1 ULB దేవా, నా ప్రార్థన శ్రద్ధగా విను. నా విన్నపాలకు నీ ముఖం తిప్పుకోకు. BSB BSB: For the choirmaster. With stringed instruments. A Maskil of David. Listen to my prayer, O God, and do not ignore my plea.
2 ULB నా మనవి విని నాకు జవాబు ఇవ్వు. నాకున్న కష్టాల వల్ల నాకు నెమ్మది లేదు. BSB BSB: Attend to me and answer me. I am restless in my complaint, and distraught
3 ULB ఎందుకంటే నా శత్రువులు చేస్తున్న పెద్ద శబ్దాల వల్ల, దుర్మార్గులు చేస్తున్న బలాత్కారాల వల్ల నేను చింతలో మునిగిపోయి మూలుగుతున్నాను. వాళ్ళు నన్ను ఎంతగానో కష్టాలపాలు చేస్తున్నారు. ఆగ్రహంతో నన్ను హింసిస్తున్నారు. BSB BSB: at the voice of the enemy, at the pressure of the wicked. For they bring down disaster upon me and resent me in their anger.
4 ULB నా గుండె నాలో వేదన పడుతున్నది. మరణ భయం నాకు కలుగుతున్నది. BSB BSB: My heart pounds within me, and the terrors of death assail me.
5 ULB దిగులు, వణుకు నాకు కలుగుతున్నాయి. తీవ్ర భయం నన్ను ముంచెత్తింది. BSB BSB: Fear and trembling grip me, and horror has overwhelmed me.
6 ULB ఆహా, నాకు గనక రెక్కలుంటే గువ్వలాగా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను. BSB BSB: I said, “Oh, that I had wings like a dove! I would fly away and find rest.
7 ULB త్వరగా పారిపోయి అరణ్యంలో నివసిస్తాను. BSB BSB: How far away I would flee! In the wilderness I would remain. Selah
8 ULB పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకుంటాను, అనుకున్నాను. BSB BSB: I would hurry to my shelter, far from this raging tempest.”
9 ULB పట్టణంలో హింస, కలహాలు నేను చూశాను. ప్రభూ, అలాటి పనులు చేసేవారిని నిర్మూలం చెయ్యి. వారి మాటలు తారుమారు చెయ్యి. BSB BSB: O Lord, confuse and confound their speech, for I see violence and strife in the city.
10 ULB రాత్రింబగళ్లు వారు పట్టణ సరిహద్దుల్లో తిరుగుతున్నారు. అక్కడ అంతా పాపం, చెడుతనం జరుగుతూ ఉంది. BSB BSB: Day and night they encircle the walls, while malice and trouble lie within.
11 ULB అక్కడ దుర్మార్గం కొనసాగుతూ ఉంది. అణచివేత, కపటం దాని వీధుల్లో జరుగుతూనే ఉన్నాయి. BSB BSB: Destruction is within; oppression and deceit never leave the streets.
12 ULB నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువైతే నేను దాన్ని సహించేవాడినే. నా పైకి లేచినవాడు నా పగవాడు కాడు. అదే అయితే నేను దాక్కోవచ్చు. BSB BSB: For it is not an enemy who insults me; that I could endure. It is not a foe who rises against me; from him I could hide.
13 ULB ఆ పని చేసింది నువ్వు అంటే నా నెచ్చెలివి, నా చెలికాడివి. నా ప్రియమిత్రుడివి. BSB BSB: But it is you, a man like myself, my companion and close friend.
14 ULB మనం కలిసి మధుర సహవాసం అనుభవించాం. ఉత్సవంగా దేవుని మందిరానికి వెళ్లాం. BSB BSB: We shared sweet fellowship together; we walked with the crowd into the house of God.
15 ULB చావు వారి మీదికి అకస్మాత్తుగా ముంచుకు వస్తుంది. ప్రాణంతోనే వారు పాతాళానికి దిగిపోతారు. ఎందుకంటే చెడుతనం వారి ఇళ్ళలో, వారి అంతరంగంలో ఉంది. BSB BSB: Let death seize them by surprise; let them go down to Sheol alive, for evil is with them in their homes.
16 ULB అయితే నేను దేవునికి మొరపెడతాను. యెహోవా నన్ను రక్షిస్తాడు. BSB BSB: But I call to God, and the LORD saves me.
17 ULB సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానిస్తూ మొరపెడతాను. ఆయన నా ప్రార్థన వింటాడు. BSB BSB: Morning, noon, and night, I cry out in distress, and He hears my voice.
18 ULB నా శత్రువులు చాలామంది ఉన్నారు. అయితే వారు నా మీదికి రాకుండా చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించి, శాంతిసమాధానాలు అనుగ్రహించాడు. BSB BSB: He redeems my soul in peace from the battle waged against me, even though many oppose me.
19 ULB పూర్వకాలం నుండి ఉన్న దేవుడు మారుమనస్సు లేనివారికి, తనకు భయపడని వారికి జవాబు చెబుతాడు. BSB BSB: God will hear and humiliate them—the One enthroned for the ages—Selah because they do not change and they have no fear of God.
20 ULB నా స్నేహితుడు తనతో శాంతి సమాధానాలతో ఉన్నవారి పైకి తన చెయ్యి ఎత్తాడు. వారితో తాను చేసిన నిబంధన మీరాడు. BSB BSB: My companion attacks his friends; he violates his covenant.
21 ULB అతని నోటి మాటలు వెన్నలాగా మృదువుగా ఉన్నాయి. కాని అతని హృదయం నిండా కలహం ఉంది. అతని మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయి గానీ అవి నిజానికి దూసుకు వస్తున్న కత్తులు. BSB BSB: His speech is smooth as butter, but war is in his heart. His words are softer than oil, yet they are swords unsheathed.
22 ULB నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు. BSB BSB: Cast your burden upon the LORD and He will sustain you; He will never let the righteous be shaken.
23 ULB దేవా, నువ్వు దుష్టులను నాశనకూపంలో పడవేస్తావు. ఇతరులతో పోలిస్తే రక్తాపరాధులు, వంచకులు సగం కంటే ఎక్కువకాలం బతకరు. నేనైతే నీలోనే నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాను. BSB BSB: But You, O God, will bring them down to the Pit of destruction; men of bloodshed and deceit will not live out half their days. But I will trust in You.
Select verses for actions: Enter goes to them and Escape comes back.