1 ULB దేవా, నన్ను కాపాడు. నా ప్రాణం మీద నీళ్ళు పొర్లి పారుతున్నాయి. BSB BSB: For the choirmaster. To the tune of “Lilies.” Of David. Save me, O God, for the waters are up to my neck.
2 ULB లోతైన అగాధంలాంటి ఊబిలో నేను దిగబడిపోతున్నాను. నిలబడలేకుండా ఉన్నాను. లోతైన నీళ్ళలో నేను మునిగిపోయాను. వరదలు నన్ను ముంచెత్తుతున్నాయి. BSB BSB: I have sunk into the miry depths, where there is no footing; I have drifted into deep waters, where the flood engulfs me.
3 ULB నేను కేకలు వేసి అలసిపోయాను, నా గొంతు ఎండిపోయింది. నా దేవుని కోసం కనిపెడుతూ ఉండగా నా కళ్ళు క్షీణించాయి. BSB BSB: I am weary from my crying; my throat is parched. My eyes fail, looking for my God.
4 ULB ఏ కారణం లేకుండా నా మీద పగబట్టిన వారు నా తలవెంట్రుకలకంటే ఎక్కువమంది ఉన్నారు. అకారణంగా నాకు శత్రువులై నన్ను చంపాలని చూసేవారు అనేకమంది. నేను దోచుకోని దాన్ని నేను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. BSB BSB: Those who hate me without cause outnumber the hairs of my head; many are those who would destroy me—my enemies for no reason. Though I did not steal, I must repay.
5 ULB దేవా, నా బుద్ధిహీనత నీకు తెలుసు. నా పాపాలు నీకు తెలియనివి కావు. BSB BSB: You know my folly, O God, and my guilt is not hidden from You.
6 ULB దేవా, సేనల ప్రభువైన యెహోవా, నీ కోసం ఎదురు చూసే వారికి నా మూలంగా సిగ్గు కలగనీయవద్దు. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదికే వారు నా మూలంగా అవమానం పాలు కానీయకు. BSB BSB: May those who hope in You not be ashamed through me, O Lord GOD of Hosts; may those who seek You not be dishonored through me, O God of Israel.
7 ULB నీ కోసం నేను నిందలు పడ్డాను. నీ కోసమే నేను సిగ్గు పడాల్సి వచ్చింది. BSB BSB: For I have endured scorn for Your sake, and shame has covered my face.
8 ULB నా సోదరులకు నేను పరాయివాణ్ణి అయ్యాను. నా తల్లి కొడుకులకు పరదేశిని అయ్యాను. BSB BSB: I have become a stranger to my brothers and a foreigner to my mother’s sons,
9 ULB నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను తినివేసింది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడ్డాయి. BSB BSB: because zeal for Your house has consumed me, and the insults of those who insult You have fallen on me.
10 ULB నేను ఉపవాసముండి ఏడ్చినపుడు నా ఆత్మకు అది నింద కారణమైంది. BSB BSB: I wept and fasted, but it brought me reproach.
11 ULB నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వారు అపహాస్యం చేశారు. BSB BSB: I made sackcloth my clothing, and I was sport to them.
12 ULB నగర ద్వారాల్లో కూర్చున్నవారు నన్ను గురించే మాట్లాడుకుంటున్నారు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడతారు. BSB BSB: Those who sit at the gate mock me, and I am the song of drunkards.
13 ULB యెహోవా, నీకే నేను ప్రార్థన చేస్తున్నాను. అనుకూల సమయంలో జవాబివ్వు. దేవా, నమ్మదగిన నీ రక్షణ సత్యాన్ని బట్టి నాకు జవాబు దయచెయ్యి. BSB BSB: But my prayer to You, O LORD, is for a time of favor. In Your abundant loving devotion, O God, answer me with Your sure salvation.
14 ULB ఊబిలోనుండి నన్ను తప్పించు. నన్ను మునిగి పోనీయకు. నన్ను ద్వేషించే వారి చేతినుండి, లోతైన జలాల నుండి నన్ను తప్పించు. BSB BSB: Rescue me from the mire and do not let me sink; deliver me from my foes and out of the deep waters.
15 ULB వరదలు నన్ను ముంచెయ్యనియ్యకు. అగాథం నన్ను మింగనియ్యకు. నన్ను గుంటలో పడనియ్యకు. BSB BSB: Do not let the floods engulf me or the depths swallow me up; let not the Pit close its mouth over me.
16 ULB యెహోవా, నీ నిబంధన కృపలోని మంచితనాన్ని బట్టి నాకు జవాబివ్వు. అధికమైన నీ కృపను బట్టి నావైపు తిరుగు. BSB BSB: Answer me, O LORD, for Your loving devotion is good; turn to me in keeping with Your great compassion.
17 ULB నీ సేవకుడి నుండి నీ ముఖం తిప్పుకోకు. నేను నిస్పృహలో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వు. BSB BSB: Hide not Your face from Your servant, for I am in distress. Answer me quickly!
18 ULB నా దగ్గరికి వచ్చి నన్ను విమోచించు. నా శత్రువులను చూసి నన్ను విడిపించు. BSB BSB: Draw near to my soul and redeem me; ransom me because of my foes.
19 ULB నాకు నింద, సిగ్గు, అవమానం కలిగాయని నీకు తెలుసు. నా విరోధులంతా నీ ఎదుటే ఉన్నారు. BSB BSB: You know my reproach, my shame and disgrace. All my adversaries are before You.
20 ULB నింద వలన నా హృదయం బద్దలైంది. నేను ఎంతో కృశించిపోయాను. నన్ను ఎవరైనా కనికరిస్తారేమో అని చూశాను గానీ ఎవరూ లేరు. ఓదార్చే వారి కోసం కనిపెట్టాను గాని ఎవరూ కనిపించ లేదు. BSB BSB: Insults have broken my heart, and I am in despair. I looked for sympathy, but there was none, for comforters, but I found no one.
21 ULB వారు నాకు ఆహారంగా చేదు విషాన్ని పెట్టారు. నాకు దాహం అయినప్పుడు తాగడానికి పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు. BSB BSB: They poisoned my food with gall and gave me vinegar to quench my thirst.
22 ULB వారి సంపద వారికి ఉరి అవుతుంది గాక. క్షేమంగా ఉన్నామని అనుకున్నప్పుడు అది వారికి ఒక బోనుగా ఉంటుంది గాక. BSB BSB: May their table become a snare; may it be a retribution and a trap.
23 ULB వారు చూడలేకపోయేలా వారి కళ్ళకు చీకటి కమ్ముతుంది గాక. వారి నడుములకు ఎడతెగని వణకు పుడుతుంది గాక. BSB BSB: May their eyes be darkened so they cannot see, and their backs be bent forever.
24 ULB వారి మీద నీ ఉగ్రతను కుమ్మరించు. నీ కోపాగ్ని వారిని ఆవరిస్తుంది గాక. BSB BSB: Pour out Your wrath upon them, and let Your burning anger overtake them.
25 ULB వారి నివాసం నిర్జనం అవుతుంది గాక. వారి గుడారాల్లో ఎవరూ నివాసం ఉండరు గాక. BSB BSB: May their place be deserted; let there be no one to dwell in their tents.
26 ULB నువ్వు దెబ్బ కొట్టిన వాణ్ణి వారు బాధిస్తున్నారు. నువ్వు గాయపరచిన వారి వేదన గూర్చి వారు కబుర్లాడుతున్నారు. BSB BSB: For they persecute the one You struck and recount the pain of those You wounded.
27 ULB ఒకదాని తరవాత ఒకటిగా అపరాధాలు వారికి తగలనివ్వు. నీ నీతిగల విజయంలోకి వారిని చేరనివ్వకు. BSB BSB: Add iniquity to their iniquity; let them not share in Your righteousness.
28 ULB జీవగ్రంథంలో నుండి వారి పేరు చెరిపివెయ్యి. నీతిమంతుల జాబితాలో వారి పేర్లు రాయవద్దు. BSB BSB: May they be blotted out of the Book of Life and not listed with the righteous.
29 ULB నేను బాధలో, వేదనలో మునిగి ఉన్నాను. దేవా, నీ రక్షణ నన్ను లేవనెత్తు గాక. BSB BSB: But I am in pain and distress; let Your salvation protect me, O God.
30 ULB దేవుని నామాన్ని గానాలతో స్తుతిస్తాను. కృతజ్ఞతలతో ఆయన్ని ఘనపరుస్తాను. BSB BSB: I will praise God’s name in song and exalt Him with thanksgiving.
31 ULB ఎద్దు కంటే, కొమ్ములు డెక్కలు గల కోడె కంటే అది యెహోవాకు ఇష్టం. BSB BSB: And this will please the LORD more than an ox, more than a bull with horns and hooves.
32 ULB దీనులు అది చూసి సంతోషిస్తారు. దేవుని వెదికేవారలారా, మీ హృదయాలు తిరిగి బ్రతుకు గాక. BSB BSB: The humble will see and rejoice. You who seek God, let your hearts be revived!
33 ULB అక్కరలో ఉన్నవారి ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. బంధకాల్లో ఉన్న తన వారిని ఆయన అలక్ష్యం చేయడు. BSB BSB: For the LORD listens to the needy and does not despise His captive people.
34 ULB భూమీ ఆకాశాలూ ఆయనను స్తుతిస్తాయి గాక. సముద్రాలు, వాటిలోని సమస్తం ఆయనను స్తుతిస్తాయి గాక. BSB BSB: Let heaven and earth praise Him, the seas and everything that moves in them.
35 ULB దేవుడు సీయోనును రక్షిస్తాడు. ఆయన యూదా పట్టణాలను తిరిగి కట్టిస్తాడు. ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. అది వారి సొంతం అవుతుంది. BSB BSB: For God will save Zion and rebuild the cities of Judah, that they may dwell there and possess it.
36 ULB ఆయన సేవకుల సంతానం దాన్ని వారసత్వంగా పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించేవారు అందులో నివసిస్తారు. BSB BSB: The descendants of His servants will inherit it, and those who love His name will settle in it.
Select verses for actions: Enter goes to them and Escape comes back.