1 ULB యెహోవా, నువ్వెందుకు దూరంగా నిలిచి ఉంటావు? ఆపద సమయాల్లో నువ్వెందుకు దాగి ఉంటావు? BSB BSB: Why, O LORD, do You stand far off? Why do You hide in times of trouble?
2 ULB తమ అహంకారాన్నిబట్టి దుర్మార్గులు పీడిత ప్రజలను తరుముతున్నారు. కానీ వారు పన్నిన మోసపు ఎత్తుగడల్లో వారే చిక్కుకునేలా చెయ్యి. BSB BSB: In pride the wicked pursue the needy; let them be caught in the schemes they devise.
3 ULB దుర్మార్గుడు తమ హృదయవాంఛను బట్టి గర్విస్తాడు. అత్యాశాపరులకు అనుగ్రహం చూపించి, యెహోవాను అవమానిస్తాడు. BSB BSB: For the wicked man boasts in the cravings of his heart; he blesses the greedy and reviles the LORD.
4 ULB దుర్మార్గుడు బహు గర్విష్టి అయిన కారణంగా అతడు యెహోవాను వెదకడు. అతడు దేవుణ్ణి పట్టించుకోడు గనక దేవుని గురించి ఆలోచించడు. BSB BSB: In his pride the wicked man does not seek Him; in all his schemes there is no God.
5 ULB అన్నివేళలా అతడు ఆందోళన లేనివాడుగా ఉంటాడు. కాని, నీ న్యాయవిధులు అతనికి అందనంత ఎత్తులో ఉన్నాయి. అతడు తన శత్రువులందరినీ చూసి మండిపడతాడు. BSB BSB: He is secure in his ways at all times; Your lofty judgments are far from him; he sneers at all his foes.
6 ULB నేను ఎన్నడూ ఓడిపోను, తరతరాల వరకూ విరోధాన్ని చూడను, అని అతడు తన మనసులో అనుకుంటాడు. BSB BSB: He says to himself, “I will not be moved; from age to age I am free of distress.”
7 ULB అతని నోరు శాపంతో, కపటంతో, హానికరమైన మాటలతో నిండి ఉంది. అతని నాలుక గాయపరిచి నాశనం చేస్తుంది. BSB BSB: His mouth is full of cursing, deceit, and violence; trouble and malice are under his tongue.
8 ULB గ్రామాల దగ్గర అతడు పొంచి ఉంటాడు, రహస్య ప్రదేశాల్లో నిరపరాధులను హత్య చేస్తాడు. నిస్సహాయులైన బాధితుల కోసం అతడి కళ్ళు వెతుకుతాయి. BSB BSB: He lies in wait near the villages; in ambush he slays the innocent; his eyes watch in stealth for the helpless.
9 ULB గుబురుగా ఉన్న పొదలోని సింహం లాగా అతడు దాగి ఉంటాడు. పీడితులను పట్టుకోవడానికి పొంచి ఉంటాడు. తన వలను లాగి పీడితులను పట్టుకుంటాడు. BSB BSB: He lies in wait like a lion in a thicket; he lurks to seize the oppressed; he catches the lowly in his net.
10 ULB అతని బాధితులు నలిగిపోయి దెబ్బలు తింటారు. వాళ్ళు అతని బలమైన వలల్లో పడిపోతారు. BSB BSB: They are crushed and beaten down; the helpless fall prey to his strength.
11 ULB దేవుడు మరచిపోయాడు, ఆయన తన ముఖం కప్పుకున్నాడు, ఆయనకు చూసే ఉద్దేశం లేదు, అని తన హృదయంలో అనుకుంటాడు. BSB BSB: He says to himself, “God has forgotten; He hides His face and never sees.”
12 ULB యెహోవా లేచి రా. దేవా, నీ చెయ్యెత్తి తీర్పు తీర్చు. పీడితులను మరిచిపోవద్దు. BSB BSB: Arise, O LORD! Lift up Your hand, O God! Do not forget the helpless.
13 ULB నువ్వు నన్ను బాధ్యుణ్ణి చెయ్యవు అని దేవుణ్ణి తృణీకరిస్తూ దుర్మార్గుడు తన హృదయంలో ఎందుకు అనుకుంటున్నాడు? BSB BSB: Why has the wicked man renounced God? He says to himself, “You will never call me to account.”
14 ULB నువ్వు దీన్ని గమనించావు. ఎందుకంటే కష్టం, దుఖం కలిగించే వాళ్ళను నువ్వు ఎప్పుడూ గమనిస్తూ ఉంటావు. నిస్సహాయుడు తనను తాను నీకు అప్పగించుకుంటాడు. తండ్రిలేని వాళ్ళను నువ్వు కాపాడతావు. BSB BSB: But You have regarded trouble and grief; You see to repay it by Your hand. The victim entrusts himself to You; You are the helper of the fatherless.
15 ULB దుష్టల, దురాత్ముల చెయ్యి విరగగొట్టు. నువ్వు ఎప్పటికీ కనుక్కోలేవనుకుని అతడు చేస్తూ వచ్చిన చెడుపనులకు అతన్నే బాధ్యుణ్ణి చెయ్యి. BSB BSB: Break the arm of the wicked and evildoer; call him to account for his wickedness until none is left to be found.
16 ULB ఎన్నటెన్నటికీ యెహోవాయే రాజు. ఆయన తన భూభాగం నుంచి అన్యజాతులను పారదోలుతాడు. BSB BSB: The LORD is King forever and ever; the nations perish from His land.
17 ULB యెహోవా, పీడితుల అవసరతలు నువ్వు విన్నావు. నువ్వు వాళ్ళ హృదయాన్ని బలపరుస్తావు. వాళ్ళ ప్రార్థన వింటావు. BSB BSB: You have heard, O LORD, the desire of the humble; You will strengthen their hearts. You will incline Your ear,
18 ULB ఏ మనిషీ మళ్ళీ ఎన్నడూ భయభ్రాంతులు కలగజేయకుండా ఉండేలా తండ్రి లేని వాళ్ళను, పీడితులను నువ్వు రక్షిస్తావు. BSB BSB: to vindicate the fatherless and oppressed, that the men of the earth may strike terror no more.
Select verses for actions: Enter goes to them and Escape comes back.