1 ULB కుమారా, నా మాటలు నీ మనసులో ఉంచుకో. నా ఆజ్ఞలు నీ దగ్గర పదిలంగా దాచుకో. BSB BSB: My son, keep my words and treasure my commandments within you.
2 ULB నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుని నీ కంటిపాపలాగా నా ఉపదేశాన్ని కాపాడుకుంటే నీకు జీవం కలుగుతుంది. BSB BSB: Keep my commandments and live; guard my teachings as the apple of your eye.
3 ULB నీ చేతి వేళ్లకు వాటిని కట్టుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసి ఉంచుకో. BSB BSB: Tie them to your fingers; write them on the tablet of your heart.
4 ULB జ్ఞానంతో <<నీవు నా సోదరివి>>అని చెప్పు. వివేకాన్ని నీ బంధువుగా భావించు. BSB BSB: Say to wisdom, “You are my sister,” and call understanding your kinsman,
5 ULB అలా చేస్తే నువ్వు వ్యభిచారి దగ్గరికి వెళ్ళకుండా, సరసాలాడే స్త్రీ వలలో పడకుండా నిన్ను నీవు కాపాడుకుంటావు. BSB BSB: that they may keep you from the adulteress, from the stranger with seductive words.
6 ULB నా యింటి కిటికీలో నుండి, కిటికీ పరదా నుండి నేను చూశాను. BSB BSB: For at the window of my house I looked through the lattice.
7 ULB జ్ఞానం లేని యువకుల మధ్య ఒక తెలివి తక్కువ యువకుడు నాకు కనబడ్డాడు. BSB BSB: I saw among the simple, I noticed among the youths, a young man lacking judgment,
8 ULB సాయంత్ర సమయం ముగిసి చిమ్మచీకటి కమ్ముతున్న రాత్రివేళ అతడు వ్యభిచారి ఉండే వీధిలో ప్రవేశించాడు. BSB BSB: crossing the street near her corner, strolling down the road to her house,
9 ULB ఆ వీధిలో తిరుగుతూ అది ఉండే యింటి దారి పట్టాడు. BSB BSB: at twilight, as the day was fading into the dark of the night.
10 ULB అప్పుడు వేశ్య వేషం ధరించిన ఒక కుటిల బుద్ధిగల స్త్రీ అతనికి ఎదురు వచ్చింది. BSB BSB: Then a woman came out to meet him, with the attire of a harlot and cunning of heart.
11 ULB ఆమె తిరుగుబోతు. అదుపు లేకుండా తిరుగుతూ ఉండేది. ఆమె కాళ్ళు ఇంట్లో నిలవవు. BSB BSB: She is loud and defiant; her feet do not remain at home.
12 ULB ఆమె ఒక్కోసారి తన ఇంటి ఎదుట, ఒక్కోసారి పట్టణ వీధుల్లో ఉంటుంది. ప్రతి సందులోనూ ఆమె కాపు కాసి ఉంటుంది. BSB BSB: Now in the street, now in the squares, she lurks at every corner.
13 ULB ఆమె ఆ యువకుణ్ణి పట్టుకుని ముద్దు పెట్టుకుంది. సిగ్గు, బిడియం లేని ముఖంతో అతనితో ఇలా చెప్పింది, BSB BSB: She seizes him and kisses him; she brazenly says to him:
14 ULB <<నేను శాంతి బలులు చెల్లించవలసి ఉంది. ఇప్పుడే నా మొక్కుబడులు చెల్లించాను. BSB BSB: “I have made my peace offerings; today I have paid my vows.
15 ULB నిన్ను కలుసుకోవాలని, నీకు ఎదురు రావాలని బయలుదేరాను. నువ్వే నాకు కనబడ్డావు. BSB BSB: So I came out to meet you; I sought you, and I have found you.
16 ULB నా మంచంపై రత్న కంబళ్ళు పరిచాను. ఐగుప్తు నుండి తెప్పించిన నైపుణ్యంగా అల్లిన నార దుప్పట్లు వేశాను. BSB BSB: I have decked my bed with coverings, with colored linen from Egypt.
17 ULB నా పరుపు మీద బోళం, అత్తరు, దాల్చిన చెక్క చల్లాను. BSB BSB: I have perfumed my bed with myrrh, with aloes, and with cinnamon.
18 ULB బయలు దేరు, ఇద్దరం మోహంతో కోరిక తీర్చుకుందాం. తెల్లవారే దాకా తనివితీరా తృప్తి పొందుదాం. BSB BSB: Come, let us take our fill of love till morning. Let us delight in loving caresses!
19 ULB నా భర్త ఇంట్లో లేడు. ప్రయాణం చేసి చాలా దూరం వెళ్ళాడు. BSB BSB: For my husband is not at home; he has gone on a long journey.
20 ULB అతడు డబ్బు సంచి తనతో తీసుకు వెళ్ళాడు. పున్నమి రోజు వరకూ ఇంటికి తిరిగి రాడు.>> BSB BSB: He took with him a bag of money and will not return till the moon is full.”
21 ULB ఆ విధంగా ఆమె తన మృదువైన మాటలు పదే పదే చెబుతూ, లాలిస్తూ అతణ్ణి లోబరచుకుంది. పొగడ్తలతో ముంచెత్తుతూ అతణ్ణి ఈడ్చుకు పోయింది. BSB BSB: With her great persuasion she entices him; with her flattering lips she lures him.
22 ULB వెంటనే అతడు ఆమె వెంట వెళ్ళాడు. పశువు వధకై వెళ్లినట్టు, పరాయివాళ్ళ చేతికి చిక్కి చెరసాల పాలైనట్టు అతడు వెళ్ళాడు. BSB BSB: He follows her on impulse, like an ox going to the slaughter, like a deer bounding into a trap,
23 ULB పక్షి తనకు ప్రాణాపాయం ఉన్నదని తెలియక ఉచ్చులో పడినట్టు, అతని గుండెను చీల్చే బాణం దూసుకుపోయేంత వరకూ అతడు ఆమె వెంటబడి వెళ్ళాడు. BSB BSB: until an arrow pierces his liver, like a bird darting into a snare—not knowing it will cost him his life.
24 ULB నా కుమారులారా, నా మాటలు వినండి. నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి. BSB BSB: Now, my sons, listen to me, and attend to the words of my mouth.
25 ULB నీ మనస్సు వ్యభిచారి నడిచే మార్గాల వైపు మళ్ళనియ్యకు. దారి తప్పి ఆమె నడిచే దారిలోకి పోకు. BSB BSB: Do not let your heart turn aside to her ways; do not stray into her paths.
26 ULB ఆమె అనేకులను లోబరచుకుని గాయపరచింది. లెక్కలేనంతమంది ఆమె బారిన పడి నాశనమయ్యారు. BSB BSB: For she has brought many down to death; her slain are many in number.
27 ULB ఆమె ఇల్లు పాతాళానికి నడిపించే దారి. ఆ దారి మరణానికి నడిపిస్తుంది. BSB BSB: Her house is the road to Sheol, descending to the chambers of death.
Select verses for actions: Enter goes to them and Escape comes back.