Psalm 99 99 Psalms Book 4 Telugu Unlocked Literal Bible 1 ULB యెహోవా పరిపాలన చేస్తున్నాడు. రాజ్యాలు వణికిపోతాయి. ఆయన కెరూబులకు పైగా కూర్చుని ఉన్నాడు. భూమి కంపిస్తుంది. BSB BSB: The LORD reigns; let the nations tremble! He is enthroned above the cherubim; let the earth quake!
2 ULB సీయోనులో యెహోవా గొప్పవాడు. రాజ్యాలన్నిటి పైగా ఆయన ఉన్నతంగా ఉన్నాడు. BSB BSB: Great is the LORD in Zion; He is exalted above all the peoples.
3 ULB వాళ్ళు నీ ఘన నామాన్ని స్తుతిస్తారు. యెహోవా పవిత్రుడు. BSB BSB: Let them praise Your great and awesome name—He is holy!
4 ULB రాజు బలశాలి. ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడు. నువ్వు నీతి న్యాయాలను సుస్థిరం చేశావు, యాకోబు ప్రజల పట్ల నీతి పాలన స్థాపించావు. BSB BSB: The mighty King loves justice. You have established equity; You have exercised justice and righteousness in Jacob.
5 ULB మన యెహోవా దేవుణ్ణి స్తుతించండి. ఆయన పాదపీఠం ముందర ఆరాధించండి. ఆయన పవిత్రుడు. BSB BSB: Exalt the LORD our God, and worship at His footstool; He is holy!
6 ULB ఆయన యాజకుల్లో మోషే అహరోనులు ఉన్నారు. ఆయనకు ప్రార్థన చేసేవాళ్ళలో సమూయేలు ఉన్నాడు. వాళ్ళు యెహోవాను ప్రార్థిస్తే ఆయన జవాబిచ్చాడు. BSB BSB: Moses and Aaron were among His priests; Samuel was among those who called on His name. They called to the LORD and He answered.
7 ULB మేఘస్తంభంలో నుంచి ఆయన వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళు ఆయన శాసనాలను పాటించారు. ఆయన తమకిచ్చిన కట్టడను అనుసరించారు. BSB BSB: He spoke to them from the pillar of cloud; they kept His decrees and the statutes He gave them.
8 ULB యెహోవా మా దేవా, నువ్వు వాళ్లకు జవాబిచ్చావు. వాళ్ళ అక్రమ కార్యాలకు వాళ్ళను శిక్షించినా, నువ్వు వాళ్ళను క్షమించిన దేవుడివి. BSB BSB: O LORD our God, You answered them. You were a forgiving God to them, yet an avenger of their misdeeds.
9 ULB మన యెహోవా దేవుడు పవిత్రుడు, మన యెహోవా దేవుణ్ణి స్తుతించండి. ఆయన పవిత్ర పర్వతం ఎదుట ఆరాధించండి. BSB BSB: Exalt the LORD our God and worship at His holy mountain, for the LORD our God is holy.
Select verses for actions: Enter goes to them and Escape comes back.
Chapter complete
You’ve read Psalm 99
Make Opened yours A free account keeps your place, highlights and notes on every device. Add Plus to ask Study Help about Psalm 99, and keep Opened free for readers who can’t pay.