1 ULB సమూయేలు ముసలివాడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులపై న్యాయాధిపతులుగా నియమించాడు. BSB BSB: When Samuel grew old, he appointed his sons as judges over Israel.
2 ULB అతని పెద్ద కొడుకు పేరు యోవేలు. రెండవవాడి పేరు అబీయా, BSB BSB: The name of his firstborn son was Joel, and the name of his second was Abijah. They were judges in Beersheba.
3 ULB వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కొడుకులు తమ తండ్రివంటి మంచి ప్రవర్తనను అనుసరించకుండా ధనంపై ఆశ పెంచుకుని, లంచాలు తీసుకొంటూ తీర్పులను తారుమారు చేశారు. BSB BSB: But his sons did not walk in his ways; they turned aside toward dishonest gain, accepting bribes and perverting justice.
4 ULB ఇశ్రాయేలు పెద్దలంతా కలసి రమాలో ఉన్న సమూయేలు దగ్గరకి వచ్చి, BSB BSB: So all the elders of Israel gathered together and came to Samuel at Ramah.
5 ULB <<అయ్యా, విను. నువ్వు ముసలివాడివి. నీ కొడుకులు నీలాగా మంచి ప్రవర్తన గలవారు కారు. కాబట్టి ప్రజలందరి కోరికను మన్నించి మాకు ఒక రాజును నియమించు. అతడు మాకు న్యాయం తీరుస్తాడు>> అని అతనితో అన్నారు. BSB BSB: “Look,” they said, “you are old, and your sons do not walk in your ways. Now appoint a king to judge us like all the other nations.”
6 ULB <<మాకు న్యాయం చేయడానికి ఒక రాజును నియమించు>> అని వారు అడిగిన మాట సమూయేలుకు రుచించలేదు. అప్పుడు సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాడు. BSB BSB: But when they said, “Give us a king to judge us,” their demand was displeasing in the sight of Samuel; so he prayed to the LORD.
7 ULB యెహోవా సమూయేలుకు ఇలా బదులిచ్చాడు. <<ప్రజలు నిన్ను కోరినట్టు జరిగించు. వారు తిరస్కరించింది నిన్ను కాదు. తమను పాలించకుండా నన్నే తిరస్కరించారు. BSB BSB: And the LORD said to Samuel, “Listen to the voice of the people in all that they say to you. For it is not you they have rejected, but they have rejected Me as their king.
8 ULB వారు నన్ను తిరస్కరించి, ఇతర దేవుళ్ళను పూజించి, నేను ఐగుప్తునుండి వారిని రప్పించినప్పటి నుండి ఇప్పటిదాకా వారు చేస్తూ వస్తున్న పనుల ప్రకారమే వారు నీ పట్ల కూడా జరిగిస్తున్నారు. వారు కోరినట్టు జరిగించు. BSB BSB: Just as they have done from the day I brought them up out of Egypt until this day, forsaking Me and serving other gods, so they are doing to you.
9 ULB అయితే వారికి రాబోయే కొత్త రాజు ఎలా పరిపాలిస్తాడో దానికి నువ్వే సాక్ష్యంగా ఉండి వారికి స్పష్టంగా తెలియజెయ్యి.>> BSB BSB: Now listen to their voice; but you must solemnly warn them and show them the manner of the king who will reign over them.”
10 ULB తమకు రాజు కావాలని కోరిన ప్రజలకి సమూయేలు యెహోవా చెప్పిన మాటలన్నీ వినిపిస్తూ BSB BSB: So Samuel spoke all the words of the LORD to the people who were asking him for a king.
11 ULB ఇలా చెప్పాడు. <<మిమ్మల్ని ఏలబోయే రాజు ఎలా ఉంటాడంటే, అతడు మీ కొడుకులను పట్టుకుని, తన రథాలు నడపడానికి, గుర్రాలను చూసుకోవడానికి వారిని పనికి పెట్టుకుంటాడు. కొందరు అతని రథాల ముందు పరుగెత్తుతారు. BSB BSB: He said, “This will be the manner of the king who will reign over you: He will take your sons and appoint them to serve his own chariots and horses, and to run in front of his chariots.
12 ULB అతడు కొందరిని తన సైన్యంలోని వెయ్యిమంది పై అధికారులుగా, యాభైమంది పై అధికారులుగా నియమిస్తాడు. తన పొలాలు దున్నడానికి, పంటలు కోయడానికి, యుద్ధం చేసే ఆయుధాలు, రథాల సామానులు తయారుచేయడానికి వారిని పెట్టుకుంటాడు. BSB BSB: He will appoint some for himself as commanders of thousands and of fifties, and others to plow his ground, to reap his harvest, and to make his weapons of war and equipment for his chariots.
13 ULB మీ ఆడపిల్లలను వంటలు చేయడానికి, అలంకరించడానికి, రొట్టెలు కాల్చడానికి పెట్టుకొంటాడు. BSB BSB: And he will take your daughters to be perfumers, cooks, and bakers.
14 ULB మీ పొలాల్లో, ద్రాక్షతోటల్లో, ఒలీవ తోటల్లో శ్రేష్ఠ భాగాన్ని తీసుకు తన సేవకులకు ఇస్తాడు. BSB BSB: He will take the best of your fields and vineyards and olive groves and give them to his servants.
15 ULB మీ పంటలో, ద్రాక్షపళ్ళలో పదవ వంతు తీసుకు తన సిబ్బందికి, పనివారికి ఇస్తాడు. BSB BSB: He will take a tenth of your grain and grape harvest and give it to his officials and servants.
16 ULB మీ స్వంత పనివాళ్ళలో, పనికత్తెల్లో, మీ పశువుల్లో, గాడిదల్లో మంచివాటిని తీసుకు తన కోసం ఉంచుకొంటాడు. BSB BSB: And he will take your menservants and maidservants and your best cattle and donkeys and put them to his own use.
17 ULB మీ మందల్లో పదవ భాగం తీసుకొంటాడు. మీకు మీరుగా అతనికి దాసులైపోతారు. BSB BSB: He will take a tenth of your flocks, and you yourselves will become his slaves.
18 ULB ఇక ఆ రోజుల్లో మీకోసం మీరు కోరుకొన్న రాజు గురించి ఎంతగా వేడుకొన్నా యెహోవా మీ మనవి పట్టించుకోడు.>> BSB BSB: When that day comes, you will beg for relief from the king you have chosen, but the LORD will not answer you on that day.”
19 ULB ఇలా చెప్పినప్పటికీ, ప్రజలు సమూయేలు మాట పెడచెవిన పెట్టి, BSB BSB: Nevertheless, the people refused to listen to Samuel. “No!” they said. “We must have a king over us.
20 ULB <<అలా కాదు, ఇతర దేశ ప్రజలు చేస్తున్నట్లు మేము కూడా చేసేలా మాకూ రాజు కావాలి, ఆ రాజు మాకు న్యాయం జరిగిస్తాడు, మాకు ముందుగా ఉండి అతడే యుద్ధాలు జరిగిస్తాడు>> అన్నారు. BSB BSB: Then we will be like all the other nations, with a king to judge us, to go out before us, and to fight our battles.”
21 ULB సమూయేలు ప్రజలు పలికిన మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిలో వివరించాడు. BSB BSB: Samuel listened to all the words of the people and repeated them in the hearing of the LORD.
22 ULB అప్పుడు యెహోవా <<నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించు>> అని సమూయేలుకు చెప్పినప్పుడు, సమూయేలు <<మీరందరూ మీ మీ గ్రామాలకు వెళ్ళి పొండి>> అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు. BSB BSB: “Listen to their voice,” the LORD said to Samuel. “Appoint a king for them.” Then Samuel told the men of Israel, “Everyone must go back to his city.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.