1 ULB అప్పుడు నయమాతీయుడు జోఫరు ఇలా జవాబు చెప్పాడు, BSB BSB: Then Zophar the Naamathite replied:
2 ULB నువ్వు అలా చెప్పినందువల్ల నాలో కలిగిన ఆత్రుత నీకు తగిన జవాబు చెప్పాలని తొందర చేస్తున్నది. BSB BSB: “So my anxious thoughts compel me to answer, because of the turmoil within me.
3 ULB నన్ను అవమానపరిచే నింద నీ నుండి వినవలసి వచ్చింది గనుక తెలివిగల నా మనసు జవాబు చెప్పేందుకు నన్ను పురిగొల్పుతున్నది. BSB BSB: I have heard a rebuke that insults me, and my understanding prompts a reply.
4 ULB ఆదిలో మనుషులు భూమి మీద నివసించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇలాగే జరుగుతున్నదని నీకు తెలియదా? BSB BSB: Do you not know that from antiquity, since man was placed on the earth,
5 ULB దుర్మార్గులకు దక్కే విజయం అశాశ్వితం. భక్తిహీనులకు లభించే సంతోషం క్షణకాలం మాత్రం ఉండేది. BSB BSB: the triumph of the wicked has been brief and the joy of the godless momentary?
6 ULB వాళ్ళ గొప్పదనం ఆకాశం కన్నా ఎత్తుగా ఎదిగి, మేఘాల కంటే ఎత్తుగా తలెత్తుకుని తిరగవచ్చు. BSB BSB: Though his arrogance reaches the heavens, and his head touches the clouds,
7 ULB అయితే వాళ్ళ మలం లాగా వాళ్ళు ఎప్పటికీ కనబడకుండా కనుమరుగైపోతారు. అంతకు ముందు వాళ్ళను చూసిన వాళ్ళు <<వాళ్ళంతా ఏమయ్యారు?>> అని అడుగుతారు. BSB BSB: he will perish forever, like his own dung; those who had seen him will ask, ‘Where is he?’
8 ULB కల లాగా వాళ్ళు కరిగి పోయి మళ్ళీ కనబడకుండా పోతారు. రాత్రివేళ వచ్చే కలలాగా వాళ్ళు చెదరిపోతారు. BSB BSB: He will fly away like a dream, never to be found; he will be chased away like a vision in the night.
9 ULB వాళ్ళను చూసిన కళ్ళు ఇకపై వాళ్ళను చూడవు. అతని నివాసం అతన్నిక చూడదు. BSB BSB: The eye that saw him will see him no more, and his place will no longer behold him.
10 ULB వాళ్ళ సంతతి వాళ్ళు కనికరించమని దరిద్రులను వేడుకుంటారు. వారి చేతుల్లో ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చివేస్తారు. BSB BSB: His sons will seek the favor of the poor, for his own hands must return his wealth.
11 ULB వాళ్ళ ఎముకల్లో యవ్వన శక్తి నిండి ఉన్నప్పటికీ అది కూడా వాళ్ళతో కలసి మట్టిలో నిద్రిస్తుంది. BSB BSB: The youthful vigor that fills his bones will lie down with him in the dust.
12 ULB చెడుతనం వాళ్ళ నోటికి తియ్యగా ఉంది. వాళ్ళ నాలుకల కింద దాన్ని దాచి ఉంచారు. BSB BSB: Though evil is sweet in his mouth and he conceals it under his tongue,
13 ULB దాన్ని జాగ్రత్త చేసుకుని తమలోనే ఉంచుకున్నారు. తమ నోట్లోనే భద్రం చేసుకున్నారు. BSB BSB: though he cannot bear to let it go and keeps it in his mouth,
14 ULB అయితే వాళ్ళ కడుపులో ఉన్నదంతా పులిసిపోతుంది. వాళ్ళ శరీరంలో అది నాగుపాము విషంగా మారుతుంది. BSB BSB: yet in his stomach his food sours into the venom of cobras within him.
15 ULB వాళ్ళు దిగమింగిన ధనాన్ని ఇప్పుడు కక్కివేస్తారు. దేవుడే వాళ్ళ కడుపులోనుండి కక్కివేసేలా చేస్తాడు. BSB BSB: He swallows wealth but vomits it out; God will force it from his stomach.
16 ULB వాళ్ళు కట్లపాముల విషం లోపలికి పీల్చుకునేవాళ్ళు. నాగుపాము కోరలు వాళ్ళను చంపివేస్తాయి. BSB BSB: He will suck the poison of cobras; the fangs of a viper will kill him.
17 ULB తేనెధారలు, వెన్నపూస ఏరులై పారుతున్నప్పటికీ వాళ్ళు సంతోషించరు. BSB BSB: He will not enjoy the streams, the rivers flowing with honey and cream.
18 ULB వాళ్ళు సంపాదించిన ఆస్తి మేరకు కష్టాలు పెరుగుతాయి. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నదంతా అనుభవించకుండానే తిరిగి అప్పగిస్తారు. BSB BSB: He must return the fruit of his labor without consuming it; he cannot enjoy the profits of his trading.
19 ULB వాళ్ళు దరిద్రులపై దాడులు చేసి విడిచిపెట్టినవాళ్ళు. తమవి కాని ఇళ్ళను బలవంతంగా ఆక్రమించుకుంటారు. ఆ ఇళ్ళను కట్టి పూర్తి చేయరు. BSB BSB: For he has oppressed and forsaken the poor; he has seized houses he did not build.
20 ULB వాళ్ళు తమ అత్యాశతో సంపాదించుకున్న ఇష్టమైన వస్తువుల్లో ఒక దానితోనైనా తమను తాము కాపాడుకోలేరు. BSB BSB: Because his appetite is never satisfied, he cannot escape with his treasure.
21 ULB వాళ్ళు దిగమింగిన వాటిలో ఏదీ మిగలడం లేదు. అందువల్ల వాళ్ళ క్షేమ స్థితి నిలబడదు. BSB BSB: Nothing is left for him to consume; thus his prosperity will not endure.
22 ULB వాళ్ళు మితిలేని సంపాదన కలిగి ఉన్న రోజుల్లో ఇబ్బందులకు గురౌతారు. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళందరూ వాళ్ళపై దాడి చేస్తారు. BSB BSB: In the midst of his plenty, he will be distressed; the full force of misery will come upon him.
23 ULB వాళ్ళు తమ కడుపు నింపుకునే సమయంలో దేవుడు వాళ్ళ మీద తన కోపాగ్ని కురిపిస్తాడు. వాళ్ళు తినే సమయంలోనే అది కురుస్తుంది. BSB BSB: When he has filled his stomach, God will vent His fury upon him, raining it down on him as he eats.
24 ULB ఇనప ఆయుధం నుండి తప్పించుకొనేందుకు పారిపోతున్నప్పుడు ఇత్తడి విల్లు నుండి బాణం వాళ్ళ దేహాల్లోకి దూసుకుపోతుంది. BSB BSB: Though he flees from an iron weapon, a bronze-tipped arrow will pierce him.
25 ULB ఆ బాణం వాళ్ళ దేహాలను చీల్చివేసి శరీరం నుండి బయటకు వస్తుంది. దాన్ని బయటకు తీసినప్పుడు కాలేయం తుత్తునియలు అవుతుంది. మరణభయం వాళ్ళ మీదికి వస్తుంది. BSB BSB: It is drawn out of his back, the gleaming point from his liver. Terrors come over him.
26 ULB వాళ్ళ ధన సంపదలు చీకటిమయం అవుతాయి. ఎవ్వరూ రాజేయకుండానే అగ్ని లేచి వాళ్ళను మింగివేస్తుంది. వాళ్ళ గుడారాల్లో మిగిలినదాన్ని అది కాల్చివేస్తుంది. BSB BSB: Total darkness is reserved for his treasures. A fire unfanned will consume him and devour what is left in his tent.
27 ULB వాళ్ళ దోషాలకు ఆకాశం సాక్షిగా నిలబడుతుంది. భూమి వారిపై తిరగబడుతుంది. BSB BSB: The heavens will expose his iniquity, and the earth will rise up against him.
28 ULB వాళ్ళ ఇళ్ళకు చేరిన సంపాదన కనబడకుండా పోతుంది. దేవుని ఉగ్రత దినాన అదంతా నాశనమౌతుంది. BSB BSB: The possessions of his house will be removed, flowing away on the day of God’s wrath.
29 ULB దేవుని దగ్గర నుంచి దుష్టులైన మనుషులకు ప్రాప్తించేది ఇదే. దేవుడు వాళ్ళకు నియమించే వారసత్వం ఇదే. BSB BSB: This is the wicked man’s portion from God, the inheritance God has appointed him.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.