1 ULB యెహోవా, దుష్టుల బారి నుండి నన్ను విడిపించు. దుర్మార్గుల చేతుల్లో పడకుండా నన్ను కాపాడు. BSB BSB: For the choirmaster. A Psalm of David. Rescue me, O LORD, from evil men. Protect me from men of violence,
2 ULB వాళ్ళు తమ హృదయాల్లో ప్రమాదకరమైన తలంపులు పెట్టుకుంటారు. అన్నివేళలా కలహాలు పుట్టించాలని ఎదురు చూస్తుంటారు. BSB BSB: who devise evil in their hearts and stir up war all day long.
3 ULB వాళ్ళు పాము నాలుకలాగా తమ నాలుకలు పదును చేసుకుంటారు. వారి పెదాల కింద పాము విషం ఉంచుకుంటారు. సెలా. BSB BSB: They sharpen their tongues like snakes; the venom of vipers is on their lips. Selah
4 ULB యెహోవా, దుర్మార్గుల బారిన పడకుండా నన్ను కాపాడు. దౌర్జన్యపరుల చేతిలోనుండి నన్ను రక్షించు. నన్ను పడగొట్టడానికి వాళ్ళు పథకాలు వేస్తున్నారు. BSB BSB: Guard me, O LORD, from the hands of the wicked. Keep me safe from men of violence who scheme to make me stumble.
5 ULB గర్వాంధులు నాకోసం బోను పెట్టారు. వాళ్ళు దారి పక్కన వల పరిచారు. నన్ను బంధించడానికి ఉచ్చులు పన్నారు. సెలా. BSB BSB: The proud hide a snare for me; the cords of their net are spread along the path, and lures are set out for me. Selah
6 ULB అయితే నేను యెహోవాతో ఇలా మనవి చేసుకుంటున్నాను, యెహోవా, నా దేవుడివి నువ్వే. నా విన్నపాలు ఆలకించు. BSB BSB: I say to the LORD, “You are my God.” Hear, O LORD, my cry for help.
7 ULB యెహోవా ప్రభూ, నువ్వే నాకు ఆశ్రయమిచ్చే కోట. యుద్ధ సమయంలో నా తలకు కాపు కాసే వాడివి నువ్వే. BSB BSB: O GOD the Lord, the strength of my salvation, You shield my head in the day of battle.
8 ULB యెహోవా, భక్తిహీనుల కోరికలను నేరవేర్చకు. వాళ్ళు మిడిసిపడకుండేలా వాళ్ళ పథకాలు భగ్నం చెయ్యి. సెలా. BSB BSB: Grant not, O LORD, the desires of the wicked; do not promote their evil plans, lest they be exalted. Selah
9 ULB నా చుట్టూ మూగిన వాళ్ళ తల మీదికి వాళ్ళ మాటల ద్వారా కీడు కలుగు గాక. BSB BSB: May the heads of those who surround me be covered in the trouble their lips have caused.
10 ULB కణకణలాడే నిప్పులు వాళ్ళపై కురియాలి. వాళ్ళను అగ్నిగుండంలో పడవెయ్యి. ఎన్నటికీ లేవకుండా అగాధంలో పడవెయ్యి. BSB BSB: May burning coals fall on them; may they be thrown into the fire, into the miry pits, never to rise again.
11 ULB దూషకులకు భూమి మీద భద్రత లేకుండా పోవాలి. దుర్మార్గులను ఆపదలు వెంటాడి పడగొట్టాలి. BSB BSB: May no slanderer be established in the land; may calamity hunt down the man of violence.
12 ULB బాధితుల తరపున యెహోవా వాదిస్తాడనీ. ఆయన దరిద్రులకు న్యాయం చేకూరుస్తాడని నాకు తెలుసు. BSB BSB: I know that the LORD upholds justice for the poor and defends the cause of the needy.
13 ULB నీతిపరులు నీ నామానికి కచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవర్తనులు నీ సన్నిధిలో నివసిస్తారు. BSB BSB: Surely the righteous will praise Your name; the upright will dwell in Your presence.
Select verses for actions: Enter goes to them and Escape comes back.