1 ULB యెహోవా, నీ ఆశ్రయం కోరి వచ్చాను. నన్ను ఎన్నటికీ అవమానం పొందనీయకు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు. BSB BSB: For the choirmaster. A Psalm of David. In You, O LORD, I have taken refuge; let me never be put to shame; save me by Your righteousness.
2 ULB నా మాటలు ఆలకించి నన్ను త్వరగా విడిపించు. నన్ను రక్షించే బలమైన దుర్గంగా, ప్రాకారం గల కోటగా ఉండు. BSB BSB: Incline Your ear to me; come quickly to my rescue. Be my rock of refuge, the stronghold of my deliverance.
3 ULB నా కొండ, నా కోట నువ్వే. నీ నామాన్ని బట్టి నాకు దారి చూపి నడిపించు. BSB BSB: For You are my rock and my fortress; lead me and guide me for the sake of Your name.
4 ULB నన్ను పట్టుకోడానికి శత్రువులు రహస్యంగా పన్నిన వల నుండి నన్ను తప్పించు. నా ఆశ్రయదుర్గం నీవే. BSB BSB: You free me from the net laid out for me, for You are my refuge.
5 ULB నా ఆత్మను నీ చేతికప్పగిస్తున్నాను. యెహోవా, నమ్మదగిన దేవా, నువ్వు నన్ను విమోచిస్తావు. BSB BSB: Into Your hands I commit my spirit; You have redeemed me, O LORD, God of truth.
6 ULB నేను యెహోవాను నమ్ముకున్నాను. పనికిమాలిన విగ్రహాలను పూజించేవారు నాకు అసహ్యం. BSB BSB: I hate those who cling to worthless idols, but in the LORD I trust.
7 ULB నీ నిబంధన నమ్మకత్వాన్ని బట్టి నేను సంతోషించి ఆనందభరితుడినౌతాను. ఎందుకంటే నువ్వు నా బాధను గమనించావు. నా ప్రాణం పడే వేదనను కనిపెట్టావు. BSB BSB: I will be glad and rejoice in Your loving devotion, for You have seen my affliction; You have known the anguish of my soul.
8 ULB నన్ను నా శత్రువులకు అప్పగించకుండా, విశాలమైన స్థలంలో నా పాదాలు నిలబెట్టావు. BSB BSB: You have not delivered me to the enemy; You have set my feet in the open.
9 ULB యెహోవా, నన్ను కనికరించు. నేను ఇరుకులో పడిపోయాను. దుఃఖంతో నా కళ్ళు క్షీణిస్తున్నాయి. నా ప్రాణం, దేహం క్షీణిస్తున్నాయి. BSB BSB: Be merciful to me, O LORD, for I am in distress; my eyes fail from sorrow, my soul and body as well.
10 ULB నా బ్రతుకు దుఃఖంతో వెళ్లబుచ్చుతున్నాను. నా ఆయుష్షు అంతా నిట్టూర్పులతో గతించిపోతున్నది. నా పాపం వలన నా బలం తగ్గిపోతున్నది. నా ఎముకలు క్షీణించిపోతున్నాయి. BSB BSB: For my life is consumed with grief and my years with groaning; my iniquity has drained my strength, and my bones are wasting away.
11 ULB నా శత్రువులంతా నన్ను హేళన చేస్తున్నారు. నా పొరుగువారు నన్ను చూసి నివ్వెరబోతున్నారు. నా స్నేహితులు భయపడుతున్నారు. వీధిలో నన్ను చూసేవారు నా దగ్గర నుండి పారిపోతున్నారు. BSB BSB: Among all my enemies I am a disgrace, and among my neighbors even more. I am dreaded by my friends—they flee when they see me on the street.
12 ULB చనిపోయి ఎవరూ జ్ఞాపకం చేసుకోని వ్యక్తిలాగా అందరూ నన్ను మర్చిపోయారు. నేను ఓటికుండలాగా తయారయ్యాను. BSB BSB: I am forgotten like a dead man, out of mind. I am like a broken vessel.
13 ULB చాలా మంది నా మీద కుట్ర పన్నుతున్నారు. నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. వారు గుసగుసలాడడం నాకు వినబడుతూ ఉంది. ఎటు చూసినా నాకు భయమే. BSB BSB: For I hear the slander of many; there is terror on every side. They conspire against me and plot to take my life.
14 ULB అయితే, యెహోవా, నేను నీలో నమ్మకం పెట్టుకున్నాను. నువ్వే నా దేవుడివి అనుకుంటున్నాను. BSB BSB: But I trust in You, O LORD; I say, “You are my God.”
15 ULB నా భవిష్యత్తు అంతా నీ చేతిలో ఉంది. నా శత్రువుల చేతి నుండీ నా వెంటబడి తరుముతున్న వారినుండీ నన్ను రక్షించు. BSB BSB: My times are in Your hands; deliver me from my enemies and from those who pursue me.
16 ULB నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రసరింపనీ. నీ కృపతో నన్ను రక్షించు. BSB BSB: Make Your face shine on Your servant; save me by Your loving devotion.
17 ULB యెహోవా, నీకు మొరపెడుతున్నాను, నాకు అవమానం కలగనీయకు. భక్తిహీనులనే అవమానం పొందనీ. వారు పాతాళంలో పడి మౌనంగా ఉండి పోనీ. BSB BSB: O LORD, let me not be ashamed, for I have called on You. Let the wicked be put to shame; let them lie silent in Sheol.
18 ULB అబద్ధాలాడే పెదాలు మూతబడి పోనీ. వారు గర్వంతో నీతిమంతులను చిన్నచూపు చూస్తూ వారిపై కఠినంగా మాట్లాడతారు. BSB BSB: May lying lips be silenced—lips that speak with arrogance against the righteous, full of pride and contempt.
19 ULB నీలో భయభక్తులు గలవారి కోసం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది! మనుషులు చూస్తుండగా నీ ఆశ్రయం కోరేవారి కోసం నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. BSB BSB: How great is Your goodness which You have laid up for those who fear You, which You have bestowed before the sons of men on those who take refuge in You!
20 ULB మనుషులు పన్నే కుట్రలకు బలి కాకుండా వారికి నీ సన్నిధిలో ఆశ్రయం కలిగించావు. మాటల దాడినుండి వారిని తప్పించి నీ గుడారంలో దాచిపెట్టావు. BSB BSB: You hide them in the secret place of Your presence from the schemes of men. You conceal them in Your shelter from accusing tongues.
21 ULB ముట్టడికి గురైన పట్టణంలో నేనుండగా యెహోవా తన నిబంధన నమ్మకత్వాన్ని నాకు చూపించాడు. ఆయనకు స్తుతి కలుగు గాక. BSB BSB: Blessed be the LORD, for He has shown me His loving devotion in a city under siege.
22 ULB నేను భయపడి, నీ దృష్టిలో ఇక నాశనమై పోయాను అనుకున్నాను. కానీ నేను మొరపెట్టినప్పుడు నువ్వు నా విజ్ఞాపన ఆలకించావు. BSB BSB: In my alarm I said, “I am cut off from Your sight!” But You heard my plea for mercy when I called to You for help.
23 ULB యెహోవా భక్తులంతా ఆయన్ని ప్రేమించండి. యెహోవా తనను నమ్మిన వారిని కాపాడతాడు. కానీ గర్విష్టుల విషయంలో ఆయన సంపూర్ణమైన ప్రతీకారం జరిగిస్తాడు. BSB BSB: Love the LORD, all His saints. The LORD preserves the faithful, but fully repays the arrogant.
24 ULB యెహోవా కోసం కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ ధైర్యంగా నిబ్బరంగా ఉండండి. BSB BSB: Be strong and courageous, all you who hope in the LORD.
Select verses for actions: Enter goes to them and Escape comes back.