1 ULB దేవుడు నోవహునూ అతని కొడుకులనూ ఆశీర్వదించాడు. <<మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. BSB BSB: And God blessed Noah and his sons and said to them, “Be fruitful and multiply and fill the earth.
2 ULB అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకే ప్రతి పురుగుకూ సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయం ఉంటుంది, అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి. BSB BSB: The fear and dread of you will fall on every living creature on the earth, every bird of the air, every creature that crawls on the ground, and all the fish of the sea. They are delivered into your hand.
3 ULB ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను. BSB BSB: Everything that lives and moves will be food for you; just as I gave you the green plants, I now give you all things.
4 ULB కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు. BSB BSB: But you must not eat meat with its lifeblood still in it.
5 ULB మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని, అంటే తన సోదరుణ్ణి హత్యచేసిన ప్రతి మనిషినీ ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను. BSB BSB: And surely I will require the life of any man or beast by whose hand your lifeblood is shed. I will demand an accounting from anyone who takes the life of his fellow man:
6 ULB దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి. BSB BSB: Whoever sheds the blood of man, by man his blood will be shed; for in His own image God has made mankind.
7 ULB మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి>> అని వాళ్ళతో చెప్పాడు. BSB BSB: But as for you, be fruitful and multiply; spread out across the earth and multiply upon it.”
9 ULB <<వినండి, నేను మీతోను, మీ తరువాత వచ్చే మీ సంతానంతోను, BSB BSB: “Behold, I now establish My covenant with you and your descendants after you,
10 ULB మీతో పాటు ఉన్న ప్రతి జీవితోను, అవి పక్షులే గాని పశువులే గాని, మీతోపాటు ఉన్న ప్రతి జంతువే గాని, ఓడలోనుంచి బయటకు వచ్చిన ప్రతి భూజంతువుతో నా నిబంధన స్థిరం చేస్తున్నాను. BSB BSB: and with every living creature that was with you—the birds, the livestock, and every beast of the earth—every living thing that came out of the ark.
11 ULB నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడూ నాశనం కారు. భూమిని నాశనం చెయ్యడానికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదు>> అన్నాడు. BSB BSB: And I establish My covenant with you: Never again will all life be cut off by the waters of a flood; never again will there be a flood to destroy the earth.”
12 ULB దేవుడు <<నాకు, మీకు, మీతోపాటు ఉన్న జీవరాసులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే, BSB BSB: And God said, “This is the sign of the covenant I am making between Me and you and every living creature with you, a covenant for all generations to come:
13 ULB మేఘంలో నా ధనుస్సు ఉంచాను. అది నాకు, భూమికి, మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది. BSB BSB: I have set My rainbow in the clouds, and it will be a sign of the covenant between Me and the earth.
14 ULB భూమిమీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది. BSB BSB: Whenever I form clouds over the earth and the rainbow appears in the clouds,
15 ULB అప్పుడు నాకు, మీకు, జీవరాసులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొంటాను గనుక సర్వశరీరులను నాశనం చెయ్యడానికి ఇక ఎన్నడూ నీళ్ళు జలప్రళయంగా రావు. BSB BSB: I will remember My covenant between Me and you and every living creature of every kind. Never again will the waters become a flood to destroy all life.
16 ULB ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికీ, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతి దానికీ మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకొంటాను>> అన్నాడు. BSB BSB: And whenever the rainbow appears in the clouds, I will see it and remember the everlasting covenant between God and every living creature of every kind that is on the earth.”
17 ULB దేవుడు <<నాకు, భూమిమీద ఉన్న సర్వశరీరులకు మధ్య నేను స్థిరం చేసిన నిబంధనకు గుర్తు ఇదే>> అని నోవహుతో చెప్పాడు. BSB BSB: So God said to Noah, “This is the sign of the covenant that I have established between Me and every creature on the earth.”
18 ULB ఓడలోనుంచి వచ్చిన నోవహు ముగ్గురు కొడుకులు షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి. BSB BSB: The sons of Noah who came out of the ark were Shem, Ham, and Japheth. And Ham was the father of Canaan.
19 ULB వీళ్ళ సంతానం, భూమి అంతటా వ్యాపించింది. BSB BSB: These three were the sons of Noah, and from them the whole earth was populated.
21 ULB ఆ ద్రాక్షారసం తాగి మత్తెక్కి తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు. BSB BSB: But when he drank some of its wine, he became drunk and uncovered himself inside his tent.
22 ULB అప్పుడు కనాను తండ్రి అయిన హాము, తన తండ్రి బట్టలు లేకుండా పడి ఉండడం చూసి, బయట ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ విషయం చెప్పాడు. BSB BSB: And Ham, the father of Canaan, saw his father’s nakedness and told his two brothers outside.
23 ULB అప్పుడు షేము, యాపెతు, ఒక బట్ట తీసుకుని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకగా నడిచివెళ్ళి తమ తండ్రి నగ్న శరీరానికి కప్పారు. వాళ్ళ ముఖాలు మరొక వైపు తిరిగి ఉన్నాయి గనుక వాళ్ళు తమ తండ్రి నగ్న శరీరం చూడలేదు. BSB BSB: Then Shem and Japheth took a garment and placed it across their shoulders, and walking backward, they covered their father’s nakedness. Their faces were turned away so that they did not see their father’s nakedness.
24 ULB అప్పుడు నోవహు మత్తులోనుంచి మేల్కొని తన చిన్నకొడుకు చేసిన దాన్ని తెలుసుకున్నాడు. BSB BSB: When Noah awoke from his drunkenness and learned what his youngest son had done to him,
25 ULB <<కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు>> అన్నాడు. BSB BSB: he said, “Cursed be Canaan! A servant of servants shall he be to his brothers.”
26 ULB అతడు <<షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడు గాక. కనాను అతనికి సేవకుడవుతాడు గాక. BSB BSB: He also declared: “Blessed be the LORD, the God of Shem! May Canaan be the servant of Shem.
27 ULB దేవుడు యాపెతును అభివృద్ధి చేస్తాడు గాక. అతడు షేము గుడారాల్లో నివాసం ఉంటాడు. అతనికి కనాను సేవకుడవుతాడు>> అన్నాడు. BSB BSB: May God expand the territory of Japheth; may he dwell in the tents of Shem, and may Canaan be his servant.”
28 ULB ఆ జలప్రళయం తరువాత నోవహు మూడు వందల ఏభై సంవత్సరాలు బ్రతికాడు. BSB BSB: After the flood, Noah lived 350 years.
29 ULB నోవహు మొత్తం తొమ్మిదివందల ఏభై సంవత్సరాలు జీవించాడు. BSB BSB: So Noah lived a total of 950 years, and then he died.