1 ULB అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు, BSB BSB: Then Job answered:
2 ULB నిజంగా లోకంలో ఉన్న ప్రజలంతా మీరేనా? మీతోనే జ్ఞానం కడతేరి పోతుందా? BSB BSB: “Truly then you are the people with whom wisdom itself will die!
3 ULB మీకున్నట్టు నాక్కూడా తెలివితేటలు ఉన్నాయి. నేను మీకంటే జ్ఞానం గలవాణ్ణి. మీరు చెప్పే విషయాలు ఎవరికి తెలియదు? BSB BSB: But I also have a mind; I am not inferior to you. Who does not know such things as these?
4 ULB దేవుణ్ణి వేడుకుని ఈవులు పొందిన నేను ఇప్పుడు నా స్నేహితుని ఎదుట నవ్వులపాలు కావలసి వచ్చింది. నీతి నిజాయితీలు కలిగిన నేను ఇతరులు చేసే ఎగతాళి భరించాల్సి వస్తుంది. BSB BSB: I am a laughingstock to my friends, though I called on God, and He answered. The righteous and upright man is a laughingstock.
5 ULB క్షేమస్థితిలో ఉన్నవాళ్ళు దుర్దశలో ఉన్న వాళ్ళను తృణీకరించడం మంచిదని భావిస్తారు. కాళ్ళు జారుతున్న వారికి మరింత దురదృష్టం జత చేసే మార్గాలు వారు వెతుకుతారు. BSB BSB: The one at ease scorns misfortune as the fate of those whose feet are slipping.
6 ULB దోపిడీ దొంగల నివాసాలు వర్ధిల్లుతాయి. దేవునికి కోపం పుట్టించేవాళ్ళు భయం లేకుండా సంచరిస్తారు. తమ శక్తి యుక్తులనే తమ దేవుళ్ళుగా భావించుకుంటారు. BSB BSB: The tents of robbers are safe, and those who provoke God are secure—those who carry their god in their hands.
7 ULB అయితే, మృగాలను అడగండి, అవి మీకు బోధ చేస్తాయి. ఆకాశంలో పక్షులను అడగండి, అవి మీకు చెబుతాయి. BSB BSB: But ask the animals, and they will instruct you; ask the birds of the air, and they will tell you.
8 ULB భూమి గురించి ఆలోచిస్తే అది నీకు బోధిస్తుంది. సముద్రంలో ఉండే చేపలు కూడా నీకు ఉపదేశం చేస్తాయి. BSB BSB: Or speak to the earth, and it will teach you; let the fish of the sea inform you.
9 ULB యెహోవా వీటన్నిటినీ తన చేతితో సృష్టించాడని గ్రహించలేని వాడెవడు? BSB BSB: Which of all these does not know that the hand of the LORD has done this?
10 ULB జీవం ఉన్న సమస్త ప్రాణులు, సమస్త మానవకోటి ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. BSB BSB: The life of every living thing is in His hand, as well as the breath of all mankind.
11 ULB నాలుక ఆహారాన్ని ఎలా రుచి చూస్తుందో అలాగే చెవి అది వినే మాటలను పరీక్షిస్తుంది గదా. BSB BSB: Does not the ear test words as the tongue tastes its food?
12 ULB వృద్ధులు జ్ఞానులు. ఆయుష్షు పెరిగే కొద్దీ వివేకం పెరుగుతుంది. BSB BSB: Wisdom is found with the elderly, and understanding comes with long life.
13 ULB అయితే దేవునికి జ్ఞానం, బల ప్రభావాలు ఉన్నాయి. ఆలోచనా, వివేకమూ ఆయనకు ఉన్నాయి. BSB BSB: Wisdom and strength belong to God; counsel and understanding are His.
14 ULB ఆలోచించు, ఆయన పడగొట్టిన దాన్ని మళ్ళీ ఎవ్వరూ తిరిగి కట్టలేరు. ఒకవేళ ఆయన ఒకరిని చెరసాల్లో ఉంచితే దాన్ని తెరవడం ఎవరికీ సాధ్యం కాదు. BSB BSB: What He tears down cannot be rebuilt; the man He imprisons cannot be released.
15 ULB చూడండి, ఆయన ప్రవాహాలను కట్టడిచేస్తే అవి ఇంకిపోతాయి. వాటిని విడుదల చేస్తే అవి భూమిని ముంచివేస్తాయి. BSB BSB: If He holds back the waters, they dry up, and if He releases them, they overwhelm the land.
16 ULB బలమూ, జ్ఞానమూ ఆయన గుణ లక్షణాలు. మోసగాళ్ళు, మోసపోయే వాళ్ళు ఆయన ఆధీనంలో ఉన్నారు. BSB BSB: True wisdom and power belong to Him. The deceived and the deceiver are His.
17 ULB ఆలోచనలు చెప్పేవాళ్ళను వస్త్రహీనులనుగా చేసి ఆయన వాళ్ళను బందీలుగా తీసుకువెళ్తాడు. న్యాయాధిపతులందరూ తెలివి లేనివాళ్ళని ఆయన రుజువు చేస్తాడు. BSB BSB: He leads counselors away barefoot and makes fools of judges.
18 ULB రాజుల అధికారాలను ఆయన రద్దు చేస్తాడు. వారి నడుములను సంకెళ్ళతో బంధిస్తాడు. BSB BSB: He loosens the bonds placed by kings and fastens a belt around their waists.
19 ULB యాజకులను వస్త్రహీనులనుగా చేసి వాళ్ళను బందీలుగా తీసుకువెళ్తాడు. స్థిరంగా పాతుకుపోయి ఉన్నవాళ్ళను ఆయన కూలదోస్తాడు. BSB BSB: He leads priests away barefoot and overthrows the established.
20 ULB వాక్చాతుర్యం గలవారు చెప్పే మాటలను ఆయన వ్యర్ధపరుస్తాడు. పెద్దమనుషులను తెలివితక్కువ వాళ్లనుగా చేస్తాడు. BSB BSB: He deprives the trusted of speech and takes away the discernment of elders.
21 ULB పాలకులను ఆయన తిరస్కరిస్తాడు. బలవంతులను బలహీనులుగా చేస్తాడు. BSB BSB: He pours out contempt on nobles and disarms the mighty.
22 ULB చీకట్లోని లోతైన విషయాలను ఆయన బయలు పరుస్తాడు. మరణాంధకారంలోకి వెలుగు రప్పిస్తాడు. BSB BSB: He reveals the deep things of darkness and brings deep shadows into light.
23 ULB ఆయన ప్రజలను వృద్ది పరుస్తాడు, అదే సమయంలో నాశనం చేస్తాడు. వాళ్ళ పొలిమేరలను విశాల పరుస్తాడు. వాళ్ళను ఖైదీలుగా కూడా తీసుకు పోతాడు. BSB BSB: He makes nations great and destroys them; He enlarges nations, then disperses them.
24 ULB లోకంలోని ప్రజల, పాలకుల జ్ఞానాన్ని ఆయన వ్యర్థం చేస్తాడు. వాళ్ళు దారీతెన్నూ లేని ఎడారి ప్రాంతంలో సంచరించేలా చేస్తాడు. BSB BSB: He deprives the earth’s leaders of reason and makes them wander in a trackless wasteland.
25 ULB వాళ్ళు వెలుగు లేనివారై చీకటిలో తడుముకుంటారు. మత్తులో ఉన్నవాడు తూలి పడినట్టు ఆయన వాళ్ళను తూలిపోయేలా చేస్తాడు. BSB BSB: They grope in the darkness without light; He makes them stagger like drunkards.
Select verses for actions: Enter goes to them and Escape comes back.