1 ULB నేను మళ్ళీ తలెత్తి చూసినప్పుడు ఎగిరిపోతూ ఉన్న ఒక గ్రంథం నాకు కనిపించింది. BSB BSB: Again I lifted up my eyes and saw before me a flying scroll.
2 ULB <<నీకు ఏమి కనబడుతుంది?>> అని అతడు నన్ను అడిగాడు. అందుకు నేను <<20 మూరల పొడవు, 10 మూరల వెడల్పు ఉండి ఎగిరిపోతూ ఉన్న ఒక గ్రంథం కనబడుతుంది>> అని చెప్పాను. BSB BSB: “What do you see?” asked the angel. “I see a flying scroll,” I replied, “twenty cubits long and ten cubits wide.”
3 ULB అప్పుడు అతడు నాతో <<ఇది భూమి అంతటి మీదికీ బయలుదేరి వెళ్తున్న శాపం. దానికి ఒక వైపు రాసి ఉన్న ప్రకారం దొంగతనం చేసేవాళ్ళు నాశనం అవుతారు, రెండవ వైపు రాసి ఉన్న ప్రకారం అబద్ద సాక్ష్యాలు పలికేవాళ్ళంతా నాశనం అవుతారు>> అని చెప్పాడు. BSB BSB: Then he told me, “This is the curse that is going out over the face of all the land, for according to one side of the scroll, every thief will be removed; and according to the other side, every perjurer will be removed.
4 ULB ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. నేనే ఆ గ్రంథాన్ని పంపుతున్నాను. అది దొంగల ఇళ్ళలో, నా నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణం చేసేవారి ఇళ్ళలో ప్రవేశించి వాళ్ళ ఇళ్ళలో ఉండి ఇళ్ళను, వాటి గుమ్మాలను, గోడలను నాశనం చేస్తుంది. BSB BSB: I will send it out, declares the LORD of Hosts, and it will enter the house of the thief and the house of him who swears falsely by My name. It will remain inside his house and destroy it, down to its timbers and stones.”
5 ULB అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత వచ్చి <<నువ్వు బయలుదేరి వెళ్లి నీ కన్నులెత్తి చూసి ఇవతలకు వస్తున్నదేమిటో కనిపెట్టు>> అని నాతో చెప్పాడు. BSB BSB: Then the angel who was speaking with me came forward and told me, “Now lift up your eyes and see what is approaching.”
6 ULB నేను <<ఇది ఏమిటి?>> అని అడిగినప్పుడు అతడు <<ఇది కొలత గంప. ఇది దేశమంతటిలో ఉన్న ప్రజల దోషములును సూచిస్తుంది>> అని చెప్పాడు. BSB BSB: “What is it?” I asked. And he replied, “A measuring basket is going forth.” Then he continued, “This is their iniquity in all the land.”
7 ULB గంపకు ఉన్న సీసపు మూత తీసినప్పుడు గంపలో కూర్చుని ఉన్న ఒక స్త్రీ కనబడింది. BSB BSB: And behold, the cover of lead was raised, and there was a woman sitting inside the basket.
8 ULB అప్పుడతడు <<ఇది దోషంతో నిండి ఉంది>> అని నాతో చెప్పి గంపలో ఆ స్త్రీని పడవేసి సీసపు మూతను గంపపై ఉంచాడు. BSB BSB: “This is Wickedness,” he said. And he shoved her down into the basket, pushing down the lead cover over its opening.
9 ULB నేను మళ్ళీ చూసినప్పుడు ఇద్దరు స్త్రీలు బయలుదేరారు. సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వాళ్లకు ఉన్నాయి. గాలికి వాళ్ళ రెక్కలు ఆడుతున్నాయి. వాళ్ళు వచ్చి గంపను మోసుకుంటూ భూమి ఆకాశాల మధ్యకు దాన్ని ఎత్తారు. BSB BSB: Then I lifted up my eyes and saw two women approaching, with the wind in their wings. Their wings were like those of a stork, and they lifted up the basket between heaven and earth.
10 ULB నేను నాతో మాట్లాడుతున్న దూతతో <<వీళ్ళు ఈ గంపను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు?>> అని అడిగాను. BSB BSB: “Where are they taking the basket?” I asked the angel who was speaking with me.
11 ULB అందుకతడు <<షీనారు దేశంలో దాని కోసం ఒక గృహం నిర్మించడానికి వాళ్ళు వెళ్తున్నారు. గృహం సిద్ధమైనప్పుడు అక్కడ దాన్ని నియమిత స్థలంలో ఉంచుతారు>> అని జవాబిచ్చాడు. BSB BSB: “To build a house for it in the land of Shinar,” he told me. “And when it is ready, the basket will be set there on its pedestal.”