22 ULB మీరు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. మీలో నివసించే పరదేశికి మీరు చేసినట్టే మీ స్వజాతివారికీ చెయ్యాలి. నేను మీ దేవుడినైన యెహోవానని వారితో చెప్పు>> అన్నాడు. BSB BSB: You are to have the same standard of law for the foreign resident and the native; for I am the LORD your God.’”
23 ULB కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో <<దేవుణ్ణి శాపనార్థాలు పెట్టిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకుపోయి రాళ్లతో చావగొట్టండి>> అని చెప్పాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేశారు. BSB BSB: Then Moses spoke to the Israelites, and they took the blasphemer outside the camp and stoned him. So the Israelites did as the LORD had commanded Moses.
Select verses for actions: Enter goes to them and Escape comes back.