1 ULB ఇశ్రాయేలు కాపరీ! మందలాగా యోసేపును నడిపించేవాడా, విను. కెరూబులకు పైగా ఆసీనుడవైనవాడా, మా మీద ప్రకాశించు. BSB BSB: For the choirmaster. To the tune of “The Lilies of the Covenant.” A Psalm of Asaph. Hear us, O Shepherd of Israel, who leads Joseph like a flock; You who sit enthroned between the cherubim, shine forth
2 ULB ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే గోత్రాల ఎదుట నీ బల ప్రభావాలను చూపించు. వచ్చి మమ్మల్ని కాపాడు. BSB BSB: before Ephraim, Benjamin, and Manasseh. Rally Your mighty power and come to save us.
3 ULB దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు. BSB BSB: Restore us, O God, and cause Your face to shine upon us, that we may be saved.
4 ULB యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీ ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వెంతకాలం కోపపడతావు? BSB BSB: O LORD God of Hosts, how long will Your anger smolder against the prayers of Your people?
5 ULB కన్నీళ్లు వారికి ఆహారంగా ఇస్తున్నావు. తాగడానికి కడివెడు కన్నీళ్లు వాళ్లకిచ్చావు. BSB BSB: You fed them with the bread of tears and made them drink the full measure of their tears.
6 ULB మా పొరుగువారు మా గురించి ఘర్షణ పడేలా చేస్తున్నావు, మా శత్రువులు తమలోతాము మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. BSB BSB: You make us contend with our neighbors; our enemies mock us.
7 ULB సేనల ప్రభువైన దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు. BSB BSB: Restore us, O God of Hosts, and cause Your face to shine upon us, that we may be saved.
8 ULB నువ్వు ఈజిప్టులోనుంచి ఒక ద్రాక్షాతీగె తెచ్చావు, ఇతర రాజ్యాలను వెళ్లగొట్టి దాన్ని నాటావు. BSB BSB: You uprooted a vine from Egypt; You drove out the nations and transplanted it.
9 ULB దాని కోసం నేల సిద్ధం చేశావు. అది లోతుగా వేరు పారి దేశమంతా వ్యాపించింది. BSB BSB: You cleared the ground for it, and it took root and filled the land.
10 ULB దాని నీడ కొండలను కప్పింది. దాని తీగెలు దేవుని దేవదారు చెట్లను కమ్మేశాయి, BSB BSB: The mountains were covered by its shade, and the mighty cedars with its branches.
11 ULB దాని తీగెలు సముద్రం వరకూ దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకూ వ్యాపించాయి. BSB BSB: It sent out its branches to the Sea, and its shoots toward the River.
12 ULB దారిన పోయేవాళ్ళంతా దాని పళ్ళు కోసేలా దాని కంచెలను నువ్వెందుకు పడగొట్టావు? BSB BSB: Why have You broken down its walls, so that all who pass by pick its fruit?
13 ULB అడవిపందులు దాన్ని పాడు చేస్తున్నాయి, పొలంలోని పశువులు దాన్ని మేస్తున్నాయి. BSB BSB: The boar from the forest ravages it, and the creatures of the field feed upon it.
14 ULB సేనల ప్రభువైన దేవా, వెనక్కి చూడు. ఆకాశం నుంచి చూచి ఈ ద్రాక్షావల్లిని గమనించు. BSB BSB: Return, O God of Hosts, we pray! Look down from heaven and see! Attend to this vine—
15 ULB నీ కుడిచెయ్యి నాటింది ఈ వేరునే. ఈ కొమ్మనే నువ్వు పెంచావు. BSB BSB: the root Your right hand has planted, the son You have raised up for Yourself.
16 ULB దాన్ని నరికి కాల్చివేశారు, నీ గద్దింపుతో నీ శత్రువులు నశించుదురు గాక. BSB BSB: Your vine has been cut down and burned; they perish at the rebuke of Your countenance.
17 ULB నీ కుడిచెయ్యి మనిషి మీద ఉంచు. నువ్వు బలపరచిన మానవ పుత్రుని మీద నీ చెయ్యి ఉంచు. BSB BSB: Let Your hand be upon the man at Your right hand, on the son of man You have raised up for Yourself.
18 ULB అప్పుడు మేము నీ దగ్గరనుంచి వెనక్కి వెళ్ళం, మమ్మల్ని బతికించు. అప్పుడు నీ పేరునే ప్రార్థన చేస్తాం. BSB BSB: Then we will not turn away from You; revive us, and we will call on Your name.
19 ULB యెహోవా, సేనల ప్రభువైన దేవా, చెరలో నుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశించ నివ్వు. BSB BSB: Restore us, O LORD God of Hosts; cause Your face to shine upon us, that we may be saved.
Select verses for actions: Enter goes to them and Escape comes back.