1 ULB వెండికి గని ఉంది. బంగారం పుటం వేసే స్థలం ఉంది. BSB BSB: “Surely there is a mine for silver and a place where gold is refined.
2 ULB ఇనుమును భూమిలోనుండి తీస్తారు. రాళ్లు కరగించి రాగి తీస్తారు. BSB BSB: Iron is taken from the earth, and copper is smelted from ore.
3 ULB మనిషి చీకటిని అంతమొందిస్తాడు. సుదూర స్థలాల్లో అన్వేషిస్తాడు. గాఢాంధకారంలో అంతు తెలియని తావుల్లో విలువైన రాళ్ళను వెతుకుతాడు. BSB BSB: Man puts an end to the darkness; he probes the farthest recesses for ore in deepest darkness.
4 ULB మనుషుల నివాసాలకు, మనిషి పాదాలు సంచరించే స్థలాలకు దూరంగా అతడు సొరంగం తవ్వుతాడు. అక్కడ అతడు మానవులకు దూరంగా ఇటు అటు తిరుగులాడుతుంటాడు. BSB BSB: Far from human habitation he cuts a shaft in places forgotten by the foot of man. Far from men he dangles and sways.
5 ULB భూమి విషయానికొస్తే అందులోనుండి ఆహారం పుడుతుంది. భూగర్భం అగ్నిమయం. BSB BSB: Food may come from the earth, but from below it is transformed as by fire.
6 ULB దాని రాళ్లు నీలరతనాల పుట్టిల్లు. దాని ధూళిలో బంగారం ఉంది. BSB BSB: Its rocks are the source of sapphires, containing flecks of gold.
7 ULB వేటాడే ఏ పక్షికైనా ఆ దారి తెలియదు. డేగ కళ్ళు దాన్ని చూడలేదు. BSB BSB: No bird of prey knows that path; no falcon’s eye has seen it.
8 ULB గర్వంగా సంచరించే మృగాలు ఆ దారి తొక్కలేదు. క్రూర సింహం ఆ దారిలో నడవలేదు. BSB BSB: Proud beasts have never trodden it; no lion has ever prowled over it.
9 ULB మనిషి చెకుముకి రాళ్ళను పట్టుకుంటాడు. పర్వతాలను వాటి కుదుళ్లతో సహా బోర్లా పడదోస్తాడు. BSB BSB: The miner strikes the flint; he overturns mountains at their base.
10 ULB శిలల్లో అతడు కాలువలు ఏర్పరుస్తాడు. అతని కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూస్తుంది. BSB BSB: He hews out channels in the rocks, and his eyes spot every treasure.
11 ULB నీళ్లు పొర్లి పోకుండా జలధారలకు ఆనకట్ట కడతాడు. అగోచరమైన వాటిని అతడు వెలుగులోకి తెస్తాడు. BSB BSB: He stops up the sources of the streams to bring what is hidden to light.
12 ULB అయితే జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది? BSB BSB: But where can wisdom be found, and where does understanding dwell?
13 ULB మనిషికి దాని విలువ తెలియదు. ప్రాణులున్న దేశంలో అది దొరకదు. BSB BSB: No man can know its value, nor is it found in the land of the living.
14 ULB అగాధం <<అది నాలో లేదు>> అంటుంది. <<నా దగ్గర లేదు>> అని సముద్రం అంటుంది. BSB BSB: The ocean depths say, ‘It is not in me,’ while the sea declares, ‘It is not with me.’
15 ULB బంగారం దానికి సాటి కాదు. దాని వెల కట్టడానికి వెండిని తూచడం పనికి రాదు. BSB BSB: It cannot be bought with gold, nor can its price be weighed out in silver.
16 ULB అది ఓఫీరు బంగారంతోగానీ ప్రశస్తమైన గోమేధికంతో, నీలంతోగానీ కొనగలిగింది కాదు. BSB BSB: It cannot be valued in the gold of Ophir, in precious onyx or sapphire.
17 ULB సువర్ణమైనా స్ఫటికమైనా దానితో సాటిరావు. ప్రశస్తమైన బంగారు నగలు ఇచ్చి దాన్ని తీసుకోలేము. BSB BSB: Neither gold nor crystal can compare to it, nor jewels of fine gold be exchanged for it.
18 ULB పగడాల, ముత్యాల పేర్లు దాని ఎదుట అసలు ఎత్తకూడదు. నిజంగా జ్ఞానానికున్న విలువ కెంపుల కన్నా గొప్పది. BSB BSB: Coral and quartz are unworthy of mention; the price of wisdom is beyond rubies.
19 ULB కూషు దేశపు పుష్యరాగం దానికి సాటి రాదు. మేలిమి బంగారంతో దానికి వెల కట్టలేము. BSB BSB: Topaz from Cush cannot compare to it, nor can it be valued in pure gold.
20 ULB అలాగైతే జ్ఞానం ఎక్కడనుండి వస్తుంది? వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంది? BSB BSB: From where, then, does wisdom come, and where does understanding dwell?
21 ULB అది జీవులందరి కన్నులకు కనిపించదు. ఆకాశ పక్షులకు అది అగమ్యగోచరం. BSB BSB: It is hidden from the eyes of every living thing and concealed from the birds of the air.
22 ULB <<మేము మా చెవులతో దాన్ని గురించి విన్నాము>> అని నాశనం, మరణం అంటాయి. BSB BSB: Abaddon and Death say, ‘We have heard a rumor about it.’
23 ULB దేవుడే దాని మార్గాన్ని గ్రహిస్తాడు. దాని స్థలం ఆయనకే తెలుసు. BSB BSB: But God understands its way, and He knows its place.
24 ULB ఆయన భూమి కొనల వరకూ చూస్తున్నాడు. ఆకాశం కింద ఉన్న దానినంతటినీ చూస్తున్నాడు. BSB BSB: For He looks to the ends of the earth and sees everything under the heavens.
25 ULB గాలికి ఇంత వేగం ఉండాలని ఆయన నియమించినప్పుడు, జలరాసుల కొలత నిర్ణయించినప్పుడు, BSB BSB: When God fixed the weight of the wind and measured out the waters,
26 ULB వర్షానికి అదుపాజ్ఞలు ఏర్పరచినప్పుడు, ఉరుము మెరుపులకు దోవ చూపినప్పుడు, BSB BSB: when He set a limit for the rain and a path for the thunderbolt,
27 ULB ఆయన జ్ఞానాన్ని చూసి దాన్ని ప్రకటించాడు. దాన్ని స్థాపించి దాన్ని పరిశోధించాడు. BSB BSB: then He looked at wisdom and appraised it; He established it and searched it out.
28 ULB యెహోవా పట్ల భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం నుండి తొలగిపోవడమే వివేకం అని ఆయన మనుషులకు చెప్పాడు. BSB BSB: And He said to man, ‘Behold, the fear of the Lord, that is wisdom, and to turn away from evil is understanding.’”
Select verses for actions: Enter goes to them and Escape comes back.