1 ULB అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు. BSB BSB: Then Job answered:
2 ULB మీరు నా మాటలు శ్రద్ధగా వినండి. నా మాటలు విని నన్ను ఆదరించకపోయినా సరే నా మాటలు వింటే చాలు. BSB BSB: “Listen carefully to my words; let this be your consolation to me.
3 ULB నాకు అనుమతి ఇస్తే నేను మాట్లాడతాను. నా మాటలు విన్న తరువాత మీరు నన్ను ఎగతాళి చేస్తారేమో. BSB BSB: Bear with me while I speak; then, after I have spoken, you may go on mocking.
4 ULB నేను మనుషులకు విన్నపం చేయడం లేదు. నేనెందుకు ఆత్రుత చెందకూడదు? BSB BSB: Is my complaint against a man? Then why should I not be impatient?
5 ULB మీ నోళ్ళపై చేతులు ఉంచుకుని నన్ను పరిశీలించి చూసి ఆశ్చర్యపడండి. BSB BSB: Look at me and be appalled; put your hand over your mouth.
6 ULB ఈ విషయాలను గురించి తలుచుకుంటే నాకేమీ తోచడం లేదు. నా శరీరమంతా వణికిపోతుంది. BSB BSB: When I remember, terror takes hold, and my body trembles in horror.
7 ULB భక్తిహీనులు ఇంకా ఎలా బతికి ఉన్నారు? వాళ్ళు ముసలివాళ్ళు అవుతున్నా ఇంకా బలంగా ఉంటున్నారెందుకు? BSB BSB: Why do the wicked live on, growing old and increasing in power?
8 ULB వాళ్ళు బతికి ఉండగానే వాళ్ళ సంతానం, వాళ్ళు చూస్తూ ఉండగానే వాళ్ళ కుటుంబాలు చక్కబడుతున్నాయి. BSB BSB: Their descendants are established around them, and their offspring before their eyes.
9 ULB వాళ్ళ సంతానానికి ఎలాంటి ఆపదా కలగడం లేదు. వాళ్ళు క్షేమం ఉన్నారు. దేవుని కాపుదల వాళ్ళపై ఉంటుంది. BSB BSB: Their homes are safe from fear; no rod of punishment from God is upon them.
10 ULB వాళ్ళ పశువులు దాటితే తప్పకుండా చూలు కలుగుతుంది. ఆవులు తేలికగా ఈనుతున్నాయి, వాటి దూడలు పుట్టగానే చనిపోవడం లేదు. BSB BSB: Their bulls breed without fail; their cows bear calves and do not miscarry.
11 ULB వాళ్ళ పిల్లలు గుంపులు గుంపులుగా బయటికి వస్తారు. వాళ్ళు ఎగురుతూ గంతులు వేస్తారు. BSB BSB: They send forth their little ones like a flock; their children skip about,
12 ULB వాళ్ళు తంబుర, తంతివాద్యం వాయిస్తూ గొంతెత్తి పాటలు పాడుతూ సంతోషిస్తారు. BSB BSB: singing to the tambourine and lyre and making merry at the sound of the flute.
13 ULB వాళ్ళు సుఖంగా తమ రోజులు గడుపుతారు. అయితే ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. BSB BSB: They spend their days in prosperity and go down to Sheol in peace.
14 ULB వాళ్ళు <<నువ్వు మాకు అక్కరలేదు, నువ్వు బోధించే జ్ఞానయుక్తమైన సంగతులు మేము వినం>> అని దేవునితో చెబుతారు. BSB BSB: Yet they say to God: ‘Leave us alone! For we have no desire to know Your ways.
15 ULB <<మేము సేవించడానికి సర్వశక్తుడైన ఆయన ఎంతటి వాడు? మేము ఆయనను వేడుకుంటే మాకు ఒరిగే దేమిటి?>> అని వాళ్ళు అడుగుతారు. BSB BSB: Who is the Almighty, that we should serve Him, and what would we gain if we pray to Him?’
16 ULB వారి ఎదుగుదల వాళ్ళ చేతుల్లో లేదు. భక్తిహీనుల తలంపులు నాకు దూరంగా ఉండుగాక. BSB BSB: Still, their prosperity is not in their own hands, so I stay far from the counsel of the wicked.
17 ULB భక్తిహీనుల దీపం ఆరిపోవడం తరచుగా జరుగుతుందా? వాళ్ళ మీదికి విపత్తులు రావడం చాలా అరుదు గదా. BSB BSB: How often is the lamp of the wicked put out? Does disaster come upon them? Does God, in His anger, apportion destruction?
18 ULB ఆయన వాళ్ళపై కోపం తెచ్చుకుని వాళ్లకు ఆపదలు కలిగించడం, వాళ్ళను తుఫానుకు కొట్టుకుపోయే చెత్తలాగా, గాలికి ఎగిరిపోయే పొట్టులాగా చేయడం తరచూ జరగదు గదా. BSB BSB: Are they like straw before the wind, like chaff swept away by a storm?
19 ULB <<వాళ్ళ పాపాలన్నీ వాళ్ళ సంతానం మీద మోపడానికి ఆయన వాటిని దాచి ఉండవచ్చు>> అని మీరు అంటున్నారు. పాపం చేసిన వాళ్లే వాటిని అనుభవించేలా ఆయన వారికే ప్రతిఫలమివ్వాలి. BSB BSB: It is said that God lays up one’s punishment for his children. Let God repay the man himself, so he will know it.
20 ULB తమ నాశనాన్ని వాళ్ళు స్వయంగా చూడాలి. సర్వశక్తుడైన దేవుని కోపాగ్నిని వారు అనుభవించాలి. BSB BSB: Let his eyes see his own destruction; let him drink for himself the wrath of the Almighty.
21 ULB వాళ్ళ జీవితకాలం ముగిసిపోయి, చనిపోయిన తరువాత ఇంటి విషయాల మీద వాళ్లకు శ్రద్ధ ఎలా ఉంటుంది? BSB BSB: For what does he care about his household after him, when the number of his months has run out?
22 ULB దేవునికి జ్ఞాన వివేకాలు నేర్పించేవాడు ఎవరైనా ఉన్నారా? ఆయన పరలోకంలో ఉండే నీతిమంతులకు తీర్పు తీర్చేవాడు గదా. BSB BSB: Can anyone teach knowledge to God, since He judges those on high?
23 ULB ఒకడు సమస్త సుఖాలు అనుభవించి, మంచి ఆరోగ్యం, నెమ్మది కలిగి జీవించి చనిపోతాడు. BSB BSB: One man dies full of vigor, completely secure and at ease.
24 ULB అతడి కుండ నిండా పాలు పొర్లుతాయి. అతడి ఎముకలు సత్తువ కలిగి ఉంటాయి. BSB BSB: His body is well nourished, and his bones are rich with marrow.
25 ULB మరొకడు ఎన్నడూ సుఖ సంతోషాలు అనేవి తెలియకుండా మనోవేదన గలవాడై చనిపోతాడు. BSB BSB: Yet another man dies in the bitterness of his soul, having never tasted prosperity.
26 ULB ఇద్దరినీ సమానంగా ఒకే వరసలో మట్టిలో పాతిపెడతారు. ఇద్దరినీ పురుగులు కప్పివేస్తాయి. BSB BSB: But together they lie down in the dust, and worms cover them both.
27 ULB నాకు వ్యతిరేకంగా మీరు పన్నుతున్న కుట్రలు నాకు తెలుసు. మీ మనసులోని ఆలోచనలు నేను గ్రహించాను. BSB BSB: Behold, I know your thoughts full well, the schemes by which you would wrong me.
28 ULB <<ఉన్నత వంశస్థుల గృహాలు ఎక్కడ ఉన్నాయి? దుర్మార్గుల నివాసాలు ఎక్కడ ఉన్నాయి?>> అని మీరు అడుగుతున్నారు గదా. BSB BSB: For you say, ‘Where now is the nobleman’s house, and where are the tents in which the wicked dwell?’
29 ULB దేశంలో ప్రయాణాలు చేసే యాత్రికులను మీరు అడగలేకపోయారా? వాళ్ళు చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకోలేకపోయారా? BSB BSB: Have you never asked those who travel the roads? Do you not accept their reports?
30 ULB ఆ విషయాలేమిటంటే, ఆపద కలిగిన రోజున దుర్మార్గులు తప్పించుకుంటారు. ఉగ్రత దిగి వచ్చే రోజున వాళ్ళు దాని నుండి పక్కకు తొలగించబడతారు. BSB BSB: Indeed, the evil man is spared from the day of calamity, delivered from the day of wrath.
31 ULB వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకు ఎదురు నిలిచి మాట్లాడగలిగేది ఎవరు? వారు చేసిన పనులను బట్టి వారికి శిక్ష విధించేవాడు ఎవరు? BSB BSB: Who denounces his behavior to his face? Who repays him for what he has done?
32 ULB వాళ్ళు చనిపోతే సమాధి అవుతారు. ఆ సమాధికి కాపలా ఉంటుంది. BSB BSB: He is carried to the grave, and watch is kept over his tomb.
33 ULB పళ్ళెంలో మట్టి పెంకులు వారికి సుఖం ఇస్తాయి. మనుషులంతా వాళ్ళనే అనుసరిస్తారు. గతంలో లెక్కలేనంతమంది వాళ్లకు ముందు ఇలాగే చేశారు. BSB BSB: The clods of the valley are sweet to him; everyone follows behind him, and those before him are without number.
34 ULB మీరు చెప్పే జవాబులు నమ్మదగినవిగా లేవు. ఇలాంటి వ్యర్ధమైన మాటలతో మీరు నన్నెలా ఓదార్చాలని చూస్తున్నారు? BSB BSB: So how can you comfort me with empty words? For your answers remain full of falsehood.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.