1 ULB యెహోవా మరోసారి మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు. BSB BSB: Then the LORD said to Moses and Aaron:
2 ULB <<ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతి ఒక్కరూ సైన్యంలో తమ దళానికి చెందిన పతాకం చుట్టూ, తన గోత్రాన్ని సూచించే చిన్నజెండా చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి అభిముఖంగా వారి గుడారాలు ఉండాలి. BSB BSB: “The Israelites are to camp around the Tent of Meeting at a distance from it, each man under his standard, with the banners of his family.
3 ULB యూదా శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో యూదా పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. ఇవి సన్నిధి గుడారానికి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించే వైపున ఉండాలి. యూదా సైనిక దళానికి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను నాయకత్వం వహించాలి. BSB BSB: On the east side, toward the sunrise, the divisions of Judah are to camp under their standard: The leader of the Judahites is Nahshon son of Amminadab,
4 ULB యూదా దళంలో నమోదైన వారు 74,600 మంది పురుషులు. BSB BSB: and his division numbers 74,600.
5 ULB యూదా గోత్రం సమీపంలో ఇశ్శాఖారు గోత్రం వారు తమ శిబిరం ఏర్పాటు చేసుకోవాలి. సూయారు కొడుకు నెతనేలు ఇశ్శాఖారు గోత్రం వారి నాయకుడు. BSB BSB: The tribe of Issachar will camp next to it. The leader of the Issacharites is Nethanel son of Zuar,
6 ULB నెతనేలుతో ఉన్న సైన్యంలో 54,400 మంది పురుషులు నమోదయ్యారు. BSB BSB: and his division numbers 54,400.
7 ULB ఇశ్శాఖారు గోత్రం వారి తరువాత జెబూలూను గోత్రం వారుండాలి. హేలోను కొడుకు ఏలీయాబు జెబూలూను గోత్రం వారి నాయకుడు. BSB BSB: Next will be the tribe of Zebulun. The leader of the Zebulunites is Eliab son of Helon,
8 ULB అతని దళంలో నమోదైన వారు 57,400 మంది పురుషులు. BSB BSB: and his division numbers 57,400.
9 ULB యూదా వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1,86,400 మంది పురుషులు ఉన్నారు. వీరు మొదటగా శిబిరం నుండి కదిలి వెళ్ళాలి. BSB BSB: The total number of men in the divisions of the camp of Judah is 186,400; they shall set out first.
10 ULB దక్షిణ దిక్కున రూబేను దళం తమ పతాకం చుట్టూ గుడారాలు వేసుకోవాలి. షెదేయూరు కొడుకు ఏలీసూరు రూబేను సైనిక దళాలకు నాయకుడు. BSB BSB: On the south side, the divisions of Reuben are to camp under their standard: The leader of the Reubenites is Elizur son of Shedeur,
11 ULB అతని సైన్యంలో నమోదైన వారు 46,500 మంది పురుషులు. BSB BSB: and his division numbers 46,500.
12 ULB రూబేను గోత్రం వారి పక్కనే షిమ్యోను గోత్రం వారు తమ గుడారాలు వేసుకోవాలి. సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు షిమ్యోను గోత్రం వాళ్లకు నాయకుడు. BSB BSB: The tribe of Simeon will camp next to it. The leader of the Simeonites is Shelumiel son of Zurishaddai,
13 ULB అతని దళంలో నమోదైన వారు 59,300 మంది పురుషులు. BSB BSB: and his division numbers 59,300.
14 ULB తరువాత గాదు గోత్రం ఉండాలి. రగూయేలు కుమారుడు ఏలీయాసాపు గాదు గోత్రానికి నాయకత్వం వహించాలి. BSB BSB: Next will be the tribe of Gad. The leader of the Gadites is Eliasaph son of Deuel,
15 ULB అతని సైన్యంలో నమోదైన వారు 45,650 మంది పురుషులు. BSB BSB: and his division numbers 45,650.
16 ULB కాబట్టి రూబేను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1,51,450 మంది పురుషులు ఉన్నారు. వీళ్ళంతా రెండో వరుసలో ముందుకు నడవాలి. BSB BSB: The total number of men in the divisions of the camp of Reuben is 151,450; they shall set out second.
17 ULB సన్నిధి గుడారం శిబిరం నుండి మిగిలిన గోత్రాలన్నిటి మధ్యలో లేవీయులతో కలసి ముందుకు కదలాలి. వారు శిబిరంలోకి ఏ క్రమంలో వచ్చారో అదే క్రమంలో శిబిరం నుండి బయటకు వెళ్ళాలి. ప్రతి ఒక్కడూ తన స్థానంలో ఉండాలి. తన పతాకం దగ్గరే ఉండాలి. BSB BSB: In the middle of the camps, the Tent of Meeting is to travel with the camp of the Levites. They are to set out in the order they encamped, each in his own place under his standard.
18 ULB ఎఫ్రాయిము గోత్రం సన్నిధి గుడారానికి పడమటి వైపున ఉండాలి. అమీహూదు కొడుకు ఎలీషామా ఎఫ్రాయిము సైన్యాలకు నాయకత్వం వహించాలి. BSB BSB: On the west side, the divisions of Ephraim are to camp under their standard: The leader of the Ephraimites is Elishama son of Ammihud,
19 ULB ఎఫ్రాయిము సైన్యంగా నమోదైన వారు 40,500 మంది పురుషులు. BSB BSB: and his division numbers 40,500.
20 ULB మనష్షే గోత్రం వారు ఎఫ్రాయిము గోత్రం వారి పక్కనే ఉండాలి. పెదాసూరు కొడుకు గమలీయేలు మనష్షే సైన్యాలకు నాయకుడుగా ఉండాలి. BSB BSB: The tribe of Manasseh will be next to it. The leader of the Manassites is Gamaliel son of Pedahzur,
21 ULB అతని సైన్యంగా నమోదైన వారు 32,200 మంది పురుషులు. BSB BSB: and his division numbers 32,200.
22 ULB మనష్షే గోత్రం వాళ్లకు దగ్గర్లోనే బెన్యామీను గోత్రం వారుండాలి. గిద్యోనీ కొడుకు అబీదాను బెన్యామీను సైన్యాలకు నాయకుడుగా ఉండాలి. BSB BSB: Next will be the tribe of Benjamin. The leader of the Benjamites is Abidan son of Gideoni,
23 ULB అతని సైన్యంగా నమోదైన వారు 35,400 మంది పురుషులు. BSB BSB: and his division numbers 35,400.
24 ULB కాబట్టి ఎఫ్రాయిము గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారి మొత్తం లెక్కిస్తే 1,08,100 మంది పురుషులు ఉన్నారు. వారింతా మూడో వరుసలో శిబిరం నుండి కదలాలి. BSB BSB: The total number of men in the divisions of the camp of Ephraim is 108,100; they shall set out third.
25 ULB దాను శిబిరానికి చెందిన వారు తమ సైనిక దళంతో దాను పతాకం చుట్టూ తమ గుడారాలు వేసుకోవాలి. సన్నిధి గుడారానికి ఉత్తరం వైపున తమ గుడారాలు వేసుకోవాలి. అమీషదాయి కొడుకు అహీయెజెరు దాను గోత్రానికి నాయకత్వం వహించాలి. BSB BSB: On the north side, the divisions of Dan are to camp under their standard: The leader of the Danites is Ahiezer son of Ammishaddai,
26 ULB దాను గోత్రానికి చెందిన సైన్యంగా నమోదైన వారు 62,700 మంది పురుషులు. BSB BSB: and his division numbers 62,700.
27 ULB అతనికి దగ్గరలోనే ఆషేరు గోత్రం వారు ఉండాలి. ఒక్రాను కొడుకు పగీయేలు ఆషేరు సైన్యానికి నాయకుడుగా ఉండాలి. BSB BSB: The tribe of Asher will camp next to it. The leader of the Asherites is Pagiel son of Ocran,
28 ULB అతని సైన్యంగా 41,500 మంది పురుషులు నమోదయ్యారు. BSB BSB: and his division numbers 41,500.
29 ULB ఆషేరు గోత్రం వాళ్లకు దగ్గరలోనే నఫ్తాలి గోత్రం వారుండాలి. ఏనాను కొడుకు అహీర నఫ్తాలి గోత్రం వాళ్లకు నాయకుడిగా ఉండాలి. BSB BSB: Next will be the tribe of Naphtali. The leader of the Naphtalites is Ahira son of Enan,
30 ULB నఫ్తాలి గోత్రం వారి సైన్యంగా నమోదైన వారు 53,400 మంది పురుషులు. BSB BSB: and his division numbers 53,400.
31 ULB కాబట్టి దాను గోత్రం వారితో కలసి శిబిరం ఏర్పాటు చేసుకున్న వారు మొత్తం లెక్కిస్తే 1,57,600 మంది పురుషులు ఉన్నారు. వీరు తమ ధ్వజాల ప్రకారం చివరి బృందంగా నడవాలి.>> BSB BSB: The total number of men in the camp of Dan is 157,600; they shall set out last, under their standards.”
32 ULB ఇశ్రాయేలు ప్రజల్లో తమ తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం మోషే, అహరోనులు వీళ్ళను లెక్కించారు. వీరు మొత్తం 6,03,550 మంది పురుషులు. BSB BSB: These are the Israelites, numbered according to their families. The total of those counted in the camps, by their divisions, was 603,550.
33 ULB అయితే యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన ప్రకారం లేవీయుల సంఖ్య లెక్కపెట్టలేదు. BSB BSB: But the Levites were not counted among the other Israelites, as the LORD had commanded Moses.
34 ULB ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మోషేకి యెహోవా ఆజ్ఞాపించినదంతా చేసారు. వారు తమ తమ ధ్వజాల దగ్గర గుడారాలు వేసుకున్నారు. శిబిరం నుండి బయటకు వెళ్ళినప్పుడు తమ పూర్వీకుల కుటుంబాల క్రమంలో వెళ్ళారు. BSB BSB: So the Israelites did everything the LORD commanded Moses; they camped under their standards in this way and set out in the same way, each man with his clan and his family.
Select verses for actions: Enter goes to them and Escape comes back.