1 ULB యోబు మళ్లీ మాట్లాడడం మొదలు పెట్టి ఇలా అన్నాడు. BSB BSB: And Job continued his discourse:
2 ULB గతంలో ఉన్నట్టే నేను ఉంటే ఎంత బాగుంటుంది! దేవుడు నన్ను కాపాడిన రోజుల్లో ఉన్నట్టు ఉంటే ఎంత మేలు! BSB BSB: “How I long for the months gone by, for the days when God watched over me,
3 ULB అప్పుడు ఆయన దీపం నా తలపై ప్రకాశించింది. ఆయన కాంతి వల్ల నేను చీకటిలో తిరగగలిగాను. BSB BSB: when His lamp shone above my head, and by His light I walked through the darkness,
4 ULB నా పండు ముసలి దినాల్లోనూ దేవుని స్నేహం నా గుడారంపై ఉండే రోజుల్లోనూ నేను ఉంటే ఎంత బాగుండేది! BSB BSB: when I was in my prime, when the friendship of God rested on my tent,
5 ULB సర్వశక్తుడు ఇంకా నాకు తోడై ఉన్నప్పుడు నా పిల్లలు నా చుట్టూ ఉండే వారు. BSB BSB: when the Almighty was still with me and my children were around me,
6 ULB నా దారి అంతా వెన్న లాగా ఉండేది. బండ నుండి నా కోసం నూనె ప్రవాహంగా పారింది. BSB BSB: when my steps were bathed in cream and the rock poured out for me streams of oil!
7 ULB పట్టణ ద్వారానికి నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠంపై కూర్చున్నప్పుడు, BSB BSB: When I went out to the city gate and took my seat in the public square,
8 ULB యువకులు నన్ను చూసి దూరం జరిగారు. ముసలివారు లేచి నిలబడ్డారు. BSB BSB: the young men saw me and withdrew, and the old men rose to their feet.
9 ULB అధికారులు మాటలు మాని నోటి మీద చెయ్యి ఉంచుకున్నారు. BSB BSB: The princes refrained from speaking and covered their mouths with their hands.
10 ULB ప్రధానులు మాటలాడక ఊరుకున్నారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకుపోయింది. BSB BSB: The voices of the nobles were hushed, and their tongues stuck to the roofs of their mouths.
11 ULB నా సంగతి విన్న ప్రతివాడూ నన్ను అదృష్టవంతుడిగా ఎంచాడు. నేను కంటబడిన ప్రతివాడూ నన్ను గూర్చి సాక్ష్యమిచ్చాడు. BSB BSB: For those who heard me called me blessed, and those who saw me commended me,
12 ULB ఎందుకంటే మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించాను. BSB BSB: because I rescued the poor who cried out and the fatherless who had no helper.
13 ULB నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవారి దీవెన నా మీదికి వచ్చింది. వితంతువుల హృదయాన్ని సంతోషపెట్టాను. BSB BSB: The dying man blessed me, and I made the widow’s heart sing for joy.
14 ULB నేను నీతిని వస్త్రంగా ధరించుకున్నాను గనక అది నన్ను ధరించింది. నా న్యాయవర్తన నాకు వస్త్రం, పాగా అయింది. BSB BSB: I put on righteousness, and it clothed me; justice was my robe and my turban.
15 ULB గుడ్డి వారికి నేను కన్నులయ్యాను. కుంటివారికి పాదాలు అయ్యాను. BSB BSB: I served as eyes to the blind and as feet to the lame.
16 ULB దరిద్రులకు తండ్రిగా ఉన్నాను. నేను ఎరగనివారి వ్యాజ్యం సైతం నేను శ్రద్ధగా విచారించాను. BSB BSB: I was a father to the needy, and I took up the case of the stranger.
17 ULB దుర్మార్గుల దవడ పళ్ళు ఊడగొట్టాను. వారి పళ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేశాను. BSB BSB: I shattered the fangs of the unjust and snatched the prey from his teeth.
18 ULB అప్పుడు నేను ఇలా అనుకున్నాను. నా గూటి దగ్గరనే నేను కన్ను మూస్తాను. ఇసుక రేణువుల్లాగా నేను దీర్ఘాయువు గలవాడినౌతాను. BSB BSB: So I thought: ‘I will die in my nest and multiply my days as the sand.
19 ULB నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపిస్తాయి. నా కొమ్మల మీద మంచు నిలుస్తుంది. BSB BSB: My roots will spread out to the waters, and the dew will rest nightly on my branches.
20 ULB నాకు ఎడతెగని ఘనత కలుగుతుంది. నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలంగా ఉంటుంది. BSB BSB: My glory is ever new within me, and my bow is renewed in my hand.’
21 ULB మనుషులు శ్రద్ధగా వింటూ నా కోసం కాచుకుని ఉన్నారు. నా ఆలోచన వినాలని మౌనంగా ఉన్నారు. BSB BSB: Men listened to me with expectation, waiting silently for my counsel.
22 ULB నేను మాటలాడిన తరువాత వారు మారు మాట పలకలేదు. ధారలుగా నా మాటలు వారి మీద పడ్డాయి. BSB BSB: After my words, they spoke no more; my speech settled on them like dew.
23 ULB వర్షం కోసం కనిపెట్టినట్టు వారు నా కోసం కనిపెట్టుకున్నారు. కడవరి వాన కోసమన్నట్టు వారు వెడల్పుగా నోరు తెరుచుకున్నారు. BSB BSB: They waited for me as for rain and drank in my words like spring showers.
24 ULB వారు ఉహించని సమయంలో వారిని చూసి చిరునవ్వు నవ్వాను. నా ముఖ కాంతిని వారు తోసిపుచ్చలేదు. BSB BSB: If I smiled at them, they did not believe it; the light of my countenance was precious.
25 ULB నేను వారికి పెద్దనై కూర్చుని వారికి మార్గాలను ఏర్పరచాను. తన సైన్యం దగ్గర రాజులాగా ఉన్నాను. దుఃఖించే వారిని ఓదార్చే వాడి వలే ఉన్నాను. BSB BSB: I chose their course and presided as chief. So I dwelt as a king among his troops, as a comforter of the mourners.
Select verses for actions: Enter goes to them and Escape comes back.