1 ULB అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు ఇచ్చాడు, BSB BSB: Then Zophar the Naamathite replied:
2 ULB ప్రవాహంలాగా బయటకు వస్తున్న నీ మాటలకు జవాబు చెప్పాలి గదా. వదరుబోతును నిర్దోషి అని ఎంచడం జరుగుతుందా? BSB BSB: “Should this stream of words go unanswered and such a speaker be vindicated?
3 ULB నీ పొగరుబోతు మాటలు విని మనుషులు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండాలా? నీ మాటలను బట్టి ఎవ్వరూ నిన్ను మందలించకూడదా? BSB BSB: Should your babbling put others to silence? Will you scoff without rebuke?
4 ULB నువ్వు దేవునితో <<నేను అనుసరించేది సక్రమం, నీ దృష్టిలో నేను పవిత్రంగా ఉన్నాను>> అంటున్నావు గదా. BSB BSB: You have said, ‘My doctrine is sound, and I am pure in Your sight.’
5 ULB నువ్వు దేవునితో మాట్లాడితే మంచిది. ఆయనే నీతో వాదులాటకు దిగితే బాగుంటుంది. BSB BSB: But if only God would speak and open His lips against you,
6 ULB ఆయనే నీకు జ్ఞాన రహస్యాలు తెలియజేయాలి. ఆయన జ్ఞాన పూర్ణుడు. నువ్వు చేసిన దోషాలకు తగినదాని కంటే తక్కువ సంజాయిషీయే దేవుడు నీ నుండి కోరుతున్నాడని తెలుసుకో. BSB BSB: and disclose to you the secrets of wisdom, for true wisdom has two sides. Know then that God exacts from you less than your iniquity deserves.
7 ULB దేవుని నిగూఢ సత్యాలు నువ్వు తెలుసుకోగలవా? సర్వశక్తుడైన దేవుణ్ణి గూర్చిన పరిపూర్ణ జ్ఞానం నీకు ఉంటుందా? BSB BSB: Can you fathom the deep things of God or discover the limits of the Almighty?
8 ULB నువ్వు ఏమి చేయగలవు? అది ఆకాశ విశాలం కంటే ఉన్నతమైనది. నీకేం తెలుసు? అది పాతాళంకంటే లోతుగా ఉన్నది. BSB BSB: They are higher than the heavens—what can you do? They are deeper than Sheol—what can you know?
9 ULB దాని కొలత భూమికంటే పొడవు, దాని వెడల్పు సముద్రంకన్నా విశాలం. BSB BSB: Their measure is longer than the earth and wider than the sea.
10 ULB ఆయన సంచారం చేస్తూ ఒకణ్ణి బంధించి, తీర్పులో విచారణ జరిగిస్తే ఆయనకు ఎదురు చెప్పగలిగేవాడు ఎవరు? BSB BSB: If He comes along to imprison you, or convenes a court, who can stop Him?
11 ULB పనికిమాలిన వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు. ఎక్కడ పాపం జరుగుతుందో ఆయన ఇట్టే కనిపెట్టగలడు. BSB BSB: Surely He knows the deceit of men. If He sees iniquity, does He not take note?
12 ULB అయితే అడవి గాడిదపిల్ల మనిషిగా పుట్టగలిగితే బుద్ధిహీనుడు తెలివిగలవాడు కావచ్చు. BSB BSB: But a witless man can no more become wise than the colt of a wild donkey can be born a man!
13 ULB నువ్వు నీ హృదయాన్ని సవ్యంగా ఉంచుకో. నీ చేతులు ఆయన వైపు చాపు. BSB BSB: As for you, if you direct your heart and lift up your hands to Him,
14 ULB నీ చేతిలో చెడుతనం ఉందని గ్రహించి దాన్ని విడిచిపెట్టు. నీ గుడారంలో ఉన్న అక్రమాన్ని పూర్తిగా తొలగించు. BSB BSB: if you put away the iniquity in your hand, and allow no injustice to dwell in your tents,
15 ULB అలా చేస్తే నువ్వు తప్పకుండా ఎలాంటి కళంకం లేనివాడవై నిర్భయంగా, స్థిరంగా, సంతోషంగా ఉంటావు. BSB BSB: then indeed you will lift up your face without blemish; you will stand firm and unafraid.
16 ULB తప్పకుండా నువ్వు నీ గడ్డుకాలాన్ని మరచిపోతావు. ప్రవహిస్తూ దాటిపోయిన నీటిని గుర్తు పెట్టుకున్నట్టు నువ్వు దాన్ని గుర్తు చేసుకుంటావు. BSB BSB: For you will forget your misery, recalling it only as waters gone by.
17 ULB అప్పుడు నీ జీవితం మధ్యాహ్నం ఉండే ఎండ కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. చీకటి ఆవరించినా అది సూర్యోదయపు వెలుగులాగా కనిపిస్తుంది. BSB BSB: Your life will be brighter than noonday; its darkness will be like the morning.
18 ULB నీ నమ్మకానికి ఒక ఆధారం దొరుకుతుంది. కనుక నువ్వు ధైర్యంగా ఉంటావు. నీ ఇల్లు మొత్తం కలయజూసి క్షేమంగా విశ్రాంతి తీసుకుంటావు. BSB BSB: You will be secure, because there is hope, and you will look around and lie down in safety.
19 ULB ఎవరి భయమూ లేకుండా నువ్వు నిద్రపోతావు. అనేకమంది నీ సహాయం కోరుకుంటారు. BSB BSB: You will lie down without fear, and many will court your favor.
20 ULB దుర్మార్గుల కంటిచూపు మందగిస్తుంది. వాళ్లకు ఎలాంటి ఆశ్రయమూ దొరకదు. తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. BSB BSB: But the eyes of the wicked will fail, and escape will elude them; they will hope for their last breath.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.