1 ULB యోబు, దయచేసి నా వాదం ఆలకించు. నా మాటలన్నీ విను. BSB BSB: “But now, O Job, hear my speech, and listen to all my words.
2 ULB ఇదిగో నేను మాటలాడడం మొదలుపెట్టాను. నా నోట నా నాలుక ఆడుతున్నది. BSB BSB: Behold, I will open my mouth; my address is on the tip of my tongue.
3 ULB నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతున్నాయి. నా పెదవులు జ్ఞానాన్ని యథార్థంగా పలుకుతాయి. BSB BSB: My words are from an upright heart, and my lips speak sincerely what I know.
4 ULB దేవుని ఆత్మ నన్ను సృష్టించింది. సర్వశక్తుని శ్వాస నాకు జీవమిచ్చింది. BSB BSB: The Spirit of God has made me, and the breath of the Almighty gives me life.
5 ULB నీ చేతనైతే నాకు జవాబియ్యి. నా ఎదుట నీ వాదం సిద్ధపరచుకో. వ్యాజ్యెమాడు. BSB BSB: Refute me if you can; prepare your case and confront me.
6 ULB దేవుని దృష్టిలో నేను కూడా నీలాంటి వాణ్ణి. నేను కూడా బంకమట్టితో తయారైన వాణ్ణి. BSB BSB: I am just like you before God; I was also formed from clay.
7 ULB నా భయం నిన్ను బెదిరించదు. నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. BSB BSB: Surely no fear of me should terrify you; nor will my hand be heavy upon you.
8 ULB నిశ్చయంగా నీ పలుకులు నా చెవిని బడ్డాయి. నీ మాటల ధ్వని నాకు వినబడింది. BSB BSB: Surely you have spoken in my hearing, and I have heard these very words:
9 ULB ఏమంటే <<నేను నేరం లేని పవిత్రుణ్ణి, మాలిన్యం లేని పాపరహితుణ్ణి. BSB BSB: ‘I am pure, without transgression; I am clean, with no iniquity in me.
10 ULB ఆయన నా మీద తప్పులెన్నడానికి తరుణం వెతుకుతున్నాడు. నన్ను తనకు పగవానిగా భావిస్తున్నాడు. BSB BSB: Yet God finds occasions against me; He counts me as His enemy.
11 ULB ఆయన నా కాళ్లను బొండలో బిగిస్తున్నాడు. నా దారులన్నిటినీ కనిపెట్టి చూస్తున్నాడు>> అని నీవంటున్నావు. BSB BSB: He puts my feet in the stocks; He watches over all my paths.’
12 ULB నేను నీకు జవాబు చెబుతాను. నీవు ఇలా చెప్పడం సరికాదు. దేవుడు మానవుడికన్నా గొప్పవాడు. BSB BSB: Behold, you are not right in this matter. I will answer you, for God is greater than man.
13 ULB నీవెందుకు ఆయనతో పోరాడతావు? తన క్రియల్లో దేన్ని గురించీ ఆయన సంజాయిషీ చెప్పుకోడు. BSB BSB: Why do you complain to Him that He answers nothing a man asks?
14 ULB దేవుడు ఒక్కమారే పలుకుతాడు. రెండు సార్లు పలుకుతాడు. అయితే మనుషులు అది కనిపెట్టరు. BSB BSB: For God speaks in one way and in another, yet no one notices.
15 ULB మంచం మీద కునికే సమయంలో, గాఢనిద్ర పట్టేటప్పుడు వచ్చే స్వప్నాల్లో మాట్లాడుతాడు. BSB BSB: In a dream, in a vision in the night, when deep sleep falls upon men as they slumber on their beds,
16 ULB ఆయన మనుషుల చెవులను తెరుస్తాడు. వారిని భయపెడతాడు. BSB BSB: He opens their ears and terrifies them with warnings
17 ULB మనుషులు గర్విష్ఠులు కాకుండా చేయడానికి, తాము తలపెట్టిన పాపకార్యం వారు మానుకొనేలా చేయడానికి, BSB BSB: to turn a man from wrongdoing and keep him from pride,
18 ULB గోతికి పోకుండా వారి జీవాన్ని, మరణం కాకుండా వారి ప్రాణాన్ని తప్పించడానికి, BSB BSB: to preserve his soul from the Pit and his life from perishing by the sword.
19 ULB వ్యాధిచేత మంచం పట్టడం మూలంగానూ, ఒకడి ఎముకల్లో ఎడతెగని నొప్పులు కలగడం మూలంగానూ వాణ్ణి శిక్షిస్తాడు. BSB BSB: A man is also chastened on his bed with pain and constant distress in his bones,
20 ULB రొట్టె, రుచిగల ఆహారం వాడికి అసహ్యం అవుతుంది. BSB BSB: so that he detests his bread, and his soul loathes his favorite food.
21 ULB వాడి ఒంట్లో మాంసం క్షీణించిపోయి వికారమై పోతుంది. బయటికి కనబడని ఎముకలు పైకి పొడుచుకు వస్తాయి. BSB BSB: His flesh wastes away from sight, and his hidden bones protrude.
22 ULB వాడు సమాధికి దగ్గర అవుతాడు. వాడి ప్రాణం హంతకులకు చేరువ అవుతుంది. BSB BSB: He draws near to the Pit, and his life to the messengers of death.
23 ULB మనుషులకు యుక్తమైనది ఏదో దాన్ని వాడికి తెలియజేయడానికి వేలాది దేవదూతల్లో ఒకడు వాడికి మధ్యవర్తిగా ఉంటే, BSB BSB: Yet if there is a messenger on his side, one mediator in a thousand, to tell a man what is right for him,
24 ULB ఆ దేవదూత వాడిపై కరుణ చూపి దేవునితో <<పాతాళంలోకి దిగిపోకుండా ఇతన్ని విడిపించు. ఇతని పక్షంగా పరిహారం దొరికింది>> అని గనక అంటే, BSB BSB: to be gracious to him and say, ‘Spare him from going down to the Pit; I have found his ransom,’
25 ULB అప్పుడు వాడి మాంసం చిన్నపిల్లల మాంసం కన్నా ఆరోగ్యంగా ఉంటుంది. వాడికి తన యవ్వన బలం తిరిగి కలుగుతుంది. BSB BSB: then his flesh is refreshed like a child’s; he returns to the days of his youth.
26 ULB వాడు దేవుణ్ణి బతిమాలుకుంటే ఆయన వాణ్ణి కటాక్షిస్తాడు. కాబట్టి వాడు ఆయన ముఖం చూసి సంతోషిస్తాడు. ఇలా ఆయన మనిషికి నిర్దోషత్వం దయచేస్తాడు. BSB BSB: He prays to God and finds favor; he sees God’s face and shouts for joy, and God restores His righteousness to that man.
27 ULB అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషిస్తూ ఇలా అంటాడు. <<నేను పాపం చేసి యథార్థమైన దాన్ని వక్రం చేశాను. అయినా నా పాపానికి తగిన ప్రతీకారం నాకు కలగలేదు. BSB BSB: Then he sings before men with these words: ‘I have sinned and perverted what was right; yet I did not get what I deserved.
28 ULB కూపంలోకి దిగిపోకుండా నా ప్రాణాన్ని ఆయన విమోచించాడు. నా జీవం వెలుగును చూస్తున్నది.>> BSB BSB: He redeemed my soul from going down to the Pit, and I will live to see the light.’
29 ULB చూడు, మానవుల కోసం దేవుడు రెండు సార్లు, మూడు సార్లు ఈ క్రియలన్నిటినీ చేస్తాడు. BSB BSB: Behold, all these things God does to a man, two or even three times,
30 ULB కూపంలోనుండి వారిని మళ్ళీ రప్పించాలని, మనుషులు సజీవులకుండే వెలుగుతో వెలిగించబడాలని ఇలా చేస్తాడు. BSB BSB: to bring back his soul from the Pit, that he may be enlightened with the light of life.
31 ULB యోబు, శ్రద్ధగా విను. నా మాట ఆలకించు. మౌనంగా ఉండు. నేను మాట్లాడతాను. BSB BSB: Pay attention, Job, and listen to me; be silent, and I will speak.
32 ULB చెప్పవలసిన మాట ఏదైనా నీకుంటే నాకు జవాబు చెప్పు. మాట్లాడు, నువ్వు నీతిమంతుడవని నిరూపించుకో. BSB BSB: But if you have something to say, answer me; speak up, for I would like to vindicate you.
33 ULB అలా కాకుంటే నా మాట ఆలకించు. మౌనంగా ఉండు, నేను నీకు జ్ఞానం బోధిస్తాను. BSB BSB: But if not, then listen to me; be quiet, and I will teach you wisdom.”
Select verses for actions: Enter goes to them and Escape comes back.