1 ULB దేవా, మౌనంగా ఉండవద్దు! దేవా, మమ్మల్ని పట్టించుకోకుండా స్పందించకుండా ఉండవద్దు. BSB BSB: A song. A Psalm of Asaph. O God, be not silent; be not speechless; be not still, O God.
2 ULB నీ శత్రువులు నీకు ఎదురు తిరుగుతున్నారు, నిన్ను ద్వేషించే వాళ్ళు రెచ్చిపోతున్నారు. BSB BSB: See how Your enemies rage, how Your foes have reared their heads.
3 ULB నీ ప్రజల మీద వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. నువ్వు కాపాడే వాళ్ళ మీద దురాలోచన చేస్తున్నారు. BSB BSB: With cunning they scheme against Your people and conspire against those You cherish,
4 ULB వాళ్ళిలా చెబుతున్నారు, వాళ్ళ రాజ్యాన్ని నాశనం చేద్దాం రండి. అప్పుడు ఇశ్రాయేలు అనే పేరు ఇక గుర్తుకు రాకుండా ఉంటుంది. BSB BSB: saying, “Come, let us erase them as a nation; may the name of Israel be remembered no more.”
5 ULB ఏకగ్రీవంగా వాళ్ళు ఆలోచన చేశారు. నీకు విరోధంగా ఒప్పందాలు చేసుకున్నారు. BSB BSB: For with one mind they plot together; they form an alliance against You—
6 ULB గుడారాల్లో జీవించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, హగ్రీయీలు, BSB BSB: the tents of Edom and the Ishmaelites, of Moab and the Hagrites,
7 ULB గెబలు జాతి వాళ్ళు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిష్తీయులు, తూరు నివాసులు, BSB BSB: of Gebal, Ammon, and Amalek, of Philistia with the people of Tyre.
8 ULB అష్షూరు దేశస్థులు వాళ్ళ పక్షాన చేరారు. లోతు వంశస్థులకు వాళ్ళు సాయం చేస్తున్నారు. సెలా BSB BSB: Even Assyria has joined them, lending strength to the sons of Lot. Selah
9 ULB నువ్వు మిద్యానుకు ఏమి చేశావో కీషోను వాగు దగ్గర నువ్వు సీసెరాకు, యాబీనుకు ఏమి చేశావో అలాగే వారికి చెయ్యి. BSB BSB: Do to them as You did to Midian, as to Sisera and Jabin at the River Kishon,
10 ULB వాళ్ళు ఏన్దోరు దగ్గర నాశనమై పోయారు. నేలకు ఎరువు అయ్యారు. BSB BSB: who perished at Endor and became like dung on the ground.
11 ULB ఓరేబు, జెయేబు నాయకులకు నువ్వు చేసినట్టు వారి ప్రధానులకు చెయ్యి. జెబహు సల్మున్నా అనే వారికి నువ్వు చేసినట్టు వాళ్ళ రాజులందరికీ చెయ్యి. BSB BSB: Make their nobles like Oreb and Zeeb, and all their princes like Zebah and Zalmunna,
12 ULB దేవుని పచ్చిక భూములను మనం ఆక్రమించుకుందాం అని వాళ్ళు అంటున్నారు. BSB BSB: who said, “Let us possess for ourselves the pastures of God.”
13 ULB నా దేవా, సుడి తిరిగే దుమ్ములాగా, గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా వాళ్ళను చెయ్యి. BSB BSB: Make them like tumbleweed, O my God, like chaff before the wind.
14 ULB మంటలు అడవిని కాల్చివేసినట్టు, కారుచిచ్చు కొండలను తగలబెట్టినట్టు, BSB BSB: As fire consumes a forest, as a flame sets the mountains ablaze,
15 ULB నీ తుఫానుతో వాళ్ళను తరిమి వెయ్యి. నీ సుడిగాలిచేత వారికి భయం పుట్టించు. BSB BSB: so pursue them with Your tempest, and terrify them with Your storm.
16 ULB యెహోవా, వాళ్ళు నీ నామాన్ని వెతికేలా వాళ్ల ముఖాలకు అవమానం కలిగించు. BSB BSB: Cover their faces with shame, that they may seek Your name, O LORD.
17 ULB వాళ్ళు ఎప్పుడూ అవమానం, భయం అనుభవించాలి, వాళ్ళు సిగ్గుపాలై నాశనం కావాలి. BSB BSB: May they be ever ashamed and terrified; may they perish in disgrace.
18 ULB యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే లోకమంతట్లో మహోన్నతుడవని వాళ్ళు తెలుసుకుంటారు. BSB BSB: May they know that You alone, whose name is the LORD, are Most High over all the earth.
Select verses for actions: Enter goes to them and Escape comes back.