1 ULB మన దేవుని పట్టణంలో తన పరిశుద్ధ పర్వతంపై యెహోవా గొప్పవాడు. అత్యధికంగా ఆయన్ని స్తుతించాలి. BSB BSB: A song. A Psalm of the sons of Korah. Great is the LORD, and greatly to be praised in the city of our God, His holy mountain.
2 ULB అది మన దేవుని మహా పట్టణం. ఉత్తరం వైపున ఉన్న సీయోను పర్వతం. దాని ఉచ్ఛ దశ ఎంతో సుందరంగా ఉంది. అది భూమి అంతటికీ ఆనందదాయకంగా ఉంది. BSB BSB: Beautiful in loftiness, the joy of all the earth, like the peaks of Zaphon is Mount Zion, the city of the great King.
3 ULB దాని భవనాలలో దేవుడు తనను ఆశ్రయంగా తెలియజేసుకుంటున్నాడు. BSB BSB: God is in her citadels; He has shown Himself to be a fortress.
4 ULB చూడండి, రాజులు సమకూడారు. వాళ్ళంతా కలసి వచ్చారు. BSB BSB: For behold, the kings assembled; they all advanced together.
5 ULB వాళ్ళు దాన్ని చూశారు. ఆశ్చర్యపోయారు. తర్వాత వ్యాకులపడ్డారు. గబగబా అక్కణ్ణించి వెళ్ళిపోయారు. BSB BSB: They saw and were astounded; they fled in terror.
6 ULB వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళలో వణుకు పుట్టింది. ప్రసవించబోయే స్త్రీకి కలిగే నొప్పుల్లాటి వేదన వాళ్లకు కలిగింది. BSB BSB: Trembling seized them there, anguish like a woman in labor.
7 ULB తూర్పుగాలిని నువ్వు రేపి దానితో తర్షీషు ఓడలను పగలగొడుతున్నావు. BSB BSB: With a wind from the east You wrecked the ships of Tarshish.
8 ULB సేనల ప్రభువైన యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో మనం ఏదైతే విన్నామో దానినే చూశాం. దేవుడు దాన్ని కలకాలం ఉండేలా స్థిరం చేశాడు. BSB BSB: As we have heard, so we have seen in the city of the LORD of Hosts, in the city of our God: God will establish her forever. Selah
9 ULB దేవా, నీ మందిరంలో మేము నీ నిబంధన కృపను ధ్యానం చేశాం. BSB BSB: Within Your temple, O God, we contemplate Your loving devotion.
10 ULB దేవా, నీ నామం గొప్పదైనట్టు నీ కీర్తి కూడా భూమి అంచులవరకూ గొప్పగా ఉంది. నీతి న్యాయాలతో నీ కుడిచెయ్యి నిండి ఉంది. BSB BSB: Your name, O God, like Your praise, reaches to the ends of the earth; Your right hand is full of righteousness.
11 ULB న్యాయమైన నీ శాసనాలను బట్టి సీయోను పర్వతం సంతోషించనీ. యూదా కుమార్తెలను ఆనందించనీ. BSB BSB: Mount Zion is glad, the daughters of Judah rejoice, on account of Your judgments.
12 ULB సీయోను పర్వతం చుట్టూ తిరుగు. దాని చుట్టూ తిరుగుతూ ఆమె గోపురాలను లెక్కించు. BSB BSB: March around Zion, encircle her, count her towers,
13 ULB తర్వాత తరం వాళ్ళకు దాని గురించి చెప్పడానికై ఆమె గోడలను పరిశీలించు. ఆమె భవనాలను చూడు. BSB BSB: consider her ramparts, tour her citadels, that you may tell the next generation.
14 ULB ఈ దేవుడు నిరంతరం మనకు దేవుడుగా ఉన్నాడు. మరణం వరకూ ఆయన మనలను నడిపిస్తాడు. BSB BSB: For this God is our God forever and ever; He will be our guide even till death.
Select verses for actions: Enter goes to them and Escape comes back.