1 ULB బాల సమూయేలు ఏలీ సమక్షంలో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆ రోజుల్లో యెహోవా స్వరం వినబడడం చాలా అరుదు. ఆయన ప్రత్యక్షం కావడం తరుచుగా జరిగేది కాదు. BSB BSB: And the boy Samuel ministered to the LORD before Eli. Now in those days the word of the LORD was rare, and visions were scarce.
2 ULB ఆ సమయంలో ఏలీ కంటి చూపు మందగించినందువల్ల అతడు ఏమీ చూడలేని స్థితిలో తన మంచంపై పండుకుని ఉన్నాడు. BSB BSB: And at that time Eli, whose eyesight had grown so dim that he could not see, was lying in his room.
3 ULB దేవుని మందసం ఉన్న యెహోవా మందిరంలోని దీపం అర్పివేయక ముందే, సమూయేలు నిద్రపోతూ ఉన్నాడు. BSB BSB: Before the lamp of God had gone out, Samuel was lying down in the temple of the LORD, where the ark of God was located.
4 ULB అప్పుడు యెహోవా సమూయేలును పిలిచాడు. అతడు <<అయ్యగారూ, నేనిక్కడే ఉన్నాను>> అన్నాడు. BSB BSB: Then the LORD called to Samuel, and he answered, “Here I am.”
5 ULB ఏలీ దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి <<నన్ను పిలిచావు గదా, వచ్చాను>> అన్నాడు. ఏలీ <<నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో>> అన్నాడు. అతడు వెళ్ళి నిద్రపోయడు. BSB BSB: He ran to Eli and said, “Here I am, for you have called me.” “I did not call,” Eli replied. “Go back and lie down.” So he went and lay down.
6 ULB యెహోవా రెండవసారి సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ దగ్గరికి వెళ్లి<<అయ్యగారూ, నువ్వు పిలిచావని వచ్చాను>> అన్నాడు. అందుకు అతడు <<బాబూ, నేను పిలవలేదు, వెళ్ళి నిద్రపో>> అని చెప్పాడు. BSB BSB: Once again the LORD called, “Samuel!” So Samuel got up, went to Eli, and said, “Here I am, for you have called me.” “My son, I did not call,” Eli replied. “Go back and lie down.”
7 ULB అప్పటివరకూ సమూయేలు యెహోవా ప్రత్యక్షత పొందలేదు, యెహోవా మాట అతడికి ఇంకా వెల్లడి కాలేదు. BSB BSB: Now Samuel did not yet know the LORD, because the word of the LORD had not yet been revealed to him.
8 ULB యెహోవా మూడవసారి సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకి వెళ్ళి <<అయ్యగారూ, నువ్వు నన్ను పిలిచావు గదా, ఇదిగో వచ్చాను>> అన్నప్పుడు, యెహోవాయే అతణ్ణి పిలిచాడని ఏలీ గ్రహించాడు. BSB BSB: Once again, for the third time, the LORD called to Samuel. He got up, went to Eli, and said, “Here I am, for you have called me.” Then Eli realized that it was the LORD who was calling the boy.
9 ULB అతడు <<నువ్వు వెళ్ళి పడుకో. ఎవరైనా నిన్ను పిలిస్తే, <యెహోవా, నీ దాసుడు వింటున్నాడు, ఏమి చేయాలో చెప్పండి> అని చెప్పు>> అని సమూయేలుతో చెప్పాడు. సమూయేలు వెళ్ళి తన స్థలంలో పండుకున్నాడు. BSB BSB: “Go and lie down,” he said to Samuel, “and if He calls you, say, ‘Speak, LORD, for Your servant is listening.’” So Samuel went and lay down in his place.
10 ULB తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలబడి అదే విధంగా <<సమూయేలూ సమూయేలూ>> అని పిలిచినప్పుడు సమూయేలు <<నీ దాసుడు వింటున్నాడు, ఏమిటో చెప్పండి>> అన్నాడు. BSB BSB: Then the LORD came and stood there, calling as before, “Samuel! Samuel!” And Samuel answered, “Speak, for Your servant is listening.”
11 ULB అప్పుడు యెహోవా సమూయేలుతో ఇలా చెప్పాడు. <<ఇశ్రాయేలు ప్రజల మధ్య నేనొక పని చేయబోతున్నాను. దాన్ని గురించి తెలుసుకున్నవారి చెవులు హోరెత్తుతాయి. BSB BSB: Then the LORD said to Samuel, “I am about to do something in Israel at which the ears of all who hear it will tingle.
12 ULB ఆ రోజున ఏలీ కుటుంబం వారిని గురించి నేను చెప్పినదంతా వారి పైకి రప్పిస్తాను. నేనే దాన్ని చేయడం మొదలుపెట్టి ముగిస్తాను. BSB BSB: On that day I will carry out against Eli everything I have spoken about his house, from beginning to end.
13 ULB తన కొడుకులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొంటున్నారని తెలిసి కూడా ఏలీ వారిని అడ్డగించలేదు కాబట్టి అతని కుటుంబానికి శాశ్వత శిక్ష విధిస్తానని నేను అతనికి తెలియజేస్తున్నాను. BSB BSB: I told him that I would judge his house forever for the iniquity of which he knows, because his sons blasphemed God and he did not restrain them.
14 ULB కాబట్టి ఏలీ కుటుంబం వారి దోషానికి బలిమూలంగా గానీ, అర్పణ మూలంగా గానీ ఎప్పటికీ క్షమాపణ ఉండదు అని శపథం చేశాను.>> BSB BSB: Therefore I have sworn to the house of Eli, ‘The iniquity of Eli’s house shall never be atoned for by sacrifice or offering.’”
15 ULB తరువాత సమూయేలు తెల్లవారేదాకా పండుకుని, లేచి యెహోవా ఆలయం తలుపులు తీశాడు గానీ భయం వేసి తనకు వచ్చిన దర్శనం విషయం ఏలీతో చెప్పలేకపోయాడు. BSB BSB: Samuel lay down until the morning; then he opened the doors of the house of the LORD. He was afraid to tell Eli the vision,
16 ULB అయితే ఏలీ <<సమూయేలూ, కుమారా>> అని సమూయేలును పిలిచాడు. అతడు <<చిత్తం, నేనిక్కడ ఉన్నాను>> అన్నాడు. BSB BSB: but Eli called to him and said, “Samuel, my son.” “Here I am,” answered Samuel.
17 ULB ఏలీ <<నీకు యెహోవా ఏమి చెప్పాడో దాచకుండా దయచేసి నాతో చెప్పు. ఆయన నీతో చెప్పిన విషయాల్లో ఏదైనా చెప్పకుండా దాచిపెడితే దానికంటే ఎక్కువ ప్రమాదం ఆయన నీకు కలుగజేస్తాడు గాక>> అనగా, BSB BSB: “What was the message He gave you?” Eli asked. “Do not hide it from me. May God punish you, and ever so severely, if you hide from me anything He said to you.”
18 ULB సమూయేలు దేనినీ దాచకుండా విషయం అంతా అతనికి తెలియజేశాడు. అది విని ఏలీ <<చెప్పినవాడు యెహోవా. ఆయన దృష్ఠికి ఏది అనుకూలమో దాన్ని ఆయన చేస్తాడు గాక>> అన్నాడు. BSB BSB: So Samuel told him everything and did not hide a thing from him. “He is the LORD,” replied Eli. “Let Him do what is good in His eyes.”
19 ULB సమూయేలు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నందువల్ల దేవుని మాటల్లో ఏదీ తప్పిపోలేదు. BSB BSB: And Samuel grew, and the LORD was with him, and He let none of Samuel’s words fall to the ground.
20 ULB కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డాడని దాను ప్రాంతం నుండి బెయేర్షెబా వరకూ ఇశ్రాయేలీయులంతా తెలుసుకున్నారు. BSB BSB: So all Israel from Dan to Beersheba knew that Samuel was confirmed as a prophet of the LORD.
21 ULB షిలోహులో యెహోవా మళ్ళీ దర్శనమిస్తూ వచ్చాడు. షిలోహులో యెహోవా తన వాక్కు ద్వారా తనను సమూయేలుకు ప్రత్యక్ష పరచుకుంటూ వచ్చాడు. సమూయేలు ద్వారా దేవుని వాక్కు ఇశ్రాయేలీయులకు వెల్లడి అయింది. BSB BSB: And the LORD continued to appear at Shiloh, because there He revealed Himself to Samuel by His word.
Select verses for actions: Enter goes to them and Escape comes back.