1 ULB ప్రతీకారం చేసే దేవా! యెహోవా! ప్రతీకారం చేసే దేవా! మా మీద ప్రకాశించు. BSB BSB: O LORD, God of vengeance, O God of vengeance, shine forth.
2 ULB లోక న్యాయమూర్తీ, లే! గర్విష్టులకు తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వు. BSB BSB: Rise up, O Judge of the earth; render a reward to the proud.
3 ULB యెహోవా, దుర్మార్గులు ఎంతకాలం, ఎంతకాలం గెలుస్తారు? BSB BSB: How long will the wicked, O LORD, how long will the wicked exult?
4 ULB వాళ్ళు గర్వంగా తిరస్కారంగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా గొప్పలు చెప్పుకుంటున్నారు. BSB BSB: They pour out arrogant words; all workers of iniquity boast.
5 ULB యెహోవా, వాళ్ళు నీ ప్రజలను అణిచివేస్తున్నారు. నీకు చెందిన జాతిని బాధిస్తున్నారు. BSB BSB: They crush Your people, O LORD; they oppress Your heritage.
6 ULB వాళ్ళు వితంతువులనూ విదేశీయులనూ చంపేస్తున్నారు. అనాథలను హత్య చేస్తున్నారు. BSB BSB: They kill the widow and the foreigner; they murder the fatherless.
7 ULB వారు యెహోవా చూడడు, యాకోబు దేవుడు ఇదంతా గమనించడు, అంటారు. BSB BSB: They say, “The LORD does not see; the God of Jacob pays no heed.”
8 ULB బుద్ధిలేని ప్రజలారా, తెలుసుకోండి. మూర్ఖులారా, మీరెప్పుడు నేర్చుకుంటారు? BSB BSB: Take notice, O senseless among the people! O fools, when will you be wise?
9 ULB చెవులిచ్చినవాడు వినలేడా? కళ్ళు చేసినవాడు చూడలేడా? BSB BSB: He who affixed the ear, can He not hear? He who formed the eye, can He not see?
10 ULB రాజ్యాలను అదుపులో పెట్టేవాడు సరిచేయడా? మనిషికి తెలివి ఇచ్చేవాడు ఆయనే. BSB BSB: He who admonishes the nations, does He not discipline? He who teaches man, does He lack knowledge?
11 ULB మనుషుల ఆలోచనలు యెహోవాకు తెలుసు, అవి పనికిరానివని ఆయనకు తెలుసు. BSB BSB: The LORD knows the thoughts of man, that they are futile.
12 ULB యెహోవా, నీ దగ్గర శిక్షణ పొందేవాడు నీ ధర్మశాస్త్రంలో నుంచి నీ దగ్గర నేర్చుకునేవాడు ధన్యుడు. BSB BSB: Blessed is the man You discipline, O LORD, and teach from Your law,
13 ULB దుర్మార్గులకు గుంట తవ్వే వరకూ అతని కష్టకాలాల్లో నువ్వు నెమ్మది ఇస్తావు. BSB BSB: to grant him relief from days of trouble, until a pit is dug for the wicked.
14 ULB యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. తన సొత్తును వదిలి పెట్టడు. BSB BSB: For the LORD will not forsake His people; He will never abandon His heritage.
15 ULB న్యాయం గెలుస్తుంది, నిజాయితీపరులంతా దాన్ని అనుసరిస్తారు. BSB BSB: Surely judgment will again be righteous, and all the upright in heart will follow it.
16 ULB దుర్మార్గుల ఎదుట నా పక్షాన ఎవరు నిలబడతారు? దుష్టులకు వ్యతిరేకంగా నా కోసం ఎవరు నిలుస్తారు? BSB BSB: Who will rise up for me against the wicked? Who will stand for me against the workers of iniquity?
17 ULB యెహోవా నాకు సాయం రాకపోతే నేను మరణనిశ్శబ్దంలో పండుకునే వాడినే. BSB BSB: Unless the LORD had been my helper, I would soon have dwelt in the abode of silence.
18 ULB నా కాలు జారింది అని నేనంటే, యెహోవా, నీ కృప నన్ను ఎత్తిపట్టుకుంది. BSB BSB: If I say, “My foot is slipping,” Your loving devotion, O LORD, supports me.
19 ULB నా లోని ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నన్ను బెదిరిస్తుంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేసింది. BSB BSB: When anxiety overwhelms me, Your consolation delights my soul.
20 ULB దుర్మార్గ పాలకులు నీతో జత కట్టగలరా? అన్యాయం చేద్దామని వాళ్ళు చట్టం కల్పిస్తారు. BSB BSB: Can a corrupt throne be Your ally—one devising mischief by decree?
21 ULB వాళ్ళు నీతిమంతులకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతారు. నిర్దోషులకు మరణ దండన విధిస్తారు. BSB BSB: They band together against the righteous and condemn the innocent to death.
22 ULB అయితే యెహోవా నాకు ఎత్తయిన కోట. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం. BSB BSB: But the LORD has been my stronghold, and my God is my rock of refuge.
23 ULB ఆయన వాళ్ళ దోషం వాళ్ళ మీదికి రప్పిస్తాడు. వాళ్ళ చెడుతనంలోనే వాళ్ళను నాశనం చేస్తాడు. మన యెహోవా దేవుడు వాళ్ళను నాశనం చేస్తాడు. BSB BSB: He will bring upon them their own iniquity and destroy them for their wickedness. The LORD our God will destroy them.
Select verses for actions: Enter goes to them and Escape comes back.