1 ULB అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబిచ్చాడు. BSB BSB: Then Bildad the Shuhite replied:
2 ULB ఎంతసేపు మాటలు వెదుక్కుంటూ నన్ను చిక్కుల్లో పడేయాలని చూస్తావు? నువ్వు ఆలోచించుకో. తరువాత నేను మాట్లాడతాను. BSB BSB: “How long until you end these speeches? Show some sense, and then we can talk.
3 ULB నువ్వెందుకు మమ్మల్ని మూర్ఖులుగా, పశువులుగా ఎంచుతున్నావు? BSB BSB: Why are we regarded as cattle, as stupid in your sight?
4 ULB అమితమైన కోపంతో నిన్ను నువ్వే చీల్చుకొంటున్నావు. నీ కోసం భూమి అంతా పాడైపోవాలా? నువ్వు కోరుకున్నావని కొండ తన స్థానం మార్చుకుంటుందా? BSB BSB: You who tear yourself in anger—should the earth be forsaken on your account, or the rocks be moved from their place?
5 ULB భక్తిహీనుల దీపం తప్పక ఆరిపోతుంది. వాళ్ళ ఇళ్ళల్లో దీపాలు వెలగకుండా పోతాయి. BSB BSB: Indeed, the lamp of the wicked is extinguished; the flame of his fire does not glow.
6 ULB వాళ్ళ నివాసాల్లో ఉన్న వెలుగు చీకటిగా మారిపోతుంది. వాళ్ళ దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది. BSB BSB: The light in his tent grows dark, and the lamp beside him goes out.
7 ULB వాళ్ళ బలమైన అడుగులు మార్గం తప్పుతాయి. వాళ్ళ సొంత ఆలోచనలు పతనానికి నడిపిస్తాయి. BSB BSB: His vigorous stride is shortened, and his own schemes trip him up.
8 ULB వాళ్ళు బోనుల్లోకి నడుస్తూ వెళ్ళే వాళ్ళు. వాళ్ళ పాదాలు వాళ్ళను వలలో పడేలా నడిపిస్తాయి. BSB BSB: For his own feet lead him into a net, and he wanders into its mesh.
9 ULB వాళ్ళ మడిమెలు బోనులో ఇరుక్కుంటాయి. వాళ్ళు ఉచ్చులో చిక్కుకుంటారు. BSB BSB: A trap seizes his heel; a snare grips him.
10 ULB వాళ్ళ కోసం ఉరి నేలపై సిద్ధంగా ఉంది. వాళ్ళను పట్టుకోవడానికి దారిలో ఉచ్చు బిగించి ఉంది. BSB BSB: A noose is hidden in the ground, and a trap lies in his path.
11 ULB అన్నివైపుల నుండి భయం కలిగించే విషయాలు వాళ్ళను చుట్టుముడతాయి. భయాలు అన్నివైపులకు వాళ్ళను వెంటాడి తరుముతాయి. BSB BSB: Terrors frighten him on every side and harass his every step.
12 ULB వాళ్ళ బలం క్షీణించిపోతుంది. వాళ్ళను కూల్చడానికి సిద్ధంగా ఆపద ఉంటుంది. BSB BSB: His strength is depleted, and calamity is ready at his side.
13 ULB అది వాళ్ళ అవయవాలను తినివేస్తుంది. మరణకరమైన రోగం వాళ్ళ శరీరాన్ని క్షీణింపజేస్తుంది. BSB BSB: It devours patches of his skin; the firstborn of death devours his limbs.
14 ULB వాళ్ళు నిర్భయంగా తమ గుడారాల్లో ఉన్నప్పుడు వారిని బయటకు ఈడ్చివేస్తారు. వారిని క్రూరుడైన రాజు దగ్గరికి బందీలుగా కొనిపోతారు. BSB BSB: He is torn from the shelter of his tent and is marched off to the king of terrors.
15 ULB వాళ్లకు సంబంధంలేని ఇతరులు వాళ్ళ గుడారాల్లో కాపురం ఉంటారు. వాళ్ళ నివాసస్థలాల మీద గంధకం చల్లడం జరుగుతుంది. BSB BSB: Fire resides in his tent; burning sulfur rains down on his dwelling.
16 ULB వాళ్ళ వేళ్లు కింద ఉన్నవి కిందనే ఎండిపోతాయి. పైన ఉన్న వాళ్ళ కొమ్మలు నరకబడతాయి. BSB BSB: The roots beneath him dry up, and the branches above him wither away.
17 ULB భూమి మీద వాళ్ళ ఆనవాళ్ళు తుడిచి పెట్టుకు పోతాయి. భూతలంపై వాళ్ళను జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. BSB BSB: The memory of him perishes from the earth, and he has no name in the land.
18 ULB వాళ్ళను వెలుగులో నుండి చీకటిలోకి తోలివేస్తారు. భూమిపై లేకుండా వాళ్ళను తరుముతారు. BSB BSB: He is driven from light into darkness and is chased from the inhabited world.
19 ULB వాళ్లకు కొడుకులు, మనవలు ఎవ్వరూ మిగలరు. వాళ్ళ ఇంట సజీవంగా ఉండే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. BSB BSB: He has no offspring or posterity among his people, no survivor where he once lived.
20 ULB వాళ్లకు పట్టిన దుర్గతిని చూసి తరువాత వచ్చిన పశ్చిమ దేశస్తులు ఆశ్చర్యపోతారు. తూర్పున ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు లోనౌతారు. BSB BSB: Those in the west are appalled at his fate, while those in the east tremble in horror.
21 ULB భక్తిహీనుల నివాసాలకు, దేవుణ్ణి ఎరగని ప్రజల స్థలాలకు ఇలాంటి గతి తప్పకుండా పడుతుంది. BSB BSB: Surely such is the dwelling of the wicked and the place of one who does not know God.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.